లింగన్న‌, వీరాస్వామిలవి పోలీసుల హత్యలే... రోళ్ళగడ్డ ప్రజల ప్రతిఘటన ప్రజలందరికీ ఆదర్శం.. మావోయిస్టు పార్టీ ప్రకటన‌


లింగన్న‌, వీరాస్వామిలవి పోలీసుల హత్యలే... రోళ్ళగడ్డ ప్రజల ప్రతిఘటన ప్రజలందరికీ ఆదర్శం.. మావోయిస్టు పార్టీ ప్రకటన‌

లింగన్న‌,

భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) తెలంగాణ రాష్ట్ర కమిటి పత్రిక ప్రకటన పూర్తి పాఠం...

*ఆగస్టు 29, 2019 బుడుగుల, రోళ్ళగడ్డ ఎన్కౌంటర్స్ పట్టి బూటకం. అకాడి వీరస్వామి, లింగవ్వలను పట్టుకొని బూటకపు ఎన్కౌంటర్లలో హత్య చేయడాన్ని ప్రజలు, ప్రజాస్వామిక వాదులు ఖండించండి!
*ఎన్ కౌంటర్ల పేరుతో హత్యలు కొనసాగించడానికి కూంబింగిలకు వస్తున్న పోలీసులను ప్రతిఘ‌టించండి!
*కూంబింగ్, ఎన్ కౌంటర్స్ పేర హత్యలు చేయడాన్ని ఆప‌కపోతే టిఆర్ఎస్ పార్టీకి, బి.జి.పి పార్టీ నాయకులకు ప్రజల చేతిలో శిక్షలు తప్పవు.

ప్రియమైన ప్రజలారా! తెలంగాణ రాష్ట్రంలో కేసిఆర్ టిఆర్ఎస్ ప్రభుత్వం, కేంద్రంలో బి.జె.పి మోడీ ప్రభుత్వం సామ్రాజ్యవాదుల, బహుళజాతి కంపెనీలతో కుమ్మక్కై కుట్రతో అడవిలో వున్న సంపదను దోచుకోవడానికి అడవుల నుండి, భూములనుండి ఆదివాసులను, పీడిత ప్రజలను గెంటివేయడానికి సుప్రీంకోర్టు తీర్పు ద్వారా, హరితహారం పేరుతో, పర్యావరణ సంరక్షణ పేరుతో తెలంగాణాలోని ఏజెన్సీ ప్రాంతాన్ని భద్రాద్రి కొత్తగూడెం నుండి మొదలు మ‌హబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, మహబూబ్ నగర్, పెద్దపల్లి, మంచిర్యాల, కొమరం భీం, ఆదిలాబాద్ జిల్లా వరకు గ్రేహౌండ్స్ - సిఆర్ పిఎఫ్ బలగాలు పెద్దఎత్తున కూంబింగ్ ఆపరేషన్స్ కొనసాగిస్తున్నాయి.

ఆదివాసులను, పీడిత ప్రజలను వందలాది మందిని అరెస్టు చేస్తూ చిత్రహింసలకు గురిచేస్తూ భూముల నుండి గెంటివేస్తూ జైళ్ళలో పెడుతున్నారు. గ్రామాలను కూలుస్తూ, కాలబెడుతున్నారు. ఆదివాసుల భూముల రక్షణకోసం, ఆదివాసీలకు, పీడిత ప్రజలకు అండగా వున్న మావోయిస్టు పార్టీని నిర్మూలించే లక్ష్యంతో కేసిఆర్ ప్రభుత్వం బూటకపు ఎన్ కౌంటర్లకు పాల్పడుతున్నది.

ఆగస్టు 21వ తారీఖు తెల్లవారుజామున మణుగూరు దళం సభ్యులు కామ్రేడ్ జాడి వీరస్వామి, మరో ఇద్దరు సభ్యులు బుడుగుల గ్రామానికి సివిల్ డ్రస్ లో ప్రజలను కలవడానికి పోయారు. వీరి ఆచూకీని ఇన్ఫార్మర్ ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు కామ్రేడ్ వీరస్వామిని ఇంటివద్దనే పట్టుకొని తీవ్ర చిత్రహింసలకు గురిచేసి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో ఎస్పీ సునిల్దత్ నిర్ణయం ప్రకారం అడవిలోకి తీసుకపోయి హత్యచేసి ఎన్ కౌంటర్లో చనిపోయినట్లు ఎప్పటిలాగే కట్టుకథ అల్లారు.

