కుల రహిత - మత రహిత అస్తిత్వం కోసం


కుల రహిత - మత రహిత అస్తిత్వం కోసం

కుల

ʹనిను వీడని నీడను నేనేʹ అని ఆత్రేయ ఒక పాట రాశారు ... ఎక్కడకు వెళ్లినా వెంటాడేది నీడ మాత్రమే కాబట్టి నిన్ను నీడలా వెంటాడుతా అని అర్థం..

ʹమతంʹ కూడా నీడ లాంటిదేనెమో.. పుట్టుక మొదలు చావు వరకూ మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. అయితే నీడ పడాలంటే కాంతి తప్పనిసరి అనే ఒక సైన్స్ సూత్రం ఉంది కాబట్టి చీకట్లో నీడ నుండి తప్పించుకోవచ్చు. కానీ మతం నుండి తప్పించుకోవడం చాలా కష్టం..ఇలా తప్పించుకోకుండా ఉండేందుకే ఆధిపత్య వర్గాలు మనువాద భావాజాలంతో కుట్రలు చేశాయి . కులమతాలు లేని లక్షల సంవత్సరాల మానవ జీవపరిణామ క్రమాన్ని మతం, కులం అనే బోనులో పకడ్బందీగా బందీ చేశాయి .

మతం చెప్పడానికి నిరాకరిస్తున్నవారు మన దేశంలో లక్షల్లోనే ఉన్నారని ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి. మాకు ఏ మతము వద్దు అని అనేకమంది దశాబ్దాలుగా ప్రభుత్వంతో పోరాటం చేస్తున్నారు. 1957 - 58లలో స్వాతంత్ర సమరయోధులు , ప్రముఖ నాస్తికులు గోరా దంపతులు తమ పిల్లల ( సమరం, విజయం) విషయంలో మతరహితులు గా ప్రకటించుకునే అవకాశం ఇవ్వాలని కోరగా , అప్పటి అసెంబ్లీ సమావేశాలలో ఈ విషయం చర్చకు వచ్చింది. వీరే కాదు , అనేకమంది దశాబ్దాలుగా ఇటువంటి అస్తిత్వ ప్రకటనకు వీలుగా అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. వ్యక్తిగత స్థాయిలో అనేకమంది ఇటువంటి ఆకాంక్షను వ్యక్తం చేస్తూనే ఉన్నారు. కొన్ని సందర్భాలలో వ్యక్తిగత పరిష్కారం చూపడం, లేక తమకు తోచింది నింపడం, దాటవేయడం అనే పధ్ధతి కొనసాగుతోంది.. కానీ విధాన పరమైన నిర్ణయం తీసుకోవడం లేదు.అయితే ఈ పోరాటం ఈనాటిది కాదు.. మతం తో పాటు మతాన్ని వ్యతిరేకించే లోకాయతులు, చార్వాకులు , బౌద్ధులు ఆయాకాలాల లో ఉన్నారు.. వారి వారసత్వం కొనసాగుతూనే ఉంది .

మతం పేరిట జరిగిన మారణహోమంలో కోట్లాది మంది చనిపోయారు . మానవ శిరసుల్ని కోట గుమ్మాలకు కట్టారు. ఒక ఆధిపత్య మతం వారు ఇంకొక మతం పై జరిపిన ఊచకోతల్లో ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది చనిపోయారు .ఒక్క మన దేశంలోనే మతం పేరిట గత 70 ఏండ్లలో కోటిమంది వరకు హత్యకు గురయ్యారని గణాంకాలు చెబుతున్నాయి.

