క‌శ్మీరీ విద్యార్థుల క‌న్నీటి గాథ‌లు


క‌శ్మీరీ విద్యార్థుల క‌న్నీటి గాథ‌లు

క‌శ్మీరీ

శుక్రవారం మూడు గంటల సమయంలో 21ఏళ్ల యువకుడు సహబాజ్ మాలిక్ పూణే స్టేషన్ లో తన స్నేహితుడు మీర్ తహతో కలిసి లోనవాల వెళ్లే రైలు కోసం ఎదురుచూస్తున్నారు. ఇద్దరు తమ భుజాలపై చిన్నపాటి బ్యాగ్‌లు వేసుకొని నిలుచున్నారు. వారు ఎక్కాల్సిన రైలు 4.30 గంటలకు రావాల్సి ఉంది. ఇద్దరు లోనవాలలో దిగి తహ హస్టల్ కు వెళ్లి అతని ల్యాప్ ట్యాప్ తీసుకుని ముంబై చేరుకోవాలి. ఇద్దరికి రాత్రికి రాత్రి ముంబై చేరుకుని తెల్లవారు జామున 5.30గంటలకు శ్రీనగర్ వెళ్లే విమానం ఎక్కాలి. ఆ క్షణం కోసం ఎంతో ఆత్రుతగా ఎదరుచూస్తున్నారు.

శ్రీ నగర్ వెళ్లాలన్న ఆనందం వారి మొహంలో స్పష్టంగా కనిపిస్తోంది. సహబాజ్ తను చివరి సారిగా ఆగ‌స్టు4న ఆదివారం తన కుటుంబ సభ్యులతో మాట్లాడాడు. అక్కడ ఆ రోజు కంటే ముందు నుంచే పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. తన తల్లంటే అతనికి ఎంతో ప్రేమ. కుటుంబానికి దూరంగా ఉన్నా.... తన తల్లితో ఫోన్లో మాట్లాడని రోజుంటూ లేదు. ʹరాత్రి పడుకునే ముందు మా అమ్మతో మాట్లాడిన తర్వాతే నిద్రపోతాను అని చెబుతున్నాడు సహబాజ్. కానీ ఎప్పుడైతే కశ్మీరులో సమాచార వ్యవస్థ నిలిపివేశారో... అప్పటి నుంచి తన తల్లితో మాట్లాడటానికి కుదరడం లేదు. మా అమ్మ అనారోగ్యంతో బాధపడుతుంది. ఆమె చాల సున్నిత మనస్తత్వం కలిగినది. తను నాతో మాట్లాడకుండా 5 - 6రోజుల నుంచి ఎలా ఉంటుందో ఎంత ఏడుస్తుందో నాకు తెలుసు అని సహబాజ్ అంటున్నాడు. మా అమ్మతో మాట్లాడకుండా ఉండలేకపోతున్న. మా అమ్మ అక్కడ ఏ పరిస్థితిలో ఉందో తెలీదు. ఈ పరిస్థితుల్లో నేను దగ్గర ఉంటే బాగుంటుందని వెళుతున్నానుʹ అని చెప్పుకొచ్చాడు.

బారాముల్లాలో ఉండే సహబాజ్ బాధతో మాట్లాడుతూ...ʹఅక్కడ భారీగా బలగాలను మోహరించారని ఎప్పుడైతే తెలిసిందో అప్పుడే నాకు ఏదో జరగబోతోంది అనిపించింది. చాల పుకార్లు కూడా పుట్టాయి. ఆర్టికల్ 370ని తొలగిస్తారని కలలో కూడా అనుకోలేదు. ఇలా కశ్మీరును పూర్తిగా నిర్భంధంలో ఉంచి విడగొట్ట‌డం ఎంత వ‌ర‌కు ప్ర‌జాస్వామ్య చ‌ర్య‌? ఇప్పుడు క‌శ్మీర్లో అమ‌ల‌వుతున్న నిర్బంధం వ‌ల్ల స్థానికులు త‌మ‌కు దూరంగా బ్రతుకుతున్న కుటుంబ‌స‌భ్యుల క్షేమ సమాచారం కూడా తెలసుకోలేకపోతున్నారుʹ అంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశాడు.