జూలై 31వ తారీఖున న్యూ డెమోక్రసి పార్టీ నాయకుడు లింగన్నను రోళ్ళగడ్డ గ్రామ సమీపాన పట్టుకొని చిత్రహింసలకు గురిచేసి బూటకపు ఎన్కౌంటర్లో హత్య చేశారు. దీనితో కోపోద్రిక్తులైన రోళ్ళగడ్డ గ్రామ ప్రజలు పోలీసులను రాళ్ళతో, కర్రలతో చితకబాది తుపాకులు గుంజుకున్నారు. రోళ్ళగడ్డ ప్రజల ప్రతిఘటనను తెలంగాణ ప్రజలందరూ ఆదర్శంగా తీసుకొని కూంబింగ్ ల‌కు, దాడులకు వస్తున్న పోలీసులను ప్రతిఘటించాలని పిలుపునిస్తున్నాము.

కామ్రేడ్ జాడి వీరస్వామి, కామ్రేడ్ లింగన్నల బాటలో ఆదివాసులు, పీడిత ప్రజలు సాయుధమై పోరాడడం ద్వారానే భూములను రక్షించుకుంటాం. పోరాడితే పోయేదేమి లేదు. మన భూములు మనకు దక్కుతాయి. కూంబింగ్లు, బూటకపు ఎన్కౌంటర్లు ఆపకపోతే టిఆర్ఎస్ పార్టీ, బి.జె.పి పార్టీ నాయకులకు ప్రజల ప్రతిఘటన తప్పదని హెచ్చరిక చేస్తున్నాం,

ఆగస్టు 26వ తారీఖున కేంద్ర హెూం మంత్రి అమిత్ షా నాయకత్వాన మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, డీజిపిలు ఇతర కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో నక్సల్స్ లేని నవ భారతాన్ని నిర్మిద్దామని ఉద్ఘాటించారు. వామపక్ష తీవ్రవాద నిర్మూలనకు రాష్ట్రాలు కోరినంత సహాకారం అందిస్తామని హామీ ఇచ్చారు. బహుముఖ దాడికి పథకాలు వేశారు. తెలంగాణ నుండి హెూంమంత్రి మహమూద్ అలీ, డిజిపి మహేందర్ రెడ్డిలు హాజరయ్యారు.

ఈ సమావేశ లక్ష్యం బ్రాహ్మణీయ హిందూ మతోన్మాదులు నిర్మించే నవభారతం. అది ఎలాంటిదంటే అంధవిశ్వాసాలతో, అశాస్త్రీయతతో కూడిన నిచ్చెనమెట్ల కులాధారిత ఫ్యూడల్ వ్యవస్థ, ఈ వ్యవస్థలో అగ్రవర్ణాల, ధనికుల, భూస్వాముల, దళారీ పెట్టుబడిదారుల, సామ్రాజ్యవాదులకు మాత్రమే అన్ని హక్కులు, అధికారాలు వుంటాయి.

పీడిత ప్రజలకు, పీడిత కులాలకు, జాతులకు, దళితులకు, మైనారిటీలకు, మహిళలకు, ఆదివాసులకు హక్కులు, అధికారాలు వుండవు. ఇలాంటి దోపిడీ హిందూ రాజ్యాన్ని స్థాపించేందుకు నవభారతం పేరుతో హిందూ మతోన్మాదులు ఒక దీర్ఘకాలిక ప్రణాళికతో తమ లక్ష్యాన్ని సాధించుకోవడానికి ఫాసిస్టు దాడులు కొనసాగిస్తున్నది. మావోయిస్టుల నిర్మూలనే ప్రధాన లక్ష్యంగా భావిస్తోంది. దళితులు, మైనారిటీలు, ఆదివాసులపై మూకదాడులతో హత్యలు చేస్తున్నది.

