యురేనియం దెబ్బకు జీవాలు గడ్డి తినడంలే.. బురుగులు కక్కి సస్తున్నాయి..!


యురేనియం దెబ్బకు జీవాలు గడ్డి తినడంలే.. బురుగులు కక్కి సస్తున్నాయి..!

యురేనియం

ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశం అయ్యింది యురేనియం తవ్వకాల గురించే. తెలంగాణలోని నల్లమల ప్రాంతంలో యురేనియం నిక్షేపాలు ఉన్నాయని.. వాటిని వెలికితీయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే వాటి వల్ల సంభవించే నష్టాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకోవాలంటే కడప జిల్లా వాసుల కష్టాలు తెలుసుకోవాలి. కడప జిల్లాలో యురేనియం తవ్వకాల వల్ల వల్ల వచ్చిన నష్టాలు, ప్రమాదాల గురించి వరలక్ష్మి తన ఫేస్‌బుక్‌పై ఒక పోస్టు పెట్టారు. అది యధాతథంగా...
----------------------------------

"మా జీవాలు (గొర్రెలు, మేకలు) గడ్డి తినడం మానేసినాయి. గుట్టెక్కుతాంటే గసపోసుకోబట్టె. నోట్లోనుంచి సొంగ కార్చుకునె. బురుగులు (నురగలు) కక్కుకోని అట్టనే పడి సచ్చిపాయె.." కనంపల్లెలో ఉండేదంతా సుగాలీలే. గుట్టల వాలుగా ఊరు. ఆ గుట్టల్లోకి గోర్లు తోలుకొనిపోయి మేపుకుంటారు. గొప్పగా బతికేవాళ్ళు కాదుగానీ, ఏదో బతుకుతెరువుకింత ఉండేది. కొంత మందికి భూములు కూడా ఉన్నాయి. యురేనియం తవ్వకాలు మొదలై వ్యర్థాలు ఏ నియంత్రణ లేకుండా అక్కడ పారబోయడం మొదలైయ్యాక ఊరికి ʹచేతబడిʹ చేసినట్లయ్యింది. ఇప్పుడా భూముల్లో పంటలు పండవు. వందలకొద్దీ జీవాలు చచ్చిపోతే గుట్టుచప్పుడు కాకుండా UCIL వాళ్ళు తలా ఇంత డబ్బిచ్చి విషయం బైటికి పొక్కకుండా చూసుకున్నారు.

యురేనియం తవ్వకాల కోసం ఆ ఊర్లో భూములు తీసుకుంటారని తెలిసినప్పుడు 2006లో మొదటిసారి ఆ గ్రామం వెళ్లాం. అట్లా గ్రామాలు తిరిగడం అప్పుడు నాకు కొత్త. బాలగోపాల్ గారు గ్రామస్తులతో మాట్లాడిన మాటలు మాకు బాగా గుర్తు. ఈ పక్కనే యురేనియం వ్యర్థాలు నిలువ చేసే చెరువు వస్తుంది. అందరికన్నా ఎక్కువ ʹకొట్టాలʹ (ఇప్పుడు టెయిలింగ్ పాండ్ ఉండే ఊరు) వాళ్ళు, మీరు నష్టపోతారు అన్నారాయన. ఇప్పుడు కొట్టాల గ్రామంలో ఎవరిని పలకరించినా అంతుచిక్కని రోగాల గురించి చెప్తారు. ఒళ్ళంతా దురదలు, మంటలు పుట్టి చర్మం రంగు మారడం, చిట్లిపోవడం, దద్దుర్లు, పొక్కులు రావడం అక్కడ మామూలు. వీటికి తోడు కాళ్ళు, చేతులు ఒకటే నొప్పులు.

భూమయ్యగారి పల్లె రైతులు యురేనియం మైనింగ్ ప్లాంటును తీవ్రంగా వ్యతిరేకించారు. పోలీసు కేసులయ్యి జైలుకెళ్ళారు. చివరికి వైఎస్ కుటుంబం ముందు ఓడిపోయారు. ఊరు కాస్త తగ్గులో ఉంది. బోరు వ్యవసాయం. ఎక్కడ చూసినా అరటి తోటలు కనిపిస్తాయి. ఇది రాయలసీమలా లేదు అన్నారు అప్పట్లో మాతో పాటు ఆ ఊర్లు చూడ్డానికి వచ్చినవాళ్ళు. ఇప్పుడక్కడ 1200 అడుగులు బోరు వేస్తె కానీ నీళ్ళు పడవు. పడినా కొన్ని నెలల లోపలే నీళ్ళు పడిపోతాయి. రైతులు కదా, పంట మీద ఆశ చావక మళ్ళీ బోరు వేస్తారు. ఇట్లా ఊరంతా చెట్లు మొలిచినట్లు బోర్లు వెలిసాయి. ఒక్కో రైతు పది పన్నెండు బోర్లు వేసాడు. ఇట్లా ఇంకెన్ని రోజులు వేయగాలరో, ఎంత ధార మిగిలి ఉందో గానీ ఆ నీళ్ళు చూస్తే భయమేసింది. బాత్రూం వెళితే ఏదో హారర్ సినిమాలాగా బకెట్ లో ఎర్రగా నీళ్ళు. ఒక్కోసారి జిడ్డుగా వస్తాయట. నీళ్ళు నిలువ చేసిన పాత్రల్లో సుద్దలాగా తెల్లని పొడి పేరుకుపోతుంది. ఈ నీళ్ళతో స్నానం చేస్తున్నందుకే ఒళ్ళంతా దురదలు, పుండ్లు. ఈ ఊర్లో చిన్న పిల్లలకు కూడా ఒళ్ళు నొప్పులే అని చేత్తో నాలుగడుగుల ఎత్తు చూపించి "ఇదో ఇంత పిల్లోల్లు కూడా నొప్పులు అంటాండారు" అని చెప్పారు. గిడ్డంగివారిపల్లెలో ఈ లక్షణాలు ఇటీవలే మొదలయ్యాయి. సుమారు యాభై ఏళ్ళ వయసున్న ఒక రైతు "ఈ ఊర్లో ఇంగ మాదే చివరి తరం" అన్నాడు. ఆ పక్కనే ఉన్న బక్కన్నగారి పల్లెలోనూ ఇదే కథ.

పులివెందుల పులుల బారినపడ్డ మేకలు. ఎవరు కాపాడాలి వీళ్ళని? ఆరేళ్ళ తర్వాత ఆ పల్లెలకు వెళితే ఒకరిద్దరు గుర్తుపట్టి "బాగుండావ్ మ్మా" అని పలకరిస్తే.. నిజం చెప్పొద్దూ...ఏడుపొచ్చింది. పదేళ్ళ క్రితం యురేనియం ఉద్యమం ఇక ఓడిపోయింది అని తెలిసొస్తున్నప్పుడు వాళ్ళన్న మాటలు జీవితంలో మర్చిపోలేను. "యురేనియం ఎప్పుడో సంపుతాది. కాదంటే రాశ్శేకర్రెడ్డోల్లు ఇప్పుడే సంపుతారు." అప్పుడే ఒకవ్వ బకాసురుని కథ చెప్పింది. చెప్పి "బండి అన్నం పంపమంటే పంపుతాము. రోజుకొక మనిషిని యాడ పంపేది" అంది. ఇప్పుడింత జరిగి సర్వ నాశనం అయ్యేటప్పుడు కూడా తలెత్తని ఆవేశాలను చూస్తే ʹఇదిరా నాయనా రాయలసీమ... బానిస బతుకుల పౌరుష గడ్డʹ అనాలనిపిస్తుంది. రాయలసీమంటే, పులివెందులంటే ఏమో అనుకునేరు..! నలభై ఏళ్ళుగా ఒక్క కుటుంబం అన్ని ఊర్ల జనాన్ని తన కాళ్ళ కింద పెట్టుకుందంటే ఇది కదా వెనకబాటుతనం. ఇది కదా అసలు దౌర్భాగ్యం!

అసలు విషయం. గురువారం ఉదయం 11 గంటలకు కడప జిల్లా యురేనియం బాధిత ప్రజలు విజయవాడ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఆఫీసుకు తమ బాధలు చెప్పుకోనీకి వస్తున్నారు. అందుబాటులో ఉన్న ప్రజాసంఘాల మిత్రులు వాళ్లకు మద్దతుగా అక్కడే ఆఫీసు ముందు నిరసనలో పాల్గొనాల్సిందిగా మనవి. ఇది ముందుగా అనుకున్నది కాదు కాబట్టి, ముందస్తు సమాచారం ఇవ్వలేకపోయాం.

- వరలక్ష్మీ విరసం

ఫేస్‌బుక్ లింక్ : https://www.facebook.com/varalakshmi.puduru/posts/2479304978797891

Keywords : Kadapa, Uranium, Excavation, Nallamala, Telangana, AP, India, BARC, NFC
(2019-09-19 08:46:17)No. of visitors : 490

Suggested Posts


0 results

Search Engine

తెలుగులో ఇలాంటి సినిమాలు తీయలేరా..?
పోరాడితే పోయేదేమీ లేదు...పోరాడి హక్కులు సాధించుకున్న విద్యార్థినులు
భీం ఆర్మీ ఛీఫ్ ఆజాద్ ను వెంటనే విడుదల చేయాలి... మేధావులు, లాయర్లు, విద్యార్థుల డిమాండ్
పులివెందుల నుండి నల్లమలదాకా...వరలక్ష్మి
ఆర్థిక మాంద్యం అంటే ఏమిటి ? ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కోవడం ఎలా ? - ఎన్.వేణుగోపాల్
కశ్మీర్ లో ఎవ్వరికి లేని ʹనెట్ʹ సేవలు బీజేపీ వాళ్ళకు ఎలా వచ్చాయి ?
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
Savenallamala: యురేనియం తవ్వకూడదన్నవాళ్ళంతా అర్బన్ నక్సలైట్లేనా ?
కశ్మీర్ ప్రజల పోరాటానికి మద్దతుగా నిబడదాం...మావోయిస్టు పార్టీ పిలుపు
భూ గురత్వాకర్షణ శక్తిని కనుగొన్నది ఐనిస్టీనా... న్యూటన్ కాదా ?
Maoist leader Murali recounts his own jail experience to cite rampant rights violation
ప్రభుత్వాన్ని,న్యాయవ్యవస్థను,ఆర్మీని విమర్శించడం దేశద్రోహం కాదు ... సుప్రీం కోర్టు జడ్జ్
దేవరకొండలో యురేనియం సర్వే కోసం వచ్చిన వారిని తరిమిన ప్రజాసంఘాలు
చెప్పులేసుకొని బైక్ నడిపినా.. లుంగీ కట్టి లారీ నడిపినా భారీ జరిమానాలు..!
యురేనియంపై నల్లమల బంద్.. కదం తొక్కిన జనం... నాయకుల అరెస్ట్, ఉద్రిక్తత‌
నల్లమల ప్రజలకు మద్దతుగా నిలబడదాం, యురేనియం తవ్వకాలను అడ్డుకుందాం ... మావోయిస్టు పార్టీ ప్రకటన‌
జేఎన్యూ పై మళ్ళీ ఎర్రజెండా రెపరెపలు... విద్యార్థి సంఘం ఎన్నికల్లో లెఫ్ట్ ఘనవిజయం
దేవుడు లేడని చెప్పే హక్కు రాజ్యాంగం కల్పించింది...మద్రాస్ హైకోర్టు
దేశ పరిస్థితులపై ఆందోళన...మరో ఐఏఎస్ రాజీనామా
జేఎన్యూ విద్యార్థి నాయకురాలు షెహ్లా రషీద్ పై రాజద్రోహం కేసు
యుద్ధం - శాంతి.
కశ్మీర్ లో 80 మందికి పెల్లెట్ గాయాలు, బాలుడు మృతి... జాతీయ వార్తాసంస్థల వెల్లడి
ఆమె పోరాటమే.. తమిళనాడు ప్రభుత్వాన్ని కదిలించింది..!
స్కూలు పిల్లలకు భోజనంలోకి కూరకు బదులు ఉప్పు...బైట పెట్టిన జర్నలిస్టుపై కేసు
పేదోళ్లుగా పుట్టడమే కాదు.. చావడం కూడా నేరమే..!
more..


యురేనియం