సహబాజ్ మిత్రుడు మీర్ తహకు ఆదివారం వరకు తనకు ఒక కిడ్నీ మాత్రమే పనిచేస్తోందని తెలీదు. ఈ విషయాన్ని తన కుటుంబ సభ్యులకు తెలియజేసిన తర్వాత గురువారం నుంచి వారితో మాట్లాడటానికి కుదరలేదు. తన బాధను చెబుతూ ʹపోయిన ఆదివారం నాకు కడుపులో విపరీతమైన నొప్పి వచ్చింది. దాంతో ఆసుపత్రికి వెళ్లాను. డాక్టర్లు సోనోగ్రాఫీ చేస్తే నాకు ప్రస్తుతం ఒక కిడ్ని మాత్రమే పనిచేస్తోందని తెలిసింది. ఈ విషయం వెంటనే మా కుటుంబ సభ్యులకు తెలియజేశాను. తర్వాత ఉదయం ఇంటికి ఫోన్ చేస్తుంటే కలువలేదు. అప్పటి నుంచి పూర్తిగా సమాచార వ్యవస్థను నిలిపివేశారు. నా ఆరోగ్యం గురించి వాళ్లు ఎంత మనస్థాపం చెందారో ఏమో. వారి పరిస్థితి ఎలా ఉందోనని నేను ఆందోళన చెందుతున్నానుʹ అని తెలిపారు.

ఇస్కందర్ పూర్ కు చెందిన మీర్ తహకు తన కుటుంబంతో గురువారం కొద్దిసేపు మాట్లాడే అవకాశం కలిగింది. మీర్ తల్లిదండ్రులు తనకు ఫోన్ చేయడానికి ఇంటి నుంచి 22కిలోమీటర్లు బాఘట్ బారాముల్లా లో పోలీస్ స్టేషన్ వరకు వెళ్లి ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ కాల్ సెంటర్ ద్వారా మాట్లాడారు. ʹమా అమ్మనాన్నతో రెండు నిమిషాలు మాత్రమే మాట్లాడగలిగాను. మా అమ్మ నాకు ఫోన్ చేస్తూనే ఏడుపు మొదలుపెట్టింది. ʹబిడ్డా నువ్వు కశ్మీరు వచ్చేయ్...నీతో ఇలా ఫోన్ లో మాట్లాడకపోయి ఉంటే మేమే అక్కడకి రావడానికి సిద్ధమయ్యాంʹ అని చెప్పడంతో ఎంతో బాధకలిగింది. వారు నన్ను చదువు విడిచిపెట్టి కశ్మీరులో తమతో ఉండేందుకు రమ్మన్నారు అనిʹ తెలిపాడు.

ʹఅసలు కశ్మీరులో ఇలా అన్ని సేవలు నిలిపివేసిన రోజు ఎప్పుడు రాలేదనుకుంటా. గ్రామాల్లో ఆర్టికల్ 370 తొలగించారని కూడా తెలియదు. ఇంకా చెప్పాలంటే పుకార్లు కూడా పుట్టాయి. యాసిన్ మాలిక్ చనిపోయాడు... అందువల్లే బలగాలు భారీగా మోహరిస్తున్నారు.... ఉగ్రవాదుల దాడులు జరగనున్నాయి... అమర్ నాథ్ యాత్రికులను వెనక్కి రప్పించారు... వేరే రాష్ట్రం నుంచి వచ్చిన వారందరిని పంపిచేశారు... అయితే ఇక కశ్మీరులో ఉన్న వారందరిని చంపేస్తారు అని అనుకున్నారు... ఉగ్రవాదుల దాడి జరగనుందని, అందుకే వేరే రాష్ట్రం నుంచి వచ్చిన వారిని పంపించి వేస్తున్నార‌ని అనుకుంటున్నారు. అంటే వారికి మా ప్రాణాలు కనిపించలేదు. వారిని మాత్రమే భారతీయులుగా గుర్తిస్తుందా అనుకోవ‌ల్సి వ‌స్తోందిʹ అన్నారు మీర్ తహ.

