ఐదు దశాబ్దాల వసంతగానం


ఐదు దశాబ్దాల వసంతగానం

ఐదు

మలుపు ప్రచురణగా
విప్లవ సాహిత్య విమర్శ మూడు సంపుటాలు

ఐదు దశాబ్దాల వసంతగానం
————————————-

వర్గపోరాట ఆచరణలో
1. విప్లవ సాహిత్య సిద్ధాంతం
2. తెలుగు సాహిత్య చరిత్ర-ఉద్యమాలు
3. విప్లవ సాహిత్య విమర్శ
సంపాదకులు : పాణి

తెలుగు సృజనాత్మక, మేధో రంగాల్లో విప్లవ సాహిత్యోద్యమ కృషికి సాహిత్య విమర్శ ఒక బలమైన ఉదాహరణ. నక్సల్బరీ శ్రీకాకుళ పోరాటాలు మన దేశంలో వర్గపోరాటాన్ని రంగం మీదికి తీసుకొని వచ్చాయి. ఈ ప్రభావం అన్ని జీవన రంగాలను స్పృశించింది. బ్రాహ్మణీయ భూస్వామ్య, రివిజనిస్టు, శుష్క మానవతా వాద విలువలన్నిటి మీద నక్సల్బరీ తీవ్ర విమర్శ పెట్టింది. వాటిని ఎదుర్కొనే క్రమంలోనే వర్గపోరాట ప్రత్యామ్నాయాన్ని అన్ని రంగాల్లో ప్రవేశ పెట్టింది. అందులో ప్రధానమైనది విప్లవ సాహిత్య విమర్శ.
మార్క్సిస్టు తత్వశాస్త్రం, చారిత్రక భౌతికవాదం, వర్గపోరాట సిద్ధాంతం పునాదిగా విప్లవ సాహిత్య విమర్శ ఆరంభమైంది. అందు వల్లనే సంస్కృత అలంకార శాస్త్రాలను పూర్వపక్షం చేసింది. శిష్ట సాహిత్య విలువలను తుత్తునియలు చేసింది. సమాంతర ప్రజా, దేశీ సాహిత్య సంప్రదాయాలను వెలికి తీసి విశ్లేషించింది. సామాజిక అధిపత్యానికి వ్యతిరేకంగా చరిత్రలో సాగిన ధిక్కార ఆలోచనారీతులను పరిశీలించింది. జీవితంలోని సకల పార్వ్శాలను ప్రగతి గీటురాయి మీద వివరించడానికి అవసరమైన పరికరాలను అందించింది. వేర్వేరు సామాజిక శాస్త్రాల వెలుగులో సాహిత్యాన్ని అంచనా వేసింది. మానవ జీవితంలో, వర్గపోరాటంలో కళా సాహిత్యాల పాత్రను విప్లవ సాహిత్య విమర్శ మదింపు వేసింది. జానపదాలు, ప్రజా కళా రూపాల దగ్గరి నుంచి వచన కవిత, కథ, నవల వంటి అనేక ప్రక్రియలకు విప్లవ సాహిత్య విమర్శ విస్తరించింది. వివిధ ప్రక్రియల ప్రత్యేకతల దృష్ట్యా సాహిత్య విమర్శ పద్ధతులను అభివృద్ధి చేసింది.
తెలుగు సాహిత్య రంగంలో ఈ యాభై ఏళ్లలో వచ్చిన అనేక ప్రతీఘాతుక ధోరణులను గుర్తించి ఓడించే క్రమంలో విప్లవ విమర్శ అభివృద్ధి సాధించింది. అలాగే వేర్వేరు పీడిత అస్తిత్వవాదాలతో నిరంతర సంభాషణ ద్వారా విప్లవ సాహిత్యోద్యమం విమర్శ రంగానికి కొన్ని కీలక భావనలు సమకూర్చింది. అలాగే విప్లవోద్యమ ప్రత్యక్ష ఆచరణ నుంచి వెలుబడుతున్న సాహిత్యాన్ని అంచనా వేయడానికి అవసరమైన నూతన ప్రమాణాలను తీర్చిదిద్దింది. ఇది ఇవాళ దండకారణ్యం నుంచి వెలుబడుతున్న అపార వైవిధ్య భరితమైన కథలకు సాధికార విశ్లేషణ అందించడం ద్వారా తెలుగు సాహిత్య విమర్శను చాలా ముందుకు తీసికెళ్లింది. ప్రయోగం, వైవిధ్యం, జీవితానుభవ ప్రత్యేకతలు మొదలైన వాటిని దృక్పథం గీటురాయి మీద అంచనా వేస్తున్నది.
అభ్యుదయ సాహిత్య విమర్శ కృషిని గుర్తిస్తూనే అందులోని లోపాలు, పరిమితులను ఎత్తి చూపుతూ మొదలైన విప్లవ సాహిత్య విమర్శ ఎప్పటికప్పుడు తనలోని లోపాలను సహితం సవరించుకుంటూ విస్తరిస్తోంది. గత సూత్రీకరణలను విస్తరించుకుంటూ పురోగమిస్తోంది. మూడు తరాల విప్లవ సాహిత్య విమర్శ అనేక ప్రభావాలు వేసినట్లే అనేక ప్రగతిశీల ఉద్యమాల, భావనల ప్రభావాలకు కూడా గురై పదునుదేలుతోంది. సాహిత్య సిద్ధాంతం, సాహిత్య చరిత్ర, అన్వయ, ప్రక్రియా విమర్శగా కొనసాగుతున్నది. ఈ మొత్తానికి విప్లవోద్యమ ఆచరణతోపాటు అనేక జీవన రంగాల్లో సాగుతున్న ప్రజా సామాజిక ఆచరణ ఆలంబన.
విప్లవ రచయితల సంఘం యాభై వసంతాల చారిత్రక సందర్భంలో ఈ ఐదు దశాబ్దాల సాహిత్య విమర్శను మలుపు ప్రచురణగా పాఠకులకు అందిస్తున్నందుకు సంతోషంగా ఉంది. సాహిత్య సిద్ధాంతం, తెలుగు సాహిత్య చరిత్ర-ఉద్యమాలు, సాహిత్య విమర్శగా మూడు సంపుటాలను ఈ ఏడాదిలో వరుసగా విడుదల చేస్తాం.
మలుపు

