ఖాన్ సాబ్ - వివి - ఓ జ్ఞాపకం...!!


ఖాన్ సాబ్ - వివి - ఓ జ్ఞాపకం...!!

ఖాన్

(ఎస్ ఏ డేవిడ్ తన ఫేస్ బుక్ టైంలైన్ పెట్టిన పోస్ట్)

చాలా కాలంగా ఒక ఆలోచన ఉండింది. తెలుగు సమాజంలో అట్టడుగు వర్గాల కోసం తమ జీవితాలను వెచ్చించిన ప్రగతిశీల భావజాలం గల వ్యక్తులను భవిష్యత్తు తరాలకు అందించేందుకు వాళ్ళ అనుభవాలను, జ్ఞాపకాలను రికార్డ్ చేసి భద్ర పరచాలని..

ఇదే విషయాన్ని వివి (వరవరరావు)సార్ తో చర్చిస్తే మంచి ప్రయత్నం, అత్యవసరంగా కొందరిని రికార్డు చేయాలి, నా సహకారం తప్పకుండా ఉంటుందని, కొందరిని తనే స్వయంగా ఇంటర్వ్యూ కూడా చేస్తానని హామీ కూడా ఇచ్చాడు.

జీవిత చారమాంకంలో ఉన్న కొందరిని ముందుగా రికార్డ్ చేద్దామని, కేశవరావు జాదవ్, ఎం.టీ.ఖాన్, చలసాని ప్రసాద్ తదితర పేర్లను అనుకున్నాం. ముందుగా కేశవరావు జాదవ్ సార్ చెప్పే విషయాలను రికార్డ్ చేయాలని ప్రయత్నిస్తే ఆయన ఆరోగ్యం సహకరించకపోవడంతో కొంతకాలం వాయిదా వేసుకున్నాం. ఇక తర్వాత ఇంటర్వ్యూ చేయాల్సిన వ్యక్తి ఎం.టీ.ఖాన్ సార్..

ఎం.టీ.ఖాన్ సార్ ను వివి గారు ఇంటర్వ్యూ చేస్తుంటే దాన్ని రికార్డ్ చేయాలని, నేను వివి సార్ ఇద్దరం కలిసి కొంత వర్క్ కూడా చేశాం. ఎం.టీ.ఖాన్ సార్ ఫోన్ చేస్తే ఎప్పుడైనా ఇంటికి రావొచ్చు అని చెప్పాడు. ఆగస్టు 18న ఇంటర్వ్యూ చేయాలని అనుకున్నాం. ఆయనకు సంబంధించిన మరింత సమాచారాన్ని ఖాన్ సార్ శిష్యుడైన పాశం యాదగిరి గారితో కనుక్కోవాలని అనుకున్నాం.

దీనికోసం వీడియో, ఫోటో కెమెరా, ఒక వాయిస్ రికార్డర్ సిద్ధం చేశాను. ఆగస్టు 18, 2014 రోజు ఖాన్ సార్ ని రికార్డ్ చేయాలని అనుకున్నాం. కానీ అదే సమయంలో వీవీ సార్ మలక్ పేట నుండి అశోక్ నగర్ కు ఇల్లు మారాడు.. ఇంట్లో ఏవో ఆర్జంట్ పనులు ఉండటంతో ఆరోజు మేము చేయాల్సిన ఇంటర్వ్యూ అనుకోకుండా వాయిదా పడింది.

రెండు రోజుల తర్వాత ఇంటర్వ్యూ చేద్దామని అనుకున్నాం. ఈలోపు చేదువార్త. ఖాన్ సార్ ఇక లేరు అని. వివి సార్ ని ఎప్పుడు కలిసిన గుర్తుచేసేవాడు ఖాన్ సార్ ని మనం ఇంటర్వ్యూ చేస్తే బాగుండు అని. ఖాన్ సార్ ఇంటి ముందు ఉన్న ఓ సూఫీ సన్యాసి సమాధి ఎవరిదో తెలుసుకోవాలని, దాని వెనుక ఉన్న కథను ఖాన్ సాబ్ చెబుతుంటే తెలుసుకోవాలని అనుకునే వాడు. కానీ అది తీరకుండానే పోయింది.

అయితే ఖాన్ సాబ్ కి వివి గారికి ఓ పోలిక ఉంది. ఇద్దరికి ʹమగ్దూం మొహియుద్దీన్ʹ అంటే ఇష్టం..ప్రేమ. ఎం.టి.ఖాన్ సాబ్. ʹమగ్దూం మొహియుద్దీన్ʹ తో ప్రభావితుడై కమ్యూనిస్టుగా మారాడు. ʹమగ్దూం మొహియుద్దీన్ తన జీవిత కాలమంతా కమ్యూనిస్టుగా బతికినట్లే వీళ్ళిద్దరూ కూడా కమ్యూనిస్టు విలువలతోనే జీవించారు/ జీవిస్తున్నారు.

