కశ్మీర్: రోగులకు వైద్యం అందడం లేదన్న‌డాక్టర్... మీడియా కెమరాల ముందే డాక్టర్ ను ఎత్తుకెళ్ళిన‌ పోలీసులు!


కశ్మీర్: రోగులకు వైద్యం అందడం లేదన్న‌డాక్టర్... మీడియా కెమరాల ముందే డాక్టర్ ను ఎత్తుకెళ్ళిన‌ పోలీసులు!

ఉదయాన్నే పేపర్ తిరగేసినా.. న్యూస్ ఛానల్స్ చూసినా కశ్మీర్ అంతా ప్రశాంతంగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్ ప్రజలు సంబరాల్లో మునిగితేలుతున్నట్లు సోషల్ మీడియాలో కాషాయ దళాలు నిస్సిగ్గుగా ప్రచారం కూడా చేస్తున్నాయి. అక్కడి వాస్తప పరిస్థితులు తెలియని.. తెలుసుకోవాలనే ఆలోచనే లేనివారికి కశ్మీర్ నిజంగానే ప్రశాంతంగా ఉదనిపిస్తుంది.

కాని, కశ్మీర్‌లో కేంద్ర ప్రభుత్వం ఆంక్షలతో పాటు అణచివేతలు కూడా కొనసాగుతున్నాయి. వాస్తవ పరిస్థితులను వివరించే, నిర్బంధాలను ప్రశ్నించే గళాలను నిస్సంకోచంగా నొక్కేస్తున్నారు. రాష్ట్రంలో ఆరోగ్య సంక్షోభం నెలకొంది. ఎంతో మంది రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా జరిగిన ఓ సంఘటనను ʹటెలిగ్రాఫ్ʹపత్రిక వెలుగులోకి తెచ్చింది.

కశ్మీర్‌లో సరైన సమయానికి చికిత్స అందక ఎంతో మంది ప్రాణాపాయస్థితిలో ఉన్నారు. ఆహారం ఒక పూట ఆలస్యం అయితే ఆగవచ్చు.. కాని రోగులకు వైద్యం ఆలస్యం అయితే ప్రాణాలు పోవడం తప్ప ఇంకో మార్గం ఉండదు కదా. కశ్మీర్‌లో దాదాపు నెల రోజులుగా కొనసాగుతున్న నిర్బంధం వల్ల ఎంతో మంది వైద్యానికి దూరమయ్యారని ఒమర్ సలీమ్ అనే ఓ యువ డాక్టర్‌ గళమెత్తాడు. దీంతో ఆగ్రహించిన భద్రతా దళాలు ఆయనను గుర్తు తెలియని ప్రాంతానికి ఎత్తుకెళ్ళి పోయారు.

డయాలిసిస్, కీమోథెరపీ చికిత్సలు చేయించుకోవాల్సిన పేషెంట్లకు వైద్యం అందుబాటులోకి రావడం లేదని తెలిపారు. డాక్టర్ సలీమ్ ఈ విషయాలను కేవలం పట్టుమని పది నిమిషాలు కూడా మీడియాతో మాట్లాడింది లేదు... వెంటనే అక్కడకు చేరుకున్న పోలీస్ బలగాలు అతడిని అపహరించుక పోయాయి.

ప్రభుత్వ మెడికల్ కాలేజీలో యూరాలజిస్ట్ గా పనిచేస్తున్న డాక్టర్ ఒమర్ సలీమ్ వైద్యులు వేసుకునే ʹయాప్రాన్ʹ ధరించి శ్రీనగర్‌లో అక్కడి పరిస్థితిని వివరించేందుకు మీడియా ఎన్‌క్లేవ్‌కు వచ్చారు. ʹనేను ఇక్కడకు కేవలం వేడుకునేందుకే వచ్చాను తప్ప నిరసన తెలిపేందుకు కాదుʹ అని రాసున్న ప్లకార్డును కూడా వెంట తీసుకొని వచ్చాడు.

ʹʹఆయుష్మాన్ భారత్ పధకంలో 15 లక్షల మంది నమోదు చేసుకున్నారు. ఇంతమంది ఈ పధకంలో నమోదవడం దేశం మొత్తంలో రికార్డు. ఇంటర్నెట్ వంటి సదుపాయాలు లేకపోవడంతో వారంతా ఈ పధకం నుంచి ఆశించిన లాభాలను పొందలేకపోతున్నారు. కొందరు అత్యవసర చికిత్స కోసం కానీ, మరికొందరు రోజువారీ మందుల కోసం కానీ బయటికి వెళ్ళలేని పరిస్థితులు నెలకొన్నాయి ʹʹ అని డాక్డర్ సలీమ్ చెప్పారు.

గతంలో కూడా డాక్టర్ సలీమ్ కేంద్ర ప్రభుత్వ ఆంక్షలను నిరసించారు. పుల్వామా ఉగ్రదాడి తర్వాత హైవేపై మోటారు వాహనాల రాకపోకలను నిషేధించినప్పుడు ఆయన తన ఆస్పత్రికి 65 కిలో మీటర్లు సైకిల్ తొక్కుకుంటూ వచ్చి నిరసన తెలిపారు. ఇలా గత కొంత కాలంగా నిర్బంధాలను ఆయన చూడటమే కాదు అనుభవించారు కూడా.

కాగా, ప్రభుత్వానికి.. మీడియాకు ఏకైక వారధిగా ఉన్న అధికార ప్రతినిధి రోహిత్ కన్సాల్‌ను ఒమర్ సలీమ్ గురించి ప్రశ్నించగా ఆయన జవాబివవ్వకుండా తప్పించుకున్నారు. అంతే కాకుండా, రాష్ట్రంలో ఎక్కడా అవాంచనీయ పరిస్థితులు లేవు... ఎమర్జెన్సీ పేషెంట్లపై ఎటువంటి ఆంక్షలు లేవని ప్రభుత్వం చెప్పడం రాజ్యం ఎంత కౄరంగా వ్యవహరిస్తోందో చెప్పడానికి ఒక ఉదాహరణ.

Keywords : Kashmir, Article 370, Doctor, Kidnap, Security Forces
(2020-08-14 20:27:31)No. of visitors : 825

Suggested Posts


మా పిల్లలను హత్యలు చేస్తున్న మీతో మాట్లేడేది లేదు - రాజ్ నాథ్ కు షాకిచ్చిన కాశ్మీరీలు

భద్రతా దళాల దాడులతో, ప్రజల ఆందోళనలతో అల్లకల్లోలంగా ఉన్న కాశ్మీర్ లో పర్యటించడానికి వెళ్ళిన కేంధ్ర హోమంత్రి రాజ్ నాథ్ సింగ్ కు కాశ్మీరీలు షాకిచ్చారు. 46 మంది చనిపోయి, 2,400 గాయాలపాలై, 15 రోజులుగా కర్ఫ్యూలో మగ్గుతున్నకశ్మీర్ లో....

అబద్దాలు చెప్పలేక జర్నలిస్టు రాజీనామా

అతడో ఆత్మాభిమానం ఉన్న జర్నలిస్టు. అందుకే యాజమాన్యం చెప్పిన మాట కాదన్నాడు. ఉద్యోగానికి గుడ్ బై చెప్పేసి తన అసలైన జర్నలిస్టుగా పాత్రికేయ ప్రపంచానికి చాటి చెప్పుకున్నాడు....

పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో తిరుగుబాటు

పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీరులో తిరుగుబాటు తీవ్రమయ్యింది. తమపై పాకిస్థాన్‌ ఆధిపత్యాన్ని సహించేది లేదంటూ పాక్ అణచివేత నుండి తమకు విముక్తి కల్పించాలంటూ ఆందోళనలు ఉధృతమవుతున్నాయి.....

మాన‌సిక స‌మ‌స్య‌ల‌తో క‌శ్మీర్ ప్ర‌జ‌లు - నిండిపోతున్న ఆసుప‌త్రులు

ప్ర‌జ‌లు మానసిక‌ జబ్బుల భారిన ప‌డుతున్నారు. మ‌తిస్తిమితం కోల్పోవ‌డం, తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌వ్వ‌డం, విప‌రీతంగా భ‌యాందోళ‌న‌ల‌తో రోధిస్తూ ప‌లువురు అప‌స్మార‌క స్తితికి చేరుకుంటున్నారు. గ‌డిచిన 12 రోజుల్లో... మాన‌సిక స‌మ‌స్య‌ల‌తో ఆసుపత్రుల్లో చేరుతున్న‌వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంద‌ని SHMS ఆసుప‌త్రి వైద్యులు

పెల్లెట్లు వద్దంటే ఇక బుల్లెట్లే - సీఆర్‌పీఎఫ్‌

పెల్లెట్లు వద్దంటే బుల్లెట్లు వాడాల్సి వస్తుందని సీఆర్‌పీఎఫ్‌ జమ్మూకాశ్మీర్‌ హైకోర్టుకు తెలిపింది. జమ్మూ కాశ్మీర్‌లో గత 32 రోజులుగా కొనసాగుతున్న అల్లర్లు, ఆందోళనలను అదుపు చేసేందుకు 13 లక్షల పెల్లెట్లను ఉపయోగించినట్లు జమ్మూ కాశ్మీర్‌ హైకోర్టుకు....

కశ్మీర్ లో వాస్తవ పరిస్థితి ఇదీ!

కశ్మీర్ లో అంతా సవ్యంగా ఉందని ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు కశ్మీర్ ప్రజలను ఎప్పుడూ ఆశ్చర్యపరచలేదు. అది ఒక అరిగిపోయిన మాట అయిపోయింది. తెలివితేటల వెలుగు కోల్పోయిన అబద్ధం అది. కశ్మీరీలకు ఆసక్తి కలిగించేదేమంటే, ప్రజల సొంత మేలు కోసం వారి మీద ఇలా విరుచుకుపడడం అవసరమైందనే ప్రభుత్వ ప్రచారంలోని తర్కాన్ని ప్రపంచం ఎట్లా ఆమోదిస్తున్నదనేదే.

దుఃఖమూ నేరమైన చోట - పి.వరలక్ష్మి

ఒక చావును దేశం వేడుక చేసుకుంటుంది. అటు వైపు ఒక దుఃఖిత సమూహం శవయాత్రకు పోటెత్తుతుంది. దశాబ్దాలుగా అది నిషిద్ధ దుఃఖం. వాళ్ళ దుఃఖానికి సంఘీభావం నేరం. అవును, మాట్లాడుతున్నది కశ్మీర్ గురించే.....

సైన్యంపై రాళ్ళు రువ్వడం దేశ ద్రోహం సరే... సైన్యం సృష్టించే అరాచకాన్ని ఏమనాలి ?

26 ఏండ్ల ఫరూఖ్‌ అహ్మద్‌ థర్ అనే ఓ యువకుడు దగ్గరి బందువు చనిపోతే పక్క గ్రామం వెళ్తుండగా ఎదురు పడ్డ కొందరు సైనికులు అతనిపై దాడి చేసి తాళ్ళతో బందించి. జీపు బానెట్‌పై కూర్చోబెట్టారు. దాదాపు తొమ్మిది గ్రామాల్లో జీపును తిప్పారు. తొమ్మిది గ్రామాల గుండా జీపు ప్రయాణిస్తున్నప్పుడు సైనికులు బిగ్గరగా అరిచారు. రండీ...మీ మనిషిపైనే దాడి చేసేందుకు బయటకు రండీ.....

కాశ్మీర్ లో మరో సాల్వజుడుం

ఓ వీడిసీ సబ్యుడి చేతిలో ఓ తల్లి, ఆమె కుమారుడు దారుణ హత్యకు గురయ్యారు. అందరూ చూస్తుండగానే ముస్తాఖ్ అహ్మద్ అనే వీడీసీ సభ్యుడు.. షమిమా అక్తర్ అనే మహిళ, ఆమె మూడేళ్ల బాబు తాహిద్ పై నేరుగా తుపాకీ ఎక్కుపెట్టి కాల్పులు జరిపాడు.....

కాశ్మీర్ ఉజ్వలమైన చరిత్ర, పోరాట గాథ...మాజీ కేంద్ర మంత్రి సఫుద్దీన్ సోజ్ కాశ్మీర్ పై రాసిన పుస్తకం గురించి..