తమ పథకంలో భాగంగానే జమ్మూ - కశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి కల్పించే హక్కులు ఆర్టికల్స్ 370, 35-ఏ లను రద్దు చేసి కశ్మీర్ ప్రజల హక్కులను కాలరాశారు. భాజపా తెలంగాణాలో తమ బలం పెంచుకోవడానికి తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నది. "ఘర్ వాపస్", "లవ్ జిహాద్", "గో సంరక్షణ", "జై శ్రీరామ్" వగైరా పేర్లతో దాడులు చేసే అవకాశాలున్నాయి. తెలంగాణ, ఆంధ్రలో హిందూ దేవాలయాలపై తీవ్రవాదులు దాడులు చేసే అవకాశాలున్నాయని భాజపా బూటకపు ప్రచారం మొదలుపెట్టింది. దీని వెనక బ్రాహ్మాణీయ హిందూ మతోన్మాదులు చేసే కుట్ర దాగివుంది. ఈ విధంగా దేశంలో బ్రాహ్మణీయ హిందూ ఫాసిజం అత్యంత ప్రమాదకరంగా మారుతున్నది.

రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రంలోని బి.జె.పి ప్రభుత్వంతో కలిసి తెలంగాణ ప్రజల ఆకాంక్షలైన నీళ్ళు, నిధులు, నియామకాలను, పౌరహక్కులను కాలరాస్తూ ʹసమాధాన్" వ్యూహంలో భాగంగా బూటకపు ఎన్కౌంటర్లకు పాల్పడుతున్నాడు. నేడు దేశంలో, రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతున్నది. ఈ బూటకపు ఎన్ కౌంటర్లను, దాడులను ఖండిస్తూ ప్రజలు, ప్రజాస్వామిక వాదులు మిలిటెంట్ గా, సమరశీలంగా పోరాడాలని పిలుపునిస్తున్నాం,

విప్లవాభినందనాలతో,
అధికార ప్రతినిధి,
జగన్,
సీపీఐ (మావోయిస్టు)

Keywords : maoists, fake encounters, linganna, veraswamy, kottagudem, rollagadda
(2020-05-31 22:08:51)No. of visitors : 1620

Suggested Posts


శృతిని అత్యాచారం చేసి, హింసలు పెట్టి చంపారు - వరవరరావు

వరంగల్ జిల్లాలో మంగళవారంనాడు ఎన్ కౌంటర్ జరిగినట్టు పోలీసులు చెబుతున్నది అబద్దమని శృతిని విద్యాసాగర్ లను పోలీసులు పట్టుకొని చిత్రహింసలు పెట్టి చంపారని విప్లవ రచయిత వరవరరావు ఆరోపించారు....

అది ఎన్‌కౌంట‌ర్ కాదు - అత్యాచారం చేసి చంపేశారు : నిజ‌నిర్థార‌ణ బృందం

హిడ్మే ఒంటిపై దుస్తులను తొల‌గించి... సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు. శరీర భాగాల‌న్నింటినీ క‌త్తుల‌తో కోశారు. ఆ త‌రువాత చాతీపై, క‌డుపులో తూటాల వ‌ర్షం కురిపించారు. మృత‌దేహాన్ని సుక్మా ప‌ట్ట‌ణానికి త‌ర‌లించారు. 14వ తేది విష‌యం తెలుసుకున్న గ్రామ‌స్తులు....

రాజ్యం పెంచి పోషించిన ప్రజా హంతకుడు నయీం - మావోయిస్టు పార్టీ

హంతక ప్రభుత్వాల పోలీసు యంత్రాంగం ఎస్ఐబి డైరెక్షన్లో ఎంతో మంది ప్రజలను, పౌరహక్కుల నేతలను, ఉద్యమకారులను కిరాతకంగా చంపిన ప్రజా హంతకుడు నయీం చావు వార్త పీడిత ప్రజలకు పండుగ వంటిదే కాకుంటే తనను పెంచి, పోషించి ఎన్నో చీకటి హత్యలకు ఆయుధంగా వాడుకున్న దోపిడీ పాలక వర్గం చేతిలో కన్నా ప్రజల చేతిలో నయినాం ఖతం అయితే ప్రజలు ఎక్కువగా సంతోషపడేవాళ్ళు...

శ్రుతి పాడిన పాట దోపిడి గుండెల్లో తూట !

శ్రుతి.... చిన్నప్పటినుండే విప్లవ భావాలతో పెరిగింది. సమాజాన్ని నిశితంగా గమనిస్తూ, సమాజాన్ని చదువుతూ పెరిగింది. వేదికలెక్కి సమాజాన్ని చైతన్య పరిచే పాటలు పాడింది. ఎమ్ టెక్ చదివిన శ్రుతి తన తండ్రి సుదర్శన్ చెప్పినట్టు అమెరికాకు కాకుండా అడవిలోకి....

చీప్ లిక్కర్ తో గ్రామజ్యోతిని వెలిగిస్తారా - మావోయిస్టు జగన్ ప్రశ్న

ప్రభుత్వం హరితహారం లో మొక్కలు నాటడం కోసం ఆదివాసులను భూముల్లోంచి వెళ్ళగొడతోందని జగన్ మండి పడ్డారు. ఒక వైపు ప్రజలను చీప్ లిక్కర్ లో ముంచి తేల్చే కుట్రలు చేస్తూ మరో వైపు గ్రామ జ్యోతి కార్యక్రమాన్ని మొదలు పెట్టడం పై జగన్ మండి పడ్డారు. చీప్ లిక్కర్ తో గ్రామ జ్యోతిని వెలిగిస్తారా

ఫేస్ బుక్ మిత్రుడి ఎన్ కౌంటర్ !

సార్ మీరు నాకు తెలుసు... మీరు నాఫేస్ బుక్ ఫ్రెండ్ సార్..... దండకారణ్యంలో భుజానికి తుపాకీ వేసుకొని తీక్షణంగా పరిసరాలను పరీక్షిస్తూనే మరో చేత్తో వంట చేస్తున్న.. ప్రతిక్షణం యుద్దం మధ్యలో జీవిస్తున్న ఓ మావోయిస్టు గెరిల్లా ఆమాట అనడంతో నేను షాక్ తిన్నాను.....

నక్సల్బరీ రాజకీయాలను ఎత్తి పట్టండి - ‍మావోయిస్టు పార్టీ నేత గణపతి పిలుపు

నేడు దేశంలో బ్రాహ్మణవాద శక్తులు ప్రభుత్వాన్ని పాలిస్తున్న నేపథ్యంలో దేశంలో అసహన పరిస్థితులు నెలకొన్నాయని, వాటికి వ్యతిరేకంగా మేథావులను, కార్మిక, శ్రామిక, ప్రజాస్వామ్య వర్గాలను, దళితులను, మైనారిటీ మతాలను, విద్యార్థులను సంఘటితం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని గణపతి చెప్పారు.....

ఈ విప్లవ యోధుడి అమరత్వానికి 21 యేండ్లు !

అది 1996 జూన్ 23 ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల దగ్గర నస్పూర్ కాలానిలో ఓ ఇల్లు.... ఆ ఇంటిని 500 మంది పోలీసులు చుట్టుముట్టారు. ఎలాంటి హెచ్చరికలు లేవు... లొంగి పొమ్మన్న మాటలు లేవు. ఏక పక్షంగా తూటాల వర్షం కురిపించిడం....

జనతన రాజ్యంలో నక్సల్బరీ వేడుకలు... 80 వేల మందితో సభ‌ (వీడియో)

మావోయిస్టు పార్టీ ద‌క్షిణ బ‌స్త‌ర్ డివిజ‌న్ క‌మిటీ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన న‌క్స‌ల్బ‌రీ వేడుక‌లు ప్ర‌పంచానికి ఇప్ప‌డు కొత్త ఆశనిస్తున్నాయి. ఒక్క‌రిద్ద‌రు కాదు.. దాదాపు 80 వేల మంది ఆదివాసీలు. సుశిక్షితులైన ప్ర‌జా విముక్తి గెరిల్లాలతో క‌లిసి క‌దంతొక్కారు.

