ʹబంగారం లేదు వజ్రాలు లేవు ఈ కట్టు కథలన్నీ యురేనియం కోసమేʹ


ʹబంగారం లేదు వజ్రాలు లేవు ఈ కట్టు కథలన్నీ యురేనియం కోసమేʹ

ʹబంగారం

తెలంగాణ లో యురేనియం తవ్వకాల కోసం కొంత కాలంగా సాగుతున్న ప్రయత్నాలు, ప్రజల వ్యతిరేకత మనకు తెలిసిందే ఈ నేపథ్యంలో తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో బంగారం, వజ్రాల నిక్షేపాలున్నాయని త్వరలోనే వాటిని తవ్వి తీస్తారనే వార్తలు పత్రికలో వచ్చాయి. అయితే యురేనియం తవ్వకాలను ప్రజలు వ్యతిరేకిస్తుండటంతో బంగారం, వజ్రాల పేరుతో ప్రభుత్వం కొత్త ఎత్తులు వేస్తోందని కొత్త కథలు చెబుతోందని సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి అంటున్నారు. వీ6 లో వచ్చిన ఆయన కామెంట్ మీకోసం...

నల్లమల అడవుల్లో వజ్రాలు, బంగారం అన్వేషణ పేరుతో యురేనియం కార్పొరేషన్ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తోంది. యురేనియం తవ్వకాలు పర్యావరణానికి, జీవజాలానికి తీవ్ర ప్రమాదకరమని జనం ఇప్పటికే ఆందోళన చేస్తున్నారు. ఆ ఉద్యమాన్ని పక్కదారి పట్టించడానికి కేంద్రం కొత్తగా వజ్రాలు, బంగారం నిల్వలపై కట్టు కథలు చెబుతోంది. నల్లగొండ, కడప జిల్లాల్లో యురేనియం తవ్వకాల కోసం 20 ఏళ్ల నుంచి వివిధ రకాలుగా కుట్రలు జరుగుతున్నాయి. వాటికి కొనసాగింపే ఈ అసత్య ప్రచారం.

ప్రజల ఆగ్రహానికి భయపడి యురేనియం సెర్చింగ్​ను నల్లగొండ జిల్లాలో టెంపరరీగా విరమించుకున్న సర్కారు.. కడప జిల్లా తుమ్మలపల్లిలో తవ్వకాలు మొదలుపెట్టి స్థానికుల జీవితాలతో, ప్రకృతితో చెలగాటమాడుతోంది. ఈ విషయంలో అక్కడి ప్రజలను ఎన్ని అబద్ధాలతో మభ్యపెట్టారో వాళ్లే చెబుతారు. తెలంగాణలోని పాలమూరు, గద్వాల, నాగర్ కర్నూలు, వనపర్తి, నల్లగొండ జిల్లాల్లో; ఆంధ్రప్రదేశ్​లోని కడప, కర్నూలు, ఒంగోలు, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో వజ్రాల గనులు కొత్త కాదు.

కుతుబ్ షాహీ నవాబుల కాలంలో ఈ గోల్కొండ వజ్రాల గనులు లాభసాటిగానే నడిచినా సౌతాఫ్రికాలోని కింబర్లీ వజ్రాల పోటీని మార్కెట్ ధరల్లో తట్టుకోలేకపోయాయి. కింబర్లీతో పోల్చితే గోల్కొండ వజ్రాల తవ్వకం, పాలిషింగ్, గ్రైండింగ్ ఖర్చులు ఎక్కువ కావడంతో నిజాంల కాలంలోనే ఈ గనులు మూతపడ్డాయి. అమెరికా, బ్రిటన్​ గనుల సంస్థలు కూడా తవ్వకం, శుద్ధి ఖర్చులు లాభసాటి కాదని తెలిసి పదేళ్ల కిందట నల్లమల నుంచి వెళ్లిపోయాయి.

ఈ విదేశీ కంపెనీలన్నీ.. బిజినెస్​ పేరుతో 200 ఏళ్లు, వలస పాలనతో మరో 200 ఏళ్లు ఇండియాని నిలువునా దోచుకున్న ఈస్ట్ ఇండియా కంపెనీ సంతతివే కావటం గమనార్హం. ఈ నిజాలు బయటపెట్టకుండా ఎప్పటికప్పుడు కొత్త కొత్త కథలు చెబుతూ యురేనియం కార్పొరేషన్ ప్రజలను మోసగిస్తోంది. ప్రకృతితో పరాచికాలాడాలని ప్రయత్నిస్తోంది. సూర్యాపేట జిల్లాలోనూ అన్వేషణ యురేనియం కోసమే కానీ బంగారం కోసం కాదనేది సుస్పష్టం. వజ్రాలు, బంగారం కోసమైతే నల్లమలలో వేల సంఖ్యలో బోరుబావుల తవ్వకం అవసరమే లేదు.

రైతులకు చెప్పకుండా వారి పొలాల్లో, కరెంట్​ సబ్ స్టేషన్లలో బోర్లు వేయటం; హెలికాఫ్టర్ల ద్వారా సర్వే చేయటం దండగ. యురేనియం తవ్వకాల వల్ల పర్యావరణంపై ఎఫెక్ట్​ పడుతుందని మాట వరసకైనా చెప్పట్లేదు. బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా ప్రతి విషయాన్నీ సీక్రెట్​గా ఉంచటం దురుద్దేశంకాక మరేంటి?. దీన్నిబట్టి ఈ సర్వేలన్నీ యురేనియం కోసమేనని తెలుస్తూనే ఉంది. యురేనియం తవ్వకాల కోసం ముందుచేతగా నల్లమల నుంచి చెంచులను, స్థానికులను తరలించడానికి గతంలో చేసిన ప్రయత్నాలు రాష్ట్ర విభజనతో ఆగిపోయాయి.