ఖాన్ సార్ లాంటి వారి జీవితాన్ని రికార్డ్ చేయాలని అనుకున్నట్లే, సుదీర్ఘ కాలం విప్లవోద్యమాన్ని తన శ్వాసగా చేసుకొని ఆచరణాత్మక జీవితాన్ని కొనసాగిస్తున్న వివి గారి జీవితాన్ని, తన పయనంలో జరిగిన అరుదైన విషయాలను..సంఘటనలను, తను చూసిన, విన్న, అనుభవించిన కథలను కూడా రికార్డ్ చేయాలని అనుకున్నాను. ఇదే విషయాన్ని వివి గారితో చెబుతూ, ʹమీతో పాటు ఓ మూడు నెలలు ట్రావెల్ చేస్తాను. ఎక్కడికి వెళితే అక్కడికి వస్తాను. మీకు గుర్తుకు వచ్చింది..చరిత్రలో నమోదు చేయాలనుకున్న విషయాలన్నింటిని చెబుతూ వెళ్ళండి వాటిని రికార్డ్ చేద్దాం" అని చెప్పాను. దానికి వివి గారు నవ్వుతూ సాధ్యమవుతుందంటావా..అని అనుమానాన్ని వ్యక్తం చేస్తూనే.. ఒకే చెప్పాడు.

వీవీగారికి నేను కలిసినప్పుడల్లా.. నీకు టైం ఇవ్వలేకపోతున్నాను డేవిడ్ అంటూనే..మనం ఖాన్ సాబ్ ఇంటర్వ్యూ మిస్ అయ్యాం అని బాధను వ్యక్తం చేసేవాడు.

మీతో పాటు ట్రావెల్ చేస్తూ రికార్డ్ చేస్తానని వివి గారికి చెప్పడం అయితే చెప్పాను కానీ, ఆయనతో జర్నీ చేయడం అంటే అనుకున్నంత సులభమైనది కాదని మహారాష్ట్ర పోలీసులు ఆయన్ని ఇంట్లో నుండి తీసుకెళుతున్నారని తెలిసినప్పుడు అర్థమైంది.

ఆయన్ని కలిసి మాట్లాడుతున్నప్పుడు "ఇక నువ్వు రికార్డ్ చేద్దామనుకున్నది ఇప్పట్లో సాధ్యం కాదేమో డేవిడ్... టైం ఇవ్వలేకపోయాను. ఎప్పుడు బయటకు వస్తానో కూడా తెలియదు..చూద్దాం తిరిగొచ్చక" అంటూ అపరాధభావంతో, నవ్వుతూ మాట్లాడిన మాటలు పదేపదే గుర్తొస్తూనే ఉన్నాయి.

ఖాన్ సాబ్ భౌతికంగా మనమధ్య లేడు... వీవీ సార్ రాజ్య నిర్బంధంలో బందీగా ఉన్నాడు...కానీ వాళ్ళు నడిచిన మార్గం...చూపిన దారి.. రేకెత్తించిన ప్రశ్నలు..వెంటాడుతూనే ఉన్నాయి..

*ఎం.టీ.ఖాన్ వర్ధంతి సందర్భంగా....
- ఎస్ ఏ డేవిడ్
ఫోటోలు: కేవీ కూర్మనాథ్

Keywords : varavararao, mt khan, virasam, mukhdum moinuddin, communism
(2020-02-23 03:51:37)No. of visitors : 405

Suggested Posts


ఆ తల్లిముందు దోసిళ్లతో.....ʹ - వరవరరావు

ʹమీరేమనుకోకుంటే ఒక ప్రశ్న వేస్తాను. ఇంత పెద్దవాళ్లున్నారు. ఈ పిల్లవాడే దొరికాడా పంపడానికిʹ అని అడిగింది ఆ తల్లి. ఆ తల్లిని నేను అప్పుడే చూడడం. ఆమె షాక్‌ తిన్నట్లుగా ఉన్నది. తండ్రి విహ్వలంగా దు:ఖిస్తున్నాడు గనుక గుండెబరువు దిగిపోతున్నట్లున్నది.....

సారూ.. ఆరోగ్యం జాగ్రత్త..!

మరికాసేపట్లో వాహనం ఎక్కిస్తారనగా అపార్ట్‌మెంట్ వాసులు వరవరరావు చుట్టూ చేరారు. వారెవరో ఆయనకు కానీ ఆయన కుటుంబ సభ్యులకు కానీ పెద్దగా పరిచయం లేదు. అయినా కానీ విరసం నేత చుట్టూ చేరారు. సొంత బంధువు కన్నా మిన్నగా జాగ్రత్తలు చెప్పడం మొదలుపెట్టారు. ʹʹసార్.. నమస్తే సార్. ఆరోగ్యం జాగ్రత్త.. వేళకు మందులు వేసుకోండిʹʹ అనడం చూసి విస్తుపోవడం కుటుంబ సభ్యుల వంతు అయ్యింది.

