నరనరాన కుల బలుపు....దళితుడి మృతదేహాన్నీ అడ్డగించిన కులోన్మాదులు


నరనరాన కుల బలుపు....దళితుడి మృతదేహాన్నీ అడ్డగించిన కులోన్మాదులు

భారత దేశంలో ఇంకా కుల వివక్ష ఎక్కడుందీ..అని ధీర్ఘాలు తీసేవాళ్ళు తప్పకుండా చదవాల్సిన వార్త ఇది. నిజానికిది వార్త కాదు దేశంలో వేళ్ళూనుకపోయిన కుల దురహంకారపు మచ్చుతునక. దళితుల పట్ల కుల దురహంకారులు తరతరాలుగా చేస్తున్న దాష్టికం.
తమిళనాడు వెల్లూరులో కుప్పన్ అనే దళి వ్యక్తి ప్రమాదంలో మరణించాడు.

తమిళనాడు వెల్లూరు ప్రాంతంలోని నారాయణపురం గ్రామంలో కుప్పన్‌ అనే దళితుడు చనిపోయాడు. దహన సంస్కారాల కోసం బంధువులు మృతదేహాన్ని తీసుకెళ్తున్నారు. ఇంతలో స్థానిక ఆధిపత్య కులానికి చెందిన కొందరు పెద్దలు వారికి అడ్డుపడ్డారు. తమ పొలం నుంచి మృతదేహాన్ని శ్మశానానికి తీసుకెళ్లడానికి వీల్లేదని తేల్చి చెప్పారు. వారు ఎంత వేడుకున్నా ఆధిపత్య కులం వారి మనసులు కరగలేదు. మరో దారి లేక బంధువులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకున్నారు. ఓ వంతెన పైనుంచి స్ట్రెచర్‌ ద్వారా మృతదేహాన్ని కిందికి దించారు. అక్కడి నుంచి దహన వాటికకు తరలించారు. దీన్ని కొందరు వ్యక్తులు మొబైల్ లో షూట్ చేసి సోషల్‌ మీడియాలో అప్ లోడ్ చేశారు. ఇప్పుడీ వీడియో వైరల్‌ అయ్యింది.

పలార్ నది సమీపంలో శ్మశాన వాటిక ఉంది. అక్కడికి వెళ్లాలంటే.. అగ్రకులం వారి పొలాల మీదుగా వెళ్లాల్సిందే. మరో దారి లేదు. దీంతో నారాయణపురం గ్రామానికి చెందిన దళితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బ్రిడ్జి 20 అడుగుల ఎత్తులో ఉంది. నాలుగేళ్లుగా వారు ఇలానే చేస్తున్నారు. మృతదేహాలను వంతెన పైనుంచి కిందికి దించి దహన సంస్కారాలు చేస్తున్నారు.

ʹʹకుప్పన్(55) రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. మృతదేహాన్ని పొలాల మీదుగా తీసుకెళ్లే ప్రయత్నం చేశాము.. అక్కడే ఉన్న సెక్యూరిటీ గార్డు అడ్డుకున్నాడు. గ్రామంలో దహన వాటికి లేకపోవడంతో నదికి సమీపంలోని ప్రాంతంలో దహన సంస్కారాలు చేస్తున్నాము. పొలాల నుంచి వెళ్లేందుకు అనుమతి ఇవ్వకపోడంతో.. నిచ్చెన సాయంతో మృతదేహాలను బ్రిడ్జి పైనుంచి కిందికి దించుతున్నాము. నాలుగేళ్లగా ఇదే విధంగా చేస్తున్నాముʹʹ అని నారాయణపురం గ్రామస్తుడు తెలిపాడు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే అగ్రకులానికి చెందిన వారు తమను చంపేస్తారనే భయంతో సైలెంట్ గా ఉంటున్నామని వెల్లడించారు.

ఇప్పుడీ వీడియో వైరల్ కావడంతో అధికారుల్లో చలనం వచ్చింది. వెల్లూరు కలెక్టర్ షణ్ముగ సుందరం స్పందించారు. దీనిపై విచారణ కోసం ఓ రెవెన్యూ బృందాన్ని పంపించారు. విచారణలో తప్పు చేసినట్టు తేలితే చర్యలు తీసుకుంటామన్నారు.

