తెలుగులో ఇలాంటి సినిమాలు తీయలేరా..?


తెలుగులో ఇలాంటి సినిమాలు తీయలేరా..?

ʹవిసారనైʹ.. అని తమిళంలో ఒక సినిమా వచ్చింది. అసలు పోలీసుల విచారణ ఎలా ఉంటుంది..? అమాయకులు విచారణ పేరుతో ఎలా బలై పోతారు.. నకిలీ ఎన్‌కౌంటర్లు ఎలా చేస్తారనే విషయాలను చూపించారు. ఈ సినిమాపై ʹహరికృష్ణ ఎంబీʹ తన ఫేస్‌బుక్ వాల్‌పై వివరంగా రాశాలు. ఆ పోస్టు యధాతథంగా... (ఈ సినిమాను పైన యూట్యూబ్ లింక్‌లో చూడవచ్చు)

------------------------------------------------------------------------------

నేరం చెయ్యకపోయినా పోలీస్ స్టేషన్ లో ఎప్పుడైనా ఉన్నారా? పోలీసుల భాషలో అమలయ్యే ఏ డిగ్రీ ట్రీట్మెంట్ ఇవ్వబడిందా?

ఈ మధ్య ఒక కన్నడ లెక్చరర్ రాసిన తన కథ చదివినప్పుడూ, మొన్న బాపట్ల ఎంపీ సురేష్ తనకు జరిగిన పోలీస్ ట్రీట్మెంట్ తన మాటల్లో విన్నప్పుడు ఎలాంటి ఫీలింగ్ అయితే కలిగిందో, ఈ కథ చూసినప్పుడు అంతకంటే ఎక్కువ ఆవేదన ... కడుపులో పేగులు మెలిపెట్టినట్లు, వెనుక ఎవరో తరిమినట్లు ఒకటే అలజడి...

ఇలాంటి కష్టాల ముందు మనం ఏడ్చే పుప్పొడి పూల ఏడుపులకు ఏం విలువ ?

--
ఇది 90ల్లో జరిగిన సంఘటన. ఒక నలుగురు తమిళనాడు యువకులు పొట్టకూటి కోసం గుంటూరు వచ్చి చిన్న చిన్న షాపుల్లో పని చేస్తూ ఉంటారు. రాత్రి పూట పబ్లిక్ పార్క్ లో పడుకుని పగలు నగరం లో ఏదో పని చేసుకుంటూ బతికేస్తుంటారు

ఉన్నట్టుండి ఒకరోజు పోలీసులు వచ్చి ఒకణ్ణి జీపులో వేసుకుని స్టేషన్ కి తీసుకుపోతారు... రాత్రంతా పిచ్చి పిచ్చి గా కొడతారు.. పొద్దున్న లేచాక చూస్తే మిగతా ముగ్గురి పరిస్థితి కూడా అంతే అని తెలుస్తుంది. వాళ్లలో ఒకడు ఎక్కడో దొంగతనం చేస్తూ పట్టుబడ్డాడు అని, అందరూ కలిసే చేసి ఉంటారు అనే అనుమానం తో అందరినీ పట్టుకొచ్చి ఉతికేస్తారు..

మరుసటి రోజు పొద్దున్నే ఆ స్టేషన్ హెడ్ స్టేషన్ కి వస్తాడు. నుదుటిన పెద్ద నామం పెట్టుకుని, నవ్వుతూ - మంచితనానికి మరోపేరు లా కనపడతాడు... తిరుమల ప్రసాదం అందరికీ పంచుతుంటాడు... ఈ నలుగురికీ కూడా ఇస్తాడు... పాపం వీళ్ళు కరిగిపోయి అతన్ని వేడుకుంటారు.... అతను జూలు విదిలించి వీళ్ళని మళ్ళీ చితక్కొట్టేస్తాడు ..

దొంగతనం వీళ్ళు చేయకపోయినా కోర్టులో ఒప్పుకుంటే చాలు అని చెప్తాడు... అయినా వీళ్ళు ఒప్పుకోరు...

జరిగింది ఏంటంటే, ఒక పెద్దాయన ఇంట్లో దొంగతనం జరిగింది. దొంగలు దొరక్కపోయినా, ఎవరో ఒకరు దొరకాలి, వాళ్ళు దొంగతనం చేశామని ఒప్పుకోవాలి... దాంతో పోలీసులకి హాయి.. లేకుంటే పైన్నుంచి ప్రెషర్.

వీళ్ళని కోర్టులో ప్రవేశపెట్టినపుడు వీళ్ళు జడ్జి ముందర ఏడ్చేస్తారు... అరవం, తెలుగు కలగలిపి ఏదో వాగేస్తారు... అక్కడెవరైనా తమిళం, తెలుగు తెలిసిన వాళ్ళు ఉన్నారేమో అని జడ్జి విచారిస్తే, వేరే కేసు విషయం పై అక్కడికి వచ్చిన తమిళనాడు పోలీసులు వీళ్ళకి అనువాదం చేస్తారు..

ఈ నలుగురిలో ఒకడికి, ఆ పోలీసుల గుంపు లో ఒకరికి అంతకుముందే షాపులో పరిచయం ఉంటుంది... వాళ్ళ సహాయం తో వీళ్ళని నిరపరాధులుగా వదిలేస్తారు... అలా బయటకి వచ్చిన వీళ్ళకి మళ్ళీ ఆ తమిళనాడు పోలీసులు కనపడితే, వాళ్ళని బతిమాలి వాళ్ళతో పాటే వెళ్తారు...

--
దీని సమాంతరంగా తమిళనాడు లో ఒక కథ జరుగుతూ ఉంటుంది... అక్కడ ఒక పోలీస్ అధికారి ఏదో కుట్ర పన్నుతూ ఉంటాడు.. ఒక whistle blower ని పట్టుకుని విచారిస్తుంటారు. అటూ ఇటుగా కొందరు మనుషుల స్వార్థం మధ్య అతని ప్రాణం పెనుగులాడుతూ ఉంటుంది..

ఆంధ్ర నుంచి బయల్దేరిన ఈ పోలీసులు, యువకులు అందరూ కలిసి తమిళనాడు లో ఒక స్టేషన్ ముందర ఆగుతారు.. ఇక ఈ యువకులు వాళ్ళ దారిలో వాళ్ళు వెళ్లే సమయానికి, ఒక పోలీస్ వీళ్ళని స్టేషన్ శుభ్రం చేసి వెళ్ళమంటాడు.

వీళ్ళు శుభ్రం చేస్తూ నీళ్ల కోసం ఒక attached బాత్రూం లో ఉండే సమయం లో, మెయిన్ రూమ్ లో పోలీస్ బాస్ ఇంకొందరి తో కలిసి ఒక కుట్ర పన్నుతాడు... అది వీళ్ళు వింటారు.. కాబట్టి వీళ్ళు ఇక బతికే అవకాశం లేదు..

మొత్త్తం కుట్ర లో భాగం ఐన అందరినీ, ఒకరికి తెలియకుండా ఒకరిని చంపేసే ప్లాన్ రచించి వాళ్ళని చెన్నై కి పంపుతారు... ఈ నలుగురి లో ఒకడు మధ్య లో దిగిపోతాడు.. దిగకుండా వెళ్లిన ఆ ముగ్గురు, వీళ్ళకి సహాయం చేసిన పోలీస్ అధికారి.. అందరూ ఆఖరికి చచ్చిపోతారు..

అలా అమాయకులు, కిందిస్థాయి పోలీసులు పెద్ద పెద్ద వాళ్ళ కోసం తమ ప్రాణాలను త్యాగం చేసేస్తారు.. ఆలా అనేకంటే, పెద్దల స్వార్థం కోసం చిన్న చిన్న ప్రాణాల బలి అనొచ్చు..

--

చెన్నై రాకముందే కారు దిగేసిన ఆ నాలుగోవాడి వల్లే ఈ కథ మనకు తెలుస్తుంది.. ఇది తమిళం లో 2016 లో "విశారనై" పేరుతో వచ్చింది... చంద్రకుమార్ అనే ఒక ఆటో డ్రైవర్ రాసిన "లాకప్" అనే ఒక నవల ఆధారంగా నిర్మిచారు ఈ చిత్రాన్ని. రజినికాంత్ అల్లుడు ధనుష్ ఈ సినిమా నిర్మించాడు... మన తెలుగు చిత్ర పరిశ్రమ లో ఉన్న యువ నటులు అతన్ని చూసి ఎంతో నేర్చుకోవాలి.... చిన్న బడ్జెట్ తో ప్రతి సంవత్సరం కొన్ని సినిమాలు చేస్తూ కొత్త తరానికి అవకాశాలు ఇస్తున్నాడు ఆయన.

మనవాళ్ళు రీమేక్ చేస్తారు అనుకున్నా.. ఇన్ని రోజులకి కనీసం డబ్బింగ్ వెర్షన్ వచ్చింది "విచారణʹ పేరుతో.. Youtube లో ఉంది. హింస భయంకరంగా ఉంటుంది కాబట్టి పిల్లలు లేకుండా చూడండి...

ఆ సినిమా చూసినప్పుడు నాకు కొన్ని రోజులు సరిగా నిద్ర పట్టలేదు.. చాల రోజులు వెంటాడింది.. ఇప్పటికీ మర్చిపోలేదు... తమ విచక్షణ వాడకుండా కేవలం పై అధికారి సూచన లతో పనిచేసే యంత్రాల్లా బతికే పోలీసులు అంటే ఎవరికైనా ఎందుకు మర్యాద ఉండాలి.. అనిపిస్తుంది.

సోషల్ లైఫ్ లో active గా ఉండేవాళ్ళు "పోలీసులు అరెస్ట్ చేస్తే" అనే పుస్తకం చదివి, దగ్గర పెట్టుకుంటే మేలు. బొజ్జ తారకం గారు రాసారు... ధర కూడా తక్కువే.... ఈ పుస్తకం పిల్లలందరి చేత చదివిస్తే చాలా ప్రయోజనం ఉంటుంది...

--

ఇందులో ఒకచోట, పోలీసు పిచ్చిగా వీపు మీద బాదుతున్నా, ఒక యువకుడు "నేను దొంగలించలేదు సర్... ఎంత కొట్టిన అదే కదా సర్, నిజం..." అని చెప్పే సన్నివేశం ఒక ఇన్స్పిరేషన్.

చిన్న చిన్న కష్టాలకు భూగోళం బద్దలైంది అనుకునే వారికి ఇలాంటి సినిమాలు కచ్చితంగా ప్రేరణ గా నిలువగలవు.

- హరికృష్ణ ఎంబీ

యూఆర్ఎల్ : https://www.facebook.com/harikrishna.mb.dattapuram/posts/10156716232814423

Keywords : Visaranai, Vicharana, Tamil Movie, Telugu Dubing, Police,
(2020-02-23 04:50:34)No. of visitors : 1141

Suggested Posts


0 results

Search Engine

నిరసనపై నిరసన: వందలమంది హిందుత్వ వాదుల మధ్య ఆజాది అంటూ నినదించిన‌ యువతి
సీఏఏకు వ్యతిరేకంగా కవిత్వం చదివిన కవి, సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన జర్నలిస్టు అరెస్టు
జాదవ్ పూర్ యూనివర్సిటీ ఎన్నికల్లో ఎగిరిన ఎర్రజెండా
దళిత యువకుల‌పై దుర్మార్గ దాడి - స్క్రూడ్రైవర్‌ను వెనక నుంచి జొప్పించి హింసలు
CAA పౌరసత్వానికి మత పరీక్ష... అమెరికన్ ఫెడరల్ ప్యానెల్
ట్రంప్ వస్తున్నాడు 24 గంటల్లో ఇండ్లు ఖాళీ చేయండి ... పేదలకు నోటీసులు
వైనాడు కొండల్లో కురిసిన నక్సల్బరీ తొలి వసంత మేఘం... !
మీడియా ప్రచారంలో నిజముందా ? ఆ విద్యార్థుల చేతుల్లో రాళ్ళున్నాయా ?
ʹకరోనా వైరస్ కాదు దేవుడి అవతారం ... విగ్రహాలు ప్రతిష్టించి పూజించండిʹ
భీమా కోరేగావ్ కేసు సమాంతర విచారణకు మహారాష్ట్ర‌ సర్కార్ నిర్ణయం
ట్రంప్ కు భారత్ లో పేదలు కనబడొద్దట - 7అడుగుల ఎత్తు గోడను కడుతున్న బీజేపీ ప్రభుత్వం
కన్హయ్యకుమార్ పై మళ్ళీ దాడి...2వారాల్లో ఇది 7వ దాడి
CAA,NRCలకు వ్యతిరేకంగా మావోయిస్టుల ప్రచారం
ఆప్ గెలుపుతో ఢిల్లీలో పెరిగిన బిర్యానీ సేల్స్... బీజేపీ అభిమానుల అసహనం
ʹఅర్బన్ నక్సల్ʹ అంటే ఎంటో, ఎవరో మాకు తెలియదు - కేంద్ర ప్రభుత్వం
క్యాంపస్‌లోకి చొరబడి అమ్మాయిలపై గూండాల‌ వికృత చేష్టలు...భగ్గుమన్న విద్యార్థి లోకం
ఢిల్లీ జామియా విద్యార్థులపై పోలీసుల దుర్మార్గ దాడి - అనేకమందికి గాయాలు
షాహీన్ బాగ్: అంబులెన్స్, స్కూల్ బస్ లను ఆపుతున్నదెవరు ?
కునాల్ కమ్రాపై ఇండిగో నిషేధాన్నినిరసిస్తూ విమానంలో నిరసనలు
భక్తులే కాదు బాస్ కూడా వాట్సప్ యూనివర్సిటీయే
ʹనా కొడుకు మోడీ, అమిత్‌షాల మద్దతుదారుడుʹ
గృహనిర్బంధం ముగిసే కొన్ని గంటల ముందు వీళ్ళద్దరిపై దుర్మార్గమైన కేసులు
In Death, A Starʹs Dawn – GauriLankesh on Com Saketh Rajan
బీజేపీకి ఓటెయ్యక పోతే రేప్ చేస్తారా - మోడీకి 170 మహిళా ప్రముఖుల లేఖ‌
CAA,NRCలకు వ్యతిరేకంగా గ్రామపంచాయితీ సంచలన తీర్మానం
more..


తెలుగులో