ఇక కులం సంగతి కూడా అంతే, నిత్యం ఏదో ఒక ఊర్లో, ఎక్కడో ఒక చోట ఈ కులం కారణంగా అవమానాలకు,దాడులకు, హత్యలకు, హత్యాచారాలకు గురవుతూనే ఉన్నారు.. దళితులన్న కారణంతో ప్రతి నాలుగు నిమిషాలకు ఒక దాడి, ప్రతి ఇరవై నిమిషాలకు ఒక హత్య, ప్రతి రోజు రెండు హత్యాచారాలకు గురవుతున్నారు. మన సమాజ ఉత్పత్తి వ్యవస్థ అనేక మార్పులకు గురి అవుతున్నా నిచ్చెనమెట్ల కులవ్యవస్తలో ఒక కులానికి చెందినవారు మరొక కులం వారిని హీనపరిచే సంస్కృతి కొనసాగుతూనే ఉంది. దీనికి వ్యతిరేకంగా ఎన్ని పోరాటాలు చేసినా, ఎన్ని చట్టాలు చేసినా పెద్దగా మార్పేమీ లేదు. మతం పరిధులు దాటి మనుషులు గా ఆలోచించాల్సిన సందర్భంలో మనమంతా జీవిస్తున్నాం.. " ఏది శాశ్వతం కాదు ఒక్క మార్పు తప్ప " అని ఒక పెద్దమనిషి అన్నట్లు మానవాళి తమ మూలాల ఎరుకలోకి ప్రయాణిస్తుందని నమ్ముతున్నాం.. కొత్త తరం అలా రూపొందడానికి మన వంతుగా ప్రయత్నిద్దాం.. అలాంటి ప్రయత్నం లో " కుల రహిత మత రహిత అస్తిత్వ" ప్రకటన కూడా దోహద పడుతుందని నమ్ముతున్నాం .. ఈ ప్రయత్నం లో మేము మొదటి వాళ్ళం కాదు.. మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ ఈ దేశంలో కులనిర్మూలన జరగనిదే అభివృద్ధి సాధ్యం కాదన్నారు.. మహాత్మా జ్యోతిబాఫ్యూలే, సావిత్రీబాయి ఫూలే , పెరియార్ సహా అనేకమంది మహనీయులు సామాజిక వివక్షలకు వ్యతిరేకంగా పోరాడారు.. మన తెలుగు నేలపై పోతులూరి వీరబ్రహ్మం, వేమన, భాగ్యరెడ్డి వర్మ, జాషువా ఇంకా అనేకమంది గొప్ప తాత్వికతతో సామాజిక వివక్షలను నిలదీశారు.. గురజాడ అప్పారావు "మతములన్నియు మాసి పోవును జ్ఞానమొక్కటే నిలిచి వెలుగును " అని భవిష్యత్ పై ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

ఈ మధ్యనే తమిళనాడుకు చెందిన స్నేహ పార్తిబరాజా అనే న్యాయవాది సుదీర్ఘ పోరాటం తర్వాత ʹ మత రహితం కుల రహితం " (No Religion, No caste) సర్టిఫికెట్ పొందిన మొదటి వ్యక్తిగా వార్తల్లో నిలిచింది. మనిషిని కులంతోనో, మతంతోనో మాత్రమే గుర్తించే ఈ దేశంలో.. తనకు కుల, మత గుర్తింపులే అక్కర లేదని తొమ్మిదేళ్లు కొట్లాడి, ప్రభుత్వ అనుమతి సాధించడం సామాన్య విషయం కాదు. అందుకే ʹఇది ఒక సామాజిక విప్లవంగా మారుతుందన్న భయంతో తనకు సర్టిఫికేట్‌ ఇచ్చేందుకు అధికారులు ఇంత ఆలస్యం చేశారుʹ అని అన్నారు స్నేహ.

మన రాష్ట్రానికి వస్తే మా పిల్లల విషయంలోనూ మేము కూడా కుల రహితంగా , మత రహితంగా పిల్లలను పెంచాలని భావించాం .. అయితే మా ( డి.వి.రామకృష్ణ రావు , ఎస్ క్లారెన్స్ కృపాళిని ) పిల్లలను స్కూల్లో చేర్పించే సందర్భంలో దరఖాస్తులో మతం కాలాన్ని నింపనందుకు స్కూల్ యాజమాన్యం అభ్యంతరం చెప్పడంతో కుల రహితం మాట రహితం ( No Religion, No caste) చెప్పుకునే హక్కు ఉండాలని కోర్టు మెట్లు ఎక్కామ్ . ఆ సందర్భం లో కోర్టు " మతం నమ్మడానికి హక్కు ఉందంటే , ఏ నమ్మకం లేకుండా ఉండడానికీ హక్కు ఉన్నట్లే " అని .. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అయితే దాన్ని చట్టం రూపంలోకి తీసుకురాలేదు. తరవాత పెద్దమ్మాయి ఇంటర్మీడియేట్ ఆన్ లైన్ అప్లికేషన్ లోనూ మతం కాలమ్ తప్పనిసరిగా నింపాల్సిన పరిస్థితిలో ఇక ఇలా కుదరదని మార్చ్ ,2017 న హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశామ్ .. ఇంకా తీర్పు వెలువడాల్సి ఉంది..