నక్సల్బరీ ప్రాసంగికత ‍- వరవరరావు (2)

చుండూరు మారణకాండపై ప్రత్యేక కోర్టు ఏర్పడి నేరస్తులకు శిక్ష పడిన స్థితి నుంచి హైకోర్టు వాళ్లను వదిలి పెట్టిన కాలానికి ఈ పరిణామ క్రమాన్ని చూస్తే ఇదొక విషాదం. ఇటు విప్లవోద్యమం, అటు దళిత అస్తిత్వ ఉద్యమాలు స్వీయ విమర్శ చేసుకోవలసిన విషాదం....

సాయిబాబాను రక్షించుకుందాం -వరవరరావు

నాగపూర్ సెంట్రల్ జైలు లోని అండా సెల్ లో ఉన్న ప్రొ . సాయిబాబ ఆరోగ్య పరిస్ధితి నానాటి దిగజారాడం తో ఆయన భార్య వసంత జాతీయ మానవ హక్కుల కమిటీకి, జాతీయ వైకల్య హక్కుల వేదిక తో కలసి ఫిర్యాదు చేశారు . ఆయన శిక్ష విధించే కొద్దీ రోజుల ముందు పిత్తాశయం, క్లోమ గ్రంధి కి సంబంధి ఆపరేషన్...

ప్రజల సభంటే.. ఇట్లుంటది

ఇప్పుడెందుకో.. సభలు గుర్తుకు వస్తున్నాయి. తెరలు తెరలుగా నాటి జ్ఞాపకాలు యాదికొస్తున్నాయి. అవి మర్చిపోవటానికి ఏమైనా ఘటనా.. కాదు అనుభవం. తేనెతుట్టె కదిపినట్టు..జ్ఞాపకాల దొంతరలు.. ముసురుకుంటున్న ముచ్చట్లు.. మానవీయ స్పర్శలు.. ఆత్మీయతలు..

సెప్టెంబర్ 17 - ఇండియన్ యూనియన్ సైనిక దురాక్రమణ దినం - వరవరరావు

నైజాం రాజ్యంలో వెయ్యి మంది కమ్యూనిస్టులు, సానుభూతిపరులు కూడా చంపబడ్డారో లేదో కాని యూనియన్ మిలిటరీ నాలుగు వేల మంది కమ్యూనిస్టులను, సానుభూతిపరులను చంపింది. ఎలమర్రు, కాటూరు గ్రామాల్లో గాంధీ విగ్రహం చుటూ పురుషులను వివస్త్రలను చేసి పరుగెత్తిస్తూ స్త్రీలపై అత్యాచారాలు చేసిన ఘటనలు ప్రపంచమంతా చెప్పకున్నది. హరీంద్రనాథ్ ఛట్టోపాధ్యాయ్ దీర్ఘ కవిత్ర రాశాడు.....

కామ్రేడ్ కాకరాల పద్మ ఎక్కడ ?

విప్లవ కార్యకర్త, విప్లవ మహిళా సంఘం నాయకురాలు కామ్రేడ్ కాకరాల పద్మ ఏమైంది. నాలుగు రోజుల కింద తమిళనాడులోని ఈరోడ్ జిల్లా సెన్నిమలై దగ్గర ఆమెను కిడ్నాప్ చేసిన ʹగుర్తు తెలియని వ్యక్తులుʹ పద్మను ఏం చేశారు...

ఒక మహిళ అస్తిత్వం ఏంటిది - పవన‌

నేను ʹపవనʹనా? ʹపెండ్యాల పవనʹనా? ʹకుసుమ పవనʹ నా? నేను ʹపవనʹ అనే ఒక మనిషినా లేక వరవరరావు బిడ్డనో, సత్యనారాయణ భార్యనో ʹమాత్రమేʹనా? నాలో సుళ్లు తిరుగుతున్న ఈ ప్రశ్నలన్నిటికి మల్లొక్కసారి నాకు నేను జవాబు చెప్పుకుంటూ మీ అందరితో నా ఈ ఘర్షణను పంచుకుందామని నా ఆశ.

తొలితరం మహిళా నక్సలైట్‌ కొమురమ్మకు విప్లవ జోహార్లు -వరవరరావు

మహబూబాబాద్‌ ప్రాంతంలో కరుడుగట్టిన భూస్వామ్యంతో రాజీలేకుండా పోరాడి 1989-90లలో మళ్లీ వెళ్లిన అజ్ఞాత జీవితంలో వాళ్లను ప్రతిఘటించే క్రమంలోనే దొరికిపోయి హత్యకు గురైన యోధుడు. యాదగిరి రాజు నాయకత్వం నుంచి లిన్‌పియావో వర్గం వైపు ఆకర్షితులైన జగన్‌ మోహన్‌ రెడ్డి, స్నేహలతల దళంలో వెంటకయ్య, కొమురమ్మలు పనిచేసినట్లు వింటుండేవాళ్లం.