Keywords : tamilanadu, dali, upper cast
(2019-11-17 19:16:15)



No. of visitors : 696

Suggested Posts


Shocking video of two naked ‘Dalit women’ being thrashed by ‘upper caste’ women

A shocking video of two ʹDalit womenʹ being subjected to merciless thrashing and public humiliation allegedly women from upper caste has gone viral on social media platforms....

ముస్లింల రక్షణ కోసం కత్తులు దూసిన సిక్కులు,చేతులు కలిపిన దళితులు ‍- పరారైన శివసేన మూక

పంజాబ్ లోని పగ్వారా పట్టణంలో ముస్లింల మీద దాడి చేయడానికి ప్రయత్నించిన శివసేన గుంపును సిక్కులు, దళితులు, ముస్లింలు ఐక్యంగా ఎదుర్కొన్నారు. కాశ్మీర్ కు వ్యతిరేకంగా శివసేన కార్యకర్తలు బుధవారంనాడు ర్యాలీ నిర్వహించారు ఈ సంధర్భంగా...

గోముసుగు దౌర్జన్యాలపై దళితుల యుద్దభేరి - భగ్గుమంటున్న గుజరాత్

దళితులు భగ్గుమంటున్నారు... తమపై హిందుత్వ శక్తులు చేస్తున్న దాడులకు వ్యతిరేకంగా కదం తొక్కుతున్నారు. గుజరాత్ లో గోరక్షకులు చేస్తున్న అమానుష అరాచకలాను ఎదిరిస్తూ ఆందోళనలకు దిగారు. గిరి సోమనాథ్ జిల్లాలోని ఊనాలో చనిపోయిన ఆవు చర్మాన్ని ఒలిచిన...

గోరక్షకుల రాజ్యంలో.. ఆకలితో 500 ఆవులు మృత్యువాత !

బీజేపీ పాలిత రాజస్తాన్ లోని గోసంరక్షణ శాలలో పట్టించుకునే వారు కరువై ఆకలి, అపరిశుభ్రంతో రెండు వారాల్లో దాదాపు 500 ఆవులు మృత్యువాతపడ్డాయి. జైపూర్‌లోని హింగోనియా గోశాలలో దాదాపు 250 మంది కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారు.

చెట్టుకు కట్టేసి మత్తు సూదులేసి.. పెట్రోల్ పోసి.. దళిత బాలుడి పై అగ్రకుల అమానుషం !

కొంతమంది అగ్రకులస్థులు ఓ దళిత బాలుడికి నరకం చూపించారు. చెట్టుకుకట్టేసి బట్టలూడదీసి దారుణంగా కొట్టారు. అతడి మర్మాంగాలపై పెట్రోల్ పోసి హింసించారు. ఈ ఘటన ఆగ్రా జిల్లాలోని బర్హాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోగల బాస్ కేసీ....

నీళ్ళు తాగనివ్వని అగ్రకుల అహంకారం - బావిలో పడి దళిత బాలుడి మృతి

మధ్యప్రదేశ్ దమోహ్ జిల్లా ఖమరియా కలాన్ గ్రామంలో మూడవతరగతి చదువుతున్న వీరన్ అనే దళిత బాలుడు మధ్యాహ్న భోజనం తర్వాత నీళ్ళు తాగడానికి....

ఢిల్లీ లో దళితులపై హిందుత్వ సంస్థల దాడి !

ఢిల్లీలో శాంతి యుత ప్రదర్శన నిర్వహిస్తున్న దళితులపై హిందుత్వ శక్తులు దాడి చేశాయి. గుజరాత్ లో దళితులపై దాడికి నిరసనగా ఆదివారంనాడు ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద యూత్ ఫర్ బుద్దిస్ట్ ఇండియా అనే సంస్థ అద్వర్యంలో దళితులు ధర్నా.....

వాళ్ళకు కమ్మోళ్ళ రక్తమే కావాలట !

హైదరాబాద్ మాక్స్ క్యూర్ హాస్పటల్ లో చికిత్సపొందుతున్న ఓ మూడేళ్ళ చిన్నారికి రక్తం అవసరం వచ్చింది. బ్లడ్ డోనర్స్ ఇండియా అనే ట్విట్టర్ లో ఓ కుల గజ్జి మహానువుడు కమ్మోళ్ళ రక్తం కావాలని ట్వీట్ చేశాడు....