ʹసోషల్ మీడియాలో కశ్మీరీ యువతులను పెళ్ళి చేసుకోచ్చు అని పోస్టులు పెడుతున్నారు. అవన్ని చూసి చాలా బాధ కలిగింది. మా అమ్మ, చెల్లి అక్కలకు గౌరవమే లేదు. వారందరిని వస్తువులాగా చూస్తున్నారు. వీరందని చూస్తుంటే చాలా భయమేస్తోంది. ఇప్పటి వరకు నా మనసులో ఆజాద్ కశ్మీరు అనే విషయం రాలేదు. నేను ఎప్పుడూ ఒక భారతీయుడిలానే మాట్లాడాను. కానీ ఇప్పుడు దేశం నేను అనుకున్నట్టు నాది కాదనిపిస్తోందిʹ అని చెప్పుకొచ్చాడు.

గందర్బల్ కు చెందిన 25ఏళ్ల ఓవైసీ వాని గత ఆరేళ్లుగా పుణేలో ఉంటున్నాడు. అతను ఇక్కడ ఓ రెస్టారెంట్ నడిపిస్తున్నాడు. సేవలు నిలిపివేయడంతో తన కుటుంబ సభ్యులతో మాట్లాడటానికి వీలు లేకుండా పోయింది. ʹనా తండ్రితో ఆగస్టు 3న మాట్లాడాను మళ్లీ మాట్లాడదాం అంటే కుదరలేదు. నేను.. మెసేజ్ లో 370ఆర్టీకల్ తొలగించిన విషయం చెప్పేంత వరకు అక్క‌డి వారికి విషయం తెలియ‌దు. నేనైతే ఆర్టికల్ 370తొలగించడాన్ని ఒప్పుకోను. కశ్మీరు ప్రజలను బంధించడం పెద్ద తప్పు. ఇక ఇప్పటి నుంచి నేను హిందుస్తాన్ కు మద్ధతుగా ఉండనుʹ అని ఆగ్రహంగా చెప్పాడు.

సామాజిక కార్యక్రమాల్లో పాలు పంచుకునే ఓవైసీ.. ʹమీరే ఆలోచించండి ఎవరి ఇంటికైనా నిప్పుపెట్టినా... ఎవరికైనా ఆరోగ్యం పాడైనా ఏం చేస్తారు. చూస్తూ ఊరుకుంటారా? చాల మంది కశ్మీరీలు హిందూస్తాన్ కు వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడుతారు? దానికి ఒక కారణం ఉంది. అక్కడి ప్రజలపై భ‌ద్ర‌తా బలగాలు దౌర్జన్యం చేస్తాయి. మహిళతో అసభ్యకరంగా ప్రవర్తిస్తాయి. అనేక సార్లు అత్యాచారాలకు పాల్పడ్డాయి. చాల మందిని చంపేశారు. మానవ హక్కుల ఉల్లంఘన జరిగింది. అయినా కొంతమంది హిందూస్తాన్ వైపే ఉన్నారు. తాజా ప‌రిణామాల తర్వాత వారు ఇక హిందూస్తాన్ కు వ్యతిరేకులుగా తయారవుతారుʹ అని చెప్పుకొచ్చాడు.

మరో 20ఏళ్ల యువకుడు ఉబేద్ పుణే కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. కశ్మీరులో సేవలు నిలిచిపోయినప్పటి నుంచి తన కుటుంబ సభ్యులతో మాట్లాడటానికి కుదరలేదని చెబుతున్నాడు. రోజు తన ఫోన్ చూసుకుంటూ కూర్చుంటున్నాడు. తనకు కుటుంబ సభ్యుల నుంచి ఎప్పుడు కాల్ వస్తుందా అని..వారితో మాట్లాడాలని ఎదురుచూస్తు ఉన్నాడు. ...ʹఇలా కశ్మీరు లాక్ డౌన్ చేయడం చాల తప్పు. నా తల్లిదండ్రులు అక్కడ ఏ పరిస్థితిలో ఉన్నారో నాకు తెలీదు. వారి గురించి నేను రోజూ ఆందోళన చెందుతున్నాను. నేను చివరి సారి ఆదివారం నా తమ్మునితో మాట్లాడాను. దాని తర్వాత ఫోన్ బంద్ అయింది. కొంత మంది నా స్నేహితులు బయటి దేశాల్లో చదువుకుంటున్న వాళ్లు కాల్స్ చేసి ఏడుస్తున్నారు. వాళ్లు నాతో ఏడుస్తూ ఒక్కసారి తమ కుటుంబ సభ్యులతో మాట్లాడాలని ఉందని చెప్పుకుంటూ బాధపడ్డారుʹ అని చెప్పుకొచ్చాడు.

ʹకశ్మీరు అయినందు వల్ల భేద భావం చూపిస్తుంటారు. మేం భారత దేశంలో భాగం అంటారు కానీ మమ్మల్నీ వేరుగా చూస్తారు. కొంత మంది కాలేజ్ లో నన్ను అడుగుతుంటారు. నీకు ఏకే -47 కాల్చడం వచ్చా అని. మాకు గన్ తీసుకువచ్చి ఇవ్వగలవా... అంటూ ఎద్దేవా చేస్తార‌ʹని బారాముల్లాకు చెందిన ఉబేద్ ఆవేదన వ్యక్తం చేశాడు.

ʹ370 ఆర్టికల్ తొలగించడంతో భారత్ కశ్మీరుకు సంబంధాలు తెగిపోతాయి. మా మీద వారి నిర్ణయాన్ని బలవంతంగా రుద్దారు. తల్లిదండ్రులు తమ వాళ్లతో మాట్లాడాలని ఎంతగా ఎదురుచూస్తున్నారు! ఈద్ పండగకు కూడా మాట్లాడుకునే అవకాశం లేకుండా పోయింది. ఇది ఏటువంటి ప్రజాస్వామ్యం ఒక తల్లికుమారులు మాట్లాడుకోడానికి అనుమతి లేకుండా పోయింది. కొంత మంది సోషల్ మీడియాలో కశ్మీరీ అమ్మాయిలను పెళ్లి చేసుకోవడానికి వీలు కలుగుతోంది అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇదంతా చూస్తుంటే కశ్మీరు గురించి ఎవరికి బాధ లేదు, ప్రేమ లేదని తెలిపోతోంది. కేవలం కశ్మీరులో భూములు కావాలి, వారిని దోచుకోవడం కావాలన్నట్టు ప్రవర్తిస్తున్నారుʹ అని చెప్పుకొచ్చాడు.

