అమేజాన్‌ కార్చిచ్చుకు అసలు కారణం - పి.వరలక్ష్మి

అమేజాన్‌


(పి.వరలక్ష్మి రాసిన ఈ వ్యాసం వీక్షణం అక్టోబర్,2019 సంచికలో ప్రచురించబడినది)

ఆగస్టు 19వ తేదీ బ్రెజిల్‌ నగరాలపై అలముకున్న దట్టమైన పొగ ప్రపంచాన్నే ఉక్కిరిబిక్కిరి చేసింది. ప్రపంచంలోని అతి పెద్ద ఉష్ణమండల వర్షారణ్యం దారుణంగా తగలబడిపోతోందని సోషల్‌ మీడియాలో ప్రకంపనలు మొదలయ్యాయి. అమేజాన్‌ అడవులను కాపాడండడని ట్యాగ్‌లైన్లు, సెలబ్రిటీల ప్రకటనలు హోరెత్తాయి. కార్చిచ్చు పడిన భూమిని అంతరిక్షం నుండి చూపించే ఉపగ్రహ చిత్రాలను నాసా విడుదల చేసింది. ఊరేగింపులు, నిరసన ప్రదర్శనలు వెల్లువెత్తాయి. బహుషా మొదటిసారి ప్రపంచమంతా ఒక్కటై పర్యావరణం కోసం గొంతువిప్పిన సందర్భం ఇదేనేమో. జి7 దేశాల కూటమి కూడా ఈ కార్చిచ్చును గురించి చర్చించింది. ఇది తక్షణ తాత్కాలిక ప్రతిస్పందనే, కాని ఈ వార్తా సంచలనం పర్యావరణ స్పృహను ఎంతో కొంత పెంచగలిగింది. పర్యావరణ సమతుల్యత కోసం అడవుల పరిరక్షణ ఎంత ముఖ్యమో అందరూ మాట్లాడుతున్నారు. భూమ్మీద ప్రాణులకు 20 శాతం ఆక్సీజన్‌ అమేజాన్‌ నుండే వస్తుందనే అతిశయోక్తులు చక్కర్లు కొట్టాయి. ప్రపంచానికి ఊపిరితిత్తుల వంటి అమేజాన్‌ అడవులు ఈ స్థాయిలో తగలబడడానికి కారణం బ్రెజిల్‌ ప్రభుత్వ పర్యావరణ వ్యతిరేక విధానాలని ఆ దేశాధ్యక్షుడు బోల్సొనారోపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయినా సెప్టెంబర్‌ చివరి వారానికి కూడా అడవి మండుతూనే ఉంది. తాజా సమాచారం ప్రకారం ఇంకా 1,31,600 కార్చిచ్చులు మండుతూనే ఉన్నాయి.

భూగోళానికి అమేజాన్‌ అడవుల ప్రాధాన్యత చిన్నది కాదు. అమేజాన్‌ ఉష్ణమండల వర్షారణ్యాలలో అతి పెద్దది. ఉష్ణమండల వర్షారణ్యాలు భూవాతావరణాన్ని, జీవసమతుల్యతను కాపాడడంలో కీలక పాత్ర వహిస్తాయి. ఎంత దట్టంగా చెట్లు పెరిగి ఉంటాయంటే ఇక్కడ 2 శాతానికి మించి సూర్యరశ్మి నేలను తాకదు. ఏడాది పొడవునా పచ్చగా ఉండే ఈ అడవులు ఆరు శాతం భూమిని ఆక్రమించుకుని ఉంటే, ఇక్కడ 50 శాతం జీవులు నివసిస్తున్నాయని శాస్త్రవేత్తలు అంచనావేస్తున్నారు. ప్రపంచంలోని నాలుగోవంతు ఔషద మొక్కలు ఇక్కడే ఉన్నాయి. అమేజాన్‌ అడవులు 55 లక్షల చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో (ఇండియా వైశాల్యం 32.8 లక్షల చ.కి.మీ.) ఎనిమిది దేశాలలో నిరంతరాయంగా విస్తరించి ఉన్నాయి. సుమారు 60 శాతం అమేజాన్‌ అడవి బ్రెజిల్‌లోనే ఉంది. ప్రపంచానికి ఊపిరితిత్తులు అనడం అతిశయోక్తి ఏమోగాని అమేజాన్‌ భూతాపాన్ని చల్లార్చే ఏసీలాగా అయితే పనిచేస్తుంది. కాలుష్యం, ఇతరేతర కారణాల వల్ల భూ ఉపరితలం మీదికి విడుదలయ్యే కొన్ని కోట్ల టన్నుల కర్బన ఉద్గారాలను పీల్చుకునే స్థాయి ఈ దట్టమైన అడవులకు ఉంది. ఈ ఉద్గారాలు భూమి వేడెక్కడానికి ప్రధాన కారకాలు. అమేజాన్‌ అడవుల విధ్వంసం వల్ల భూతాపం మునుపటి కన్నా తీవ్రంగా పెరిగిపోతుంది.

