కశ్మీర్‌లో పర్యటించిన ఆర్థికవేత్త ʹజీన్ డ్రీజ్ʹ ఇంటర్వ్యూ..!


కశ్మీర్‌లో పర్యటించిన ఆర్థికవేత్త ʹజీన్ డ్రీజ్ʹ ఇంటర్వ్యూ..!

కశ్మీర్‌లో

ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్‌లో ఏం జరుగుతోందో ప్రభుత్వం బయటి ప్రపంచానికి తెలియనీయడం లేదు. ఇంటర్నెట్, మొబైల్, టీవీ సౌకర్యాలను బంద్ చేసి అంతా బాగానే ఉందని చెబుతోంది. అయితే అక్కడ పర్యటించిన నిజనిర్థారణ బృందం మాత్రం వాస్తవ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని అంటోంది. ఆ బృందంలో సభ్యుడైన ప్రముఖ ఆర్థికవేత్త జీన్ డ్రీజ్ నిన్ని ఢిల్లీలో ఇంటర్వ్యూ ఇచ్చారు. హిందీలో ఉన్న ఆ ఇంటర్వ్యూను ʹఅరుణʹ తన ఫేస్‌బుక్ వాల్‌పై తెలుగులో పోస్టు చేశారు. అది యధాతథంగా..

------------------------------------------------------------------------------------------------------------------

ఈ రోజు స్వాతంత్ర దినోత్సవం దేశ భక్తి ఏరులై ప్రవహించే రోజు.కనుక నేడు ఓ దేశభక్తుడు గురించి తెలుసుకుందాం. ఆయన ద్రుష్టిలో దేశం అంటే ప్రజలు. అందుకని ప్రపంచంలోని అన్నీ దేశాలకి భక్తుడు.అయితే భారతమాత కడుపున పుట్టక హృదయంలోంచి పుట్టిన బిడ్డ. ప్రజలు తన ప్రాణం అనుకునే ఆయన పేరు "Jean Drèze". బెల్జియంలో పుట్టి భారతదేశ పౌరుడు అయిపోయారు.. భారతదేశంలో పుట్టి అమెరికా పౌరసత్వం కోసం తపించి పోయే ప్రజలున్న భారతదేశంలో Jean Drèze భారతదేశ బడుగు బలహీన వర్గాల కోసం పనిచేస్తూ భారత ప్రజలకు తన వంతు సేవ చేస్తున్నారు.

బెల్జియంలో పుట్టిన Jean Dreze భారతదేశంలో 1979 నుంచి నివాసం ఉంటూ 2002లో భారతీయ పౌరుడు అయ్యారు. భారతదేశంలోనే విద్యనభ్యసించి పీహెచ్డీ చేశారు. ఈయన డెవలప్మెంట్ ఎకనామిక్స్ ఫీల్డులో ఎక్స్పర్ట్. ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో ప్రొఫెసర్ గా పనిచేశారు. ప్రస్తుతం జి.బి పంత్ సోషల్ సైన్స్ ఇన్స్టిట్యూట్ అలహాబాదులో విజిటింగ్ ప్రొఫెసర్ గా పని చేస్తున్నారు. ఈయన తన భార్య బేలా భాటియాతో కలసి ఢిల్లీలో ఓ జుగ్గీలో అతి సామాన్యమైన జీవితం గడుపుతున్నారు.
భారత దేశంలో కరువు, ఆకలి, జెండర్ ఈక్వాలిటీ,విద్య,శిశు సంరక్షణ,పాఠశాలలో భోజన పధకం,ఉపాధి హక్కు, సమాచార హక్కు చట్టానికి సంబంధించి విస్తృత క్యాంపెయిన్ ఇలా పలు అంశాలకు సంబంధించి చాలా విస్తృతంగా పని చేస్తున్నారు. అంతర్జాతీయంగా పీస్ మూమెంట్ గురించి కూడా పని చేస్తున్నారు.ఇరాక్ లో యుద్ధం ఐతే శాంతి అంటూ అక్కడ ప్రత్యక్షం అయిపోయారు.

