స్కూలు పిల్లలకు భోజనంలోకి కూరకు బదులు ఉప్పు...బైట పెట్టిన జర్నలిస్టుపై కేసు


స్కూలు పిల్లలకు భోజనంలోకి కూరకు బదులు ఉప్పు...బైట పెట్టిన జర్నలిస్టుపై కేసు

స్కూలు

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని మీర్జాపూర్‌ జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు మధ్యాహ్న భోజనంలో రొట్టె ముక్కలో ఉప్పు నంచుకొని తిన‌డాన్ని వీడియో తీసి ప్రపంచానికి తెలిపిన జర్నలిస్టు పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని అపఖ్యాతిపాలు చేయాలని జర్నలిస్ట్ పవన్ జైస్వాల్ కుట్రపన్నారని అధికారులు ఆరోపించారు.
ఆగస్టు 22 వతేదీన మీర్జాపూర్‌ జిల్లాలోని షియుర్ ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థులు కూరకు బదులుగా ఉప్పు నంజుకుంటూ చపాతీలు తింటున్న ఘటనను ʹజనసంఘర్ష్‌ టైమ్స్ʹ అనే హిందీ పత్రికలో రిపోర్టర్ గా పని చేస్తున్న పవన్ జైస్వాల్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది వైరల్ అవడంతో స్పందించిన మీర్జాపూర్‌ జిల్లా మేజిస్ట్రేట్‌ దార్యాప్తు జరిపి ఆ పాఠశాల అధికారులను సస్పెండ్‌ చేశారు. సమగ్ర దర్యాప్తు జరిపిస్తామని యోగీ ఆదిత్యనాథ్‌ నేతత్వంలోని బీజేపీ ప్రభుత్వం హామీ ఇచ్చింది.

అయితే గత ఆదివారం నాడు పోలీసులు జర్నలిస్ట్‌ పవన్‌ జైస్వాల్, పాఠశాల ఉన్న సియూర్‌ గ్రామ పెద్ద ప్రతినిధి అయిన రాజ్‌కుమార్‌ పాల్‌తోపాటు ఓ గుర్తుతెలియని వ్యక్తిని కూడా ఇందులో నిందితులుగా చేర్చారు.. ʹʹఈ ఘటనపై కలెక్టర్ ఆధ్వర్యంలో దర్యాప్తు జరిగిన అనంతరం ముగ్గురిపై కేసు నమోదు చేశాం. అందులో జర్నలిస్టు పవన్ జైస్వాల్ ఒకరుʹʹ అని మీర్జాపూర్ ఎస్పీ అవదేశ్ కుమార్ పాండే తెలిపారు.

అధికారులు తమను తాము రక్షించుకోవడానికి తనపై కేసులు నమోదు చేశారని జర్నలిస్టు పవన్ అంటున్నారు. ఆ పాఠశాలలో భోజనం సరిగ్గా ఉండటం లేదని గతంలో అనేక సార్లు గ్రామస్తులు తనతో చెప్పారని ఆగస్టు 22 నకూడా ఓ గ్రామస్తుడు తనకు ఫోన్ చేయడంతో మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో తాను ఆ పాఠశాలకు వెళ్ళానని పవన్ చెప్పారు. తాను వెళ్ళే సరికి పిల్లలు ఉప్పు నంచుకొని రొట్టెలు తింటున్నారని దాన్నే వీడియో తీసానని ఆయన తెలిపారు. వీడియో చూసి అధికారులు మంచిగానే స్పంధించారని వెంటనే చర్యలు కూడా తీసుకున్నారని చెప్పిన పవన్ ప్రభుత్వం విచారణకు ఆదేశించగానే ప్లేటు ఫిరాయించి నా మీదే కేసులు పెట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇప్పుడు నిజం బైట పెట్టినందుకు జర్నలిస్టు పవన్ పైనా అతనికి సహకరించినందుకు మరో ఇద్దరిపైనా ఐపీసీలోని సెక్షన్ 120బీ( నేరపూరిత కుట్ర), 420 (మోసం), 193 కింద కేసు నమోదు చేశారు.

కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న ఈ మధ్యాహ్న భోజన పథకంలో రోటి, సోయాబీన్, ఇతర కూరగాయలు, లేదా రోటి, దాల్‌ లేదా పలావును తప్పనిసరిగా సర్వ్‌ చేయాలంటూ యూపీ ప్రభుత్వం అధికారులకు మార్గదర్శకాలను సూచించింది. ప్రతి రోజు 450 గ్రాముల క్యాలరీలు, 12 గ్రాముల ప్రొటీన్లు విధిగా ఉండాలని కూడా నిర్దేశించింది. అందులో ఏ ఒక్కటి లేకపోవడానికి కారణమేంటి ? తప్పెవరిది ?

పిల్లలకు రొట్టెతోపాటు ఉప్పు ఇచ్చిన పాఠశాల ఉద్యోగులదీ తప్పు కాదు.. వాళ్ళకు ఆహార వస్తువులు సప్లై చేయని అధికారులదీ తప్పు కాదు... ఇంత జరుగుతున్నా పట్టించుకోని ప్రభుత్వ పెద్దలదీ తప్పు కాదు.... తప్పెవరిదంటే ఈ అవినీతిని, పిల్లల పొట్టకొట్టే దుర్మార్గాన్ని బైట పెట్టిన జర్నలిస్టుది అతనికి సహకరించిన వాళ్ళది తప్పు. ఇదే నేటి పాలకుల ధర్మం

Keywords : Uttarapradesh, journalist, pawan jaiswal, school children,
(2020-06-01 07:54:07)No. of visitors : 924

Suggested Posts


అది రామరాజ్యం... ఆవులకేమో అంబులెన్సులు... పిల్లల‌కేమో చావుకేకలు !

ఆవులకు ఏమైనా అయితే రక్షించడానికి, వాటిని ఆఘమేఘాలమీద ఆస్పత్రికి తరలించడానికి అంబులెన్స్ లు ప్రారంభించారు. ఇంత గొప్పగా జరుగుతున్న యోగీ మహరాజ్ పాలనలో గోరఖ్ పూర్ లోని ప్రభుత్వ ఆస్పత్రిలోఆక్సీజన్ లేక‌ 63మంది చిన్నారుల‌ ప్రాణాలు పోయాయి. ప్రభుత్వం బాకీ పడ్డ 60 లక్షల రూపాయలు ....

అది మనువాదపు కసాయి రాజ్యం ‍‍- ప్రేమంటే నరనరాన ద్వేషం

ఓ యుతి, ఓ యువకుడు జంటగా రోడ్డు మీద వెళ్తున్నారు. నవ్వుతూ తుళ్ళుతూ కబుర్లు చెప్పుకుంటూ వెళ్తున్న వాళ్ళను చూసి యాంటీ రోమియో స్క్వాడ్ ముసుగేసుకున్న మనువులకు మండింది. సంఘ్ పరివార్ పాలనలో మగ ఆడ కలిసి తిరగడ ఎంత పాపం ! ఆ పాపానికి ఒడిగట్టిన ఆ ఇద్దరినీ పట్టుకొని కొట్టారు, పోలీసులతో కలిసి యువకుడికి గుండు గీసి అవమానించారు....

అనుకున్నంతయ్యింది...బీజేపీ నేత కూతురును పెళ్ళి చేసుకున్న దళిత యువకుడిపై దాడి జరిగింది

నాన్నా నన్నూ అజిత్ ను చంపకండి ప్లీజ్ అంటూ ఉత్తర ప్రదేశ్ ఎమ్మెల్యే కూతురు సాక్షి మిశ్రా వేడుకున్న వీడియో మీకు గుర్తుంది కదా.... తాను దళితుడిని పెండ్లి చేసుకున్నందుకు మమ్మ‌ల్ని చంపడానికి నాన్న గూండాలను పంపుతున్నాడని, పోలీసులు తమకు రక్షణ కల్పించాలని ఆమె విఙప్తి చేసింది. అయితే ఆ యువతి అనుకున్నంతా అయ్యింది. సాక్షాత్తూ హైకోర్టు ముందరే వీరిపై దాడి

యోగీ రాజ్యం: ఆవును కాపాడటం కోసం మహిళను చంపేసిన పోలీసు

అది ఉత్తర ప్రదేశ్ లోని హర్రియా పట్టణం శనివారం నాడు వేగంగా వెళ్తున్న ఓ పోలీసు జీబు డ్రైవర్ కంట్రోల్ తప్పింది. ఆ జీబుకు ఎదురుగా ఓ ఆవు వస్తోంది. డ్రైవర్ కు ఆ సమయంలో తమ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యానాథ్, ఆయన శిష్యులైన గోరక్షకులు....

రోహింగ్యాల పట్ల సానుభూతి చూపిన ప్రియాంకా చోప్రా దేశం విడిచి వెళ్ళిపోవాల్సిందే ‍- బీజేపీ నేత

రోహింగ్యా శరణార్థులను సందర్శించిన సినీ నటి ప్రియాంకా చోప్రా దేశం విడిచి వెళ్ళాలంటూ బీజేపీ నేత వినయ్ కటియార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రోహింగ్యా శరణార్థులను సందర్శించడానికి వెళ్లిన వారెవరైనా దేశం విడిచి వెళ్ళిపోవాల్సిందేనంటూ ఆయన అన్నారు.

అమానుషంగా అమ్మాయిలను కొట్టారు...వాళ్ళ మీదే కేసులు పెట్టారు...బేటీ బచావ్...బేటీ పడావ్..అంటే ఇదేనా ?

విద్యార్థినులపై దాడి చేసి నెత్తురోడేట్టు అమానుషంగా కొట్టిన పోలీసులపై చర్యలు తీసుకోవల్సింది పోయి బాధితులపైనే కేసులు పెట్టారు. ఉత్తర ప్రదేశ్ లోని బెనారస్ హిందూ యూనివర్సిటీకి చెందిన 1000 మంది విద్యార్థులపై ఇవ్వాళ్ళ కేసు నమోదయ్యింది....

యోగీ రాజ్యంలో దారుణం... ఆక్సిజన్ లేక 30 మంది చిన్నారుల మృతి !

ఆక్సిజన్‌ సరఫరా చేస్తున్న కంపెనీకి ప్రభుత్వం కట్టాల్సిన 66లక్షల రూపాయల బాకీ కట్టకపోవడం వల్ల ఆ కంపెనీ ఆక్సిజన్‌ పంపిణీని ఆపేసింది. ఫలితంగా ఇంతమంది చిన్నారుల ప్రాణాలు గాల్లో పోయాయి....

పోలీసుల దుర్మార్గం...బాలిక గ్యాంగ్ రేప్ !

రక్షక భటులు ఓ బాలికను కాటేశారు. కిడ్నాప్ చేసి దారుణంగా రేప్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని మథుర గోవింద్‌నగర్లో పదవతరగతి చదువుతున్న ఓ బాలికను ఇన్స్‌పెక్టర్ రమాకాంత్ పాండే, మరో పోలీస్ ప్రవీణ్ ఉపాధ్యాయ్‌లు....

ముస్లిం మహిళలను గ్యాంగ్ రేప్‌ చేయండి.. బీజేపీ మహిళా మోర్చా చీఫ్ సునీత

ఇప్పుడు ముస్లింలకు ఒకే ఒక్క పరిష్కారం ఉంది. హిందూ సోదరులు పది మంది కలిసి గ్రూపుగా ఏర్పడి ముస్లిం మహిళలను గ్యాంగ్ రేప్ చేయాలి. తల్లులు, చెల్లెళ్లు ఎవరినీ వదలకూడదు. అందరినీ బహిరంగంగా వీధుల్లోకి లాక్కొచ్చిమరీ అత్యాచారం చేయాలి.

అది విషాదంకాదు నరమేధం... 63 కు చేరిన చిన్నారుల మరణాలు

యోగీ ఆదిత్యానాథ్ రాజ్యంలో చిన్నారుల నరమేధం కొనసాగుతోంది. ప్రభుత్వం నిర్లక్ష్యం 63 మంది చిన్నారులను బలితీసుకుంది. గోరఖ్ పూర్ లోని బాబా రాఘవ్‌దాస్‌ ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆక్సిజన్ లేక నిన్న 31 మంది చిన్నారుఅ ఊపిరి ఆగిపోగా ఇవ్వాళ్ళ ఆ సంఖ్య 63 కు...

Search Engine

వీవీ,సాయిబాబాలతో సహా రాజకీయ ఖైదీల విడుదలకై వారం రోజుల కార్యక్రమాలు -నిర్బంధ వ్యతిరేక వేదిక పిలుపు
మానవత్వానికే మచ్చ తెచ్చిన ఆ దుర్మార్గుడితో కలిసి ఉండలేను... విడాకులు ఇప్పించండి
నోరు మూసుకో....ట్రంప్ కు పోలీసు చీఫ్ హెచ్చరిక‌
తెలంగాణకోసం పోరాడిన వారు జైళ్ళలో మగ్గుతున్నరు
వరవరరావు బెయిల్ పిటిషన్ మళ్ళీ వాయిదా !
వరవరరావు విడుదల కోసం ʹమాహాʹ సీఎంకు మాజీ కేంద్ర సమాచార కమీషనర్ల‌ లేఖ
వీవీ,సాయిబాబాల‌ జీవించే హక్కును కాపాడండి...పౌరహక్కుల సంఘం
కేసీఆర్ కు తెలంగాణ, ఏపీకి చెందిన 27 మంది ప్రముఖ రచయితల విజ్ఞప్తి
వీవీ, సాయిబాబాలను వెంటనే విడుదల చేయాలి -సామాజిక తెలంగాణ మహాసభ
వరవరరావును వెంటనే విడుదల చేయాలి - సీపీఐ (ఎంఎల్) జనశక్తి డిమాండ్
వరవరరావు ఆరోగ్యంపై ఆయన సహచరి హేమలత ప్రకటన‌
వీవీ, సాయిబాబాలతో సహా రాజకీయ ఖైదీలందరినీ విడుదల చేయాలంటూ దేశవ్యాప్త ప్రదర్శనలు
సామాజిక కార్యకర్తల‌ జీవించే హక్కును కాలరాస్తున్న‌ పాలకుల విధానాలపై రేపు(మే29) నిరసన
మంథని లో లాకప్ డెత్...పౌరహక్కుల సంఘం నిజ నిర్దారణ... విచారణకు ఆదేశించిన హైకోర్టు
దయనీయస్థితిలో జి.ఎన్.సాయిబాబా ఆరోగ్య పరిస్థితి- సహచరి వసంతకుమారి ఆందోళన
వరవరరావును విడుదల చేయాలి -జర్నలిస్టు,హక్కుల,ప్రజా సంఘాల డిమాండ్
వరవరరావు విడుదలకు తెలంగాణ ప్రభుత్వం చొరవ చేయాలి..వివిధ పార్టీల డిమాండ్
మా నాన్నను వెంటనే విడుదల చేయండి..వరవరరావు కూతుర్ల లేఖ‌
వీవీ, ఇతర సామాజిక‌ కార్యకర్తలున్న తలోజా జైలుతో సహా మూడు జైళ్ళలో కరోనాతో ముగ్గురు ఖైదీల మృతి !
తలోజా జైల్లో వ్యాపించిన కరోనా...అనారోగ్యంతో ఉన్నవీవీని తక్షణం విడుదల చేయాలని విరసం డిమాండ్
పింజ్రా తోడ్ కార్యకర్తలకు బెయిల్...కొద్ది నిమిషాల్లోనే మళ్ళీ అరెస్టు
రాజ్యాంగాన్ని, ప్రజల స్వేచ్ఛ, హక్కులను కాపాడడాన్ని సుప్రీం కోర్టు మానుకుంది...మార్కండేయ్ ఖట్జు
నక్సల్బరీ ప్రాసంగికత ‍- వరవరరావు (2)
నక్సల్బరీ ప్రాసంగికత ‍- వరవరరావు (1)
ఇది నక్సల్బరీ ప్రజ్వరిల్లినరోజు....అడవిలో ప్రవేశించాలనే ఆశయం నెరవేరిన రోజు...
more..


స్కూలు