దేవరకొండలో యురేనియం సర్వే కోసం వచ్చిన వారిని తరిమిన ప్రజాసంఘాలు


దేవరకొండలో యురేనియం సర్వే కోసం వచ్చిన వారిని తరిమిన ప్రజాసంఘాలు


యురేనియం తవ్వకాలకు సంబందించి యురేనియం నమునాలను సేకరించడానికి యుసిఐఎల్ సంస్థ(యురేనియం కార్పొరేషన్ ఆప్ ఇండియా)
వేయబోయే బోర్ పాయింట్లను గుర్తించడానికి నిన్న(9/9/2019) రాత్రి 8 గంటలకు జియోలాజికల్ సర్వే ఆప్ ఇండియాకు చెందిన ప్రత్యేక బస్ లో సుమారు 30 ముంది జియాలాజిస్ట్ లు (వారికి తెలుగురాదు)దేవరకొండ లోని విష్ణు ప్రియ లాడ్జ్ కి చేరుకోవడం జరిగింది. ఈ విషయంపై రాత్రి 10 గంటల ప్రాంతంలో సమాచారం అందిన వెంటనే తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా కమిటి స్పందించి దేవరకొండ ప్రాంతానికి చెందిన విద్యావంతుల వేదిక సబ్యులకు,దళిత యువజన జేఏసి,విద్యార్థి సంఘాల నాయకులకు సమాచారం అందించడం జరిగింది.

*సన్నద్దమైన విద్యావంతుల వేదిక*

మంగళవారం ఉదయం 6 గంటలకే విద్యావంతుల వేదిక సబ్యులు లాడ్జ్ ముందు బైఠాయించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగ ప్రవేశం చేసి వాళ్లు యురేనియం కు సంబందించిన వారు కాదని నచ్చ చెప్పే ప్రయత్నం చేసా‌రు. జియోలాజికల్ సర్వే సంస్థకు సంబందించిన వారని,
వేరే సర్వే కోసం వచ్చారని పోలీసులు నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు.


అయినప్పటికీ అక్కడ ప్లకార్డులతో నిరసన తెలుపుతున్న విద్యావంతుల వేదిక సబ్యులు ఎంతకు వినిపించుకోక పోవడంతో పోలీసులు జియాలాజిస్ట్ లు బస చేసిన హోటల్ లోకి ప్రవేశించి జియోలాజికల్ సర్వే వారితో మంతనాలు జరిపారు.ఇరువై నిమిషాల చర్చల అనంతరం పోలీసులు ,జియాలాజికల్ సర్వే వారు హోటల్ నుంచి వెలుపలకు వచ్చారు. తాము జియాలాజిస్ట్ లమని, ప్రయోగాలు చేయడానికి వచ్చామని ఒక పత్రం ఇచ్చారు. స్పందించిన నాయకులు యురేనియం పేరుతో ప్రయోగాలకు, పరిశోధనలకు ఈ నల్లమల్ల, దేవరకొండ లో తావులేదని, వెంటనే ఇక్కడి నుంచి వెల్లిపోవాలని డిమాండ్ చేసారు.కొద్దిసేపు,జియాలాజికల్ సర్వే ఆప్ ఇండియా వారికి,విద్యావంతుల వేదిక బృందానికి గలాట జరుగడంతో పోలీసులు జోక్యం చేసుకొని నాయకులను పక్కకు తప్పించి ఆ అధికారులను అక్కడి నుంచి పంపించడం జరిగింది.అనంతరం అధికారుల బస్సు హైదరాబాద్ వైపు వెళ్ళిపోయింది.

ఈ సందర్భంగా విద్యావంతుల వేదిక బాధ్యులు ఎర్ర క్రిష్ణ జాంస‌న్ మాట్లాడుతూ--- నల్లమల్ల లో యురేనియం పేరుతో ఏలాంటి సర్వేలు,పరిశోధనలు జరపడానికి వీలు లేదన్నారు.అన్యాయం గా ఈ ప్రాంతం పై ఆధిపత్యం చేసి యురేనియం తవ్వకాలు జరపాలని చూస్తే సహించేది లేదన్నారు.ఈ ప్రాంతం అత్యంత వెనుకబడిన ప్రాంతమని ఇప్పుడిప్పుడే చక్కదిద్దుకుంటున్న గిరిజన ఆదివాసి జీవితాలను బుగ్గి పాలు చేయోద్దన్నారు.అనేక ఉధ్యమాలకు పురుడు పోసిన ఈ గడ్డ పై అణు విధ్వంసానికి చోటు లేదన్నారు.ఇక్కడి ప్రజలతో మమేకమై యురేనియం వ్యతిరేక ఉధ్యమాన్ని మరింత ముంధుకు తీసుకపోతామన్నారు. ఈ అందోళన కార్యక్రమంలో నాయకులు కొర్ర రాంసింగ్, లక్ష్మణ్ నాయక్, వలమల్ల ఆంజనేయులు,ఎస్.శ్రీనివాస్, కట్రావత్ రాజు, పొట్ట ప్రభు, ఎర్ర నగేష్ తదితరులు పాల్గొన్నారు.