చిత్తూరు, అనంతపూర్, కర్నూలు జిల్లాల్లో బంగారం మైనింగ్​కి, స్థానికులను తరలించటానికి వేసిన పన్నాగాలు రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో నిలిచిపోయాయి. ప్రజావ్యతిరేక విధానాలతో, ప్రకృతి విధ్వంసానికి సర్కార్లు బరితెగిస్తే ఎవరు తీసుకున్న గోతిలో వాళ్లే పడతారని మర్చిపోకూడదు. గతం నుంచి గుణపాఠాలు నేర్చుకోకపోతే ఆ గనుల్లోనే భూస్థాపితమవుతాయని గుర్తుంచుకోవాలి.

Keywords : uranium, nallamala, adivasi
(2019-09-19 03:28:24)No. of visitors : 383

Suggested Posts


దేవరకొండలో యురేనియం సర్వే కోసం వచ్చిన వారిని తరిమిన ప్రజాసంఘాలు

ఉదయం 6 గంటలకే విద్యావంతుల వేదిక సబ్యులు లాడ్జ్ ముందు బైఠాయించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగ ప్రవేశం చేసి వాళ్లు యురేనియం కు సంబందించిన వారు కాదని నచ్చ చెప్పే ప్రయత్నం చేసా‌రు. జియోలాజికల్ సర్వే సంస్థకు సంబందించిన వారని, వేరే సర్వే కోసం వచ్చారని పోలీసులు నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు.

Search Engine

తెలుగులో ఇలాంటి సినిమాలు తీయలేరా..?
పోరాడితే పోయేదేమీ లేదు...పోరాడి హక్కులు సాధించుకున్న విద్యార్థినులు
భీం ఆర్మీ ఛీఫ్ ఆజాద్ ను వెంటనే విడుదల చేయాలి... మేధావులు, లాయర్లు, విద్యార్థుల డిమాండ్
పులివెందుల నుండి నల్లమలదాకా...వరలక్ష్మి
ఆర్థిక మాంద్యం అంటే ఏమిటి ? ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కోవడం ఎలా ? - ఎన్.వేణుగోపాల్
కశ్మీర్ లో ఎవ్వరికి లేని ʹనెట్ʹ సేవలు బీజేపీ వాళ్ళకు ఎలా వచ్చాయి ?
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
Savenallamala: యురేనియం తవ్వకూడదన్నవాళ్ళంతా అర్బన్ నక్సలైట్లేనా ?
కశ్మీర్ ప్రజల పోరాటానికి మద్దతుగా నిబడదాం...మావోయిస్టు పార్టీ పిలుపు
భూ గురత్వాకర్షణ శక్తిని కనుగొన్నది ఐనిస్టీనా... న్యూటన్ కాదా ?
Maoist leader Murali recounts his own jail experience to cite rampant rights violation
ప్రభుత్వాన్ని,న్యాయవ్యవస్థను,ఆర్మీని విమర్శించడం దేశద్రోహం కాదు ... సుప్రీం కోర్టు జడ్జ్
దేవరకొండలో యురేనియం సర్వే కోసం వచ్చిన వారిని తరిమిన ప్రజాసంఘాలు
చెప్పులేసుకొని బైక్ నడిపినా.. లుంగీ కట్టి లారీ నడిపినా భారీ జరిమానాలు..!
యురేనియంపై నల్లమల బంద్.. కదం తొక్కిన జనం... నాయకుల అరెస్ట్, ఉద్రిక్తత‌
నల్లమల ప్రజలకు మద్దతుగా నిలబడదాం, యురేనియం తవ్వకాలను అడ్డుకుందాం ... మావోయిస్టు పార్టీ ప్రకటన‌
జేఎన్యూ పై మళ్ళీ ఎర్రజెండా రెపరెపలు... విద్యార్థి సంఘం ఎన్నికల్లో లెఫ్ట్ ఘనవిజయం
దేవుడు లేడని చెప్పే హక్కు రాజ్యాంగం కల్పించింది...మద్రాస్ హైకోర్టు
దేశ పరిస్థితులపై ఆందోళన...మరో ఐఏఎస్ రాజీనామా
జేఎన్యూ విద్యార్థి నాయకురాలు షెహ్లా రషీద్ పై రాజద్రోహం కేసు
యుద్ధం - శాంతి.
యురేనియం దెబ్బకు జీవాలు గడ్డి తినడంలే.. బురుగులు కక్కి సస్తున్నాయి..!
కశ్మీర్ లో 80 మందికి పెల్లెట్ గాయాలు, బాలుడు మృతి... జాతీయ వార్తాసంస్థల వెల్లడి
ఆమె పోరాటమే.. తమిళనాడు ప్రభుత్వాన్ని కదిలించింది..!
స్కూలు పిల్లలకు భోజనంలోకి కూరకు బదులు ఉప్పు...బైట పెట్టిన జర్నలిస్టుపై కేసు
more..


ʹబంగారం