కేటీఆర్ కు సడెన్ గా ప్రజాస్వామ్యం ఎందుకు గుర్తొచ్చింది ?


కేటీఆర్ కు సడెన్ గా ప్రజాస్వామ్యం ఎందుకు గుర్తొచ్చింది ?

కేటీఆర్

ఇటీవల నగరంలో ʹతెలంగాణా వికాస సమితిʹ మూడవ మహాసభలలో ప్రధాన అతిథిగా విచ్చేసిన టీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంటు కెటిఆర్ గారు ప్రసంగిస్తూ దేశంలో అసహనం పెరిగిపోతుందనీ తర్కానికి, విభిన్నాభిప్రాయాలకు, వైరుధ్యాలకు అందులోనూ మిత్రవైరుధ్యాలకు విలువలేకుండా పోతుందనీ, ప్రశ్నించే స్థితి లేకపోతే ప్రజాస్వామ్యానికే ప్రమాదమని, భిన్న శక్తుల మధ్య జరిగే సంఘర్షణ నుండే చరిత్ర పుడుతుందని. కావున తెలంగాణా వికాస సమితి కలిసికట్టుగా ఉంటూ ʹఅవసరమైతేʹ సందర్భానుసారం రాష్ట్ర ప్రభుత్వం లోటుపాట్లను కూడా ఎత్తి చూపాలని ఒక గంభీరోపన్యాసం ఇచ్చారు.

ఇంత హఠాత్తుగా కెటిఆర్ గారికి ప్రజాస్వామ్య విలువలూ, ఆదర్శాలు ఎందుకు గుర్తుకొచ్చినట్లు? ఈ ఇన్స్టాంట్ జ్ఞానోదయానికి కారణాలేమిటి అని ఆలోచిస్తే చాపక్రింద నీరులా విస్తరిస్తున్న బిజెపి ప్రమాదమే అని మామూలు ఇంగితం, పరిజ్ఞానం ఉన్న సామాన్యులకు కూడా తెలుస్తుంది. చిన్న చేపను పెద్ద చేప మింగిన కథనే మళ్లీ పునరావృత్తం కాబోతుంది. శాసనసభలో ఎదురులేకుండా, ప్రశ్నించే వీలు లేకుండా, భిన్నాభిప్రాయాలకు తావు లేకుండా, ప్రతిపక్షాల ఉనికినే భరించే, సహించే స్వభావం లేని టీఆర్ ఎస్. తన బలంతోపాటు వాపును కూడా ప్రదర్శించటం కోసం ఇతర పార్టీల శాసన సభ్యులను ʹసంతలో సరుకులుగాʹ కొనలేదా? వారు చెప్పే ప్రజాస్వామ్యం ఇదేనా? ఇదే చాణక్య నీతిని బిజెపి ఇప్పుడు తెలంగాణాలో అమలు జరిపి దొడ్డిదారిగుండా అధికారాన్ని హస్తగతం చేసుకోవటానికి ఉచ్చులు, వ్యూహాలు పన్నబోతుంది. ʹతమదాకా వస్తేగాని తెలిసిరాదన్నట్లుʹ ముంచుకొచ్చే ప్రమాదాన్ని పసిగట్టిన సర్కారు వారు ప్రజాస్వామ్య సూత్రాలను వల్లె వేస్తున్నారు.

నగరం నడిబొడ్డుగా తెలంగాణా ఉద్యమానికి కేంద్రబిందువుగా పనిచేసిన ʹధర్నాచౌక్ʹలో అసమ్మతి గళాలు సమావేశాలు జరుపుకోకుండా నగర పొలిమేరలకు తరిమేసింది ఏ సహన గుణంతో? మల్లన్నసాగర్ నిర్వాసితుల తరఫున నిలబడితే ఆంక్షలు విధించి అరెస్టులు చేసింది ఏ సహన‌ గుణంతో? పర్యావరణానికీ, చెంచులకు ఉరేనియంగా మారిన యురేనియంను వ్యతిరేకించే అక్కడి గిరిజనులను కలవటానికి వెళ్తున్నవారిని అరెస్టు చేయటం ఏ ప్రజాస్వామ్య విలువల కోసం? ప్రజాభిప్రాయాన్ని మన్నించకుండా వాస్తు పేరుతో నూతన సచివాలయం, నూతన శాసన సభ భవనం కోసం, ప్రభుత్వ పాఠశాలలు వసతి గృహాలలో కనీస సౌకర్యాలు లేకున్నా ఆ నిర్మాణాలు ఎవరి కోసం? ఉస్మానియా దవాఖానా కూలిపోయే దశలో ఉన్నా, గుళ్లకు, గోపురాలకు, యజ్ఞ యాగాదులకు ప్రజాధనాన్ని వృధా పరచటం జనహితం కోసమేనా? వీటిని ప్రశ్నించే వారందరూ మిత్రవైరుధ్యాల కోవలోని వారే కదా? ఒకప్పుడు తమతోపాటు తెలంగాణా కోసం ఉద్యమించిన సహచరులే కదా? ఇంత అసహనం కల్గిన పాలకులు సహనం గురించి ఉపన్యాసాలా?

ʹఒకే దేశం, ఒకే పార్టీ, ఒకే నాయకుడు అంటూ ప్రమాదఘంటికలు మోగుతున్న వేళ, దేశం బహుళత్వాన్ని కాదని ఏకదృవంలోకి దూసుకపోతున్న వేళ, జాత్యహంకారంలో ప్రజల్ని విభజించి పాలించే నియంతృత్వపు పోకడలు ఉ ద్భవిస్తున్న వేళ... అటువంటి వ్యక్తులకు, శక్తులకు పార్లమెంటులో మద్దతు ఇస్తున్నదెవరు? ఆర్టికల్ 370 రద్దు, సమాచార చట్టానికి సవరణలు, త్రిపుల్ తలాక్, పెద్దనోట్ల రద్దు ప్రహసనానికి ఏ ప్రజాస్వామ్య విలువలను కాపాడటం కోసం మద్దతు ఇచ్చారు? రాష్ట్రాల హక్కులను కాలరాచి సమాఖ్య స్ఫూర్తికి భగ్నం కల్గించే విద్యా, వైద్యరంగాలలో సంస్కరణలను, మోటారు వెహికిల్స్ చట్టం సంస్కరణలను, సంస్థలనే గాక వ్యక్తులను కూడా ఉగ్రవాదులుగా ప్రకటించి వారి ఆస్తులను

జప్తుచేసే చర్యలను ఎందుకు ప్రశ్నించటం లేదు? తమదాకా వస్తేగాని ప్రజాస్వామ్యం, సెక్యులరిజం విలువలు, సూత్రాలు జ్ఞాపకం రావన్న మాట! దేశం ఏ గంగలో కల్సినా ʹబేఫికర్" కాని రాష్ట్రంలోని తమ అధికారానికి ఎసురు వస్తేనే ఉలికిపడుతూ ఉపన్యాసాలు, ఉపదేశాలు అన్నమాట!

ʹవిరుద్ధశక్తుల సంఘర్షణలో చరిత్ర పుట్టెనుʹ అని కెసిఆర్గారు చెప్పారని కెటిఆర్గారి మరో ఉవాచ. ఎనభైఏళ్ల క్రింద ʹమహాప్రస్థానంలో శ్రీశ్రీ ఆ మాట అనక ముందే గతితర్క సిద్ధాంతంలో అది ప్రాథమిక సూత్రమని తత్వశాస్త్ర విద్యార్థులందరికీ తెలిసిన జగమెరిగిన సత్యమే. మరి అంత విజ్ఞానం ఉన్న కేసీఆర్, కేటీఆర్లు తెలంగాణాలో భిన్నస్వరాలను ఆలాపించే గొంతుకలను ఎందుకు నులుముతున్నట్లు?

