తెలంగాణ సాయుధ పోరాటం నుండి నక్సల్బరీ వరకు... ఎమ్ టీ ఖాన్ జీవితం


తెలంగాణ సాయుధ పోరాటం నుండి నక్సల్బరీ వరకు... ఎమ్ టీ ఖాన్ జీవితం

తెలంగాణ

ఉద్యమాలతోనే ప్రజలు స్వేచ్ఛా హక్కును సాధించుకుంటారనే బలమైన విశ్వాసం ఎం.టి ఖాన్‌ది. అదే అతన్ని చివరికంట ఉద్యమాలతో, హక్కుల ఉద్యమాలతో ఐక్యంగా ఉండేలా చేసింది. హైదరాబాద్ పాత బస్తీలోని పురాణాపూల దగ్గర సంప్రదాయక ముస్లింలైన దర్గా ముత్తావలి (ధర్మకర్త) కుటుంబంలో 1933లో ఎం.టి.ఖాన్ జన్మించారు. తెలంగాణ సాయుధ పోరాట ఉద్యమకాలంలో కూడా రజాకార్ల ఆగడాలను తీవ్రంగా వ్యతిరేకించాడు.

మతోన్మాదులు ఎవరైన ఒక్కటే అనే భావనతో హిందూ ముస్లిం మతోన్మాద దాడులను వ్యతిరేకించాడు. 60, 70 దశకంలో యువత నక్సల్బరి, శ్రీకాకుళ ఉద్యమాలకు ప్రేరేపించబడ్డట్టుగా ఖాన్‌సాబ్ కూడా ఆ ఉద్యమాలతో పెల్లుబికిన అనేక ప్రజా ఉద్యమాలలో తనవంతు బాధ్యతను నిర్వర్తించాడు. 1969లో మొదటి దశ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు. శ్రీకాకుళ నక్సల్బరి ఉద్యమాల ప్రభావంతో 1970లో ఏర్పడ్డ విప్లవ రచయితల సంఘంలో వ్యవస్థాపక సభ్యుడైనాడు. 1972లో ʹపిలుపుʹ పేరుతో పత్రికను స్థాపించి నడిపించినారు.

