కోపోద్రిక్త యువతరం నరాల్లో నెత్తురై పోటెత్తిన వాడు ..!


కోపోద్రిక్త యువతరం నరాల్లో నెత్తురై పోటెత్తిన వాడు ..!

కోపోద్రిక్త

(రచయిత మోహన సుందరం తన ఫేస్ బుక్ వాల్ పై పోస్ట్ చేసిన ఆర్టికల్ మీకోసం)

నా గోడునో, నా గొడవనో, నా గుండెచప్పుడునో
నా ప్రేమనో, నా కన్నీళ్ళనో, నా ఆకలి ఆక్రోశాన్నో
అసలెప్పుడూ నా పాట వినిపించదు.
నా బాధలనో, నా వ్యధల్నో, నా బరిబాతల్నో
నా బతుకునో, నా మెతుకునో,నా నీరస నిట్టూర్పునో
పొరపాటుగానైనా నా పాట వినిపించదు.

నాపాట బలహీనుల కన్నీటిని సొమ్ము చేసుకోదు
నా పాట అధికారం కాళ్ళముందు సాగిలపడదు
నిలువ నీటి మడుగుల్ని చీల్చే ఉగ్రజలపాతం నాపాట
అగాధమైన ఆకాంక్షల సాహసబిందువు నా పాట
ఎగసే కోట్లాది గొంతుల్లో నాదీ ఒకటి
ఎలుగెత్తే నినాదాల్లో నాదీ ఒక్కటి

కోసినా, ఉరితీసినా
తలవంచదు నా పాట
సమాధిలోంచి సైతం
ధిక్కారాన్నే సంధిస్తుంది నాపాట.

నక్సల్బరీ తరాన్ని ఊపేసిన ఈ గేయం రచయిత కామ్రేడ్ సరోజ్ దత్తా. కవి, రచయిత, సంపాదకుడు, మార్క్సిస్టు- లెనినిస్ట్ మేధావి, తాత్వికుడు. మరీ ముఖ్యంగా కలకత్తా కోపోద్రిక్త యువతరం నరాల్లో నిప్పుల్ని ప్రవహించేలా చేసిన విప్లవకారుడు, గొప్ప నాయకుడు.

నక్సల్బరీ తొలితరం నాయకుల్లో ప్రముఖుడు, 1969 ఏప్రిల్ 22 వ తేదీన ఏర్పడిన సీపీఐ(ఎం.ఎల్.) వ్యవస్థాపక కేంద్రకమిటీ సభ్యుడు కామ్రేడ్ సరోజ్ దత్తా ప్రస్తుత బంగ్లాదేశ్ లోని జెసోర్ లో 1914 మార్చి 13 వ తేదీన జన్మించారు. కలకత్తా యూనివర్సిటీ లో ఇంగ్లీష్ సాహిత్యంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన ఆయన 1940 లో ప్రసిద్ధి చెందిన అమృతబజార్ పత్రిక సంపాదకవర్గం లో చేరి ఆ పత్రికలు చీఫ్ ఎడిటర్ అయ్యారు. 1949లో కమ్యూనిస్టు పార్టీ సభ్యులైన ఆయన బెంగాల్లో కమ్యూనిస్టు పార్టీని బలోపేతం చేసేందుకు ఎంతో కృషి చేసారు. వేలాది వ్యాసాలు రాశారు. 1964 లో పార్టీ చీలిక తర్వాత సీపీఎం పార్టీలోకి వచ్చిన ఆయన ప్రముఖ కమ్యూనిస్టు మేధావి కామ్రేడ్ సుశీతల్ రాయ్ చౌదరి తో కలిసి పార్టీ పత్రిక " స్వాధీనత " ని నడిపారు. తన వ్యాసాల ద్వారా నక్సల్బరీ భూమికని ఏర్పాటు చేశారు. సీపీఐ(ఎం.ఎల్.) ఏర్పడిన తర్వాత పార్టీ పత్రికలు లిబరేషన్, సంవాద్ లకు సంపాదకత్వం వహించి పార్టీ లైన్ గురించి ఎన్నో విలువైన సిద్ధాంతవ్యాసాలు రాశారు.

నక్సల్బరీ తరం నేతల్లో అత్యంత ప్రభావం కలిగించిన నేత కామ్రేడ్ సరోజ్ దత్తా. ముఖ్యంగా కలకత్తా యువతరానికి మార్గదర్శనం చేసిన నాయకుడు. ఆ రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా సంచలనం కలిగించిన విగ్రహావిధ్వంసం కార్యక్రమానికి రూపకల్పన చేసి వేడినెత్తుటి యువతను విప్లవ మార్గం పట్టించినవాడు. అందుకే కామ్రేడ్ చారుమజుందార్ తర్వాత రాజ్యానికి మోస్ట్ వాంటెడ్ పర్సన్ అయ్యాడు. కలకత్తా లోని తన ఆప్తమిత్రుడైన మేధావి, రచయిత దేవీప్రసాద్ చటోపాధ్యాయ ఇంట్లో ఆశ్రయం తీసుకొని ఉండగా 1971 ఆగస్ట్ 4 వ తేదీ రాత్రి ఆయనని అదుపులోకి తీసుకున్న పోలీసులు తీవ్ర చిత్రహింసలకు గురిచేసి 5 వ తేదీ వేకువజామున కలకత్తాలోని షహీద్ మైదానంలో కాల్చిచంపి పడేసి పోయారు. తమ ఇంట్లోంచి తమ కళ్లెదుటే ఎత్తుకుపోయి అమానుషంగా కాల్చిచంపేసారని దేవీప్రసాద్ చటోపాధ్యాయ వాపోయినా అప్పటి ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. ప్రముఖ సినీనటుడు ఉత్తమకుమార్ నెత్తుటిముద్దగా ఉన్న ఓ వ్యక్తిని పోలీసులు షహీద్ మైదానంలో కాల్చిచంపడాన్ని మార్నింగ్ వాక్ చేస్తున్న తాను కళ్లారా చూశానని చెప్పినా , ఆయన తాగిన మైకంలో చెబుతున్నారు అంటూ ప్రభుత్వం కొట్టిపారేసింది.

కామ్రేడ్ సరోజ్ దత్తా అమరత్వం మేధావుల్ని కలచివేసింది. ఎంతోమంది మేధావులు వీధుల్లోకి వచ్చి పెద్దఎత్తున నిరసన ప్రదర్శనలు చేశారు. అప్పటి మిశ్రమ ప్రభుత్వానికి, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జ్యోతిబసు నేతృత్వంలోని సిపిఎం ప్రభుత్వానికి సరోజ్ దత్తా హత్యపై న్యాయవిచారణ జరిపించాల్సిందిగా అనేక వినతులు చేశారు. ప్రభుత్వం వాటన్నింటినీ బుట్టదాఖలు చేసింది. కామ్రేడ్ సరోజ్ దత్తా ఉదంతంతో ప్రముఖ రచయిత దివ్యేంద్ పాలిత్ ʹసహజూద్దాʹ అనే నవల రాశారు. సరోజ్ దత్తా ఉదంతం తోనే ʹ సోపన్ ʹ అనే సినిమా తీశారు. గౌతమ్ ఘోష్ సినిమా ʹ కాల్బెలాʹలో కూడా సరోజ్ దత్తా పాత్రని గొప్పగా చిత్రీకరించాడు. 2018 లో కస్తూరి బసు, మిఠాలీ బిశ్వాస్ లు "SD " పేరిట కామ్రేడ్ సరోజ్ దత్తా జీవితం, రచనలు, ఆయన ప్రభావం మీద గొప్ప డాక్యుమెంటరీ సినిమా తీశారు.

కామ్రేడ్ సరోజ్ దత్తా రచనలు, శక్తివంతమైన ఆయన కవితలు అనేక భాషల్లోకి అనువాదం అయ్యాయి. కామ్రేడ్ ఆలూరి భుజంగరావు గారు సరోజ్ దత్తా వ్యాసాలు కొన్నింటిని తెలుగులోకి అనువాదం చేసి ప్రచురించారు. విరసం పదివసంతాలు సందర్భంగా ప్రచురించిన " మరో ఝoఝ " కవితా సంకలనం ముఖచిత్రంగా కేవీఆర్ అనువాదం చేసిన సరోజ్ దత్తా ʹనా పాటʹ కవితనే ప్రచురించారు. కామ్రేడ్ చారుమజుందార్ ఈ శతజయంతి సంవత్సరంలో నక్సల్బరీ కి పునాదులు వేసిన ఆ విలువైన నాయకుల్ని స్మరించుకోవడం, ఎంతో విలువైన, స్ఫూర్తినిచ్చిన వారి రచనల్ని చదువుకోవడం, వారి త్యాగాలతో వేసిపోయిన రహదారిని మరింత ముందుకు తీసుకుపోవడం మన కర్తవ్యం.

" వేట ఒక్కటే మిగిలినప్పుడు
వేటాడబడటమే మిగిలినప్పుడు
తప్పదిప్పుడు
నా పాట ఆయుధమయ్యే తీరుతుంది! "
- మోహన సుందరం

Keywords : saroj datta, west bengal, naxalbari, martyr, writer
(2020-06-01 22:41:22)No. of visitors : 636

Suggested Posts


నక్సల్బరీ ప్రజ్వలానికి 50 ఏళ్ళు....అడవిలో ప్రవేశించాలనే ఆశయం నెరవేరిన రోజు...

మొదటి అయిదుగురు ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులతోను, ఆరుగురు పట్టణ యువకులతోను, ముగ్గురు పోర్టు ఉద్యోగులతోను, కొద్దిమంది షిప్ యార్డు కార్మికులతోను సంబంధాలు ఉండేవి. వీరిలో ముఖ్యులను నాకు పరిచయం చేసింది ప్రముఖ రచయిత రావిశ్రాస్తి కొడుకు కామ్రేడ్ నారాయణమూర్తి. కృష్ణా జిల్లాలో కామ్రేడ్ కె.ఎస్. కుడి భుజంగా పేరొందిన కామ్రేడ్ తప్పెట సుబ్బారావు నాకు షెల్టర్...

Maoists are the Real Communists - Jaison C Cooper

Itʹs 50 years and the spirit continues. Itʹs a movement that has been loved and hated by many alike. Itʹs also a movement nobody can never ignore. But has it been understood properly? Lots of blood, violence, sacrifice, nostalgia, romance and adventurism have been attached to it. There is no limit to the misunderstanding on the Naxal movement....

నక్సల్బరీ ప్రజ్వలానికి 50 ఏళ్ళు.... కొన్ని ఙాపకాలు

ఈ కాలంలో ఆయన మావద్దకు వచ్చిన ఓ రోజు తన అంగీ పక్కజేబు నుండి మడత పెట్టి ఉన్న ఓ కాగితాన్ని బయటకు తీసి మడతవిప్పి ఇది చూడండని నా చేతికిచ్చాడు. చూస్తే అది కోడిగుడ్డు ఆకారంలో ఉన్న ఒక రేఖా చిత్రం. ఎవరో గజిబిజిగా చేత్తో గీసి ఇచ్చిన ఓ బొమ్మ. ఆలోచించి పోల్చుకుంటే అది ఓ చేతిబాంబు బొమ్మని అర్థమైంది. అంతకు మించి ఇంకే వివరాలు అందులో లేవు.

ప్రపంచవ్యాప్తంగా ఉత్తేజపూరితంగా సాగుతున్న నక్సల్బరీ వారోత్సవాలు

కెనడా, లండన్, ఇటలీ, బాంగ్లాదేశ్ తో సహా అనేక దేశాల్లో మావోయిస్టు, కమ్యూనిస్టు పార్టీలు, సంఘాలు భారత విప్లవానికి వెన్నుదన్నుగా నిలుస్తామని ప్రతినపూనాయి. ఇటు దేశంలో బీహార్ మొదలుకొని కేరళ వరకు పట్టణాల్లొ, పల్లెల్లో, అడవుల్లో వేలాది సభలు జరిగాయి...

 నక్సల్బరీ ప్రజ్వలానికి 50 ఏళ్ళు.... కొన్ని ఙాపకాలు (2)

నక్సల్బరీ ఉద్యమ ఆశయాల పట్ల, విలువలపట్ల ఎంతో గౌరవం ఉంది. అందుచేతనే నక్సల్బరీ రాజకీయంతో నేను అనుబంధం ఏర్పర్చుకుని కొనసాగిస్తున్నాను. అంతేగాక ఒక్క నక్సల్బరీ రాజకీయ పంథా మినహా, భారత దేశంలో ఇప్పటికి ఉనికిలో ఉన్న మరే ఇతర రాజకీయ పంథా భారత దేశ విప్లవాన్ని ముందుకు నడిపించలేదని రుజువైంది....

Naxalbari: its relevance for today… and for tomorrow

The stormy period of the nineteen sixties gave birth in several countries to uprisings, movements and organisations that continue to have a lasting impact to this day...

50 ఏండ్ల నక్సల్బరీ... పులకించిన బొడ్డపాడు

శ్రీకాకుళ సాయుధ రైతాంగ పోరాటానికి ఊపిరిలూదిన గడ్డ బొడ్డపాడు. ఆ పోరాటానికి ఎంతోమంది వీరులను అందించిన గడ్డ బొడ్డపాడు. శ్రీకాకుళ సాయుధ పోరాట చరిత్రలో ఆ ఊరిది ఓ పేజీ అలాంటి గ్రామం...

Bangladesh: Celebration of 50 years of Naxalbari..