20ఏళ్ల కాశీఫ్ హసన్ కూడా పుణేలో ఉంటున్నాడు. ఇతనిది కూడా వీరందరిలా ఓకే పరిస్థితి. నెల కిందట కశ్మీరు నుంచి మళ్లీ పుణేకు వచ్చాడు. ʹనా ఆరోగ్యం బాగులేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్లాను. అక్కడకి వెళ్లిన తర్వాత స్నేహితులు చెప్పారు. ఆర్టికల్ 370 తొలగించారని. అక్కడ భద్రత కట్టదిట్టం చేశారని, సేవలు నిలిచిపోయాయని. దీంతో వెంటనే అక్కడి నుంచి తిరిగి గదికి వచ్చేశాను. నా దగ్గర అప్పటికి 2వేల రూపాయలు ఉన్నాయి. నేను చికిత్స చేయించుకుంటే ఉన్న డబ్బులు అయిపోతాయి. మళ్లీ తల్లిదండ్రులు పంపించలేరు. నేను చివరి సారి మా అమ్మతో శనివారం మాట్లాడాను. ఇప్పుడు మళ్లీ మాట్లాడాలని ఉన్నా కుదరదు. ఆర్టికల్ తొలగించడంతో మాకున్న స్వతంత్ర ప్రతిపత్తి కోల్పోయాం. మా ప్రత్యేకత కోల్పోయాం. నార్త్ ఈస్ట్ లో రాష్ట్రాల ప్రత్యేకతను కలిగి ఉన్నాయి. కానీ కశ్మీరు నుంచి మాత్రమే సర్కార్ ఆ ప్రత్యేకతను లాక్కుంది. దీంతో క్లీయర్ కట్ గా తెలిసిపోతోంది కశ్మీరుపై ప్రభుత్వాలు ఎంత వ్యతిరేకత చూపుతున్నాయో. ప్రత్యేకంగా ముస్లిం వీరోధిగా వ్యవహరిస్తోంది. మా ప్రజలను ఒక్క మాట కూడా అడగకుండా ప్రతిపత్తి తొలగించారుʹ అంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశాడు.

ఢిల్లీలో సహాయక ప్రొఫెసర్ గా పనిచేస్తున్న ఆరూషీ హసన్ తన తల్లితో ఆదివారం మాట్లాడాని చెబుతోంది. తన తల్లి ఫోన్ లో మాట్లాడుతూ ʹఇంట్లోకి కావాలసిన వస్తువులు కొనుక్కున్నాము. పరిస్థితులు అంత బాగా లేవు. ఇంటర్నెట్, ఫోన్, అన్ని బంద్ కాబోతున్నాయి. నువ్వు అక్కడ జాగ్రత్తగా ఉండూ అని చెప్పింది. దీంతో పాకిస్తాన్ తో యుద్ధానికి సిద్ధమవుతున్నారేమో అనుకున్నాం. కానీ ఆర్టీకల్ 370, 35ఏ తొలగిస్తారని కల‌లో కూడా ఊహించలేదʹని చెప్పుకొచ్చింది.

source : newslaundry

Keywords : Kashmir, Students, Pune, Article 370, 35(a), Jammu, India
(2019-11-17 07:35:23)No. of visitors : 426

Suggested Posts


మా పిల్లలను హత్యలు చేస్తున్న మీతో మాట్లేడేది లేదు - రాజ్ నాథ్ కు షాకిచ్చిన కాశ్మీరీలు

భద్రతా దళాల దాడులతో, ప్రజల ఆందోళనలతో అల్లకల్లోలంగా ఉన్న కాశ్మీర్ లో పర్యటించడానికి వెళ్ళిన కేంధ్ర హోమంత్రి రాజ్ నాథ్ సింగ్ కు కాశ్మీరీలు షాకిచ్చారు. 46 మంది చనిపోయి, 2,400 గాయాలపాలై, 15 రోజులుగా కర్ఫ్యూలో మగ్గుతున్నకశ్మీర్ లో....

అబద్దాలు చెప్పలేక జర్నలిస్టు రాజీనామా

అతడో ఆత్మాభిమానం ఉన్న జర్నలిస్టు. అందుకే యాజమాన్యం చెప్పిన మాట కాదన్నాడు. ఉద్యోగానికి గుడ్ బై చెప్పేసి తన అసలైన జర్నలిస్టుగా పాత్రికేయ ప్రపంచానికి చాటి చెప్పుకున్నాడు....

పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో తిరుగుబాటు

పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీరులో తిరుగుబాటు తీవ్రమయ్యింది. తమపై పాకిస్థాన్‌ ఆధిపత్యాన్ని సహించేది లేదంటూ పాక్ అణచివేత నుండి తమకు విముక్తి కల్పించాలంటూ ఆందోళనలు ఉధృతమవుతున్నాయి.....

