బాలకపై సామూహిక అత్యాచారం చేసిన దుర్మార్గులు... బాధితురాలికి గుండుగీయించి ఊరేగించిన గ్రామ పెద్దలు


బాలకపై సామూహిక అత్యాచారం చేసిన దుర్మార్గులు... బాధితురాలికి గుండుగీయించి ఊరేగించిన గ్రామ పెద్దలు

బాలకపై

కొందరు దుర్మార్గులు ఓ బాలికపై అత్యాచారం చేశారు....న్యాయం కోసం ఆ చిన్నారి కుటుంభం గ్రామ పెద్దలను వేడుకుంటే వాళ్ళు మరింత దుర్మార్గంగా ఆ చిన్నారికే గుండు గీయించి ఊర్లో ఊరేగించారు.

బీహార్ గయ జిల్లాలో జరిగిన ఈ నెల 14న జరిగిన ఈ సంఘటన‌ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 14వతేదీన ఇంటి నుండి బైటికి వెళ్ళిన ఈ బాలికను అదే గ్రామానికి చెందిన కొందరు బలిసిన కుటుంభాలకు చెందిన దుర్మార్గులు కిడ్నాప్ చేసి పంచాయితీ భవనంపైకి తీసుకెళ్ళి ఒకరి తర్వాత ఒకరు అత్యాచారం చేశారు. స్పృహతప్పిన ఆ బాలికను అక్కడె వదిలేసి వెళ్ళి పోయారు.

తెల్లవారి గ్రామస్తుడొకరు ఆమెను చూసి తల్లితండ్రులకు తెలియజేయడంతో వాళ్ళు ఇంటికి తీసుకెళ్ళారు.
బాలికపై జరిగిన దారుణాన్ని కుటుంభ సభ్యులు పంచాయితీ పెద్దల దృష్టికి తీసుకెళ్ళారు. అయితే అత్యాచారం చేసిన వాళ్ళు బలిసిన కుటుంభాలకు చెందినవాళ్ళవడంతో బాలికదే తప్పని తేల్చారు పంచాయితీ పెద్దలు. తప్పు ఆమెదే అని తేల్చారు కాబట్టి అందుకు శిక్షగా ఆ బాలికకు గుండు గీయించి ఊర్లో తిప్పారు. దీంతో బాలిక తల్లి పోలీసులకు పిర్యాదు చేసింది.

పోలీసులు కూడా ఈ అత్యాచార సంఘటనపై కనీసం స్పంధించలేదు. అత్యాచారం చేసిన వాళ్ళతో చేతులు కలిపిన వాళ్ళు కేసు కూడా నమోదు చేయలేదు. తమకు న్యాయం చేయమంటూ అటు పోలీసులను, గ్రామ పెద్దలనూ వేడుకొని చివరకు ఆ కుటుంభం ఈ నెల 24న‌ బాధిత బాలికను తీసుకొని జిల్లా పోలీసు ఉన్నతాధికారులను కలవడంతో పోలీసు శాఖలో కదలిక వచ్చింది. సోమవారం నిందితులపై కేసు నమోదు చేశారు. ఇప్పటివరకు ఆరుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Keywords : bihar, rape, police, girl
(2019-09-19 03:02:09)



No. of visitors : 393

Suggested Posts


Leaders Of CPI Maoist In Bihar Seek To Consolidate Their Cadre Base Amidst State Repression

The CPI(Maoist) leaders in Bihar are trying to consolidate their cadre base and moving places to meet their supporters. Central intelligence agencies have alerted the state police on the movement of top Maoist leaders like Vijay Yadav alias Sandeep ji, Nanadlal Yadav alias Nitesh ji, Indal Bhokta and a few others....

ఓ ముస్లింను హత్య చేసిన కేసులో మరణ శిక్ష పడి బెయిల్ పై వచ్చిన వారికి సన్మానం చేసిన కేంధ్ర మంత్రి

జార్ఖండ్లో గో మాంసం అమ్ముతున్నాడనే నెపంతో గతేడాది జూన్‌ 29న జార్ఖండ్‌ రాంఘడ్‌కు చెందిన అలిముద్దిన్‌ అన్సారీ అనే 40 ఏళ్ళ వ్యక్తిపై 12 మంది దాడి చేసి తీవ్రంగా కొట్టడంతో అతను అక్కిడిక్కడే మృతి చెందాడు. ఈ దాడిలో పాల్గొన్న వారిలో 11 మందికి ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు మరణశిక్ష విధించింది.

బీహార్ లో మహా కూటమిదే గెలుపు ?

బిహార్ లో నితీష్, లాలూల జోడీ గెలిచే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. బీహార్ వాసులు మహాకూటమికే పట్టం కడతారని ఎగ్జిట్ పోల్స్ అంచనాలు చెబుతున్నాయి.....

భూస్వామ్య సేనల పాలిట సింహ స్వప్నం,భూమిపుత్రుడు అరవింద్‌ - రవి నర్ల

భారతదేశంలోని విప్లవశ్రేణులకూ, బీహార్‌లోని రైతులకూ, రైతు కూలీలకూ, పీడిత ప్రజలకూ, ముఖ్యంగా మగధ్‌ ప్రాంతంలోని పీడిత ప్రజానీకానికందరికీ అత్యంత ప్రియమైన విప్లవ నాయకుడు. బ్రహ్మర్షిసేన, భూమిసేన మొదలుకొని రణవీర్‌ సేన వరకు భూస్వామ్య సేనల పాలిట సింహ స్వప్నంగా నిలిచి వాటిని భూస్థానితం చేసిన ఎర్రసైన్యపు సేనాని.

This TV reporter is winning praise for relentlessly questioning an errant BJP leader

The internet canʹt stop admiring TV9 Bharatvarsh reporter Rupesh Kumarʹs questioning of a self-proclaimed Bharatiya Janta Party leader who broke ICU rules in a Muzaffarpur hospital.

Search Engine

తెలుగులో ఇలాంటి సినిమాలు తీయలేరా..?
పోరాడితే పోయేదేమీ లేదు...పోరాడి హక్కులు సాధించుకున్న విద్యార్థినులు
భీం ఆర్మీ ఛీఫ్ ఆజాద్ ను వెంటనే విడుదల చేయాలి... మేధావులు, లాయర్లు, విద్యార్థుల డిమాండ్
పులివెందుల నుండి నల్లమలదాకా...వరలక్ష్మి
ఆర్థిక మాంద్యం అంటే ఏమిటి ? ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కోవడం ఎలా ? - ఎన్.వేణుగోపాల్
కశ్మీర్ లో ఎవ్వరికి లేని ʹనెట్ʹ సేవలు బీజేపీ వాళ్ళకు ఎలా వచ్చాయి ?
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
Savenallamala: యురేనియం తవ్వకూడదన్నవాళ్ళంతా అర్బన్ నక్సలైట్లేనా ?
కశ్మీర్ ప్రజల పోరాటానికి మద్దతుగా నిబడదాం...మావోయిస్టు పార్టీ పిలుపు
భూ గురత్వాకర్షణ శక్తిని కనుగొన్నది ఐనిస్టీనా... న్యూటన్ కాదా ?
Maoist leader Murali recounts his own jail experience to cite rampant rights violation
ప్రభుత్వాన్ని,న్యాయవ్యవస్థను,ఆర్మీని విమర్శించడం దేశద్రోహం కాదు ... సుప్రీం కోర్టు జడ్జ్
దేవరకొండలో యురేనియం సర్వే కోసం వచ్చిన వారిని తరిమిన ప్రజాసంఘాలు
చెప్పులేసుకొని బైక్ నడిపినా.. లుంగీ కట్టి లారీ నడిపినా భారీ జరిమానాలు..!
యురేనియంపై నల్లమల బంద్.. కదం తొక్కిన జనం... నాయకుల అరెస్ట్, ఉద్రిక్తత‌
నల్లమల ప్రజలకు మద్దతుగా నిలబడదాం, యురేనియం తవ్వకాలను అడ్డుకుందాం ... మావోయిస్టు పార్టీ ప్రకటన‌
జేఎన్యూ పై మళ్ళీ ఎర్రజెండా రెపరెపలు... విద్యార్థి సంఘం ఎన్నికల్లో లెఫ్ట్ ఘనవిజయం
దేవుడు లేడని చెప్పే హక్కు రాజ్యాంగం కల్పించింది...మద్రాస్ హైకోర్టు
దేశ పరిస్థితులపై ఆందోళన...మరో ఐఏఎస్ రాజీనామా
జేఎన్యూ విద్యార్థి నాయకురాలు షెహ్లా రషీద్ పై రాజద్రోహం కేసు
యుద్ధం - శాంతి.
యురేనియం దెబ్బకు జీవాలు గడ్డి తినడంలే.. బురుగులు కక్కి సస్తున్నాయి..!
కశ్మీర్ లో 80 మందికి పెల్లెట్ గాయాలు, బాలుడు మృతి... జాతీయ వార్తాసంస్థల వెల్లడి
ఆమె పోరాటమే.. తమిళనాడు ప్రభుత్వాన్ని కదిలించింది..!
స్కూలు పిల్లలకు భోజనంలోకి కూరకు బదులు ఉప్పు...బైట పెట్టిన జర్నలిస్టుపై కేసు
more..


బాలకపై