కాంగ్రెస్స్, బీజేపీ నాయకులంతా కట్టగట్టుకొని తిట్టిపోసిన పుస్తకం ఇది. ఈ పుస్తకావిష్కరణకు రావాల్సిన రాహుల్ గాంధీ చివరి నిమిషంలో రాక పోవటానికి కారణం సైఫుద్ధీన్ ఈ పుస్తకంలో కాశ్మీర్ సమస్యకు నెహ్రూను కూడా బాధ్యడ్ని చేయటమే. పటేల్ 37 అడుగుల విగ్రహ నిర్మాణం జరిగాక, ఈ పుస్తకంలో సైఫుద్దీన్ ప్రస్తావించిన పటేల్ ప్రస్తావన విశేషమైనది.

Search Engine

రాముడిని విమర్షించాడనే కారణంతో కత్తి మహేష్ అరెస్ట్
ఢిల్లీలో జరిగిన దాడుల కుట్రలను బైటపెట్టిన కారవాన్ పత్రిక....ఆ పత్రిక జర్నలిస్టులపై దాడి, లైంగిక వేధింపులు
ఏడు వందల ఇరవై గంటల ఆందోళన...కనుచూపు మేరలో లేని ఉపశమన ఆశారేఖ
మోడీకి, శ్రీరాముడికి జైకొట్టనందుకు ఆటో డ్రైవర్ ను చితకబాదిన మతోన్మాదులు
ప్రజల పంటలను ధ్వంసం చేసిన పోలీసులు, ఫారెస్ట్ అధికారులు ... నిజనిర్దారణ కమిటీ రిపోర్ట్
అంబులెన్స్ సమయానికి రాక గర్భవతి మరణం... వార్త ప్రసారం చేసిన జర్నలిస్టు, టి వి చానెల్ పై కేసు
వీవీని విడుదల చేయాలి...ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, పబ్లిక్ సెక్టార్, కాంట్రాక్టు ఉద్యోగుల ఐక్య వేదిక డిమాండ్
పాలకుల అవినీతిని వెలికి తీసిన జర్నలిస్టులపై రాజద్రోహం కేసులు...అరెస్టులు
విప్లవ వాగ్గేయకారుడు వంగపండు ప్రసాదుకు నివాళి -విరసం
వీరుల కన్నతల్లి... అమరుల బంధువు...
ఇది భయపడాల్సిన సమయం కాదు... ఎదిరించాల్సిన సమయం...ప్రొఫెసర్ హానీబాబు భార్య డాక్టర్ జెన్నీ రోవేనా
వారిపై దాడి చేసింది సిఆర్‌పిఎఫ్ బలగాలే... మావోయిస్టులు కాదు...నిజనిర్దారణ కమిటీ రిపోర్టు
ముగిసిన అమ్మ ఎదురు చూపులు
ఏపీ జైళ్ళలో కరోనా పాజిటీవ్....ఖైదీలను విడుదల చేయాలి
ప్రొఫెసర్ సాయిబాబాను కాపాడుకుందాం... సహకరించండి... సాయిబాబా భార్య లేఖ‌
పోలీసు కూంబింగు‌ల మధ్య ఏవోబీలో భారీ ర్యాలీ ‍- అమరుల వారోత్సవాలు జరుపుకుంటున్న ప్రజలు
ప్రైవేట్ హాస్పిటల్స్ లో కరోనా పీజుల దోపిడీని అరికట్టాలి -CLC
అక్రమంగా అరెస్ట్ చేసిన ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ హనీ బాబును విడుదల చేయాలి - CLC
Condemn the impunity towards political prisoners
వరవరరావును విడుదల చేయాలి....765 మంది జర్నలిస్టుల లేఖ!
భీమా కోరేగావ్ కేసు: మరో ప్రొఫెసర్ అరెస్ట్
Condemn the arbitrary arrest of Prof. Hany Babu - CASR
కవిత్వంలో అమరత్వం...జూలై 28 - వరవరరావు
ఉద్యమాల ఉపాధ్యాయుడి జీవితమంతా ప్రజా ఉద్యమాలే
కుల నిర్మూలనవాది ఉసాకి జోహార్లు...పాపని నాగరాజు
more..


కశ్మీర్: