కారు – పువ్వు కొట్లాట నిజంగనేనా, ఉల్లెక్కాలనా?


కారు – పువ్వు కొట్లాట నిజంగనేనా, ఉల్లెక్కాలనా?

కారు

బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు ఒకరిని ఒకరు విమర్శించుకుంటు.. పైకి శత్రువుల్లా కనిపిస్తున్నరు కానీ అది ఉత్తుత్తి శత్రుత్వమే అని విశ్లేషిస్తున్నారు వీక్షణం ఎడిటర్, సీనియర్ జర్నలిస్ట్ ఎన్. వేణుగోపాల్. వీక్షణం పత్రిక కోసం రాసిన సంపాదకీయాన్ని తన ఫేస్‌బుక్ వాల్‌పై పంచుకున్నరు. అది యధాతథంగా ఇక్కడ చదవవచ్చు.

-----------------------------------------------------------------------------------

అబ్బబ్బబ్బ, ఏం వార్తలు, ఏం వార్తలు. పెద్దదొర ఢిల్లి సర్కారు మీద యుద్ధం జేస్తనన్నడటగద. ఢిల్లి సర్కారును చెడ తిడ్తాండట గద. సర్కారంటే సర్కారు గాదనుకో, పువ్వు పార్టీని మస్తు తిడ్తాండట గద. ఇగ చిన్నదొరయితె ఇంకొక ఆకు ఎక్కువ జదివినట్టు. పువ్వు గుర్తోల్లకు ప్రజాస్వామ్యం అంటేందో సుద్దులు గుడ జెప్పిండట గద. అబ్బ, ఏం కాలమొచ్చెను నాయనా. ఎంత మంచి మాట ఇంటి. నిజంగ తెలంగాణ నెత్తురు ఉడికిపోయిందనుకో.

ఎప్పటి నుంచి ఢిల్లిని సవాల్ జేస్తాంది తెలంగాణ. ప్రతాపరుద్రుడు ఢిల్లి మీద మర్లబడె, కొట్లాడె, ఒప్పుకున్న పైకం గుడ ఎగ్గొట్టె. ఆఖరికి ఢిల్లి వోడొచ్చి పట్టుకపోతాంటె చస్తెమానాయె గాని ఢిల్లివోని బందినైతనా అని నదిల దునికి సచ్చిపాయె. ఆ తర్వాత మన సర్వాయి పాపన్న ఢిల్లి మీద కొట్లాడె. అటెన్క మన అసఫ్జాహి రాజులు ఢిల్లి బిషాదెంత అని రాజ్జెమే నిలబెట్టిరి. మన తుర్రెబాజ్ ఖాన్ ఢిల్లి మీదనే గాదు, ఢిల్లిల్నో, కలకత్తాల్నో కూసున్న తెల్లోని మీద గుడ కొట్లాడె.

కొసాఖరికి ఎన్టిరామారావు గుడ ఢిల్లిదెంత లెక్క, అది పొగసువంటిది అనె. మనం జైతెలంగాణల ఢిల్లి మీద కొట్లాడితిమి. మల్ల ఇరవై ఏండ్లు కొట్లాడ్తిమి. పడుసు పడుసు పోరగాండ్లు ఢిల్లిని ఎదిరించి పానాలిచ్చిరి, ఢిల్లి మెడలు ఒంచి తెలంగాణ దెచ్చిరి. ఇంత కతున్నది గద మనకూ ఢిల్లికి మజ్జెన.

మరిప్పుడు పువ్వు గుర్తోల్ల మీద, ఢిల్లి సర్కారు మీద పెద్దదొర, చిన్నదొర ఒంటికాలి మీద లేస్తాండ్రంటే నాకు శాన సంబురమాయె. అబ్బ ఇన్నాళ్లకు గదరా, తెలంగాణ అయిష్యత్ జూపెడ్తాండ్రు అనిపిచ్చె. కాని గాలి దీశిండ్రు గద. ఇదంత ఉల్లెక్కాలనేనట గద. నువ్వు కొట్టినట్టు జెయ్యి, నేను ఏడ్శినట్టు జేత్త అని కత జెప్పినట్టు ఇద్దరు పదులుకున్నరట గద.

అయినా, నా పిచ్చి గని, పువ్వు గుర్తు ముక్కెమంత్రులు గుడ ఎన్నడు జెయ్యనటువంటి యాగాలు గీగాలు అన్ని పెద్దదొర జేత్తనే ఉండె. నన్నుమించిన హిందువున్నడా అని బస్తీ మె సవాల్ ఇసిరెనే ఇసిరె. నివ్వద్దె. నాగపూర్ అయ్యగార్లనడుగాలె, మా దొర వాండ్ల కన్న రెండాకులు ఎక్కువే జదివిండని కచ్చితంగ జెప్తరు. ఎహె, నాగపూర్ దాక ఎందుకు, ఢిల్లిల పువ్వు సర్కారును మాత్రం దొర ఏమన్న జేశిండా? బల్లపీట మీదెక్కి తిట్టె, బల్లపీట దిగంగనె అలాయిబలాయి ఇచ్చుకునె.

ఎన్ని ముచ్చట్లు లెవ్వు? పెద్దనోట్లు ఖతం జేసినప్పుడు దేశమంత తిడ్తాంటె పువ్వు గుర్తు సర్కారును మెచ్చుకున్నది మన దొరే గాదా? గదేందో జీఎస్టో బీఎస్టో బెట్టి దేశాన్ని పజీత జేసినప్పుడు అందరికన్న ముందు దాన్ని ఒప్పుకున్న మారాజు మన దొరేనాయె. గవన్ని పాత ముచ్చట్లనుకో,

నిన్న మొన్న ఈడ బీరాలు పల్కుకుంటనే, ఆడ ఢిల్లిల మన దొర జేసిన పనులేంటియి? సమాచార హక్కో గదేందో నాకు నోరు దిరగది గని, దాని మీద పువ్వు గుర్తోల్ల పనులను తిట్టి తిట్టి, ఆఖరికి ఆ పనులకే ఓటేసిండు గద. కశ్మీర్ మీద ఓటెసె, అన్నలను బట్టుకునె ఖానూను మీద ఓటేసె, రాష్ట్రాల సర్కార్ల తోకలు కోస్తాన, అన్ని అతికారాలు నాకే అని పువ్వు గుర్తోల్లు అంటె గుడ ఓటేసె. ఇగ ఢిల్లి మీద కొట్లాట ఏడిది బాంచెన్. అదంత ఉల్లెక్కాల.

కార్ల పువ్వు. లేకపోతె పూల కారు. అసలు సంగతి జెప్పాల్నా. కాంగ్రెసోల్లను, తెలుగుదేశపోల్లను, కమ్మినిస్టులను, ఆమాటకొస్తే మాట్లాడిన ప్రతి ఒక్కణ్ని ఖాళీ జేసి, మైదాన్ సాఫ్ జేసి, పువ్వులు బరిచి, పువ్వు గుర్తోనికి హారతి బట్టి తాంబాళంల తెలంగాణను బెట్టి సదివిచ్చింది పెద్ద దొర గాదా, ఇద్దరికి ఎంత సోపతో తెలుస్తలేదా?

- ఎన్. వేణుగోపాల్, ఎడిటర్, వీక్షణం.

(ఇది వీక్షణం సెప్టెంబర్ మాసం సంపాదకీయం)

Keywords : TRS, BJP, KCR, KTR, Telangana, Modi, Amit Shah
(2020-06-01 18:40:45)No. of visitors : 567

Suggested Posts


0 results

Search Engine

వీవీ,సాయిబాబాలతో సహా రాజకీయ ఖైదీల విడుదలకై వారం రోజుల కార్యక్రమాలు -నిర్బంధ వ్యతిరేక వేదిక పిలుపు
మానవత్వానికే మచ్చ తెచ్చిన ఆ దుర్మార్గుడితో కలిసి ఉండలేను... విడాకులు ఇప్పించండి
నోరు మూసుకో....ట్రంప్ కు పోలీసు చీఫ్ హెచ్చరిక‌
తెలంగాణకోసం పోరాడిన వారు జైళ్ళలో మగ్గుతున్నరు
వరవరరావు బెయిల్ పిటిషన్ మళ్ళీ వాయిదా !
వరవరరావు విడుదల కోసం ʹమాహాʹ సీఎంకు మాజీ కేంద్ర సమాచార కమీషనర్ల‌ లేఖ
వీవీ,సాయిబాబాల‌ జీవించే హక్కును కాపాడండి...పౌరహక్కుల సంఘం
కేసీఆర్ కు తెలంగాణ, ఏపీకి చెందిన 27 మంది ప్రముఖ రచయితల విజ్ఞప్తి
వీవీ, సాయిబాబాలను వెంటనే విడుదల చేయాలి -సామాజిక తెలంగాణ మహాసభ
వరవరరావును వెంటనే విడుదల చేయాలి - సీపీఐ (ఎంఎల్) జనశక్తి డిమాండ్
వరవరరావు ఆరోగ్యంపై ఆయన సహచరి హేమలత ప్రకటన‌
వీవీ, సాయిబాబాలతో సహా రాజకీయ ఖైదీలందరినీ విడుదల చేయాలంటూ దేశవ్యాప్త ప్రదర్శనలు
సామాజిక కార్యకర్తల‌ జీవించే హక్కును కాలరాస్తున్న‌ పాలకుల విధానాలపై రేపు(మే29) నిరసన
మంథని లో లాకప్ డెత్...పౌరహక్కుల సంఘం నిజ నిర్దారణ... విచారణకు ఆదేశించిన హైకోర్టు
దయనీయస్థితిలో జి.ఎన్.సాయిబాబా ఆరోగ్య పరిస్థితి- సహచరి వసంతకుమారి ఆందోళన
వరవరరావును విడుదల చేయాలి -జర్నలిస్టు,హక్కుల,ప్రజా సంఘాల డిమాండ్
వరవరరావు విడుదలకు తెలంగాణ ప్రభుత్వం చొరవ చేయాలి..వివిధ పార్టీల డిమాండ్
మా నాన్నను వెంటనే విడుదల చేయండి..వరవరరావు కూతుర్ల లేఖ‌
వీవీ, ఇతర సామాజిక‌ కార్యకర్తలున్న తలోజా జైలుతో సహా మూడు జైళ్ళలో కరోనాతో ముగ్గురు ఖైదీల మృతి !
తలోజా జైల్లో వ్యాపించిన కరోనా...అనారోగ్యంతో ఉన్నవీవీని తక్షణం విడుదల చేయాలని విరసం డిమాండ్
పింజ్రా తోడ్ కార్యకర్తలకు బెయిల్...కొద్ది నిమిషాల్లోనే మళ్ళీ అరెస్టు
రాజ్యాంగాన్ని, ప్రజల స్వేచ్ఛ, హక్కులను కాపాడడాన్ని సుప్రీం కోర్టు మానుకుంది...మార్కండేయ్ ఖట్జు
నక్సల్బరీ ప్రాసంగికత ‍- వరవరరావు (2)
నక్సల్బరీ ప్రాసంగికత ‍- వరవరరావు (1)
ఇది నక్సల్బరీ ప్రజ్వరిల్లినరోజు....అడవిలో ప్రవేశించాలనే ఆశయం నెరవేరిన రోజు...
more..


కారు