Savenallamala: యురేనియం తవ్వకూడదన్నవాళ్ళంతా అర్బన్ నక్సలైట్లేనా ?


Savenallamala: యురేనియం తవ్వకూడదన్నవాళ్ళంతా అర్బన్ నక్సలైట్లేనా ?

Savenallamala:

ప్రజల ప్రాణాలు కాపాడాలంటే అర్బన్ నక్సలైటా ? పర్యావరణం నాశ‌నమవుతుంది అంటే దేశద్రోహా ? నల్లమలను కాపాడాలంటే చైనా ఏజెంటా ? అవునట ! ప్రజలకోసం మాట్లాడితే ఇలాంటి ముద్రలేస్తున్నారు కొందరు బీజేపీ మద్దతుదారులు.
నల్లమల ప్రాంతంలో యురేనియం తవ్వకాల నిర్ణయానికి వ్యతిరేకంగా కొంత కాలంగా అక్కడి ప్రజలు ఉద్యమాలు చేస్తున్నారు. వాళ్ళ‌కు మద్దతుగా అనేకమంది సామాజిక స్పృహ ఉన్న మేదావులు, విద్యార్థులు, జర్నలిస్టులు, ప్రజాసంఘాల కార్యకర్తలు గొంతు విప్పుతున్నారు. నల్లమల ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళకు తాము అండగా ఉంటామన్న భరోసా ఇస్తున్నారు.

బీజేపీ, టీఆరెస్ మినహా అన్నిరాజకీయ పక్షాలు కూడా నల్లమల ప్రాంతాన్ని సందర్శించాయి. మరో వైపు సోషల్ మీడియాలో కూడా సేవ్ నల్లమల అంటూ ఉద్యమం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో తెలుగు సినీ రంగానికి చెందిన ప్రముఖులు శేఖర్ కమ్ముల,వీవీ వినాయక్, వేణు ఉడుగుల,సురేందర్ రెడ్డి, రాహుల్ రామకృష్ణ, ఆర్పీ పట్నాయక్, విజయ్ దేవరకొండ, పవన్ కళ్యాణ్, నాగబాబు, సాయి ధరమ్ తేజ్, అడివి శేషు, సమంత , చంద్రబోస్, వీవీ వినాయక్, అనసూయ, తనికెళ్ళ భరణి, సురేందర్ రెడ్డి, మాదాల రవి, హరితేజ, క్రీడాకారిణి గుత్తా జ్వాల లాంటి వాళ్ళు సోషల్ మీడియాలో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా గళమెత్తారు.

నల్లమల ప్రజలకు తమ మద్దతు ప్రకటించారు. ఇదంతా యురేనియం మద్దతుదారులైన బీజేపీయులకు మింగుడుబడడం లేదు. విధ్యుత్తు ఉత్ప‌త్తి అవ‌స‌రం పేరుతో యురేనియం వెలికి తీసి అణుబాంబులు తయారు చేసే వాళ్ళ వ్యూహానికి ఎదురు దెబ్బ తగులుతుందనే భయం పట్టుకుంది వాళ్ళకు. యురేనియం తవ్వకాల వల్ల జరిగే మానవ హననం , పర్యావరణ నాశనం వాళ్ళకు పట్టదు.

నల్లమలలో జరిగే యురేనియం తవ్వకాల వల్ల జరిగే నష్టం ఒక్క నల్లమలకే పరిమితం కాదని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా నది ప్రవహించే ప్రాంతమంతా మానవ జీవితాలను అతలాకుతలం చేస్తాయనే విషయం వాళ్ళకు తెలిసినా పట్టించుకోరు. కృష్ణా నది జలాలే తాగుతున్న హైదరాబాద్ ప్రజలు, వచ్చే అనేక తరాలపాటు నయంకాని అనారోగ్య సమస్యలతో క్రుంగి క్రుశించి పోతారని వాళ్ళకు తెలియదని అనలేం.

ప్రపంచంలో యురేనియం తవ్వకాల కారణంగా జరిగిన నష్టాలు వాళ్ళకు నిజంగా తెలియదా! ఎక్కడిదాకో ఎందుకు మనదేశంలోనే ప‌క్క‌రాష్ట్రం జార్ఖండ్ లోని జాదూ గూడలో జరిగిన విపరీత పరిణామాలు మర్చిపోదామా ? ఈ నాటికీ అక్కడ పుడుతున్న పిల్లలు వికలాంగులుగా వికృతంగా పుడుతున్నారన్న నిజం చూడ నిరాక‌రిద్దామా ?

అవును ఇవన్నీ వాళ్ళకు అవసరం లేదు. వాళ్ళ మోడీ యురేనియం తవ్వాలన్నాడు. అంతే తవ్వి తీయాల్సిందే.అందుకే దానిని వ్యతిరేకించే వాళ్ళందరిపై సోషల్ మీడియాలో దుష్ప్రచారానికి ఒడిగట్టారు. విజయ్ దేవరకొండ సినీ అర్బన్ నక్సలైటు అని ముద్ర వేస్తున్నారు. సేవ్ నల్లమల ఉద్యమం చైనా నడిపిస్తోందంటూ బట్టకాల్చి మీదేస్తున్నారు. అసలు యురేనియం వల్ల ఏ నష్టమూ లేదంటూ అబద్దపు ప్రచారాలకు పూనుకుంటున్నారు.

ఈ దేశ ప్రజలపై వీళ్ళు పాల్పడుతున్న దాడులు కొత్త కానట్టే ఈ దుష్ప్రచారాలు కొత్త కాదు. భయపెట్టి, దాడులు చేసి, దుష్ప్రచారాలు చేసి ఏ ప్రజా ఉద్యమాన్నీ ఆపలేరు అన్నది చరిత్ర రుజువు చేసింది. నల్లమల ఉద్యమం విష‌యంలో కూడా అదే జ‌రిగి తీరుతుంది.

(బీజేపీ మద్దతుదారుల పోస్టుల్లో ఇది ఒక ఉదహరణ మాత్రమే)

Keywords : save nallamala, uranium, vijay devarakonda, pawan kalyan, tolly wood
(2019-10-13 05:00:00)No. of visitors : 380

Suggested Posts


పాలకులారా...! ఈ తల్లి ప్రశ్నలకు జవాబు చెప్పగలరా ?

నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం,తిర్మలపూర్ గ్రామంలో... తమ ఊరును ఖాళీ చేయిస్తారన్న ప్రభుత్వం ఆలోచనపై ఓ తల్లి తన ఆవేదనను వెల్లడించింది. పాలకులకు కొన్ని ప్రశ్నలు సంధించింది. ఆ వీడియో మీ కోసం...

నల్లమల ప్రజలకు మద్దతుగా నిలబడదాం, యురేనియం తవ్వకాలను అడ్డుకుందాం ... మావోయిస్టు పార్టీ ప్రకటన‌

నల్లమల అడవి ప్రాంతంలో అమ్రాబాద్,పదర తదితర ప్రాంతంలోని ప్రజలను నిర్వాసితులను చేస్తూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్ట‌నున్న యురేనియం త్రవ్వకాలను సి.పి.ఐ మావోయిస్టు పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది.యురేనియం త్రవ్వకాల ప్రయత్నాలు వెంటనే ఆపివేయాలని డిమాండ్ చేస్తున్నాము.

పులివెందుల నుండి నల్లమలదాకా...వరలక్ష్మి

నల్లమలలో యురేనియం తవ్వకాల గురించి మాట్లాడే ముందు కడప జిల్లా తుమ్మలపల్లె యురేనియం ప్రాజెక్టు నిర్వాకం గురించి యురేనియం కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (యు.సి.ఐ.ఎల్‌.) సమాధానం చెప్పాలి.

Search Engine

మావి నిషేధిత సంఘాలు కావు
పోలీస్ క‌మిష‌న‌ర్ ప్ర‌క‌ట‌న‌పై కేసీఆర్ స్పందించాలి : ప‌్ర‌జా సంఘాలు
కేసీఆర్ ఓ నియంత : విరసం కార్య‌ద‌ర్శి పాణి
Condemn arrest and onslaught on TVV and others activists - SFS
ʹనల్లమల గురించి మాట్లాడినందుకే నాభర్తను అరెస్ట్ చేశారు..ఆయనెక్కడున్నడో నాకు చూపించాలిʹ
స్టూడెంట్ మార్చ్ పత్రిక ఎడిటర్, విరసం కార్యవర్గ సభ్యుడు డా. జగన్ ను విడుదల చేయాలి
దేశవ్యాప్త నిరసనలతో వెనక్కి తగ్గిన పోలీసులు...49 మంది ప్రముఖలపై కేసు విత్ డ్రా
Over 140Telugu Literary Persons Endorse Letter to PM by 49 Celebrities, Condemn FIR
ʹఇది ఆర్టీసీ ఉద్యోగుల పోరాట‌మే కాదు - కేసీఆర్ నియంతృత్వ వ్య‌తిరేక ప్ర‌జాస్వామిక పోరాటంʹ
49 మంది ప్రముఖలపై కేసు ఎత్తివేయాలి ‍-140 మంది తెలుగు రచయితల బ‌హిరంగ‌లేఖ‌ !
ఆర్టీసీని ప్రైవేటు పరం చేయడానికి టీఆరెస్ ప్రభుత్వం కుట్ర... సమ్మెకు ప్రజలందరూ మద్దతు తెలపాలి ...మావోయిస్టు పార్టీ
చెట్లు నరకొద్దన్నందుకు పోలీసుల దాడి...38 మందిపై కేసు
ఆ 49 మంది కోసం ...ఇక మనమూ తేల్చుకోవాల్సిందే - పాణి
ఆర్టీసీ నష్టాలకు కారణమెవరు ? సమ్మె ఎవరి కోసం ?
జైళ్ళలో పేదలే మగ్గుతున్నారు... ప్రజలకు పోలీసులతో ఎలాంటి లాభం లేదు... తెలంగాణ ఐపీఎస్ అధికారి
జగన్ ది నరహంతక పాలన.. ఏవోబీ ఎన్ కౌంటర్ కు నిరసనగా అక్టోబర్ 3న బంద్ - మావోయిస్టు నేత గణేష్
ప్రొఫెసర్ సాయిబాబాను వెంటనే ఆసుపత్రికి తరలించి సరైన వైద్యం అందించాలి - విరసం
అమేజాన్‌ కార్చిచ్చుకు అసలు కారణం - పి.వరలక్ష్మి
మహాజనాద్భుత సాగరహారానికి ఏడేండ్లు -ఎన్ వేణుగోపాల్
ʹహైకోర్టు తీర్పు ప్రకారం మావోయిస్టుల మృతదేహాలను ABMS కు అప్పజెప్పాలిʹ
మావోయిస్టు అరుణ ఎక్కడ ?
ఐదు దశాబ్దాల వసంతగానం
మన్యంలో నెత్తురు పారిస్తున్న జగన్ సర్కార్
కశ్మీర్ లో దుర్మార్గం పై మహిళల నివేదిక
ఈ గొప్ప ప్రజాస్వామ్యాన్ని చూసి తెలంగాణమా గర్వించు !
more..


Savenallamala: