చిన్నారిపై అత్యాచారం,హత్య? కేసును నీరుగారుస్తున్న పోలీసులు...తల్లి ఆమరణ నిరాహార దీక్ష‌ !


చిన్నారిపై అత్యాచారం,హత్య? కేసును నీరుగారుస్తున్న పోలీసులు...తల్లి ఆమరణ నిరాహార దీక్ష‌ !

మూడేళ్ళుగా ఆ చిన్నారిని ఒంటరిని చేశారు... అనేక రకాలుగా అవమానపర్చి హింసించారు....దొంగతనం ఆరోపణలు చేసి ఆ చిన్నమనసును చిదిమేశారు...మానసికంగా ఎప్పుడో చంపేసిన ఆ దుర్మార్గులు ఆ చిన్నారిని చివరికి భౌతికంగా హత్య చేశారు. అదీ అత్యాచారం చేసి.

ఇవి ఏ ఒక్కరిపైనో చేస్తున్న ఆరోపణలు కాదు. చదువు చెప్పాల్సిన టీచర్లు, స్వంత తల్లిలా చూసుకోవాల్సిన వార్డెన్...అక్కా, చెల్లెళ్ళుగా, అన్నా దమ్ములుగా ఉండాల్సిన తోటి విద్యార్థులు...మొత్తంగా సమాజం ఆ చిన్నారి మరణానికి కారణం.

యోగీ ఆదిత్యానాథ్ రాజ్యం ఉత్తరప్రదేశ్ లోని ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురిలోని నవోదయ పాఠశాలలో 16 ఏళ్ళ‌ అనుష్క పాండే 11వ తరగతి చదువుతోంది. చదువులో చురుకైన అనుష్క పదవతరగతిలో 93 శాతం మార్కులు సాధించి స్కూల్ టాపర్ గా నిలిచింది. డాక్టర్ అయ్యి ఈ సమాజానికి సేవ చేయాలని కలలు కన్నది.తాను బాగా సెటిల్ అయ్యి పేదరికంలో మగ్గుతున్న తల్లితండ్రులకు తోడుగా నిలబడాలనుకున్నది.... ఆ చిన్నారి కలలను ఆ పాఠశాల చిదిమేసింది. ఆ చిన్నారి తల్లితండ్రులకు ఎన్నటికీ ఆరని శోకాన్నిమిగిల్చింది.

అనుష్క అంటే మొదటినుండి ద్వేషం పెంచుకున్న హాస్టల్ వార్డెన్ మూడేళ్ళ క్రితం ఓ చారెడు మిక్చర్ దొంగతనం చేసిందని ఆరోపణలు చేసి క్లాసులోని 40 మంది స్టూడెంట్స్ తో ఆ చిన్నారి చెంపలపై కొట్టించడం పదమూడేళ్ళ వయసులో ఆ చిన్నపిల్ల మనసును ఎంత మానసిక క్షోబకు గురిచేసి ఉంటుంది. ఆ రోజు నుండి ప్రతి విద్యార్థి ఆమెను దొంగలా చూడడం, దొంగా అని పిలవడం ఈ మూడేళ్ళుగా ఆ చిన్నారి ఎలా తట్టుకొని ఉంటుంది ? అయినా బాధలన్నీ దిగమింగుకుంటూ చదువుపైనే దృష్టి పెట్టి స్కూల్ టాపర్ గా నిల్చిన ఆ అమ్మాయి ఈ నెల 16 న గదిలో ఫ్యానే లేని ఫ్యాన్ రాడ్ కు తాడుకు వేళాడుతూ కనిపించింది. శవమై కనిపించింది. ఎన్నో ఆశలను తమ కళ్ళల్లో నింపుకున్న తల్లితండ్రులకు ఇక ఎప్పటికీ కనిపించకుండా వెళ్ళిపోయింది.

అయితే నిజంగానే ఆమె ఉరేసుకొని చనిపోయిందా ? మూడేళ్ళుగా ఎన్ని అవమానాలెదురైనా పంటి బిగువన భరిస్తూ, ధైర్యంగా ఎదుర్కొంటూ వస్తున్న అనుష్క నిజంగానే ఆత్మహత్య చేసుకున్నదా ? కాదంటున్నారు ఆమె స్నేహితులు, తల్లితండ్రులు.

అక్కడి పరిస్థితులు కూడా ఆమెది ఆత్మహత్య కాదనే చెబుతున్నాయి. తమ కూతురు మరణం గురించి తమకు కనీస‌ సమాచారం ఇవ్వలేదని తమ‌ బంధువు అనుష్క మృతదేహాన్ని ఆసుపత్రిలో చూసినప్పుడు అనుష్క‌ మరణం గురించి తెలుసుకున్నట్లు తల్లిదండ్రులు చెబుతున్నారు.

ఈ కేసును ఆత్మహత్యగా ప్రకటించి అర్జెంట్ గా మూసేయాలని స్కూల్ అధికారులు, పోలీసులు, జిల్లా యంత్రాంగం ప్రయత్నించగా సోషల్ మీడియా భగ్గున మండింది. మొదట అనుష్క మరణంపై నవోదయ పాఠశాల మాజీ విద్యార్థి, గరుడ పబ్లికేషన్స్ సహ వ్యవస్థాపకుడు అంకుర్ పాఠ‌క్ వరుస ట్వీట్లతో విషయాన్ని ప్రపంచానికి తెలిపాడు.
పోస్టుమార్టం నివేదికల ప్రకారం అనుష్కను లైంగిక వేధింపులకు గురిచేసి, తరువాత హత్య చేసినట్లు ఆరోపించారు. ఆమె రూంలో ఫ్యానే లేదు. ఖాళీ ఫ్యాన్ రాడ్ మాత్రమే ఉన్నది. ఖాళీ ఫ్యాన్ డౌన్ రాడ్ యొక్క చిన్న రంధ్రాల ద్వారా ఒక గుడ్డను వేలాడదీసి ఆత్మహత్య చేసుకోవడం సాధ్యమేనా అని ఆయన ప్రశ్నించారు.

"పోస్ట్ మార్టంలో బాలికపై అత్యాచారం జరిగిందని తేలింది. అత్యాచారం చేసిన తర్వాత హత్య చేసి ఉరితీసి ఉండవచ్చు. అనుష్క పదవ తరగతిలో 93శాతం మార్కులు సాధించిన పాఠశాల టాపర్. డాక్టర్ కావాలనుకున్నది. జిల్లా యంత్రాంగం ఇప్పుడు కేసును మార్చేసే పనిలో బిజీగా ఉంది. ఈ కేసులో న్యాయం జరగాలంటే మొత్తం విషయంపై సిబిఐ విచారణ ఉండాలి. ఓ అమ్మాయిపట్ల ఇలా జరిగితే ఏ పేద తల్లి అయినా ఇక‌ తన కుమార్తెను హాస్టల్‌కు పంపించదు. ఇప్పుడు విద్యాలయంలోనే అత్యాచారాలు ప్రారంభమైనప్పుడు, అమ్మాయిలు చదువుకోవడానికి ఎక్కడికి వెళతారు? ʹ అని పాఠక్ ప్రశ్నించారు.
పాఠక్ ట్వీట్ల్ అతర్వాత సోషల్ మీడియాలో అనుష్కకు మద్దతుగా ఉద్యమం ఊపందుకుంది. జస్టిస్ ఫర్ అనుష్క పాండే అనే హాష్ ట్యాగ్ తో నెటిజనులు ప్రభుత్వంపై విరుచుకపడుతున్నారు. ముఖ్యమంత్రి యోగీ అదిత్యనాథ్ కలగజేసుకొని అనుష్కకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

చివరికి ప్రభుత్వం ప్రిన్స్ పాల్ ను సస్పెండ్ చేసింది. అనుష్క‌ తండ్రి పిర్యాదు మేరకు పోస్కో చట్టం కింద కేసు నమోదు చేశామని మెయిన్ పురి ఏస్పీ అజయ్ శంకర్ రాయ్ తెలిపారు. విచారణ జరుపుతున్నామని నేరస్తులను పట్టుకుంటామన్నారు.

మరో వైపు అనుష్క హత్య పై న్యాయ విచారణకు డిమాండ్ చేస్తూ మెయిన్ పురిలో విద్యార్థులు ప్రదర్శన నిర్వహించారు. ఢిల్లీ యునివర్సిటీ విద్యార్థులు, నవోదయ స్కూల్స్ మాజీ విద్యార్థులు కలిసి భారీ ప్రదర్శన నిర్వహించారు.
చివరకు తన కూతురును హత్య చేసినవారిని శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు( సెప్టంబర్ 23) మెయిన్ పురిలోని షహీద్ పార్క్ లో అనుష్క తల్లి ఆమరణ నిరాహార ధీక్ష చేపట్టారు. ఆమెకు మద్దతుగా అనుష్క గ్రామస్తులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇంత జరుగుతున్నా యోగీ ప్రభుత్వానికి చీమకుట్టినట్టైనా లేకపోవడం సిగ్గుచేటు అని విద్యార్థులు ఆగ్రహంగా ఉన్నారు

Keywords : uttar pradesh, navodaya school, anushka panday, death
(2019-11-19 20:08:25)



No. of visitors : 479

Suggested Posts


అది రామరాజ్యం... ఆవులకేమో అంబులెన్సులు... పిల్లల‌కేమో చావుకేకలు !

ఆవులకు ఏమైనా అయితే రక్షించడానికి, వాటిని ఆఘమేఘాలమీద ఆస్పత్రికి తరలించడానికి అంబులెన్స్ లు ప్రారంభించారు. ఇంత గొప్పగా జరుగుతున్న యోగీ మహరాజ్ పాలనలో గోరఖ్ పూర్ లోని ప్రభుత్వ ఆస్పత్రిలోఆక్సీజన్ లేక‌ 63మంది చిన్నారుల‌ ప్రాణాలు పోయాయి. ప్రభుత్వం బాకీ పడ్డ 60 లక్షల రూపాయలు ....

అది మనువాదపు కసాయి రాజ్యం ‍‍- ప్రేమంటే నరనరాన ద్వేషం

ఓ యుతి, ఓ యువకుడు జంటగా రోడ్డు మీద వెళ్తున్నారు. నవ్వుతూ తుళ్ళుతూ కబుర్లు చెప్పుకుంటూ వెళ్తున్న వాళ్ళను చూసి యాంటీ రోమియో స్క్వాడ్ ముసుగేసుకున్న మనువులకు మండింది. సంఘ్ పరివార్ పాలనలో మగ ఆడ కలిసి తిరగడ ఎంత పాపం ! ఆ పాపానికి ఒడిగట్టిన ఆ ఇద్దరినీ పట్టుకొని కొట్టారు, పోలీసులతో కలిసి యువకుడికి గుండు గీసి అవమానించారు....

అనుకున్నంతయ్యింది...బీజేపీ నేత కూతురును పెళ్ళి చేసుకున్న దళిత యువకుడిపై దాడి జరిగింది

నాన్నా నన్నూ అజిత్ ను చంపకండి ప్లీజ్ అంటూ ఉత్తర ప్రదేశ్ ఎమ్మెల్యే కూతురు సాక్షి మిశ్రా వేడుకున్న వీడియో మీకు గుర్తుంది కదా.... తాను దళితుడిని పెండ్లి చేసుకున్నందుకు మమ్మ‌ల్ని చంపడానికి నాన్న గూండాలను పంపుతున్నాడని, పోలీసులు తమకు రక్షణ కల్పించాలని ఆమె విఙప్తి చేసింది. అయితే ఆ యువతి అనుకున్నంతా అయ్యింది. సాక్షాత్తూ హైకోర్టు ముందరే వీరిపై దాడి

యోగీ రాజ్యం: ఆవును కాపాడటం కోసం మహిళను చంపేసిన పోలీసు

అది ఉత్తర ప్రదేశ్ లోని హర్రియా పట్టణం శనివారం నాడు వేగంగా వెళ్తున్న ఓ పోలీసు జీబు డ్రైవర్ కంట్రోల్ తప్పింది. ఆ జీబుకు ఎదురుగా ఓ ఆవు వస్తోంది. డ్రైవర్ కు ఆ సమయంలో తమ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యానాథ్, ఆయన శిష్యులైన గోరక్షకులు....

అమానుషంగా అమ్మాయిలను కొట్టారు...వాళ్ళ మీదే కేసులు పెట్టారు...బేటీ బచావ్...బేటీ పడావ్..అంటే ఇదేనా ?

విద్యార్థినులపై దాడి చేసి నెత్తురోడేట్టు అమానుషంగా కొట్టిన పోలీసులపై చర్యలు తీసుకోవల్సింది పోయి బాధితులపైనే కేసులు పెట్టారు. ఉత్తర ప్రదేశ్ లోని బెనారస్ హిందూ యూనివర్సిటీకి చెందిన 1000 మంది విద్యార్థులపై ఇవ్వాళ్ళ కేసు నమోదయ్యింది....

యోగీ రాజ్యంలో దారుణం... ఆక్సిజన్ లేక 30 మంది చిన్నారుల మృతి !

ఆక్సిజన్‌ సరఫరా చేస్తున్న కంపెనీకి ప్రభుత్వం కట్టాల్సిన 66లక్షల రూపాయల బాకీ కట్టకపోవడం వల్ల ఆ కంపెనీ ఆక్సిజన్‌ పంపిణీని ఆపేసింది. ఫలితంగా ఇంతమంది చిన్నారుల ప్రాణాలు గాల్లో పోయాయి....

పోలీసుల దుర్మార్గం...బాలిక గ్యాంగ్ రేప్ !

రక్షక భటులు ఓ బాలికను కాటేశారు. కిడ్నాప్ చేసి దారుణంగా రేప్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని మథుర గోవింద్‌నగర్లో పదవతరగతి చదువుతున్న ఓ బాలికను ఇన్స్‌పెక్టర్ రమాకాంత్ పాండే, మరో పోలీస్ ప్రవీణ్ ఉపాధ్యాయ్‌లు....

అది విషాదంకాదు నరమేధం... 63 కు చేరిన చిన్నారుల మరణాలు

యోగీ ఆదిత్యానాథ్ రాజ్యంలో చిన్నారుల నరమేధం కొనసాగుతోంది. ప్రభుత్వం నిర్లక్ష్యం 63 మంది చిన్నారులను బలితీసుకుంది. గోరఖ్ పూర్ లోని బాబా రాఘవ్‌దాస్‌ ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆక్సిజన్ లేక నిన్న 31 మంది చిన్నారుఅ ఊపిరి ఆగిపోగా ఇవ్వాళ్ళ ఆ సంఖ్య 63 కు...

పరీక్షలు రాసింది 12 వేల మంది... పాసయ్యింది 20 వేల మంది

12,800 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. కానీ పాసయ్యింది మాత్రం 20,089 మంది. చివరి నిమిషంలో ఈ అంకెలు చూసిన అధికారులు షాకయిపోయారు. ఏం చేయాలో అర్దం కాక తలలు పట్టుకొని ఆలోచించి చివరకు పరీక్షా ఫలితాల....

ముస్లిం మహిళలను గ్యాంగ్ రేప్‌ చేయండి.. బీజేపీ మహిళా మోర్చా చీఫ్ సునీత

ఇప్పుడు ముస్లింలకు ఒకే ఒక్క పరిష్కారం ఉంది. హిందూ సోదరులు పది మంది కలిసి గ్రూపుగా ఏర్పడి ముస్లిం మహిళలను గ్యాంగ్ రేప్ చేయాలి. తల్లులు, చెల్లెళ్లు ఎవరినీ వదలకూడదు. అందరినీ బహిరంగంగా వీధుల్లోకి లాక్కొచ్చిమరీ అత్యాచారం చేయాలి.

Search Engine

ప్రజల పక్షాన మాట్లాడుతున్నందుకే ఈ అక్రమ కేసులు : విరసం
Withdraw the False Case against Veekshanam Editor!
వీక్ష‌ణం సంపాద‌కుడిపై UAPA కేసు
భగత్ సింగ్ తుపాకీ - జార్జిరెడ్డి సినిమా...!!
Arrest of B Anuradha & N Ravi Sharma – Fact and Fiction
అనూరాధ, రవి శర్మల అరెస్టు – వాస్తవమూ కల్పనా..!
కేసీఆర్ అప్రజాస్వామిక పాలన‌: అనురాధ, రవిల అరెస్ట్ - రాజద్రోహం, యూఏపీఏ కేసులు బనాయింపు
ఫీజుల పెంపును నిరసిస్తూ.. కేంద్ర మంత్రిని నిర్బంధించిన జేఎన్‌యూ విద్యార్థులు..!
పోలీసుల అడ్డంకులు ఛేదించుకుని సమరోత్సాహంతో ట్యాంక్ బండ్ పైకి దూసుకొచ్చిన‌ కార్మికులు
చలో ట్యాంక్ బండ్ లో మావోయిస్టులున్నారన్న సీపీ... ఉక్కుపాదం మోపడం కోసమే ఈ ఆరోపణలన్న‌ ఆర్టీసీ జేఏసీ
వేలాది పోలీసు బలగాల నిర్బంధాల మధ్య‌ చలో టాంక్ బండ్ విజయవంతం
ఆర్టీసీ సమ్మెకు రాజకీయ ఖైదీల మద్దతు.. జైళ్లో నిరసన.. చలో ట్యాంక్‌బండ్ విజయవంతం చేయండి..!
భగత్ సింగ్ పిస్టల్ – అనేకానేక స్మృతులు
జర్నలిస్టులు, దళిత, మానవహక్కుల కార్యకర్తల వాట్సప్ ఖాతాలు హ్యాక్
దొర ప్రతాపమంత మజ్దూర్ల మీదనే!
తెలంగాణలో పాత రోజులు మళ్ళీ దాపురించాయి... అణిచివేతే పాలకుల విధానమయ్యింది
ఆర్టీసీ సమ్మె పై నిర్భందం...పౌరహక్కుల సంఘం ఆగ్రహం
భారత విప్లవోద్యమంలో చారుమజుందార్‌ - రేపే శతజయంతి సదస్సు
నలమాస కృష్ణ, మద్దిలేటిల అరెస్టు చట్టబద్దం కాదు - హైకోర్టు
ʹఆవులగురించి కాదు ఆడపిల్లల గురించి శ్రద్ద పెట్టండిʹ
ఈ కుట్ర కేసు వెనుక ఉన్న కుట్రలో అసలు కథ‌ ఇంకోటి ఉంది
నలమాస కృష్ణ, మద్దిలేటి అరెస్ట్...అక్రమం అంటున్న ప్రజా సంఘాలు
RTC కార్మికులారా ఆత్మహత్యలు వ‌ద్దు.. తెలంగాణ సమాజం మీ వెంట‌ ఉంది.. పోరాడి హక్కులు సాదించుకుందాం !
దేశానికి రానున్నవి చీకటిరోజులు
మావి నిషేధిత సంఘాలు కావు
more..


చిన్నారిపై