నల్లమల్ల పై ప్రయోగాలను సహించం :
విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు పందుల సైదులు.

విష ప్రయోగాలకు నల్లమల్ల అటవి ప్రాంతంలో చోటులేదని, యురేనియం పేరుతో విధ్వంసక అభివృద్ధి ఈ ప్రాంతంలో అవసరం లేదన్నారు. మానవాళిని, జీవ కోటిని నాశనం చేసే అభివృద్ధి అవసరం లేదని, అభివృద్ధి ప్రజల కోణంలో జరగాలే తప్ప కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేసే కోణంలో కాదన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల అభిప్రాయాలకు గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత పాలకులకు ఉందన్నారు.

Keywords : uranium, nalgonda, devarakonda, police
(2020-01-17 13:15:01)No. of visitors : 601

Suggested Posts


ʹబంగారం లేదు వజ్రాలు లేవు ఈ కట్టు కథలన్నీ యురేనియం కోసమేʹ

ఈ విదేశీ కంపెనీలన్నీ.. బిజినెస్​ పేరుతో 200 ఏళ్లు, వలస పాలనతో మరో 200 ఏళ్లు ఇండియాని నిలువునా దోచుకున్న ఈస్ట్ ఇండియా కంపెనీ సంతతివే కావటం గమనార్హం. ఈ నిజాలు బయటపెట్టకుండా ఎప్పటికప్పుడు కొత్త కొత్త కథలు చెబుతూ యురేనియం కార్పొరేషన్ ప్రజలను మోసగిస్తోంది. ప్రకృతితో పరాచికాలాడాలని ప్రయత్నిస్తోంది. సూర్యాపేట జిల్లాలోనూ అన్వేషణ యురేనియం కోసమే కానీ బంగారం కోసం క

Search Engine

ʹప్రొఫెసర్ కాశీంను అణగారిన ప్రజల వైపు నిలబడ్డందుకే అరెస్ట్ చేశారుʹ
ఉరిశిక్ష‌లు, ʹఎన్‌కౌంట‌ర్ʹ హ‌త్య‌ల‌తో నేరాల నియంత్ర‌ణ సాధ్య‌మేనా?
రాజ్యాంగమే నా బలం,ఆ బలంతోనే పోరాటం కొనసాగిస్తా - ఆజాద్
మోడీ భారత పౌరుడనే రుజువుందా ? ఆర్టీఐ ద్వారా అడిగిన కేరళవాసి
వాళ్ళిద్దరి కోసం..!
జేఎన్‌యూ తర్వాత‌...ఇప్పుడు మరో యూనివర్సిటీ విద్యార్థులపై దాడి
మమ్మల్ని ఈ దేశం నుండి బహిష్కరించండి - రాష్ట్రపతికి లేఖ రాసిన ʹఉనాʹ దళితులు
JNU పై దాడి చేసిందెవరో తేల్చి చెప్పిన వార్డెన్ల నివేదిక‌
భీం ఆర్మీ ఛీఫ్ ఆజాద్ కు బెయిల్...నెల రోజులు సహరన్ పూర్ లోనే ఉండాలని కండీషన్
మోడీషా రాజ్య నిర్బంధంలో మగ్గుతున్న భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ విడుదలకై ఉద్యమిద్దాం
విద్వేషం అతని మతం.. అణచివేత అతని ఆయుధం..!
మీరు చేస్తే గొప్ప పని ప్రజలు చేస్తే హింసనా జగ్గీ గారు
ఈ ప్రభుత్వమే నిర్బంధ కేంద్రాల్లోకి నెట్టబడే రోజొస్తుంది : అరుంధతి రాయ్
మన చేతుల మీది నెత్తుటి మరకలు కడగడానికి ఎన్ని సముద్రాలు కావాలి?
నిజం ఎప్పటికి బయటకు వస్తుంది?
విరసం అధ్యక్ష కార్యదర్శులుగా అరసవెల్లి కృష్ణ,కాశీం
50 ఏళ్ల.. దుఃఖం, నిర్భంధం, ధిక్కారం, స్పూర్తి... 50 ఏళ్ల విరసం మహాసభలు
విరసం 50 ఏళ్ళ సభలు...నోమ్ ఛామ్ స్కీ సందేశం
సృజ‌నాత్మ‌క ధిక్కారం.. విర‌సం 50 ఏళ్ల స‌భ‌లు ప్రారంభం
విరసం 50 ఏళ్ల సభలు.. పూణే జైలు నుంచి వరవరరావు సందేశం
CPI (Maoist) oppose Citizenship Amendment Act, calls to intensify mass campaign against it
అమిత్ షాకు బహిరంగ లేఖ‌ !
50 ఏళ్ళ ధిక్కారస్వరం...ఈ నెల11,12 తేదీల్లో విరసం రాష్ట్ర‌ మహాసభలు
నెత్తుటి ఏరులు పారినా ఎత్తిన జెండా దించకుండా... మళ్ళీ పిడికిలెత్తిన జేఎన్‌యూ
Cotton University Students Hoist Black Flags, Express Solidarity with JNU
more..


దేవరకొండలో