పోరాడితే పోయేదేమీ లేదు...పోరాడి హక్కులు సాధించుకున్న విద్యార్థినులు


పోరాడితే పోయేదేమీ లేదు...పోరాడి హక్కులు సాధించుకున్న విద్యార్థినులు

పోరాడితే

ʹపోరాడితే పోయేదేం లేదు బానిస సంకెళ్లు తప్పʹ అని కార్ల్ మార్క్స్ ఏనాడో మనకు చెప్పాడు. మన ప్రాథమిక హక్కులను సాధించుకోవాలన్నా, మనకు జరగాల్సిన న్యాయాన్ని పొందాలన్నా పోరాటమే తప్ప వేరే మార్గం లేదు. సరిగ్గా అదే పోరాట పంధాను అనుసరించారు బేగంపేటలోని సెయింట్ ఫ్రాన్సిస్ కళాశాల విద్యార్థినులు. డ్రెస్ కోడ్ పేరిట విద్యార్థినుల దుస్తులపై ఆంక్షలు విధించడమే కాకుండా.. తమ కోడ్‌ను వాళ్లు అనుసరిస్తున్నారా లేదా అని చూడటానికి ఏకంగా సెక్యూరిటీని నియమించుకొని ప్రతినిత్యం అవమానకరంగా ప్రవర్తించిన యాజమాన్యంపై తిరగబడ్డారు.

మోకాళ్ల పైకి ఉండే కుర్తాలు ధరించొద్దు.. జీన్స్, టీషర్ట్ వేసుకోవద్దు.. స్లీవ్ లెస్ దుస్తులు అసలే వద్దని నియమాలు పెట్టారు. చివరకు ముస్లిం విద్యార్థినులు బుర్కా లోపల ఏ డ్రెస్ వేసుకున్నారో చూడాలంటూ గేటు దగ్గరే తనిఖీలు నిర్వహిస్తూ కళాశాల యాజమాన్యం కౄరంగా ప్రవర్తించింది. అంతే కాకుండా మీరు సాంప్రదాయబద్దంగా ఉండే దుస్తులు ధరిస్తే మీకు గౌరవం పెరుగుతుంది.. మీకు మంచిగా పెళ్లిళ్లు అవుతాయని యాజమాన్యం హితబోధలు చేసింది. స్లీవ్ లెస్ ధరించి వస్తే పురుష లెక్చరెర్లు పాఠాలు సరిగా చెప్పలేక పోతున్నారు.. వారి దృష్టి మీమీద పడుతోంది అంటూ భయపెట్టారు. దీంతో అవమానాన్ని భరించలేక.. ఆంక్షలపై యుద్దం ప్రకటించారు.

తమకు కళాశాలలో జరుగుతున్న అవమానాలను, ఆంక్షలను ఒకరితో ఒకరు పంచుకున్న విద్యార్థినులు సోషల్ మీడియా ద్వారా ఏకమైయ్యారు. సోమవారం కళాశాల ఎదుట మన నిరసనను తెలియజేద్దామంటూ సంఘటితం అయ్యారు. పోరాడితే పోయేదేం లేదు.. మనపై విధించిన ఆంక్షలు తప్ప అనుకుంటూ ప్లకార్డులు చేతబట్టి వందలాది మంది విద్యార్థినులు కళాశాల ఎదుట ఆందోళన చేపట్టారు.

ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు కళాశాల ఎదుట రోడ్డుపై భైటాయించి డ్రెస్ కోడ్‌పై తమ నిరసనను వ్యక్తం చేశారు. నా మోకాళ్లు ఎవరికి దృష్టిమళ్లుతోంది..? మేం కాలేజీకి వచ్చేది చదువుకోవడానికే కాని.. ఫ్యాషన్ షోకి కాదంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. రిమూవ్ ది డ్రెస్ కోడ్ అంటూ నినదించారు.

విద్యార్థినుల ఆందోళనతో యాజమాన్యం వారితో చర్చలు జరపడానికి వచ్చింది. డ్రెస్ కోడ్ వల్ల మీకే మంచిదని.. పెళ్లిళ్లు అవుతాయని సర్థిచెప్పడానికి ప్రయత్నించగా విద్యార్థినులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కాలేజీనా లేదా మ్యారేజ్ బ్యూరోనా అంటూ మండిపడ్డారు. డ్రెస్ కోడ్ తొలగించే వరకు ఆందోళన విరమించమంటూ భీష్మించుకొని కూర్చున్నారు.