యాభై ఏళ్ల నక్సల్బరీ: కవిత్వంలో అమరత్వం...జూలై 28 - వరవరరావు

చారు మజుందార్‌ కన్న ముందే 1970 జూలై 28ననే మరొక గొప్ప విప్లవకారుడు కామ్రేడ్‌ భుజాసింగ్‌ పంజాబ్‌లో అమరుడయ్యాడు. అది పోలీసులు చేసిన ఎన్‌కౌంటర్‌ హత్య...102 సంవత్సరాల క్రితం సాయుధ పోరాటం చేపట్టిన గదర్‌ పార్టీ మొదలు నక్సల్బరీ వసంత మేఘగర్జన దాకా ఆయన సాయుధ విప్లవంతో కొనసాగిన కమ్యూనిస్టు.....

Search Engine

నిరసనపై నిరసన: వందలమంది హిందుత్వ వాదుల మధ్య ఆజాది అంటూ నినదించిన‌ యువతి
సీఏఏకు వ్యతిరేకంగా కవిత్వం చదివిన కవి, సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన జర్నలిస్టు అరెస్టు
జాదవ్ పూర్ యూనివర్సిటీ ఎన్నికల్లో ఎగిరిన ఎర్రజెండా
దళిత యువకుల‌పై దుర్మార్గ దాడి - స్క్రూడ్రైవర్‌ను వెనక నుంచి జొప్పించి హింసలు
CAA పౌరసత్వానికి మత పరీక్ష... అమెరికన్ ఫెడరల్ ప్యానెల్
ట్రంప్ వస్తున్నాడు 24 గంటల్లో ఇండ్లు ఖాళీ చేయండి ... పేదలకు నోటీసులు
వైనాడు కొండల్లో కురిసిన నక్సల్బరీ తొలి వసంత మేఘం... !
మీడియా ప్రచారంలో నిజముందా ? ఆ విద్యార్థుల చేతుల్లో రాళ్ళున్నాయా ?
ʹకరోనా వైరస్ కాదు దేవుడి అవతారం ... విగ్రహాలు ప్రతిష్టించి పూజించండిʹ
భీమా కోరేగావ్ కేసు సమాంతర విచారణకు మహారాష్ట్ర‌ సర్కార్ నిర్ణయం
ట్రంప్ కు భారత్ లో పేదలు కనబడొద్దట - 7అడుగుల ఎత్తు గోడను కడుతున్న బీజేపీ ప్రభుత్వం
కన్హయ్యకుమార్ పై మళ్ళీ దాడి...2వారాల్లో ఇది 7వ దాడి
CAA,NRCలకు వ్యతిరేకంగా మావోయిస్టుల ప్రచారం
ఆప్ గెలుపుతో ఢిల్లీలో పెరిగిన బిర్యానీ సేల్స్... బీజేపీ అభిమానుల అసహనం
ʹఅర్బన్ నక్సల్ʹ అంటే ఎంటో, ఎవరో మాకు తెలియదు - కేంద్ర ప్రభుత్వం
క్యాంపస్‌లోకి చొరబడి అమ్మాయిలపై గూండాల‌ వికృత చేష్టలు...భగ్గుమన్న విద్యార్థి లోకం
ఢిల్లీ జామియా విద్యార్థులపై పోలీసుల దుర్మార్గ దాడి - అనేకమందికి గాయాలు
షాహీన్ బాగ్: అంబులెన్స్, స్కూల్ బస్ లను ఆపుతున్నదెవరు ?
కునాల్ కమ్రాపై ఇండిగో నిషేధాన్నినిరసిస్తూ విమానంలో నిరసనలు
భక్తులే కాదు బాస్ కూడా వాట్సప్ యూనివర్సిటీయే
ʹనా కొడుకు మోడీ, అమిత్‌షాల మద్దతుదారుడుʹ
గృహనిర్బంధం ముగిసే కొన్ని గంటల ముందు వీళ్ళద్దరిపై దుర్మార్గమైన కేసులు
In Death, A Starʹs Dawn – GauriLankesh on Com Saketh Rajan
బీజేపీకి ఓటెయ్యక పోతే రేప్ చేస్తారా - మోడీకి 170 మహిళా ప్రముఖుల లేఖ‌
CAA,NRCలకు వ్యతిరేకంగా గ్రామపంచాయితీ సంచలన తీర్మానం
more..


ఖాన్