కశ్మీర్... 21 రోజులు 21 ప్రశ్నలు...సమాధానం ఉందా ?


కశ్మీర్... 21 రోజులు 21 ప్రశ్నలు...సమాధానం ఉందా ?

కశ్మీర్...

జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న రాజ్యాంగంలోని 370వ అధికరణను ఎత్తివేసి ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడగొట్టి ఈ రోజుకు మూడు వారాలు అంటే, సరిగ్గా 21 రోజులు. ఇది జరిగిన ఆగస్టు ఐదవ తేదీన రాష్ట్రంలోని ల్యాండ్‌ ఫోన్, మొబైల్‌ ఫోన్‌ సర్వీసులతోపాటు ఇంటర్నెట్, తపాలా సర్వీసులను కూడా నిలిపివేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అక్కడ అత్యయిక పరిస్థితులే కొనసాగుతున్నాయి. కశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని కేంద్ర ప్రభుత్వం పదే పదే చెబుతోంది. కేంద్రం చెబుతున్నట్టు కశ్మీర్ లో సాధారణ పరిస్థితులే ఉన్నాయా ? ఆగస్టు 5వతేదీకన్నా ముందున్న పరిస్థితులు ఆ తర్వాత ఉన్నాయా ? 21 రోజులు... ఈ 21 ప్రశ్నలకు ప్రభుత్వం దగ్గర‌జవాబున్నదా ?

1)మూడు వారాలుగా కశ్మీర్ లో మొబైల్ ఫోన్లు పని చేయడం లేదు. ల్యాండ్‌లైన్‌ ఫోన్‌ సర్వీసులను పునరుద్ధరించామని ప్రభుత్వం చెబుతోంది కానీ కశ్మీర్‌కు ఒక్క ఫోన్‌కూడా కలవడం లేదని దేశంలోని అనేక‌ ప్రాంతాల నుంచి కశ్మీరీల బందువులు, స్నేహితులు ఇప్పటికీ ఎందుకు ఫిర్యాదులు చేస్తున్నారు ? శ్రీనగర్‌లోని సెంట్రల్‌ టెలిఫోన్‌ ఎక్స్ఛేంజ్ ఇఅప్పటికీ ఎందుకు మూసి ఉంది ?

2)రాష్ట్ర ప్రభుత్వం శ్రీనగర్‌లో ఏర్పాటు చేసిన 5 ఫోన్ కాల్ సెంటర్లకు ఇప్పటికీ ఎంతో దూరం నుండి ప్రతీ రోజు దాదాపు 500 మంది కాలినడకన ఎందుకు వస్తున్నారు ?

3)ఇంటర్నెట్‌ సర్వీసులు, బ్రాడ్‌ బ్యాండ్‌ సర్వీసులు, తపాలా సర్వీసులు ఇప్పటి వరకు ఇంకా ఎందుకు నడవడం లేదు.

4)కశ్మీర్ లోని వార్తా పత్రికలు తమ వెబ్ సైట్ల ను, సోషల్ మీడియా పేజీలను ఎందుకు అప్డేట్ చేయలేకపోతున్నారు ? కశ్మీర్ లోని అన్ని వార్తా పత్రికల ముద్రణ ఎందుకు జరగడం లేదు ? కొన్ని పత్రికలు మాత్రమే అది కూడా అతి తక్కువ సంఖ్యలో ముద్రణ కొనసాగించడాన్ని ఎలా అర్దం చేసుకోవాలి ?
5)ఇప్పటికీ జర్నలిస్టులకు వార్తా సేకరణ కూడా చాలా కష్టమవుతోంది ఎందువల్ల ? వారంతా నాలుగు కంప్యూటర్లు, ఓ మొబైల్‌ టెలిఫోన్ ఉన్న‌ ప్రభుత్వ మీడియా సెంటర్‌పై ఆధారపడి పనిచేసే పరిస్థితి ఎందుకు ఉన్నది ?

6)ముగ్గురు మాజీ ముఖ్యమంత్రులు సహా కొన్ని వందల మంది రాజకీయ నాయకులు ఇప్పటికీ గృహ నిర్బంధంలోనే ఎందుకు ఉన్నారు ? వారికి వారి కుటుంబాలను కలుసుకునే అవకాశం నేటికి ఎందుకు ఇవ్వడం లేదు ?
7)ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యాలయం మినహా మిగతా పార్టీ కార్యాలయాలన్నీ నిర్మానుష్యంగా ఉండడానికి కారణమేంటి ?.
8)కశ్మీర్లో నాలుగువేల మందికి పైగా ప్రజలను ఎందుకు నిర్బంధంలోకి తీసుకొని స్థలా భావం వల్ల వారిని రాష్ట్రం బయటకు తరలించినట్లు ఓ అధికారి తెలిపిన విషయం నిజం కాదా ?
9)ఒక్క రాజకీయ నాయకులనే కాక, ఉద్యోగులు, వ్యాపారులతో సహా అనేక మందిని నిర్బంధించి వారిని బందువులతో కూడా కలవనివ్వకపోవడం నిజం కాదా ?