1975 ఎమర్జెన్సీ కాలంలో అరెస్టు అయిన తొలి హైదరాబాదీ ఖాన్‌సాబ్. జైళ్ళు నుండే పిలుపు పత్రికను ఆయన భార్య కైసర్ బేగవ్‌ు సహకారంతో నడిపించాడు. సికింద్రాబాద్ కుట్ర కేసులో కొండపల్లి సీతారామయ్య తదితరులతో అరెస్టయినాడు. అప్పటికే వివిధ సంఘాల కార్యాచరణలో ఉన్న ఖాన్‌సాబ్, 1980లో ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం హైదరాబాద్ శాఖకు ఉపాధ్యక్షుడయినాడు.
అప్పుడు డా॥ రాజ్ గోపాలన్, కోదండరాంలు అధ్యక్ష, కార్యదర్శులుగా కొనసాగారు. 80 దశకం నుండి 90 దశకం వరకు హైదరాబాద్‌లో జరిగిన మత ఘర్షణలలో 93 మంది చనిపోగా, 64 మంది కత్తిపోట్లకు గురైయ్యారు. 350 మంది హింసా కారకులుగా జైళల్లో నిర్బంధించబడ్డారు. ఈ స్థితిలో మత ఘర్షణల నివారణ కోసం హైదరాబాద్ ఏక్తా సంస్థలో చాలా కాలం పని చేసారు.
1991లో కరీంనగర్‌లో జరిగిన ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం 7వ రాష్ట్ర మహాసభల్లో రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా బాధ్యత తీసుకున్నాడు. ఆ తర్వాత 1993లో జరిగిన 8వ రాష్ట్ర మహాసభల్లో ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘంలో ఎదురైన సంక్షోభ సమయంలో కన్నాభిరాన్ స్థానంలో అందరికీ ఆమోదనీయుడైన వాడిగా సంస్థకు అధ్యక్షుడయినాడు ఖాన్‌సాబ్. అప్పటి నుండి ఐదేండ్ల పాటు పౌరహక్కుల సంఘానికి అధ్యక్షుడుగా ఉండి 1998లో హైదరాబాద్‌లో జరిగిన సంస్థ 10వ రాష్ట్ర మహాసభల నాటి నుండి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా పౌరహక్కుల సంఘంలోనే కొనసాగాడు. ఖాన్‌సాబ్ సంస్థకు అధ్యక్షుడుగా ఉన్న 1993 నుంచి 1998 కాలంలో పౌరహక్కుల ఉద్యమ చరిత్రలో ఎంతో ప్రాముఖ్యత, ప్రాధాన్యత కలిగిన సంఘటనలు జరిగాయి.
ఎన్‌కౌంటర్ హత్యలు పెద్ద ఎత్తున జరిగిన కాలమది. 1993 జనవరి 30న ఎవ్‌ుఎల్‌ఎ బాలరాజ్, ఒక ఐఎఎస్ అధికారితో పాటు ఎనిమిది మందిని నక్సలైట్లు తూర్పు గోదావరి జిల్లా గుర్తేడులో కిడ్నాప్ చేసిన కాలమది. అప్పటి 23 ఏళ్ళ నక్సలైట్ చరిత్రలో మొట్టమొదటి ఐ.పి.ఎస్ ఆఫీసర్, వ్యాస్ హత్య జరిగిన కాలమది. అదే కాలంలో నిజామాబాద్, తెలంగాణ రీజనల్ సెక్రటరీ శంకర్ అలియాస్ దొంత మార్కెండేయ ఎన్‌కౌంటర్ హత్యకు గురయ్యాడు.
ఖాన్‌సాబ్ అధ్యక్షుడుగా ఉన్నంత కాలం రాజ్యహింస, ఆచరణ విషయాల పట్ల పౌరహక్కుల ఉద్యమం అవలంబిచాల్సిన హక్కుల దృక్పధాల పట్ల తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. ప్రజాతంత్ర పోరాటాలు బలంగా సాగినప్పుడు చారిత్రక ప్రజాస్వామ్య భావ సంఘర్షణ జరిగింది. ఇంత ఘర్షణలో ఖాన్‌సాబ్ ఎక్కడా తన సంయమనాన్ని కోల్పోలేదు. తీవ్రమైన వాదోపవాదాల్లో పాల్గొంటూ తన అధ్యక్ష గౌరవాన్ని కాపాడుకున్నాడు.
అది ఖాన్‌సాబ్‌కు జీవితం ఇచ్చిన పరిణతి. ఎన్‌కౌంటర్ హత్యలు పెద్ద ఎత్తున సాగిన కాలంలో అప్పట్లో ఎన్‌కౌంటర్లో ఎవరు చనిపోయారో ప్రకటించేవారు కాదు. రాత్రికి రాత్రే ఇంట్లో నుంచి యువకుల్ని ఎత్తుకెళ్ళి కాల్చి చంపి, ఎన్‌కౌంటర్‌గా గుర్తు తెలియని శవంగా ప్రకటించడం జరుగుతుండేది. శవాలను బంధుమిత్రులకు అప్పగించే బాధ్యత ప్రభుత్వం నిర్వహించేది కాదు. ఎన్‌కౌంటర్‌లో మరణించిన శవం దరి దాపుల్లోకి ఎవరినీ రానిచ్చేవారు కాదు.
అటువంటి కాలంలో 1994 లో సూర్యం ఎన్‌కౌంటర్ కేసు హైకోర్టులో న్యాయవాదులు న్యాయస్థానంలో పోరాటం చేయడానికి ఎటువంటి సంకోచం లేకుండా ఆ కేసులో పిటిషనర్‌గా ఖాన్‌సాబ్ నిలబడ్డాడు. మొదటి సారిగా రీ పోస్టుమార్టం చేయించడం ద్వారా లభ్యమైన సాక్ష్యాధారాలతో ఎన్‌కౌంటర్ల బూటకత్వాన్ని కోర్టు ముందు ప్రశ్నించి నేరాన్ని నిర్ధారించడం ఆ కేసుతోనే మొదలై ఆ తరువాత వెల్లువలా హైకోర్టులో కేసులు వేసి శవాలను భద్రపరచాలని, బంధు మిత్రులకు అప్పగించాలని, వారి వారి కుటుంబ ఆచారాల ప్రకారంగా, రాజకీయ విశ్వాసాలపరంగా అంతిమ యాత్రకు అనుమతించాలని పలు ఆదేశాలు పొందడం మొదలైంది.
న్యాయస్థానాల్లో న్యాయపోరాటంగానే కాక, కోర్టు బయట కూడా ప్రజా ఉద్యమాన్ని కొనసాగించింది. ఏ ఎన్‌కౌంటర్ హత్యలతో శ్మశాన భయానక వాతావరణం సృష్టించాలని పాలకులు, ప్రభుత్వాలు పెద్ద ఎత్తున బూటకపు ఎన్‌కౌంటర్లు చేయించారో అందుకు ప్రతి ఘటనగా ప్రతి ఎన్‌కౌంటర్ సందర్భమూ మార్చురీలను, ఊర్లను స్మశానాలను సైతం సరికొత్త పోరాట కేంద్రాలుగా మార్చారు.
ఆప్తులను కోల్పోయిన బంధు మిత్రులు, గ్రామ ప్రజలే పాటలతో, సభలతో ఊరేగింపులతో సరికొత్త ఎన్‌కౌంటర్ల నిరసన రూపాలను సష్టించారు. ఈ కదలికను, పెల్లుబికిన ప్రజాగ్రహాన్ని ముందుండి నడిపిన పురుషోత్తం, గద్దర్లపై హత్యా ప్రయత్నాలు జరిగితే ʹఎన్‌కౌంటర్ శవాల స్వాధీన కమిటీʹ కన్వీనర్‌గా ఆ బాధ్యతను స్వీకరించి కొనసాగించాడు ఖాన్‌సాబ్.
ఎన్‌కౌంటర్ హత్యలకి వ్యతిరేకంగా వచ్చిన నాటి విశాల ప్రజా ఉద్యమాల నేపధ్యం లేకుండా 1997 లో మొదటిసారిగా హైకోర్టు మధుసూదన్ రాజ్ ఎనౌకౌంటర్ కేసులో హత్యానేరం నమోదు చేయాలనే తీర్పు ఇచ్చేది కాదు. అటు కోర్టులో న్యాయ పోరాటంలో ఇటు బయట ప్రజా పోరాటంలో ముందుండి నాయకత్వం వహించింది ఎవ్‌ు.టి. ఖాన్.
1993లో జాతీయ మానవహక్కుల కమిషన్ ఎన్‌హెచ్‌ఆర్‌సి ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎనౌకౌంటర్ హత్యలను పోలీసు కస్టడీ హత్యలను అప్పటివరకు సవివరంగా సేకరించి విపులంగా వివరిస్తూ 1994లో ఎపిసిఎల్‌సి అధ్యక్షులు ఎవ్‌ు.టి. ఖాన్ ఫిర్యాదుదారుడిగా కేసు వేస్తే ఆ విచారణకు స్వయాన ఎన్‌హెచ్‌ఆర్‌సి చైర్మన్ రంగనాథ్ మిశ్రా రాష్ట్రానికి వచ్చారు.
కరీంనగర్, వరంగల్, నల్గొండ జిల్లాల్లో ఎన్‌హెచ్‌ఆర్‌సి చైర్మన్ సమక్షంలోనే ఎవ్‌ు.టి. ఖాన్ బాలగోపాల్, కన్నభిరాన్లపై మఫ్టీ పోలీసులు, మాజీలు కలిసి గూండాల్లా దాడి చేసారు. దాంతో హైద్రాబాద్ లేక్ వ్యూ గెస్టు హౌస్‌లో ఎన్‌హెచ్‌ఆర్‌సి తదుపరి విచారణ ముగించింది. ఆ విధంగా బహిరంగ విచారణనైతే రాష్ర్ట పోలీసులు అడ్డుకోగలిగారు గానీ, ఎన్‌హెచ్‌ఆర్‌సి ముందే బరితెగించిన వారి హక్కుల ఉల్లంఘన చర్యలను వారే బహిరంగపరుచుకున్నారు.
ఫలితంగా 1997లో ఎన్‌హెచ్‌ఆర్‌సి ఎన్‌కౌంటర్ హత్యలు, కస్టడీ మరణాల విషయంలో హత్య కేసులు నమోదు చేయాలని, విచారణను నిందిత పోలీసులు కాక ఇతరేతర పోలీసులు చేయాలని శవ పరీక్షను వీడియోలో చిత్రీకరించి భద్రపరచాలని ఆదేశాలను దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు గైడ్ లైన్స్ గా ఇచ్చింది. ఇందుకు మూలం ఖాన్‌సాబ్ ఆధ్వర్యంలో ఎపిసిఎల్‌సి జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఇచ్చిన ఫిర్యాదే.