అలాగే 2019 మార్చి 23న, భగత్ సింగ్ అతని సహచరుల వర్ధంతి నాడు డేవిడ్, రూప దంపతులకు పుట్టిన . బాబు ʹఇవాన్ రూడేʹ బర్త్ సర్టిఫికెట్ కోసం స్థానిక మున్సిపాలిటీ ఆఫీసుకు (వనపర్తి జిల్లా కొత్తకోట) వెళితే ఏ మతానికి చెందిన వాల్లో ʹమతంʹ అనే కాలం నింపితే తప్ప సర్టిఫికెట్ ఇవ్వడం కుదరదని ఖరాఖండిగా చెప్పేసారు..పుట్టుక మొదలూ చావు వరకూ అన్నీ సర్టిఫికెట్లను ఆన్లైన్లో తీసుకోవాల్సిన నేటి పరిస్థితులలో ʹమతంʹ అనే కాలం నింపితే తప్ప బర్త్ సర్టిఫికేట్ రావడంలేదు. మీరు కోరిన ప్రకారం సర్టిఫికెట్ ఇవ్వడం కుదరదని తేల్చిచెబుతున్నారు.

ఆ క్రమం లో మేము కూడా ప్రజా ప్రయోజన వ్యాజ్యం హైకోర్టులో దాఖలు చేశాం .. మా ప్రజా ప్రయోజన వ్యాజ్యాల పనంతా న్యాయవాది, పౌరహక్కుల నాయకుడు డి. సురేశ్ కుమార్ చూస్తున్నారు.

అయితే మన దేశంలో శతాబ్ధాలుగా వంచనకు గురై, అణగదొక్కబడ్డ ఎంతోమంది జీవితాలలో రిజర్వేషన్లు కొద్దిపాటి ఉపశమనంగా ఉన్నాయి. వారి అభివృద్ధికి ఎంతోకొంత దోహదపడుతున్నాయి. ఇవి పోరాడి సాధించుకున్న హక్కులు అనే విషయం మా అవగాహనలో ఉంది . రిజర్వేషన్లు తీసుకునే హక్కు ఎలా అయితే ఉందో.. మత , కుల వ్యవస్థలనుంచి బయటకు రావాలాకునేవారికి ఆ హక్కు ఉండాలని మేము కోరుతున్నాం.. ఈ నేపథ్యం లోనే మత రహితం - కుల రహితం (No Religion - No caste) అనే అస్తిత్వాన్ని గుర్తించాలని ప్రభుత్వంతో పోరాటం చేస్తున్నాం . మా ప్రజాస్వామిక ఆకాంక్షకు మీ అందరి మద్దతు ఉంటుందని ఆశిస్తున్నాం..

ఆ క్రమంలో 3 సెప్టెంబర్ ,2019 మంగళవారం న హైదరాబాద్ లోని బాలింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రం షోయబుల్లా ఖాన్ హాల్ లో సాయంత్రం 6 నుంచి రాత్రి 9 గంటలవరకు కుల రహిత మత రహిత సర్టిఫికెట్ పొందిన మొదటి భారతీయురాలు తమిళనాడు కు చెందిన స్నేహా పార్తిబరాజా ( ఎం .ఎ. స్నేహ ) గారితో సంభాషణ ఏర్పాటు చేశాం .. అందరికీ ఇదే మా ఆహ్వానం ..

డి.వి.రామకృష్ణారావు , ఎస్. క్లారెన్స్ కృపాళిని , డేవిడ్ , రూప

Keywords : no caste, no religion, sneha, david,
(2019-09-19 08:22:31)No. of visitors : 286

Suggested Posts


మహాశ్వేతా దేవి - మన తెలంగాణ సాగర హారంః వరవర రావు

మన మహా సాగరహారం ʹచలో హైదరాబాద్ అంటూ తెలంగాణ మార్చ్ చేసిన సెప్టెంబర్ 30, 2012 మహత్తర మధ్యాహ్నం మహాశ్వేతాదేవి కూడా మన ఊర్లో ఉన్నారు. ఆ రోజు ఆమెను మన మధ్యకు తెచ్చుకొని ఉంటే....

సెప్టెంబర్ 17 - ఇండియన్ యూనియన్ సైనిక దురాక్రమణ దినం - వరవరరావు

1947 ఆగస్ట్ 15న విలీనానికి అంగీకరించకుండా షరతులు విధిస్తూ వచ్చిన నిజాంను నెహ్రూ - పటేల్ ప్రభుత్వం సగౌరవంగా, సాదరంగా చర్చలకు ఆహ్వానించింది. అప్పటికే నిజాంను వ్యతిరేకిస్తూ వీరోచిత పోరాటం నడుపుతున్న కమ్యూనిస్టులను మాత్రమే కాదు, కనీసం కాంగ్రెస్ ను కూడా ఈ చర్చల్లో భాగం చేయలేదు....

ʹఅరుణోదయʹ పై పోలీసుల దాడిని ఖండించిన విరసం

తెలంగాణ ఉద్యమంలో ఆట పాటతో ఆరుణోదయ కళాకారులు గ్రామ గ్రామాన తిరిగి ప్రజల్లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తమ వంతు కృషి చేశారు. ఆ సంస్థ కార్యాలయాన్ని దౌర్జన్యంగా మూసేయడం అత్యంత నిరంకుశమైన......

ఆదివాసి.. లంబాడా వివాదం ‍- ఎం.రత్నమాల

మహారాష్ట్ర ప్రభుత్వం లంబాడాలను ఆదివాసి తెగగా గుర్తించడం లేదు కనుక ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం లంబాడాలను ఆదివాసి షెడ్యూల్డు తెగగా ప్రకటించడంతో దీన్ని అవకాశంగా తీసుకుని మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్‌ (పాత) జిల్లాకు లంబాడాల వలసలు పెద్ద ఎత్తున వెల్లువలా సాగాయి.....

ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ పోరాటానికి విరసం మద్దతు

అట్టడుగున ఉన్న మనిషికి ఫలితాలు అందినప్పుడే సామాజిక న్యాయం జరిగినట్టు లెక్క. మాదిగ, డక్కలి, చిందు, మాష్టి, బుడగజంగం, దాసరి, బేగరి కులాలకు ఈ నాటికీ ఎస్సీ రిజర్వేషన్ ఫలాలు అందడం లేదు....

ఆ నిండైన సాహిత్య సామాజిక జీవితం రచయితలందరికీ ఆదర్శం - విరసం

ʹరచయితలందరూ తమ తరానికి జవాబుదారులు; తమకు తాము జవాబు చెప్పుకోవాల్సిన వాళ్ళు... అంతస్సాక్షి ఉన్న రచయిత పీడిత ప్రజల పక్షాన దృఢంగా నిలవాలి. అలా కాకపోతే ఆ రచయితల్ని నిర్దోషులుగా నిర్ణయించే ప్రశ్నే లేదు.ʹ....

ఉత్తేజకరంగా సాగిన విరసం సాహిత్యపాఠశాల‌

అంతకుముందు అంతర్జాతీయ శ్రామికవర్గ పతాకావిష్కరణతో కార్యక్రమాలను ప్రారం భించారు. అమరుడు పులి అంజన్న తల్లి సైదమ్మ ఎర్ర జెండాను, సీనియర్ విరసం సభ్యురాలు రత్నమాల విప్లవ రచయితల సంఘం జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా అమరుడు శేషయ్య సోదరుడు సాంబయ్య, అమరుడు వివేక్ తండ్రి యోగానంద్ అమరుల స్థూపాన్ని ఆవిష్క రించారు.

ʹఆయన జైల్లోనే చనిపోతారేమోʹ

90 శాతం అంగవైకల్యం కలిగిన సాయిబాబాను అన్యాయంగా జైల్లో పెట్టారని.. ఆయనేమైనా యుద్ద ఖైదీనా..? ప్రభుత్వ అనాలోచిత చర్యతో యుద్ధఖైదీ మాదిరి ఆయన జైల్లోనే తుది శ్వాస విడిచే పరిస్ధితి వచ్చిందని ...

అమరుడు బొజ్జా తారకం — ʹనది పుట్టిన గొంతుకʹ - వరవరరావు

గోదావరి తెలంగాణలో ప్రవేశించిన నిజామాబాద్ కు 1968లో వచ్చిన తారకం గారు ఇక్కడి మట్టిలోని ఎరుపులోనూ, ఇక్కడి నీళ్లలోని ప్రవాహ గుణంలోనూ కలగలిసిపోయారు. 1968 నుంచి 78 దాకా ఒక దశాబ్దం పాటు విప్లవోద్యమాలకు, విప్లవ సాహిత్యానికి నిజామాబాద్ చిరునామా బొజ్ఞాతారకం....

చలసాని స్మృతిలో... - కే.కుమార్ వర్మ

బొడ్డపాడు నడిబొడ్డులో అమరవీరులను స్మరిస్తూ ఎర్ర జెండా చేతబట్టి తామాడ గణపతి ఇంటిముందునుండి దండుగా కదులుతున్నట్లుంది...

Search Engine

తెలుగులో ఇలాంటి సినిమాలు తీయలేరా..?
పోరాడితే పోయేదేమీ లేదు...పోరాడి హక్కులు సాధించుకున్న విద్యార్థినులు
భీం ఆర్మీ ఛీఫ్ ఆజాద్ ను వెంటనే విడుదల చేయాలి... మేధావులు, లాయర్లు, విద్యార్థుల డిమాండ్
పులివెందుల నుండి నల్లమలదాకా...వరలక్ష్మి
ఆర్థిక మాంద్యం అంటే ఏమిటి ? ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కోవడం ఎలా ? - ఎన్.వేణుగోపాల్
కశ్మీర్ లో ఎవ్వరికి లేని ʹనెట్ʹ సేవలు బీజేపీ వాళ్ళకు ఎలా వచ్చాయి ?
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
Savenallamala: యురేనియం తవ్వకూడదన్నవాళ్ళంతా అర్బన్ నక్సలైట్లేనా ?
కశ్మీర్ ప్రజల పోరాటానికి మద్దతుగా నిబడదాం...మావోయిస్టు పార్టీ పిలుపు
భూ గురత్వాకర్షణ శక్తిని కనుగొన్నది ఐనిస్టీనా... న్యూటన్ కాదా ?
Maoist leader Murali recounts his own jail experience to cite rampant rights violation
ప్రభుత్వాన్ని,న్యాయవ్యవస్థను,ఆర్మీని విమర్శించడం దేశద్రోహం కాదు ... సుప్రీం కోర్టు జడ్జ్
దేవరకొండలో యురేనియం సర్వే కోసం వచ్చిన వారిని తరిమిన ప్రజాసంఘాలు
చెప్పులేసుకొని బైక్ నడిపినా.. లుంగీ కట్టి లారీ నడిపినా భారీ జరిమానాలు..!
యురేనియంపై నల్లమల బంద్.. కదం తొక్కిన జనం... నాయకుల అరెస్ట్, ఉద్రిక్తత‌
నల్లమల ప్రజలకు మద్దతుగా నిలబడదాం, యురేనియం తవ్వకాలను అడ్డుకుందాం ... మావోయిస్టు పార్టీ ప్రకటన‌
జేఎన్యూ పై మళ్ళీ ఎర్రజెండా రెపరెపలు... విద్యార్థి సంఘం ఎన్నికల్లో లెఫ్ట్ ఘనవిజయం
దేవుడు లేడని చెప్పే హక్కు రాజ్యాంగం కల్పించింది...మద్రాస్ హైకోర్టు
దేశ పరిస్థితులపై ఆందోళన...మరో ఐఏఎస్ రాజీనామా
జేఎన్యూ విద్యార్థి నాయకురాలు షెహ్లా రషీద్ పై రాజద్రోహం కేసు
యుద్ధం - శాంతి.
యురేనియం దెబ్బకు జీవాలు గడ్డి తినడంలే.. బురుగులు కక్కి సస్తున్నాయి..!
కశ్మీర్ లో 80 మందికి పెల్లెట్ గాయాలు, బాలుడు మృతి... జాతీయ వార్తాసంస్థల వెల్లడి
ఆమె పోరాటమే.. తమిళనాడు ప్రభుత్వాన్ని కదిలించింది..!
స్కూలు పిల్లలకు భోజనంలోకి కూరకు బదులు ఉప్పు...బైట పెట్టిన జర్నలిస్టుపై కేసు
more..


కుల