ముందుకు సాగుతున్న ʹఛలో ఉనాʹ - కదం తొక్కుతున్న గుజరాత్ దళితులు

గుజరాత్ దళితులు కదం తొక్కుతున్నారు. వారితో ముస్లింలు చేతులు కలుపుతున్నారు. అన్ని వర్గాల ప్రజాస్వామికవాదులు, విప్లవ, ప్రజా సంఘాలు ఒక్కటై కదులుతున్నారు. ఆగస్టు 5 న అహ్మదాబాద్ లో బయలు దేరిన ఛలో ఉనా ర్యాలీ అనేక పల్లెలు, పట్టణాలు....

హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ నుండి దళిత విద్యార్థుల గెంటివేత

వాళ్ళు దళితులు.... రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంభాల నుండి వచ్చిన నిరుపేద విద్యార్థులు... ఒకటో తరగతి నుండి తొమ్మిదో తరగతి వరకు వాళ్ళు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లోనే చ‌దువుకున్నారు. ఇప్పుడు వాళ్ళకు చ‌దువు రావడం లేదని పదో తరగతికి ప్రమోట్ చేయకుండా 34మంది విద్యార్థులను స్కూల్ నుండి గెంటేశారు....

Search Engine

Withdraw the False Case against Veekshanam Editor!
వీక్ష‌ణం సంపాద‌కుడిపై UAPA కేసు
భగత్ సింగ్ తుపాకీ - జార్జిరెడ్డి సినిమా...!!
Arrest of B Anuradha & N Ravi Sharma – Fact and Fiction
అనూరాధ, రవి శర్మల అరెస్టు – వాస్తవమూ కల్పనా..!
కేసీఆర్ అప్రజాస్వామిక పాలన‌: అనురాధ, రవిల అరెస్ట్ - రాజద్రోహం, యూఏపీఏ కేసులు బనాయింపు
ఫీజుల పెంపును నిరసిస్తూ.. కేంద్ర మంత్రిని నిర్బంధించిన జేఎన్‌యూ విద్యార్థులు..!
పోలీసుల అడ్డంకులు ఛేదించుకుని సమరోత్సాహంతో ట్యాంక్ బండ్ పైకి దూసుకొచ్చిన‌ కార్మికులు
చలో ట్యాంక్ బండ్ లో మావోయిస్టులున్నారన్న సీపీ... ఉక్కుపాదం మోపడం కోసమే ఈ ఆరోపణలన్న‌ ఆర్టీసీ జేఏసీ
వేలాది పోలీసు బలగాల నిర్బంధాల మధ్య‌ చలో టాంక్ బండ్ విజయవంతం
ఆర్టీసీ సమ్మెకు రాజకీయ ఖైదీల మద్దతు.. జైళ్లో నిరసన.. చలో ట్యాంక్‌బండ్ విజయవంతం చేయండి..!
భగత్ సింగ్ పిస్టల్ – అనేకానేక స్మృతులు
జర్నలిస్టులు, దళిత, మానవహక్కుల కార్యకర్తల వాట్సప్ ఖాతాలు హ్యాక్
దొర ప్రతాపమంత మజ్దూర్ల మీదనే!
తెలంగాణలో పాత రోజులు మళ్ళీ దాపురించాయి... అణిచివేతే పాలకుల విధానమయ్యింది
ఆర్టీసీ సమ్మె పై నిర్భందం...పౌరహక్కుల సంఘం ఆగ్రహం
భారత విప్లవోద్యమంలో చారుమజుందార్‌ - రేపే శతజయంతి సదస్సు
నలమాస కృష్ణ, మద్దిలేటిల అరెస్టు చట్టబద్దం కాదు - హైకోర్టు
ʹఆవులగురించి కాదు ఆడపిల్లల గురించి శ్రద్ద పెట్టండిʹ
ఈ కుట్ర కేసు వెనుక ఉన్న కుట్రలో అసలు కథ‌ ఇంకోటి ఉంది
నలమాస కృష్ణ, మద్దిలేటి అరెస్ట్...అక్రమం అంటున్న ప్రజా సంఘాలు
RTC కార్మికులారా ఆత్మహత్యలు వ‌ద్దు.. తెలంగాణ సమాజం మీ వెంట‌ ఉంది.. పోరాడి హక్కులు సాదించుకుందాం !
దేశానికి రానున్నవి చీకటిరోజులు
మావి నిషేధిత సంఘాలు కావు
పోలీస్ క‌మిష‌న‌ర్ ప్ర‌క‌ట‌న‌పై కేసీఆర్ స్పందించాలి : ప‌్ర‌జా సంఘాలు
more..


నరనరాన