Jean Dreze పలు మార్లు కశ్మీర్ కు పోయి వచ్చారు. ప్రభుత్వం ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత ఆయన కశ్మీర్ లో పర్యటించారు. కాశ్మీర్ లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల గురించి జర్నలిస్టులకు తెలియజేయడానికి ప్రెస్ క్లబ్ కి వచ్చారు.పలువురు జర్నలిస్టులతో ముఖాముఖి మాట్లాడారు. Jean Drezeకి ఇంటర్వ్యూ అడిగితే హిందీలో తీసుకో ఎక్కువ మంది భారతీయ ప్రజలకు అర్థమవుతుంది. వారు సత్యం తెలుసుకుంటారు. నిజాలు తెలుసుకుంటే భారతీయ ప్రజలు కశ్మీర్ వాసులను అక్కున చేర్చుకుంటారు అని అన్నారు. హిందీ అనర్గళంగా మాట్లాడే Jean Dreze తన కాశ్మీర్ పర్యటన వివరాలు ఇలా తెలిపారు.

1ప్రశ్న. మీరు ఆర్థిక వేత్త ఆర్థిక అంశాల పైనే నేను మిమ్మల్ని ప్రశ్నించ దలచాను. వెనుకబడి ఉన్నా కాశ్మీర్ ను అభివృద్ధి చేయడానికి ఆర్టికల్ 370 ఎత్తి వేశామని ప్రధాన మంత్రి చెబుతున్నారు దీనిపై ఆర్థికవేత్తగా మీ అభిప్రాయాన్ని తెలపండి.

Jean Dreze:- ఈ వాదన పూర్తిస్థాయిలో తప్పు. భారతదేశంలో ప్రజలు ఇలా అనుకోవటం తప్పు. వాస్తవం వేరుగా ఉంది. భారత ప్రధాని ఆర్ధిక అంశాలలో క్లాసెస్ తీసుకుంటే మంచిది. ఆయన అనుమతిస్తే నేను ప్రధానికి ఫ్రీగా క్లాస్ చెప్పడానికి సిద్ధం. నా దగ్గర ఉన్న ఆర్థిక, సామాజిక, స్టాటస్టిక్స్ కశ్మీర్ కి సంబంధించినవి చాలా ఉన్నాయి. వాటిని ప్రధానమంత్రికి అవగతం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ప్రధాని కనుక కొంత సమయం వెచ్చిస్తే ఈ విషయాలన్నీ ఆయనకు చెప్పగలను. కాశ్మీర్లో జీవన ప్రమాణాలు మెరుగ్గా ఉంటాయి. కశ్మీర్ లో అడల్ట్ న్యూట్రిషన్ బావుంది. చాలా రాష్ట్రాల కన్నా అభివృద్ధి చెందిన రాష్ట్రంగా కశ్మీర్ ఉంది. ముఖ్యంగా గుజరాత్ మోడల్ గురించి ఎక్కువగా చర్చ జరిగింది. ఆ గుజరాత్ కన్నా కూడా కశ్మీర్ బాగా అభివృద్ధి చెందిన రాష్ట్రం. కాశ్మీర్ లో ల్యాండ్ రిఫార్మ్స్ చక్కగా అమలయ్యాయి. అందువలన ఉత్తర ప్రదేశ్, జార్ఖండ్, బీహార్ రాష్ట్రాలలో కనిపించే నిరుద్యోగ సేన కశ్మీర్లో కనిపించదు. కాశ్మీర్ లో రోజు కూలీకి పనిచేసే వారికి రోజుకు 500 రూపాయలు అందుతాయి. ఇదంతా సాధ్యం అయ్యింది అంటే దానికి కారణం ఆర్టికల్ 370. ఈ ఆర్టికల్ వలన అక్కడ భూమి పంపకం సక్రమంగా జరిగింది. అందువలన అక్కడున్న వారికి మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఉపాధి మెరుగ్గా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కాశ్మీర్ అభివృద్ధి కోసం తహతహలాడుతుంది. అందుకే ఆర్టికల్ 370 తీసి వేసాము అని చెప్పడం తప్పు.

2 ప్రశ్న. ప్రస్తుతం మీరు కాశ్మీర్ పర్యటించి వచ్చారు. కశ్మీర్ లో ఉన్న ఆర్థిక రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి.

Jean Dreze:-చూడండి 2000 సంవత్సరం నుంచి కాశ్మీర్ కు పోతూనే ఉన్న. ఇప్పటికి నాలుగుసార్లు పర్యటించాను. నా కంటికి ప్రతిసారి కశ్మీర్ లో మెరుగైన జీవన ప్రమాణాలు కనిపించాయి. ముఖ్యంగా కాశ్మీర్ గ్రామీణ ప్రాంతాలలో మిగతా ఉత్తర భారతదేశ రాష్ట్రాలకు మల్లే కశ్మీర్ గ్రామాలలో ఆకలి పేదరికం కనిపించదు. మీకు తమాషా అయిన విషయం చెప్తాను. బీహార్ నుంచి ఉత్తరప్రదేశ్ నుంచి చాలామంది కూలీలు కాశ్మీర్ కు మైగ్రేన్ అవుతారు. దీనికి కారణం అక్కడ రోజువారి కూలి ఎక్కువ దొరకడమే. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో పనులన్నీ ఆగి పోవడం వలన ఈ కూలీలు అందరూ తన సొంత ఊర్లకు ప్రయాణం అయిపోయారు. పని లేక పోవటం వలన కశ్మీర్ నుంచి తిరుగు ప్రయాణం అయ్యారు. ఏది ఏమైనప్పటికీ స్థానిక కాశ్మీరీలు మాత్రం మెరుగైన జీవన ప్రమాణాలతో ఉన్నారు. ఇక రాజకీయ పరిస్థితుల గురించి చర్చించాల్సి వస్తే కాశ్మీర్ ప్రజల మూడ్ గత కొంతకాలంగా ఏమీ బాగుండటం లేదు. నేను వెళ్ళిన ప్రతిసారి కాశ్మీర్ లో అస్థిర రాజకీయ పరిస్థితులు కనిపించాయి. ముఖ్యంగా 2016లో ఆరు నెలల పాటు 7 మిలియన్ కాశ్మీర్ ప్రజలు సమ్మె చేశారు. నాకు తెలిసినంతవరకు భారతదేశంలో ఇటువంటి సమ్మె చోటు చేసుకోలేదు. ఈ సమ్మె ఒక చరిత్రాత్మక సమ్మె. అని చెప్పవచ్చు. ఈ ఆరు నెలల పాటు కాశ్మీర్ పూర్తిగా స్తంభించింది. ఇది గవర్నమెంట్ విధించిన కర్ఫ్యూ కాదు. అయినా మొత్తం కాశ్మీర్ షట్ డౌన్ అయిపోయింది. అయినప్పటికీ కాశ్మీర్ ప్రజలు ఎలాగో ఒకలాగా కోలుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వమే కర్ఫ్యూ విధించింది. దీనివలన కాశ్మీర్ మరోసారి షట్ డౌన్ అయ్యింది. దీని ఎఫెక్ట్ కాశ్మీర్ ఆర్థిక పరిస్థితి పైన పడుతుంది. ఇది కాశ్మీర్ కు మంచిది కాదు. కాశ్మీర్ ఆర్థిక పరిస్థితికి మంచిది కాదు.

3 ప్రశ్న. మీరు అక్కడ పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్నాయని చెబుతున్నారు కానీ భారత ప్రభుత్వం అక్కడ సామాన్య పరిస్థితులు నెలకొని ఉన్నాయని చెపుతున్నది.

Jean Dreze:-ప్రభుత్వం అలా చెప్పకపోతే ఇంకెలా చెప్తుంది. కనుక దీనిని నమ్మాల్సిన అవసరం లేదు. కాశ్మీర్ గురించి తెలుసుకోవాలంటే కాశ్మీర్ కు పోవడం మంచిది. లేదా అక్కడికి పోయిన వారి విశ్వసనీయతను బట్టి వారు ఇచ్చిన సమాచారాన్ని తెలుసుకోవాలి. విశ్వసనీయ సమాచారం అంటే నా దృష్టిలో ఇండిపెండెంట్ గా వెళ్లి అక్కడ పరిస్థితులను పర్యవేక్షించే వారు అందించిన సమాచారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విషయంలో అంతర్జాతీయ చానల్స్ మీడియా సంస్థలు నిష్పాక్షికంగా వార్తలు సేకరిస్తున్నాయి. ఆ వార్తలను ఫాలో కావలసి ఉంటుంది. లేదా మా లాంటి వారు స్వచ్ఛందంగా పోయి అక్కడ విస్తృతంగా పర్యటిస్తున్నారు. వారు తెచ్చిన సమాచారం కూడా క్రెడిబుల్ గా ఉంది. నేను నాతోపాటు కొంతమంది యాక్టివిస్ట్లు శ్రీనగర్లోని కాశ్మీర్ గ్రామాల్లోనూ విస్తృతంగా పర్యటించాము. కాశ్మీర్ లో ఏం జరుగుతుంది అని తెలుసుకోవాలని ఉంటే, మా బోటి వాళ్ళు అందించే సమాచారాన్ని కూడా భారతీయులు వాడుకోవాలి. అంతేగాని ప్రభుత్వం చెపుతున్నది లేదా ప్రభుత్వంకి కొమ్ముకాసే మీడియా రిపోర్టులను నమ్మితే..... కశ్మీర్ లో జరిగే పరిస్థితులపై తప్పుడు సమాచారం గురి అవుతారు. భారతీయ పౌరులు ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. అని ముగించారు.