పెల్లెట్లు వద్దంటే ఇక బుల్లెట్లే - సీఆర్‌పీఎఫ్‌

పెల్లెట్లు వద్దంటే బుల్లెట్లు వాడాల్సి వస్తుందని సీఆర్‌పీఎఫ్‌ జమ్మూకాశ్మీర్‌ హైకోర్టుకు తెలిపింది. జమ్మూ కాశ్మీర్‌లో గత 32 రోజులుగా కొనసాగుతున్న అల్లర్లు, ఆందోళనలను అదుపు చేసేందుకు 13 లక్షల పెల్లెట్లను ఉపయోగించినట్లు జమ్మూ కాశ్మీర్‌ హైకోర్టుకు....

దుఃఖమూ నేరమైన చోట - పి.వరలక్ష్మి

ఒక చావును దేశం వేడుక చేసుకుంటుంది. అటు వైపు ఒక దుఃఖిత సమూహం శవయాత్రకు పోటెత్తుతుంది. దశాబ్దాలుగా అది నిషిద్ధ దుఃఖం. వాళ్ళ దుఃఖానికి సంఘీభావం నేరం. అవును, మాట్లాడుతున్నది కశ్మీర్ గురించే.....

సైన్యంపై రాళ్ళు రువ్వడం దేశ ద్రోహం సరే... సైన్యం సృష్టించే అరాచకాన్ని ఏమనాలి ?

26 ఏండ్ల ఫరూఖ్‌ అహ్మద్‌ థర్ అనే ఓ యువకుడు దగ్గరి బందువు చనిపోతే పక్క గ్రామం వెళ్తుండగా ఎదురు పడ్డ కొందరు సైనికులు అతనిపై దాడి చేసి తాళ్ళతో బందించి. జీపు బానెట్‌పై కూర్చోబెట్టారు. దాదాపు తొమ్మిది గ్రామాల్లో జీపును తిప్పారు. తొమ్మిది గ్రామాల గుండా జీపు ప్రయాణిస్తున్నప్పుడు సైనికులు బిగ్గరగా అరిచారు. రండీ...మీ మనిషిపైనే దాడి చేసేందుకు బయటకు రండీ.....

కాశ్మీర్ లో మరో సాల్వజుడుం

ఓ వీడిసీ సబ్యుడి చేతిలో ఓ తల్లి, ఆమె కుమారుడు దారుణ హత్యకు గురయ్యారు. అందరూ చూస్తుండగానే ముస్తాఖ్ అహ్మద్ అనే వీడీసీ సభ్యుడు.. షమిమా అక్తర్ అనే మహిళ, ఆమె మూడేళ్ల బాబు తాహిద్ పై నేరుగా తుపాకీ ఎక్కుపెట్టి కాల్పులు జరిపాడు.....

నెత్తురోడుతున్న కాశ్మీర్ - పోలీసు పెల్లెట్లకు 11ఏండ్ల విద్యార్థి బలి

శ్రీనగర్‌లోని హర్వాన్‌లో శుక్రవారం రాత్రి ఓ విద్యార్థి మృతదేహం లభ్యమైంది. మృతుడి శరీరమంతా పెల్లెట్ల గాయాలతో నిండి ఉన్నది. శ్రీనగర్‌లోని హర్వాన్‌లో శుక్రవారం పోలీసులకు, నిరసనకారులకు మధ్య ఘర్షణ చోటు చేసుకున్నది....

కాశ్మీరీ చిన్నారుల విషాదం - ʹచదువన్నాఆగుతుంది కానీ చావు ఆగదు..ʹ

ʹమా కోసం చదువన్నా ఆగుతుంది కానీ చావు ఆగదు. ఓ ఇండియా... నీకోసం సింధు వెండిని తీసుకొస్తే.. ఇక్కడ(కాశ్మీర్‌లో) నీకోసం బంగారమే ఉందిʹ అని హిష్మా నజీర్ పలికింది. ఇలాంటి వ్యాఖ్యలతో సంజీవ్ సిక్రి డైరెక్ట్ చేసిన వీడియో....

బుర్హాన్ వని ఎన్ కౌంటర్ పై సారీ చెప్పండి - పోలీసులకు సీఎం ఆదేశం

కాశ్మీర్ లో బుర్హాన్ వని ఎన్‌కౌంటర్‌పై ప్రజలకు క్షమాపణ చెప్పాలని జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబాబూ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. రోడ్లు, వీధుల్లో కూడా పోలీసులు కనిపించరాదంటూ ఆమె ఆదేశాలిచ్చినట్టు....

Search Engine

Withdraw the False Case against Veekshanam Editor!
వీక్ష‌ణం సంపాద‌కుడిపై UAPA కేసు
భగత్ సింగ్ తుపాకీ - జార్జిరెడ్డి సినిమా...!!
Arrest of B Anuradha & N Ravi Sharma – Fact and Fiction
అనూరాధ, రవి శర్మల అరెస్టు – వాస్తవమూ కల్పనా..!
కేసీఆర్ అప్రజాస్వామిక పాలన‌: అనురాధ, రవిల అరెస్ట్ - రాజద్రోహం, యూఏపీఏ కేసులు బనాయింపు
ఫీజుల పెంపును నిరసిస్తూ.. కేంద్ర మంత్రిని నిర్బంధించిన జేఎన్‌యూ విద్యార్థులు..!
పోలీసుల అడ్డంకులు ఛేదించుకుని సమరోత్సాహంతో ట్యాంక్ బండ్ పైకి దూసుకొచ్చిన‌ కార్మికులు
చలో ట్యాంక్ బండ్ లో మావోయిస్టులున్నారన్న సీపీ... ఉక్కుపాదం మోపడం కోసమే ఈ ఆరోపణలన్న‌ ఆర్టీసీ జేఏసీ
వేలాది పోలీసు బలగాల నిర్బంధాల మధ్య‌ చలో టాంక్ బండ్ విజయవంతం
ఆర్టీసీ సమ్మెకు రాజకీయ ఖైదీల మద్దతు.. జైళ్లో నిరసన.. చలో ట్యాంక్‌బండ్ విజయవంతం చేయండి..!
భగత్ సింగ్ పిస్టల్ – అనేకానేక స్మృతులు
జర్నలిస్టులు, దళిత, మానవహక్కుల కార్యకర్తల వాట్సప్ ఖాతాలు హ్యాక్
దొర ప్రతాపమంత మజ్దూర్ల మీదనే!
తెలంగాణలో పాత రోజులు మళ్ళీ దాపురించాయి... అణిచివేతే పాలకుల విధానమయ్యింది
ఆర్టీసీ సమ్మె పై నిర్భందం...పౌరహక్కుల సంఘం ఆగ్రహం
భారత విప్లవోద్యమంలో చారుమజుందార్‌ - రేపే శతజయంతి సదస్సు
నలమాస కృష్ణ, మద్దిలేటిల అరెస్టు చట్టబద్దం కాదు - హైకోర్టు
ʹఆవులగురించి కాదు ఆడపిల్లల గురించి శ్రద్ద పెట్టండిʹ
ఈ కుట్ర కేసు వెనుక ఉన్న కుట్రలో అసలు కథ‌ ఇంకోటి ఉంది
నలమాస కృష్ణ, మద్దిలేటి అరెస్ట్...అక్రమం అంటున్న ప్రజా సంఘాలు
RTC కార్మికులారా ఆత్మహత్యలు వ‌ద్దు.. తెలంగాణ సమాజం మీ వెంట‌ ఉంది.. పోరాడి హక్కులు సాదించుకుందాం !
దేశానికి రానున్నవి చీకటిరోజులు
మావి నిషేధిత సంఘాలు కావు
పోలీస్ క‌మిష‌న‌ర్ ప్ర‌క‌ట‌న‌పై కేసీఆర్ స్పందించాలి : ప‌్ర‌జా సంఘాలు
more..


క‌శ్మీరీ