దీంతో కళాశాల యాజమాన్యం, కమిటీ ప్రతినిధులు ఈ విషయంపై సుమారు 2 గంటల పాటు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అనంతరం పాత డ్రెస్‌కోడ్‌ విధానమే కొనసాగుతుందని, కొత్త డ్రెస్‌ కోడ్‌ విధానాన్ని తొలగిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ సిస్టర్‌ శాండ్రా ప్రకటించడంతో విద్యార్థినులు ఒక్కసారిగా కేరింతలు కొడుతూ సంబరాలు చేసుకున్నారు. వారి హక్కులను సాధించుకోవడంలో సఫలమైనదందుకు కేరింతలు కొట్టారు.

Keywords : St Francis Womenʹs College, Dress Code, Begumpet, Hyderabad, Agitation, Students,
(2019-12-06 07:56:16)No. of visitors : 372

Suggested Posts


0 results

Search Engine

మా పేరు మీద కస్టడీ హత్యలు వద్దు..!
కూలి డబ్బులు అడిగినందుకు దళితుడిని జేసీబీతో తొక్కించి చంపాడు..!
క్షీణించిన వరవరరావు ఆరోగ్యం - ట్రీట్ మెంట్ కోసం పూణే ప్రభుత్వ‌ హాస్పటల్ కు...
రేప్ బాధితురాలు కోర్టుకు వెళ్తుండగా మళ్ళీ దాడి చేసిన రేపిస్టులు... సజీవదహనానికి యత్నం
అది ఎన్కౌంటర్ కాదు.. 17 మందిని ఏకపక్షంగా కాల్చి చంపారు : జుడీషియల్ కమీషన్ వెల్లడి
ఇండియాస్ డాటర్స్.. ఇంకెంత కాలం ఈ దారుణాలు..? ఈ డాక్యుమెంటరీ చూడండి..!
20 వసంతాల నెత్తుటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
ప్రియాంక హత్య : ఢిల్లీలో పగిలిన చిన్ని గుండె !
100 కి డయల్ చేసి ఉంటే...! విక్టిమ్ బ్లేమింగ్ - సీ.వనజ
దొరతనం గెలుసుడా ఓడుడా? - ఎన్.వేణుగోపాల్
ʹఆకలి, పేదరికంతో చచ్చిపోతున్నాʹ.. కంటతడి పెట్టిస్తున్న ఓ చిన్నారి సూసైడ్ లెటర్
ఈ తెలంగాణ మీదే.. మాది కాదు : కేసీఆర్‌కు ఒక ఆర్టీసీ కండక్టర్ బహిరంగ రాజీనామా లేఖ
మహిళా కార్యకర్తలపై అక్రమకేసులకు వ్యతిరేకంగా పోరాడుదాం !
కిషన్ జీ... పీడితుల యుద్ద గీతి !
ఒక ప్రొఫెసర్ - ఏడు కుట్ర కేసులు
ప్రజల పక్షాన మాట్లాడుతున్నందుకే ఈ అక్రమ కేసులు : విరసం
Withdraw the False Case against Veekshanam Editor!
వీక్ష‌ణం సంపాద‌కుడిపై UAPA కేసు
భగత్ సింగ్ తుపాకీ - జార్జిరెడ్డి సినిమా...!!
Arrest of B Anuradha & N Ravi Sharma – Fact and Fiction
అనూరాధ, రవి శర్మల అరెస్టు – వాస్తవమూ కల్పనా..!
కేసీఆర్ అప్రజాస్వామిక పాలన‌: అనురాధ, రవిల అరెస్ట్ - రాజద్రోహం, యూఏపీఏ కేసులు బనాయింపు
ఫీజుల పెంపును నిరసిస్తూ.. కేంద్ర మంత్రిని నిర్బంధించిన జేఎన్‌యూ విద్యార్థులు..!
పోలీసుల అడ్డంకులు ఛేదించుకుని సమరోత్సాహంతో ట్యాంక్ బండ్ పైకి దూసుకొచ్చిన‌ కార్మికులు
చలో ట్యాంక్ బండ్ లో మావోయిస్టులున్నారన్న సీపీ... ఉక్కుపాదం మోపడం కోసమే ఈ ఆరోపణలన్న‌ ఆర్టీసీ జేఏసీ
more..


పోరాడితే