ఆమె పోరాటమే.. తమిళనాడు ప్రభుత్వాన్ని కదిలించింది..!


ఆమె పోరాటమే.. తమిళనాడు ప్రభుత్వాన్ని కదిలించింది..!

ఆమె

ఆమె తొమ్మిదేండ్లు పోరాడింది తనకు కులం లేదు మతం లేదు అని ధృవీకరణ ఇవ్వమని..

ఆమె తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచే ఇదే భావజాలంతో పెంచినా.. తనకు రాజ్యంగం ప్రకారం దక్కాల్సిన ధృవీకరణను ఆమె కోరుకుంది.

అందుకోసం ఎన్నో ఏండ్లు ఒక సామాన్యురాలిగా పోరాటం చేసింది.

స్వతహాగా ఒక లాయర్ అయినా.. తను మాత్రం నిజమైన పోరాటం చేసి #NoCasteNoReligion సర్టిఫికేట్ సాధించి.. తొలి భారతీయ వ్యక్తిగా చరిత్రలో నిలిచింది.

ఇవాళ హైదరాబాద్‌కు వచ్చిన ఆమె కొన్ని విషయాలు ʹఅవని న్యూస్ʹతో పంచుకున్నారు. అది మీ కోసం..

అవని : స్నేహ.. మీ కుటుంబ నేపథ్యం ఏంటి..?

స్నేహ : నేను తమిళనాడులోని తిరుపత్తూర్ జిల్లాలో పుట్టా.. ఇది తమిళనాడులో మొన్న అగస్టు 15 నుంచే ఏర్పడిన కొత్త జిల్లా అంతకు ముందు మాది వేలూరు జిల్లా. మా అమ్మ పేరు మణిమొళి.. నాన్న పేరు ఆనంద కృష్ణన్.. వీళ్లిద్దర కమ్యూనిస్టు భావజాలంతో ఉన్న వాళ్లే. వాళ్లిద్దరూ నాస్తికులు, కమ్యూనిస్టులు.. కులం, మతంపై వారికి నమ్మకం లేదు. కేవలం ఇద్దరి మధ్య ప్రేమ ఉండటం వల్ల అలా కలసి ఉన్నారు.

అవని: మరి మీకు స్నేహ అనే హిందూ పేరు ఎలా పెట్టారు..?

స్నేహ : ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. మా నాన్న కమ్యూనిస్టు.. కాని ఎందుకో నాకు స్నేహ అని పేరు పెట్టారు. నన్ను ఒక మిషనరీ స్కూల్లో జాయిన్ చేశారు. జాయినింగ్ టైంలో మాకు కులం, మతం లేదని ఆ మిషనరీ స్కూల్లోని సిస్టర్.. మరి మీ కూతురికి ఎందుకు హిందూ పేరు పెట్టారు అని అడిగింది. దానికి మా నాన్న.. రెండో కూతురు పుడితే ముస్లిం పేరు పెడతాలే అని రిప్లై ఇచ్చారు. అలాగే మా చెల్లికి ముంతాజ్ సూర్య అని పేరు పెట్టారు

అవని : మరి ఇంకొకరు పుడితే ఏం చెప్పే వారు అని మా నాన్నను అడిగారు..?

స్నేహ : అదే చెప్తున్నా.. మా నాన్న మూడో కూతురికి జెన్నిఫర్ అని పేరు పెట్టారు..!

అవని : సరే స్నేహ.. మీరు.. కుల రహిత మత రహిత ధృవీకరణ పత్రం తీసుకోవడానికి ఎవరు స్పూర్తి..?

స్నేహ : నాకు స్పూర్తి మా అమ్మానాన్నలే.. నేను వాళ్లు నేర్పించిన పద్దతిలోనే నడిచా.. అందులో వాళ్లు తమిళనాడు మార్కిస్ట్స్ లెనినిస్ట్ పార్టలో కీలక సభ్యులు.. మాకు చిన్నతనం నుంచే నేర్పించారు. అలాగే పెరిగాం. కాకపోతే మా తల్లిదండ్రుల సమయంలో ఈ సర్టిఫికేట్ తీసుకోలేక పోయారు నేను తీసుకున్నాను అంతే.

అవని : మీరు చేస్తున్న ఉద్యమం వల్ల ఒక మైనస్ కూడా ఉంది. అది తెలుసా..?

స్నేహ : చెప్పండి..!

అవని : మీరు నో క్యాస్ట్ నో రిలీజియన్ అంటున్నారు.. దాని వల్ల అణగారిన వర్గాలు రిజర్వేషన్లు కోల్పోతాయి కదా..?

స్నేహ : మిత్రులారా.. క్యాస్ట్ వేరూ.. రిలీజియన్ వేరు.. ! నేను నో క్యాస్ట్ నో రిలీజియన్ అని నినదిస్తున్నాను.. అంటే నేను మతాన్ని వ్యతిరేకిస్తున్నానే కాని.. అదే సమయంలో నా సహచరులు రిజర్వేషన్లు పొందాలని అనుకుంటున్నా. నాకు కులం వద్దు మతం వద్దు... అదే సమయంలో అణగారిన వర్గాలు తప్పకుండా ఎదగాలి.. వారి రిజర్వేషన్లు వారికి రాజ్యంగం అందించిన హక్కు వాళ్లు పొందాలనే నేను కోరుకుంటున్నాను.

కొన్ని ఏండ్లుగా దళితులకు సామాజిక న్యాయం జరగలేదు.. అందుకే వారితో నేను ఉన్నాను. వారికి నేను ఎప్పుడూ తోడుగా ఉంటాను.

అవని : స్నేహ, మరి మీ పిల్లలకు ఎందుకు వేరే మతాల పేర్లు పెట్టారు.?

స్నేహ : ఒక్క విషయం ఇక్కడ చెప్పాలి. నేను మీడియానో.. బంధువులనో.. స్నేహితులనో చూసుకొని ఈ పేరు పెట్టలేదు.. కేవలం నేను ʹNRNCʹ అనే నినాదానికి టార్చ్‌బేరర్ గా ఉన్నా కాబట్టే నా నుంచే మొదలవ్వాలని అనుకున్నా. అందుకే నా ముగ్గురు కూతుర్లకు మైనార్టీ మతాల పేర్లు పెట్టాను.

అవని : ఒక మతం ఈ దేశంలో మెజార్టీగా ఉంది.. మరి మీ మతం,కులం రహితంగా ఎలా చేయగలరు..!

స్నేహ : ఇవ్వాళే చేయాలని నేను అనుకోలేదు. నన్ను పెంచిన అమ్మానాన్న అనుకోలేదు. కాని ఎక్కడో ఒక దగ్గర మొదలవ్వాలి కదా..! అదే నేను కోరుకునేది.

అవని : ఇంకా మీరేం చెప్పాలని అనుకుంటున్నారు..!

స్నేహ : ఏమీ లేదు.. తెలంగాణ ఉద్యమం గురించి చదువుకున్నా.. కాని ఇవ్వాళ చూస్తున్నా.. ఇక్కడ స్పూర్తి ఎక్కువ.
.
.
.

ʹ

ఎంఏ స్నేహ తొమ్మిదేండ్లుగా సాగించిన పోరాటం వల్ల తనకు కులం, మతం రహిత ధృవీకరణ పత్రం రావడమే కాదు.. ఏకంగా తమిళనాడు స్కూల్స్, కాలేజీల టీసీలలో ఆ ప్రస్తావనే లేకుండా చేసింది.

Keywords : స్నేహ, కులం,మతం, పార్థీబరాజా, Sneha, MA Sneha
(2019-09-18 21:31:16)No. of visitors : 1584

Suggested Posts


0 results

Search Engine

తెలుగులో ఇలాంటి సినిమాలు తీయలేరా..?
పోరాడితే పోయేదేమీ లేదు...పోరాడి హక్కులు సాధించుకున్న విద్యార్థినులు
భీం ఆర్మీ ఛీఫ్ ఆజాద్ ను వెంటనే విడుదల చేయాలి... మేధావులు, లాయర్లు, విద్యార్థుల డిమాండ్
పులివెందుల నుండి నల్లమలదాకా...వరలక్ష్మి
ఆర్థిక మాంద్యం అంటే ఏమిటి ? ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కోవడం ఎలా ? - ఎన్.వేణుగోపాల్
కశ్మీర్ లో ఎవ్వరికి లేని ʹనెట్ʹ సేవలు బీజేపీ వాళ్ళకు ఎలా వచ్చాయి ?
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
Savenallamala: యురేనియం తవ్వకూడదన్నవాళ్ళంతా అర్బన్ నక్సలైట్లేనా ?
కశ్మీర్ ప్రజల పోరాటానికి మద్దతుగా నిబడదాం...మావోయిస్టు పార్టీ పిలుపు
భూ గురత్వాకర్షణ శక్తిని కనుగొన్నది ఐనిస్టీనా... న్యూటన్ కాదా ?
Maoist leader Murali recounts his own jail experience to cite rampant rights violation
ప్రభుత్వాన్ని,న్యాయవ్యవస్థను,ఆర్మీని విమర్శించడం దేశద్రోహం కాదు ... సుప్రీం కోర్టు జడ్జ్
దేవరకొండలో యురేనియం సర్వే కోసం వచ్చిన వారిని తరిమిన ప్రజాసంఘాలు
చెప్పులేసుకొని బైక్ నడిపినా.. లుంగీ కట్టి లారీ నడిపినా భారీ జరిమానాలు..!
యురేనియంపై నల్లమల బంద్.. కదం తొక్కిన జనం... నాయకుల అరెస్ట్, ఉద్రిక్తత‌
నల్లమల ప్రజలకు మద్దతుగా నిలబడదాం, యురేనియం తవ్వకాలను అడ్డుకుందాం ... మావోయిస్టు పార్టీ ప్రకటన‌
జేఎన్యూ పై మళ్ళీ ఎర్రజెండా రెపరెపలు... విద్యార్థి సంఘం ఎన్నికల్లో లెఫ్ట్ ఘనవిజయం
దేవుడు లేడని చెప్పే హక్కు రాజ్యాంగం కల్పించింది...మద్రాస్ హైకోర్టు
దేశ పరిస్థితులపై ఆందోళన...మరో ఐఏఎస్ రాజీనామా
జేఎన్యూ విద్యార్థి నాయకురాలు షెహ్లా రషీద్ పై రాజద్రోహం కేసు
యుద్ధం - శాంతి.
యురేనియం దెబ్బకు జీవాలు గడ్డి తినడంలే.. బురుగులు కక్కి సస్తున్నాయి..!
కశ్మీర్ లో 80 మందికి పెల్లెట్ గాయాలు, బాలుడు మృతి... జాతీయ వార్తాసంస్థల వెల్లడి
స్కూలు పిల్లలకు భోజనంలోకి కూరకు బదులు ఉప్పు...బైట పెట్టిన జర్నలిస్టుపై కేసు
పేదోళ్లుగా పుట్టడమే కాదు.. చావడం కూడా నేరమే..!
more..


ఆమె