ఈ నెల 26 న తెలంగాణ బంద్ కు మావోయిస్టు పార్టీ పిలుపు

గొల్లగూడెం ఎన్ కౌంటర్ కు నిరసనగా ఈ నెల 26 న తెలంగాణ బంద్ ను జయప్రదం చేయాలని సీపీఐ మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ పిలుపునిచ్చారు. మహారాష్ట్రా గడ్చిరోలి జిల్లా, వెంకటాపురం పోలీస్ స్టేషన్ పరిధి గొల్లగూడెం అడవుల్లో...

Search Engine

వీవీ,సాయిబాబాలతో సహా రాజకీయ ఖైదీల విడుదలకై వారం రోజుల కార్యక్రమాలు -నిర్బంధ వ్యతిరేక వేదిక పిలుపు
మానవత్వానికే మచ్చ తెచ్చిన ఆ దుర్మార్గుడితో కలిసి ఉండలేను... విడాకులు ఇప్పించండి
నోరు మూసుకో....ట్రంప్ కు పోలీసు చీఫ్ హెచ్చరిక‌
తెలంగాణకోసం పోరాడిన వారు జైళ్ళలో మగ్గుతున్నరు
వరవరరావు బెయిల్ పిటిషన్ మళ్ళీ వాయిదా !
వరవరరావు విడుదల కోసం ʹమాహాʹ సీఎంకు మాజీ కేంద్ర సమాచార కమీషనర్ల‌ లేఖ
వీవీ,సాయిబాబాల‌ జీవించే హక్కును కాపాడండి...పౌరహక్కుల సంఘం
కేసీఆర్ కు తెలంగాణ, ఏపీకి చెందిన 27 మంది ప్రముఖ రచయితల విజ్ఞప్తి
వీవీ, సాయిబాబాలను వెంటనే విడుదల చేయాలి -సామాజిక తెలంగాణ మహాసభ
వరవరరావును వెంటనే విడుదల చేయాలి - సీపీఐ (ఎంఎల్) జనశక్తి డిమాండ్
వరవరరావు ఆరోగ్యంపై ఆయన సహచరి హేమలత ప్రకటన‌
వీవీ, సాయిబాబాలతో సహా రాజకీయ ఖైదీలందరినీ విడుదల చేయాలంటూ దేశవ్యాప్త ప్రదర్శనలు
సామాజిక కార్యకర్తల‌ జీవించే హక్కును కాలరాస్తున్న‌ పాలకుల విధానాలపై రేపు(మే29) నిరసన
మంథని లో లాకప్ డెత్...పౌరహక్కుల సంఘం నిజ నిర్దారణ... విచారణకు ఆదేశించిన హైకోర్టు
దయనీయస్థితిలో జి.ఎన్.సాయిబాబా ఆరోగ్య పరిస్థితి- సహచరి వసంతకుమారి ఆందోళన
వరవరరావును విడుదల చేయాలి -జర్నలిస్టు,హక్కుల,ప్రజా సంఘాల డిమాండ్
వరవరరావు విడుదలకు తెలంగాణ ప్రభుత్వం చొరవ చేయాలి..వివిధ పార్టీల డిమాండ్
మా నాన్నను వెంటనే విడుదల చేయండి..వరవరరావు కూతుర్ల లేఖ‌
వీవీ, ఇతర సామాజిక‌ కార్యకర్తలున్న తలోజా జైలుతో సహా మూడు జైళ్ళలో కరోనాతో ముగ్గురు ఖైదీల మృతి !
తలోజా జైల్లో వ్యాపించిన కరోనా...అనారోగ్యంతో ఉన్నవీవీని తక్షణం విడుదల చేయాలని విరసం డిమాండ్
పింజ్రా తోడ్ కార్యకర్తలకు బెయిల్...కొద్ది నిమిషాల్లోనే మళ్ళీ అరెస్టు
రాజ్యాంగాన్ని, ప్రజల స్వేచ్ఛ, హక్కులను కాపాడడాన్ని సుప్రీం కోర్టు మానుకుంది...మార్కండేయ్ ఖట్జు
నక్సల్బరీ ప్రాసంగికత ‍- వరవరరావు (2)
నక్సల్బరీ ప్రాసంగికత ‍- వరవరరావు (1)
ఇది నక్సల్బరీ ప్రజ్వరిల్లినరోజు....అడవిలో ప్రవేశించాలనే ఆశయం నెరవేరిన రోజు...
more..


లింగన్న‌,