10)కశ్మీర్‌ పరిస్థితి ప్రత్యక్షంగా పరిశీలించేందుకు రాహుల్‌ గాంధీ సహా ప్రతిపక్ష నాయకులందరికి శ్రీనగర్‌ విమానాశ్రయంలోనే ఎందుకు నిలిపివేశారు. వారిని నగరంలోకి ఎందుకు అనుమతించలేదు ? కశ్మీర్ పౌరులు విమానంలో విపక్ష నేతలో తమ గోడు వెళ్ళబోసుకున్నది వాస్తవం కాదా ?

11 ) ప్రతిపక్ష పార్టీ నేతల బందంతోని వచ్చిన మీడియా ప్రతినిధుల పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించడమే కాకుండా చేయి కూడా చేసుకున్నది నిజంకాదా ?
12)స్థానిక మీడియా ప్రతినిధులను భద్రతా బలగాలు వీధుల్లోకి కూడా ఎందుకు అనుమతించడం లేదు ? వాళ్ళ వీడియో ఫుటేజ్ ను ఎందుకు డిలీట్ చేస్తున్నారు ?
13) పోలీసుల పెల్లెట్ గాయాలతో, టియర్ గ్యాస్ వల్ల గాయపడిన వారిలో 150 మంది ప్రస్తుతం శ్రీనగర్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నది నిజం కాదా ?
14)శ్రీఙర్ తోపాటు చుట్టు పక్కల ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శ్నలు జరుగుతున్న విషయం నిజంకాదా ?
15)ఇప్పటికీ కొన్ని మెడికల్ షాపులు తప్ప మార్కెట్లు అన్నీ బంద్‌ ఉన్నాయన్నది నిజం కాదా ?
16) అప్పుడప్పుడు కనిపించే ప్రైవేటు టాక్సీలు తప్ప ప్రజా రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయిందన్నది నిజం కాదా ? వీధులన్నీ నిర్మానుష్యంగా ఉంటున్నాయన్నది అబద్దమా ?
17) ఏ పార్టీ, ఏ సంస్థ పిలు ఇవ్వకుండానే మూడు వారాలుగా ప్రజలు అప్రకటిత బంద్ పాటిస్తున్నారన్నది నిజంకాదా ప్రభుత్వాన్నిఅలసిపోయేట్టు చేయడం కోసం ప్రజలు ఈ అప్రకటిత బంద్ ను ఓ నిరసన రూపంగా పాటిస్తున్నారన్నది నిజం కాదా ?
18)విధులకు హాజరు కావాలంటూ స్థానిక అధికార యంత్రాంగం ఎన్నిసార్లు పిలుపునిచ్చినప్పటికీ ప్రభుత్వ కార్యాలయాలకు ఇప్పటికీ ఉద్యోగులు వెళ్ళడం లేదన్నది నిజం కాదా ?
19) పాఠశాలలను తెరచినప్పటికీ పిల్లలను తల్లితండ్రులు పాఠశాలలకు పంపడం లేదన్నది నిజం కాదా ?
20)జబ్బు పడిన వారు, గాయాలపాలైనవారికోసం అంబులెన్స్‌లు అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్నరన్నది నిజం కాదా ?
21)ప్రజలకు సరిపడ మెడిసిన్ సప్లై చేస్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది కానీ మెడికల్ షాపుల్లో అవసరమైన మందులు అందుబాటులో లేవని ఫార్మాసిస్టులు చెబుతున్నది అబద్దమా ? కుటుంభ సభ్యులు అనారోగ్యంగా ఉంటే ప్రజలు మందుల కోసం దూరప్రాంతాలకు , చివరకు ఢ్ల్లీకి కూడా వెళ్ళి మందులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉన్నదన్నది నిజం కాదా ?

(scroll.in లో వచ్చిన వ్యాసానికి ఇది అనువాదం)

Keywords : kashmir, article 370, 35a, bjp, army, police, pellets
(2019-11-19 15:57:25)No. of visitors : 404

Suggested Posts


మా పిల్లలను హత్యలు చేస్తున్న మీతో మాట్లేడేది లేదు - రాజ్ నాథ్ కు షాకిచ్చిన కాశ్మీరీలు

భద్రతా దళాల దాడులతో, ప్రజల ఆందోళనలతో అల్లకల్లోలంగా ఉన్న కాశ్మీర్ లో పర్యటించడానికి వెళ్ళిన కేంధ్ర హోమంత్రి రాజ్ నాథ్ సింగ్ కు కాశ్మీరీలు షాకిచ్చారు. 46 మంది చనిపోయి, 2,400 గాయాలపాలై, 15 రోజులుగా కర్ఫ్యూలో మగ్గుతున్నకశ్మీర్ లో....

అబద్దాలు చెప్పలేక జర్నలిస్టు రాజీనామా

అతడో ఆత్మాభిమానం ఉన్న జర్నలిస్టు. అందుకే యాజమాన్యం చెప్పిన మాట కాదన్నాడు. ఉద్యోగానికి గుడ్ బై చెప్పేసి తన అసలైన జర్నలిస్టుగా పాత్రికేయ ప్రపంచానికి చాటి చెప్పుకున్నాడు....

పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో తిరుగుబాటు

పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీరులో తిరుగుబాటు తీవ్రమయ్యింది. తమపై పాకిస్థాన్‌ ఆధిపత్యాన్ని సహించేది లేదంటూ పాక్ అణచివేత నుండి తమకు విముక్తి కల్పించాలంటూ ఆందోళనలు ఉధృతమవుతున్నాయి.....

పెల్లెట్లు వద్దంటే ఇక బుల్లెట్లే - సీఆర్‌పీఎఫ్‌

పెల్లెట్లు వద్దంటే బుల్లెట్లు వాడాల్సి వస్తుందని సీఆర్‌పీఎఫ్‌ జమ్మూకాశ్మీర్‌ హైకోర్టుకు తెలిపింది. జమ్మూ కాశ్మీర్‌లో గత 32 రోజులుగా కొనసాగుతున్న అల్లర్లు, ఆందోళనలను అదుపు చేసేందుకు 13 లక్షల పెల్లెట్లను ఉపయోగించినట్లు జమ్మూ కాశ్మీర్‌ హైకోర్టుకు....

దుఃఖమూ నేరమైన చోట - పి.వరలక్ష్మి

ఒక చావును దేశం వేడుక చేసుకుంటుంది. అటు వైపు ఒక దుఃఖిత సమూహం శవయాత్రకు పోటెత్తుతుంది. దశాబ్దాలుగా అది నిషిద్ధ దుఃఖం. వాళ్ళ దుఃఖానికి సంఘీభావం నేరం. అవును, మాట్లాడుతున్నది కశ్మీర్ గురించే.....

సైన్యంపై రాళ్ళు రువ్వడం దేశ ద్రోహం సరే... సైన్యం సృష్టించే అరాచకాన్ని ఏమనాలి ?

26 ఏండ్ల ఫరూఖ్‌ అహ్మద్‌ థర్ అనే ఓ యువకుడు దగ్గరి బందువు చనిపోతే పక్క గ్రామం వెళ్తుండగా ఎదురు పడ్డ కొందరు సైనికులు అతనిపై దాడి చేసి తాళ్ళతో బందించి. జీపు బానెట్‌పై కూర్చోబెట్టారు. దాదాపు తొమ్మిది గ్రామాల్లో జీపును తిప్పారు. తొమ్మిది గ్రామాల గుండా జీపు ప్రయాణిస్తున్నప్పుడు సైనికులు బిగ్గరగా అరిచారు. రండీ...మీ మనిషిపైనే దాడి చేసేందుకు బయటకు రండీ.....

కాశ్మీర్ లో మరో సాల్వజుడుం

ఓ వీడిసీ సబ్యుడి చేతిలో ఓ తల్లి, ఆమె కుమారుడు దారుణ హత్యకు గురయ్యారు. అందరూ చూస్తుండగానే ముస్తాఖ్ అహ్మద్ అనే వీడీసీ సభ్యుడు.. షమిమా అక్తర్ అనే మహిళ, ఆమె మూడేళ్ల బాబు తాహిద్ పై నేరుగా తుపాకీ ఎక్కుపెట్టి కాల్పులు జరిపాడు.....

నెత్తురోడుతున్న కాశ్మీర్ - పోలీసు పెల్లెట్లకు 11ఏండ్ల విద్యార్థి బలి

శ్రీనగర్‌లోని హర్వాన్‌లో శుక్రవారం రాత్రి ఓ విద్యార్థి మృతదేహం లభ్యమైంది. మృతుడి శరీరమంతా పెల్లెట్ల గాయాలతో నిండి ఉన్నది. శ్రీనగర్‌లోని హర్వాన్‌లో శుక్రవారం పోలీసులకు, నిరసనకారులకు మధ్య ఘర్షణ చోటు చేసుకున్నది....

కాశ్మీరీ చిన్నారుల విషాదం - ʹచదువన్నాఆగుతుంది కానీ చావు ఆగదు..ʹ

ʹమా కోసం చదువన్నా ఆగుతుంది కానీ చావు ఆగదు. ఓ ఇండియా... నీకోసం సింధు వెండిని తీసుకొస్తే.. ఇక్కడ(కాశ్మీర్‌లో) నీకోసం బంగారమే ఉందిʹ అని హిష్మా నజీర్ పలికింది. ఇలాంటి వ్యాఖ్యలతో సంజీవ్ సిక్రి డైరెక్ట్ చేసిన వీడియో....

బుర్హాన్ వని ఎన్ కౌంటర్ పై సారీ చెప్పండి - పోలీసులకు సీఎం ఆదేశం

కాశ్మీర్ లో బుర్హాన్ వని ఎన్‌కౌంటర్‌పై ప్రజలకు క్షమాపణ చెప్పాలని జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబాబూ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. రోడ్లు, వీధుల్లో కూడా పోలీసులు కనిపించరాదంటూ ఆమె ఆదేశాలిచ్చినట్టు....

Search Engine

ప్రజల పక్షాన మాట్లాడుతున్నందుకే ఈ అక్రమ కేసులు : విరసం
Withdraw the False Case against Veekshanam Editor!
వీక్ష‌ణం సంపాద‌కుడిపై UAPA కేసు
భగత్ సింగ్ తుపాకీ - జార్జిరెడ్డి సినిమా...!!
Arrest of B Anuradha & N Ravi Sharma – Fact and Fiction
అనూరాధ, రవి శర్మల అరెస్టు – వాస్తవమూ కల్పనా..!
కేసీఆర్ అప్రజాస్వామిక పాలన‌: అనురాధ, రవిల అరెస్ట్ - రాజద్రోహం, యూఏపీఏ కేసులు బనాయింపు
ఫీజుల పెంపును నిరసిస్తూ.. కేంద్ర మంత్రిని నిర్బంధించిన జేఎన్‌యూ విద్యార్థులు..!
పోలీసుల అడ్డంకులు ఛేదించుకుని సమరోత్సాహంతో ట్యాంక్ బండ్ పైకి దూసుకొచ్చిన‌ కార్మికులు
చలో ట్యాంక్ బండ్ లో మావోయిస్టులున్నారన్న సీపీ... ఉక్కుపాదం మోపడం కోసమే ఈ ఆరోపణలన్న‌ ఆర్టీసీ జేఏసీ
వేలాది పోలీసు బలగాల నిర్బంధాల మధ్య‌ చలో టాంక్ బండ్ విజయవంతం
ఆర్టీసీ సమ్మెకు రాజకీయ ఖైదీల మద్దతు.. జైళ్లో నిరసన.. చలో ట్యాంక్‌బండ్ విజయవంతం చేయండి..!
భగత్ సింగ్ పిస్టల్ – అనేకానేక స్మృతులు
జర్నలిస్టులు, దళిత, మానవహక్కుల కార్యకర్తల వాట్సప్ ఖాతాలు హ్యాక్
దొర ప్రతాపమంత మజ్దూర్ల మీదనే!
తెలంగాణలో పాత రోజులు మళ్ళీ దాపురించాయి... అణిచివేతే పాలకుల విధానమయ్యింది
ఆర్టీసీ సమ్మె పై నిర్భందం...పౌరహక్కుల సంఘం ఆగ్రహం
భారత విప్లవోద్యమంలో చారుమజుందార్‌ - రేపే శతజయంతి సదస్సు
నలమాస కృష్ణ, మద్దిలేటిల అరెస్టు చట్టబద్దం కాదు - హైకోర్టు
ʹఆవులగురించి కాదు ఆడపిల్లల గురించి శ్రద్ద పెట్టండిʹ
ఈ కుట్ర కేసు వెనుక ఉన్న కుట్రలో అసలు కథ‌ ఇంకోటి ఉంది
నలమాస కృష్ణ, మద్దిలేటి అరెస్ట్...అక్రమం అంటున్న ప్రజా సంఘాలు
RTC కార్మికులారా ఆత్మహత్యలు వ‌ద్దు.. తెలంగాణ సమాజం మీ వెంట‌ ఉంది.. పోరాడి హక్కులు సాదించుకుందాం !
దేశానికి రానున్నవి చీకటిరోజులు
మావి నిషేధిత సంఘాలు కావు
more..


కశ్మీర్...