ʹఅవసరమైతే" వికాస సమితి సందర్భానుసారంగా లోటుపాట్లను తమకు ఎత్తి చూపాలనే సందేశం కేటీఆర్గారు ఇచ్చారు. గత మూడేళ్లుగా ఆ సంస్థ ప్రభుత్వానికి వత్తాసుగా ʹనీటిపాటలనే" పాడింది గాని సద్విమర్షలు, సూచనలు, సలహాలు ఎప్పుడూ ఇవ్వలేదు. వికాస సమితికి తోడుగా ఉన్న మరోసాహితీ సంస్థ సృష్టికర్త ఇంకో సాహితీ సంస్థ తన ఉనికిని రద్దు చేసుకుంటే గౌవంగా ఉంటుంది అని ʹఫత్వాʹ జారీ చేయటం ఏ ప్రజాస్వామ్య విలువలకు నిదర్శనం?

చివరలో సంస్థ అధ్యక్షుడు దేశపతి శ్రీనివాస్ ప్రసంగిస్తూ ʹప్రాంతీయ ఆకాంక్షలు పట్టించుకోకుండా కేంద్రం సమాఖ్య విలువలకు తూట్లుపొడుస్తుందనిʹ వ్యాఖ్యానించాడు. ఆ మాట నిజమే. పైన చెప్పిన ఆర్టికల్ 370 రద్దుతో పాటు అనేక చట్టాల సవరణలు సమాఖ్య వ్యవస్థకు విఘాతాన్ని కల్గించాయి. కావున ʹతెలంగాణా వికాస సమితిʹ ఏ మాత్రం నిజాయితీ ఉన్నా, ప్రజాస్వామ్యంపై, రాజ్యాంగంపై విశ్వాసమున్నా కేంద్రం ప్రవేశపెట్టిన హడావుడి బిల్లులకు టీఆర్ఎస్ పార్లమెంటులో ఎందుకు మద్దతు ఇచ్చిందో సూటిగా ప్రశ్నించి వివరణలు పొంది తమ ʹవికాసాన్ని" నిరూపించుకోవాలి.

-పరవస్తు లోకేశ్వర్
ఫోన్: 9160680847

Keywords : telangana, trs, ktr, vikasa samithi, bjp, democracy
(2020-06-01 02:40:25)No. of visitors : 345

Suggested Posts


కొమురయ్య బెయిల్ పై విడుదల - టీఆరెస్ నేతలతో ప్రాణ హాని ఉందని ఆందోళన

ఆరుగాలం కష్టపడి పండించిన పత్తికి గిట్టుబాటు ధర రాక పోవడంతో ఆగ్రహించి మంత్రి కడియం శ్రీహరి మీద చెప్పు విసిరిన కొమురయ్య సోమవారం జైలు నుండి విడుదలయ్యాడు....

జంప్ లు షురూ !

ఎన్నికలు వచ్చాయంటే రాజకీయ నేతల గోడ దూకడాలు ప్రారంభమవుతాయి. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు అధికార పార్టీలలోకి వలసలు ముమ్మరమవుతాయి. తిండి దొరికే చోటికి వలస వెళ్ళడం పక్షులకు అవసరం కదా......

వందల మందితో టీఆరెస్ ఎమ్మెల్యే పుట్టినరోజు వేడుకలు...వార్త రాసిన రిపోర్టర్ ఇల్లు కూల్చి వేత‌

తెలంగాణలో లాక్ డౌన్ ను కఠినంగా అమలు పర్చాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. అయితే అధికార పార్టీ ఎమ్మెల్యే అన్ని నిబందనలను ధిక్కరించి వందల మందితో ధూ ధాంగా పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నాడు. పైగా ఆ వార్త రాసిన పాపానికి ఓ జర్నలిస్టు ఇల్లు కూల్చేశారు అధికారులు.

Search Engine

వరవరరావు బెయిల్ పిటిషన్ పై విచారణ మళ్ళీ వాయిదా
రాజస్తాన్ లో అమెరికా లాంటి ఘటన....వ్యక్తిని కిందపడేసి మోకాలితో తొక్కిన పోలీసులు
రాబోయేవి మరింత దుర్భర దినాలు
అమెరికాలో వివక్ష గురించి మాట్లాడేవారు భారత్ లో వివక్ష గురించి ఎందుకు మాట్లాడరు ?
తెలంగాణ మంత్రులకు ప్రొఫెసర్ హరగోపాల్ లేఖ‌ !
వీవీ,సాయిబాబాలతో సహా రాజకీయ ఖైదీల విడుదలకై వారం రోజుల కార్యక్రమాలు -నిర్బంధ వ్యతిరేక వేదిక పిలుపు
మానవత్వానికే మచ్చ తెచ్చిన ఆ దుర్మార్గుడితో కలిసి ఉండలేను... విడాకులు ఇప్పించండి
నోరు మూసుకో....ట్రంప్ కు పోలీసు చీఫ్ హెచ్చరిక‌
తెలంగాణకోసం పోరాడిన వారు జైళ్ళలో మగ్గుతున్నరు
వరవరరావు బెయిల్ పిటిషన్ మళ్ళీ వాయిదా !
వరవరరావు విడుదల కోసం ʹమాహాʹ సీఎంకు మాజీ కేంద్ర సమాచార కమీషనర్ల‌ లేఖ
వీవీ,సాయిబాబాల‌ జీవించే హక్కును కాపాడండి...పౌరహక్కుల సంఘం
కేసీఆర్ కు తెలంగాణ, ఏపీకి చెందిన 27 మంది ప్రముఖ రచయితల విజ్ఞప్తి
వీవీ, సాయిబాబాలను వెంటనే విడుదల చేయాలి -సామాజిక తెలంగాణ మహాసభ
వరవరరావును వెంటనే విడుదల చేయాలి - సీపీఐ (ఎంఎల్) జనశక్తి డిమాండ్
వరవరరావు ఆరోగ్యంపై ఆయన సహచరి హేమలత ప్రకటన‌
వీవీ, సాయిబాబాలతో సహా రాజకీయ ఖైదీలందరినీ విడుదల చేయాలంటూ దేశవ్యాప్త ప్రదర్శనలు
సామాజిక కార్యకర్తల‌ జీవించే హక్కును కాలరాస్తున్న‌ పాలకుల విధానాలపై రేపు(మే29) నిరసన
మంథని లో లాకప్ డెత్...పౌరహక్కుల సంఘం నిజ నిర్దారణ... విచారణకు ఆదేశించిన హైకోర్టు
దయనీయస్థితిలో జి.ఎన్.సాయిబాబా ఆరోగ్య పరిస్థితి- సహచరి వసంతకుమారి ఆందోళన
వరవరరావును విడుదల చేయాలి -జర్నలిస్టు,హక్కుల,ప్రజా సంఘాల డిమాండ్
వరవరరావు విడుదలకు తెలంగాణ ప్రభుత్వం చొరవ చేయాలి..వివిధ పార్టీల డిమాండ్
మా నాన్నను వెంటనే విడుదల చేయండి..వరవరరావు కూతుర్ల లేఖ‌
వీవీ, ఇతర సామాజిక‌ కార్యకర్తలున్న తలోజా జైలుతో సహా మూడు జైళ్ళలో కరోనాతో ముగ్గురు ఖైదీల మృతి !
తలోజా జైల్లో వ్యాపించిన కరోనా...అనారోగ్యంతో ఉన్నవీవీని తక్షణం విడుదల చేయాలని విరసం డిమాండ్
more..


కేటీఆర్