- అరుణ

Facebook Link : https://www.facebook.com/aruna.aruna.77582359/posts/2320935014834613

Keywords : Jean Dreze, Economist, Article 370, Kashmir, Belgium, Interview
(2020-08-03 09:48:41)No. of visitors : 960

Suggested Posts


0 results

Search Engine

పాలకుల అవినీతిని వెలికి తీసిన జర్నలిస్టులపై రాజద్రోహం కేసులు...అరెస్టులు
విప్లవ వాగ్గేయకారుడు వంగపండు ప్రసాదుకు నివాళి -విరసం
వీరుల కన్నతల్లి... అమరుల బంధువు...
ఇది భయపడాల్సిన సమయం కాదు... ఎదిరించాల్సిన సమయం...ప్రొఫెసర్ హానీబాబు భార్య డాక్టర్ జెన్నీ రోవేనా
వారిపై దాడి చేసింది సిఆర్‌పిఎఫ్ బలగాలే... మావోయిస్టులు కాదు...నిజనిర్దారణ కమిటీ రిపోర్టు
ముగిసిన అమ్మ ఎదురు చూపులు
ఏపీ జైళ్ళలో కరోనా పాజిటీవ్....ఖైదీలను విడుదల చేయాలి
ప్రొఫెసర్ సాయిబాబాను కాపాడుకుందాం... సహకరించండి... సాయిబాబా భార్య లేఖ‌
పోలీసు కూంబింగు‌ల మధ్య ఏవోబీలో భారీ ర్యాలీ ‍- అమరుల వారోత్సవాలు జరుపుకుంటున్న ప్రజలు
ప్రైవేట్ హాస్పిటల్స్ లో కరోనా పీజుల దోపిడీని అరికట్టాలి -CLC
అక్రమంగా అరెస్ట్ చేసిన ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ హనీ బాబును విడుదల చేయాలి - CLC
Condemn the impunity towards political prisoners
వరవరరావును విడుదల చేయాలి....765 మంది జర్నలిస్టుల లేఖ!
భీమా కోరేగావ్ కేసు: మరో ప్రొఫెసర్ అరెస్ట్
Condemn the arbitrary arrest of Prof. Hany Babu - CASR
కవిత్వంలో అమరత్వం...జూలై 28 - వరవరరావు
ఉద్యమాల ఉపాధ్యాయుడి జీవితమంతా ప్రజా ఉద్యమాలే
కుల నిర్మూలనవాది ఉసాకి జోహార్లు...పాపని నాగరాజు
ఉద్యమాల ఉపాధ్యాయుడు ఉ.సా.కు జోహార్లు !
వరవరరావు,సాయిబాబాలను విడుదల చేయాలంటూ 520 మంది రచయితల లేఖ‌ !
విలాస జీవితం ఎవరిది....డీజీపీకి మావోయిస్టుల సవాల్
వీవీ విడుదల కోసం బంద్ కు పిలుపునిచ్చిన మావోయిస్టు పార్టీ
వరవరరావు ఆరోగ్యం గురించి పారదర్శక, అధికారిక సమాచారం ఇవ్వండి...వీవీ కుటుంబం డిమాండ్
వరవరరావును విడుదల చేయాలంటూ ఉత్తరప్రదేశ్ లో సాహితీవేత్తల ప్రదర్శన‌
గౌతమ్ నవ్‌లఖా, ఆనంద్ తెల్తుంబ్డే‌కు ప్రతిష్టాత్మక అవార్డు
more..


కశ్మీర్‌లో