1994- 95 సంవత్సరాలలోనే చరిత్రాత్మకమైన జైలు ఖైదీల పోరాటం జరిగింది. రాష్ర్ట వ్యాప్తంగా నక్సలైట్ ఖైదీలు, జీవిత ఖైదీలు వివిధ జైళ్ళలో చేస్తున్న నిరవధిక నిరాహార దీక్ష నెల రోజులు దాటడంతో వారికి సంఘీభావంగా బయట 72 ప్రజా సంఘాల మద్దతుతో జాయింట్ యాక్షన్ కమిటీ ఫర్ డెమొక్రాటిక్ రైట్స్ జెఎసిడిఆర్ ఆధ్వర్యంలో నిరవధిక నిరాహార దీక్ష శిబిరాన్ని ప్రారంభిస్తూ మొదటి రోజు ఆయనే దీక్షలో పాల్గొన్నాడు.
సుదీర్ఘమైన జైలు జీవితాన్ని చూసిన ఖాన్ సాబ్ ఆనాటి ఖైదీల పోరాటం విజయవంతంగా నడిపి 42 డిమాండ్లు సాధించుకోవడంలో, అప్పటి హోం మంత్రి, స్వయాన ఖాన్‌సాబ్ విద్యార్థి అయిన ఇంద్రా రెడ్డితో చర్చలు నడిపించడంలో ఎంతో చురుకైన పాత్ర పోషించారు. 2000 సంవత్సరంలో పురుషోత్తం హత్య ఆ తరువాత ఆజాం అలీ హత్యలతో మాజీలను చేరదీసి హక్కుల సంఘాలు, ప్రజా ఉద్యమాలపై సరికొత్త హంతక దాడిని మొదలు పెట్టిన చంద్రబాబు ప్రభుత్వ పాశవిక నిర్భంధ కాలంలో ఎంతో ధైర్యంగా ముందుకువచ్చి సర్కారీ హంతక ముఠాల వ్యతిరేక కమిటీకి కన్వీనరుగా ఉండి రాష్ర్టంలో దేశంలో హక్కులడిగితే హత్యలా అని పాలకులను ప్రశ్నించాడు.
ఆ రకంగా తెలుగు సమాజంలో ప్రతి ఉద్యమంలో ప్రత్యేకించి హక్కుల ఉద్యమాలు అత్యంత భయానక దాడికి గురైన సందర్భంలోనే ఆయన పెద్ద దిక్కుగా, హక్కుల ఉద్యమానికి వెన్నుదన్నుగా నిల్చి అందరినీ నడిపించారు. ఖాన్ సాబ్.. హైద్రాబాద్లో మత ఘర్షణలు జరిగినపుడు రెండు మతాల స్వార్థపర నాయకులను ఎండ గట్టాడు.
రెండు మతాల ఉన్మాదానికి ఆజ్యం పోసే బిజెపి,ఎమ్ ఐ ఎమ్ కుట్రలను ధైర్యంగా ఎదిరించాడు. వీటికి ప్రత్యామ్నాయ ప్రజా ఉద్యమాలు పాతబస్తీలో రావాలని జీవితాంతం ఆకాంక్షించాడు. చార్మినార్ నుంచి చార్మినార్ వరకు పాత బస్తీ చుట్టివచ్చే విధంగా జరిగిన పెద్ద ఊరేగింపును, ఉర్దూ ఘర్‌లో సభను ఖాన్ సాబ్ చొరవతోనే ఎపిసిఎల్‌సి నిర్వహించింది.
సరిగ్గా సంవత్సరం క్రితం హైదరాబాద్ సరోజినీదేవి హాల్లో జరిగిన ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం 16వ రాష్ర్ట మహా సభలలో తెలంగాణ ప్రత్యేక రాష్ర్ట ఉద్యమ నేపథ్యంలో ʹపౌర హక్కుల సంఘంʹగా జరిగిన పేరు మార్పును ఆహ్వానిస్తూ తెలంగాణ రాష్ర్ట ఆవిర్భవాన్ని చూసిగాని చనిపోను అన్న ఖాన్ సాబ్, జూన్ 2న తెలంగాణ రాష్ర్ట ఆవిర్భావ సందర్భంగా అనారోగ్యంగా ఉన్నా గన్ పార్క్ వద్దకు వచ్చి తెలంగాణ అమరులకు జోహర్లు అర్పించారు.
నిండైన జీవితం, మెండైన అనుభవం కలబోసిన ఆయనది అరుదైన వ్యక్తిత్వం. నిఖార్సయిన ప్రజాస్వామిక జీవనం. ఆ సద్గుణాలే ఆయన సుదీర్ఘ జీవితంలో ఆయనతో ప్రయాణించిన వారందరికీ ఆయన తమవాడే అనిపించేట్లు చేసింది. అందుకే కావటానికి ఆయన పౌరహక్కుల సంఘం సారథి ఆయినా ఈనేల మీద సాగిన అన్ని ప్రగతిశీల ప్రజా ఉద్యమాల వారధి. ఆయన గురించి, ఆయనతో పంచుకున్న అనుభవాలను మనందరం స్మరించుకోవడం కోసం ఈ తరం వారికి తెలియజేయడం కోసం ఖాన్‌సాబ్ జీవితాన్ని ఆగస్టు 20 అతను మరణం రోజునైన గుర్తు చేసుకుందాం.
- ఎన్.నారాయణరావు,
ప్రధాన కార్యదర్శి, పౌరహక్కుల సంఘం, తెలంగాణ‌
ఫోటోలు : కేవీ కూర్మనాథ్

Keywords : MT Khan, apclc, virasam, telangana, fake encounters
(2019-09-18 23:43:52)No. of visitors : 308

Suggested Posts


మహాశ్వేతా దేవి - మన తెలంగాణ సాగర హారంః వరవర రావు

మన మహా సాగరహారం ʹచలో హైదరాబాద్ అంటూ తెలంగాణ మార్చ్ చేసిన సెప్టెంబర్ 30, 2012 మహత్తర మధ్యాహ్నం మహాశ్వేతాదేవి కూడా మన ఊర్లో ఉన్నారు. ఆ రోజు ఆమెను మన మధ్యకు తెచ్చుకొని ఉంటే....

సెప్టెంబర్ 17 - ఇండియన్ యూనియన్ సైనిక దురాక్రమణ దినం - వరవరరావు

1947 ఆగస్ట్ 15న విలీనానికి అంగీకరించకుండా షరతులు విధిస్తూ వచ్చిన నిజాంను నెహ్రూ - పటేల్ ప్రభుత్వం సగౌరవంగా, సాదరంగా చర్చలకు ఆహ్వానించింది. అప్పటికే నిజాంను వ్యతిరేకిస్తూ వీరోచిత పోరాటం నడుపుతున్న కమ్యూనిస్టులను మాత్రమే కాదు, కనీసం కాంగ్రెస్ ను కూడా ఈ చర్చల్లో భాగం చేయలేదు....