The importance and dignity of the peasant uprising of Naxalbari is immense in the communist movement of South Asia . With the influence of Chinaʹs cultural revolution in 1967, the peasantʹs movement in West Bengalʹs rural areas was the voices of the struggles...

Germany, Berlin: Long live Peopleʹs War! Long live Naxalbari !

On 20 May, an international action day took place on the occasion of the 50th anniversary of the Naxalbari insurrection....

Bangladesh: 50th Anniversary of Naxalbari celebrated in Dhaka

Procession and discussion meeting held at 50th anniversary of Naxalbari was held in Dhaka on 25th May. At around 3:30 pm a procession started from the Press Club to Progoti conference room, Mukti Bhawan, 2 Purana Paltan in Dhaka. The meeting and Discussion was led by Jafar Hossain, assisted by Atif Anik...

Search Engine

మానవత్వానికే మచ్చ తెచ్చిన ఆ దుర్మార్గుడితో కలిసి ఉండలేను... విడాకులు ఇప్పించండి
నోరు మూసుకో....ట్రంప్ కు పోలీసు చీఫ్ హెచ్చరిక‌
తెలంగాణకోసం పోరాడిన వారు జైళ్ళలో మగ్గుతున్నరు
వరవరరావు బెయిల్ పిటిషన్ మళ్ళీ వాయిదా !
వరవరరావు విడుదల కోసం ʹమాహాʹ సీఎంకు మాజీ కేంద్ర సమాచార కమీషనర్ల‌ లేఖ
వీవీ,సాయిబాబాల‌ జీవించే హక్కును కాపాడండి...పౌరహక్కుల సంఘం
కేసీఆర్ కు తెలంగాణ, ఏపీకి చెందిన 27 మంది ప్రముఖ రచయితల విజ్ఞప్తి
వీవీ, సాయిబాబాలను వెంటనే విడుదల చేయాలి -సామాజిక తెలంగాణ మహాసభ
వరవరరావును వెంటనే విడుదల చేయాలి - సీపీఐ (ఎంఎల్) జనశక్తి డిమాండ్
వరవరరావు ఆరోగ్యంపై ఆయన సహచరి హేమలత ప్రకటన‌
వీవీ, సాయిబాబాలతో సహా రాజకీయ ఖైదీలందరినీ విడుదల చేయాలంటూ దేశవ్యాప్త ప్రదర్శనలు
సామాజిక కార్యకర్తల‌ జీవించే హక్కును కాలరాస్తున్న‌ పాలకుల విధానాలపై రేపు(మే29) నిరసన
మంథని లో లాకప్ డెత్...పౌరహక్కుల సంఘం నిజ నిర్దారణ... విచారణకు ఆదేశించిన హైకోర్టు
దయనీయస్థితిలో జి.ఎన్.సాయిబాబా ఆరోగ్య పరిస్థితి- సహచరి వసంతకుమారి ఆందోళన
వరవరరావును విడుదల చేయాలి -జర్నలిస్టు,హక్కుల,ప్రజా సంఘాల డిమాండ్
వరవరరావు విడుదలకు తెలంగాణ ప్రభుత్వం చొరవ చేయాలి..వివిధ పార్టీల డిమాండ్
మా నాన్నను వెంటనే విడుదల చేయండి..వరవరరావు కూతుర్ల లేఖ‌
వీవీ, ఇతర సామాజిక‌ కార్యకర్తలున్న తలోజా జైలుతో సహా మూడు జైళ్ళలో కరోనాతో ముగ్గురు ఖైదీల మృతి !
తలోజా జైల్లో వ్యాపించిన కరోనా...అనారోగ్యంతో ఉన్నవీవీని తక్షణం విడుదల చేయాలని విరసం డిమాండ్
పింజ్రా తోడ్ కార్యకర్తలకు బెయిల్...కొద్ది నిమిషాల్లోనే మళ్ళీ అరెస్టు
రాజ్యాంగాన్ని, ప్రజల స్వేచ్ఛ, హక్కులను కాపాడడాన్ని సుప్రీం కోర్టు మానుకుంది...మార్కండేయ్ ఖట్జు
నక్సల్బరీ ప్రాసంగికత ‍- వరవరరావు (2)
నక్సల్బరీ ప్రాసంగికత ‍- వరవరరావు (1)
ఇది నక్సల్బరీ ప్రజ్వరిల్లినరోజు....అడవిలో ప్రవేశించాలనే ఆశయం నెరవేరిన రోజు...
హిందూత్వ లాఠీలు:న్యాయ‌వాదిపై పోలీసుల దాడి - ముస్లిం అనుకొని కొట్టామని సమర్ధన‌
more..


కోపోద్రిక్త