Keywords : virasam, naxalbari, revolutionary writers
(2020-01-15 20:03:40)No. of visitors : 426

Suggested Posts


మహాశ్వేతా దేవి - మన తెలంగాణ సాగర హారంః వరవర రావు

మన మహా సాగరహారం ʹచలో హైదరాబాద్ అంటూ తెలంగాణ మార్చ్ చేసిన సెప్టెంబర్ 30, 2012 మహత్తర మధ్యాహ్నం మహాశ్వేతాదేవి కూడా మన ఊర్లో ఉన్నారు. ఆ రోజు ఆమెను మన మధ్యకు తెచ్చుకొని ఉంటే....

సెప్టెంబర్ 17 - ఇండియన్ యూనియన్ సైనిక దురాక్రమణ దినం - వరవరరావు

1947 ఆగస్ట్ 15న విలీనానికి అంగీకరించకుండా షరతులు విధిస్తూ వచ్చిన నిజాంను నెహ్రూ - పటేల్ ప్రభుత్వం సగౌరవంగా, సాదరంగా చర్చలకు ఆహ్వానించింది. అప్పటికే నిజాంను వ్యతిరేకిస్తూ వీరోచిత పోరాటం నడుపుతున్న కమ్యూనిస్టులను మాత్రమే కాదు, కనీసం కాంగ్రెస్ ను కూడా ఈ చర్చల్లో భాగం చేయలేదు....

ఆదివాసి.. లంబాడా వివాదం ‍- ఎం.రత్నమాల

మహారాష్ట్ర ప్రభుత్వం లంబాడాలను ఆదివాసి తెగగా గుర్తించడం లేదు కనుక ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం లంబాడాలను ఆదివాసి షెడ్యూల్డు తెగగా ప్రకటించడంతో దీన్ని అవకాశంగా తీసుకుని మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్‌ (పాత) జిల్లాకు లంబాడాల వలసలు పెద్ద ఎత్తున వెల్లువలా సాగాయి.....

ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ పోరాటానికి విరసం మద్దతు

అట్టడుగున ఉన్న మనిషికి ఫలితాలు అందినప్పుడే సామాజిక న్యాయం జరిగినట్టు లెక్క. మాదిగ, డక్కలి, చిందు, మాష్టి, బుడగజంగం, దాసరి, బేగరి కులాలకు ఈ నాటికీ ఎస్సీ రిజర్వేషన్ ఫలాలు అందడం లేదు....

ʹఅరుణోదయʹ పై పోలీసుల దాడిని ఖండించిన విరసం

తెలంగాణ ఉద్యమంలో ఆట పాటతో ఆరుణోదయ కళాకారులు గ్రామ గ్రామాన తిరిగి ప్రజల్లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తమ వంతు కృషి చేశారు. ఆ సంస్థ కార్యాలయాన్ని దౌర్జన్యంగా మూసేయడం అత్యంత నిరంకుశమైన......

ఆ నిండైన సాహిత్య సామాజిక జీవితం రచయితలందరికీ ఆదర్శం - విరసం

ʹరచయితలందరూ తమ తరానికి జవాబుదారులు; తమకు తాము జవాబు చెప్పుకోవాల్సిన వాళ్ళు... అంతస్సాక్షి ఉన్న రచయిత పీడిత ప్రజల పక్షాన దృఢంగా నిలవాలి. అలా కాకపోతే ఆ రచయితల్ని నిర్దోషులుగా నిర్ణయించే ప్రశ్నే లేదు.ʹ....

ఉత్తేజకరంగా సాగిన విరసం సాహిత్యపాఠశాల‌

అంతకుముందు అంతర్జాతీయ శ్రామికవర్గ పతాకావిష్కరణతో కార్యక్రమాలను ప్రారం భించారు. అమరుడు పులి అంజన్న తల్లి సైదమ్మ ఎర్ర జెండాను, సీనియర్ విరసం సభ్యురాలు రత్నమాల విప్లవ రచయితల సంఘం జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా అమరుడు శేషయ్య సోదరుడు సాంబయ్య, అమరుడు వివేక్ తండ్రి యోగానంద్ అమరుల స్థూపాన్ని ఆవిష్క రించారు.

అమరుడు బొజ్జా తారకం — ʹనది పుట్టిన గొంతుకʹ - వరవరరావు

గోదావరి తెలంగాణలో ప్రవేశించిన నిజామాబాద్ కు 1968లో వచ్చిన తారకం గారు ఇక్కడి మట్టిలోని ఎరుపులోనూ, ఇక్కడి నీళ్లలోని ప్రవాహ గుణంలోనూ కలగలిసిపోయారు. 1968 నుంచి 78 దాకా ఒక దశాబ్దం పాటు విప్లవోద్యమాలకు, విప్లవ సాహిత్యానికి నిజామాబాద్ చిరునామా బొజ్ఞాతారకం....

ʹఆయన జైల్లోనే చనిపోతారేమోʹ

90 శాతం అంగవైకల్యం కలిగిన సాయిబాబాను అన్యాయంగా జైల్లో పెట్టారని.. ఆయనేమైనా యుద్ద ఖైదీనా..? ప్రభుత్వ అనాలోచిత చర్యతో యుద్ధఖైదీ మాదిరి ఆయన జైల్లోనే తుది శ్వాస విడిచే పరిస్ధితి వచ్చిందని ...

ʹఅన్నలు మల్లొస్తరు బిడ్డా.. ఆల్లొస్తే వాళ్ళకు గిన్ని మంచి నీల్లో, తిండో పెట్టాలనే బతుకుతాన్నʹ

అందుకే అంత నిర్బంధంల కూడా నా కొడుకు అంత్యక్రియలకు వచ్చిన జనాలకు మా ఖిలా వరంగల్ సరిపోలె. ఎక్కడోల్లను అక్కడ అరెస్ట్ చేసినా వచ్చిండ్రు. ఎవరో నక్సలైట్ అట, చిన్న పిల్లగాడేనట, బలే తెలివికల్లోడట అని అనుకుంట జనాలు వచ్చిండ్రు. పద్దెనిమిది నిండి పందొమ్మిది పడగానే చంపేసిండ్రు.

Search Engine

కట్టుకథ ఆధారంగా కాశీం అరెస్ట్...!!
ʹప్రొఫెసర్ కాశీంను అణగారిన ప్రజల వైపు నిలబడ్డందుకే అరెస్ట్ చేశారుʹ
ఉరిశిక్ష‌లు, ʹఎన్‌కౌంట‌ర్ʹ హ‌త్య‌ల‌తో నేరాల నియంత్ర‌ణ సాధ్య‌మేనా?
రాజ్యాంగమే నా బలం,ఆ బలంతోనే పోరాటం కొనసాగిస్తా - ఆజాద్
మోడీ భారత పౌరుడనే రుజువుందా ? ఆర్టీఐ ద్వారా అడిగిన కేరళవాసి
వాళ్ళిద్దరి కోసం..!
జేఎన్‌యూ తర్వాత‌...ఇప్పుడు మరో యూనివర్సిటీ విద్యార్థులపై దాడి
మమ్మల్ని ఈ దేశం నుండి బహిష్కరించండి - రాష్ట్రపతికి లేఖ రాసిన ʹఉనాʹ దళితులు
JNU పై దాడి చేసిందెవరో తేల్చి చెప్పిన వార్డెన్ల నివేదిక‌
భీం ఆర్మీ ఛీఫ్ ఆజాద్ కు బెయిల్...నెల రోజులు సహరన్ పూర్ లోనే ఉండాలని కండీషన్
మోడీషా రాజ్య నిర్బంధంలో మగ్గుతున్న భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ విడుదలకై ఉద్యమిద్దాం
విద్వేషం అతని మతం.. అణచివేత అతని ఆయుధం..!
మీరు చేస్తే గొప్ప పని ప్రజలు చేస్తే హింసనా జగ్గీ గారు
ఈ ప్రభుత్వమే నిర్బంధ కేంద్రాల్లోకి నెట్టబడే రోజొస్తుంది : అరుంధతి రాయ్
మన చేతుల మీది నెత్తుటి మరకలు కడగడానికి ఎన్ని సముద్రాలు కావాలి?
నిజం ఎప్పటికి బయటకు వస్తుంది?
విరసం అధ్యక్ష కార్యదర్శులుగా అరసవెల్లి కృష్ణ,కాశీం
50 ఏళ్ల.. దుఃఖం, నిర్భంధం, ధిక్కారం, స్పూర్తి... 50 ఏళ్ల విరసం మహాసభలు
విరసం 50 ఏళ్ళ సభలు...నోమ్ ఛామ్ స్కీ సందేశం
సృజ‌నాత్మ‌క ధిక్కారం.. విర‌సం 50 ఏళ్ల స‌భ‌లు ప్రారంభం
విరసం 50 ఏళ్ల సభలు.. పూణే జైలు నుంచి వరవరరావు సందేశం
CPI (Maoist) oppose Citizenship Amendment Act, calls to intensify mass campaign against it
అమిత్ షాకు బహిరంగ లేఖ‌ !
50 ఏళ్ళ ధిక్కారస్వరం...ఈ నెల11,12 తేదీల్లో విరసం రాష్ట్ర‌ మహాసభలు
నెత్తుటి ఏరులు పారినా ఎత్తిన జెండా దించకుండా... మళ్ళీ పిడికిలెత్తిన జేఎన్‌యూ
more..


ఐదు