ʹఅరుణోదయʹ పై పోలీసుల దాడిని ఖండించిన విరసం

తెలంగాణ ఉద్యమంలో ఆట పాటతో ఆరుణోదయ కళాకారులు గ్రామ గ్రామాన తిరిగి ప్రజల్లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తమ వంతు కృషి చేశారు. ఆ సంస్థ కార్యాలయాన్ని దౌర్జన్యంగా మూసేయడం అత్యంత నిరంకుశమైన......

ఆదివాసి.. లంబాడా వివాదం ‍- ఎం.రత్నమాల

మహారాష్ట్ర ప్రభుత్వం లంబాడాలను ఆదివాసి తెగగా గుర్తించడం లేదు కనుక ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం లంబాడాలను ఆదివాసి షెడ్యూల్డు తెగగా ప్రకటించడంతో దీన్ని అవకాశంగా తీసుకుని మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్‌ (పాత) జిల్లాకు లంబాడాల వలసలు పెద్ద ఎత్తున వెల్లువలా సాగాయి.....

ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ పోరాటానికి విరసం మద్దతు

అట్టడుగున ఉన్న మనిషికి ఫలితాలు అందినప్పుడే సామాజిక న్యాయం జరిగినట్టు లెక్క. మాదిగ, డక్కలి, చిందు, మాష్టి, బుడగజంగం, దాసరి, బేగరి కులాలకు ఈ నాటికీ ఎస్సీ రిజర్వేషన్ ఫలాలు అందడం లేదు....

ఆ నిండైన సాహిత్య సామాజిక జీవితం రచయితలందరికీ ఆదర్శం - విరసం

ʹరచయితలందరూ తమ తరానికి జవాబుదారులు; తమకు తాము జవాబు చెప్పుకోవాల్సిన వాళ్ళు... అంతస్సాక్షి ఉన్న రచయిత పీడిత ప్రజల పక్షాన దృఢంగా నిలవాలి. అలా కాకపోతే ఆ రచయితల్ని నిర్దోషులుగా నిర్ణయించే ప్రశ్నే లేదు.ʹ....

ఉత్తేజకరంగా సాగిన విరసం సాహిత్యపాఠశాల‌

అంతకుముందు అంతర్జాతీయ శ్రామికవర్గ పతాకావిష్కరణతో కార్యక్రమాలను ప్రారం భించారు. అమరుడు పులి అంజన్న తల్లి సైదమ్మ ఎర్ర జెండాను, సీనియర్ విరసం సభ్యురాలు రత్నమాల విప్లవ రచయితల సంఘం జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా అమరుడు శేషయ్య సోదరుడు సాంబయ్య, అమరుడు వివేక్ తండ్రి యోగానంద్ అమరుల స్థూపాన్ని ఆవిష్క రించారు.

ʹఆయన జైల్లోనే చనిపోతారేమోʹ

90 శాతం అంగవైకల్యం కలిగిన సాయిబాబాను అన్యాయంగా జైల్లో పెట్టారని.. ఆయనేమైనా యుద్ద ఖైదీనా..? ప్రభుత్వ అనాలోచిత చర్యతో యుద్ధఖైదీ మాదిరి ఆయన జైల్లోనే తుది శ్వాస విడిచే పరిస్ధితి వచ్చిందని ...

అమరుడు బొజ్జా తారకం — ʹనది పుట్టిన గొంతుకʹ - వరవరరావు

గోదావరి తెలంగాణలో ప్రవేశించిన నిజామాబాద్ కు 1968లో వచ్చిన తారకం గారు ఇక్కడి మట్టిలోని ఎరుపులోనూ, ఇక్కడి నీళ్లలోని ప్రవాహ గుణంలోనూ కలగలిసిపోయారు. 1968 నుంచి 78 దాకా ఒక దశాబ్దం పాటు విప్లవోద్యమాలకు, విప్లవ సాహిత్యానికి నిజామాబాద్ చిరునామా బొజ్ఞాతారకం....

చలసాని స్మృతిలో... - కే.కుమార్ వర్మ

బొడ్డపాడు నడిబొడ్డులో అమరవీరులను స్మరిస్తూ ఎర్ర జెండా చేతబట్టి తామాడ గణపతి ఇంటిముందునుండి దండుగా కదులుతున్నట్లుంది...

Search Engine

తెలుగులో ఇలాంటి సినిమాలు తీయలేరా..?
పోరాడితే పోయేదేమీ లేదు...పోరాడి హక్కులు సాధించుకున్న విద్యార్థినులు
భీం ఆర్మీ ఛీఫ్ ఆజాద్ ను వెంటనే విడుదల చేయాలి... మేధావులు, లాయర్లు, విద్యార్థుల డిమాండ్
పులివెందుల నుండి నల్లమలదాకా...వరలక్ష్మి
ఆర్థిక మాంద్యం అంటే ఏమిటి ? ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కోవడం ఎలా ? - ఎన్.వేణుగోపాల్
కశ్మీర్ లో ఎవ్వరికి లేని ʹనెట్ʹ సేవలు బీజేపీ వాళ్ళకు ఎలా వచ్చాయి ?
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
Savenallamala: యురేనియం తవ్వకూడదన్నవాళ్ళంతా అర్బన్ నక్సలైట్లేనా ?
కశ్మీర్ ప్రజల పోరాటానికి మద్దతుగా నిబడదాం...మావోయిస్టు పార్టీ పిలుపు
భూ గురత్వాకర్షణ శక్తిని కనుగొన్నది ఐనిస్టీనా... న్యూటన్ కాదా ?
Maoist leader Murali recounts his own jail experience to cite rampant rights violation
ప్రభుత్వాన్ని,న్యాయవ్యవస్థను,ఆర్మీని విమర్శించడం దేశద్రోహం కాదు ... సుప్రీం కోర్టు జడ్జ్
దేవరకొండలో యురేనియం సర్వే కోసం వచ్చిన వారిని తరిమిన ప్రజాసంఘాలు
చెప్పులేసుకొని బైక్ నడిపినా.. లుంగీ కట్టి లారీ నడిపినా భారీ జరిమానాలు..!
యురేనియంపై నల్లమల బంద్.. కదం తొక్కిన జనం... నాయకుల అరెస్ట్, ఉద్రిక్తత‌
నల్లమల ప్రజలకు మద్దతుగా నిలబడదాం, యురేనియం తవ్వకాలను అడ్డుకుందాం ... మావోయిస్టు పార్టీ ప్రకటన‌
జేఎన్యూ పై మళ్ళీ ఎర్రజెండా రెపరెపలు... విద్యార్థి సంఘం ఎన్నికల్లో లెఫ్ట్ ఘనవిజయం
దేవుడు లేడని చెప్పే హక్కు రాజ్యాంగం కల్పించింది...మద్రాస్ హైకోర్టు
దేశ పరిస్థితులపై ఆందోళన...మరో ఐఏఎస్ రాజీనామా
జేఎన్యూ విద్యార్థి నాయకురాలు షెహ్లా రషీద్ పై రాజద్రోహం కేసు
యుద్ధం - శాంతి.
యురేనియం దెబ్బకు జీవాలు గడ్డి తినడంలే.. బురుగులు కక్కి సస్తున్నాయి..!
కశ్మీర్ లో 80 మందికి పెల్లెట్ గాయాలు, బాలుడు మృతి... జాతీయ వార్తాసంస్థల వెల్లడి
ఆమె పోరాటమే.. తమిళనాడు ప్రభుత్వాన్ని కదిలించింది..!
స్కూలు పిల్లలకు భోజనంలోకి కూరకు బదులు ఉప్పు...బైట పెట్టిన జర్నలిస్టుపై కేసు
more..


తెలంగాణ