నిజానికి అడవుల్లో కార్చిచ్చులు కొత్త కాదు. ఈ ప్రాంతంలో జులై నుండి అక్టోబర్‌ వరకు ఉండే పొడి కాలంలో మంటలు చెలరేగడం సహజం. పిడుగుపాటు వల్ల కూడా మంటలు వస్తాయి. అయితే ఇక్కడ ఎగసే మంటలకు ప్రధాన కారణం ఎక్కువగా పంటలు సాగు చేసుకోవడం కోసం రైతులు అడవిని నరికి తగలబెట్టడమే. ఇది ప్రతి ఏడాదీ బ్రెజిల్‌తోపాటు పెరు, బొలీవియా, కాంగో, అంగోలా, జాంబియా వంటి దేశాలలో ఉండేదే. కానీ బ్రెజిల్‌లో ఈ ఏడాది జనవరి నుండి ఆగస్టు వరకు 85 శాతం అధికంగా మంటలు చెలరేగినట్లు ఆ దేశ అంతరిక్ష పరిశోధన సంస్థ నివేదించింది. జనవరిలో అధికారంలోకి వచ్చిన జైర్‌ బొల్సొనారో విధానాలే ఇందుకు కారణమని ప్రపంచమంతా అతన్ని తిట్టిపోస్తోంది. ఇందులో వాస్తవం ఉంది కానీ బొల్సొనారో ఒక్కడే విలన్‌ కాదు. ఇంకా చెప్పాలంటే ఇతను మెయిన్‌ విలన్‌ కాదు. ఇప్పుడు పర్యావరణ చర్చంతా బ్రెజిల్‌ కేంద్రంగా, ఆ దేశ ʹపొగరుబోతుʹ అధ్యక్షుడి కేంద్రంగా జరుగుతుండడంతో అసలు చర్చనీయాశం ముందుకు రావడం లేదు.

ఇవాల్టి సంక్షోభం అర్థం కావాలంటే బ్రెజిల్‌లో యాభై ఏళ్లుగా అమలవుతున్న రాజకీయార్థిక విధానాల గురించి కనీసంగానైనా తెలుసుకోవాలి. 1964 నుండి 1985 వరకు బ్రెజిల్‌ సైనిక పాలన కింద ఉన్నప్పుడు బహుళ జాతి సంస్థలు ఇక్కడ ప్రయోగాలు చేయడం మొదలు పెట్టాయి. బ్రెజిల్‌ను ʹఅభివృద్ధిʹ చేయడానికి ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య సంస్థలు ఆ దేశంలో విస్తారంగా రోడ్లు, భారీ డ్యాముల వంటి నిర్మాణాలకు సహకారం అందించాయి. ప్రపంచ బ్యాంకు అభివృద్ధి పథకంలో భాగంగా బ్రెజిల్‌ ప్రభుత్వం కార్పొరేట్‌ సంస్థలకు సబ్సిడీలు ఇచ్చి గనుల తవ్వకాలను ప్రోత్సహించింది. ఇదంతా జరిగింది అమేజాన్‌ అడవి ప్రాంతంలోనే. 1972లో బి.ఆర్‌. 230 అనే 4 వేల కిలో మీటర్ల జాతీయ రహదారి అమేజాన్‌ అడవిని చీలుస్తూ నిర్మాణమైంది. 1960లలో ప్రారంభమై 1980లో పూర్తయిన మరో రహదారి 4,325 కిలోమీటర్ల మేరా అమేజాన్‌ పరీవాహక ప్రాంతంలో ఉన్న రాష్ట్రాలను అనుసంధానించింది. ఇవి అడవి సంపదను తరలించే రహదారులని వేరే చెప్పనక్కర్లేదు. ఇనుము, రాగి, బంగారం తదితర గనుల నుండి ముడిసరుకు ప్రపంచ మార్కెట్‌కు సులువుగా చేరే మార్గం పడింది. వ్యాపార పంటలు వ్యవసాయంలోకి ప్రవేశించాయి. సోయాబీన్‌, చెరకు, కాఫీ, కోకో, పామ్‌ ఆయిల్‌ పంటలు, బీఫ్‌ పరిశ్రమకు అవరమయ్యే పశువుల కోసం పచ్చిక బయళ్ళు విస్తరించే కొద్దీ అడవి తరుగుతూ వచ్చింది.

70ల ప్రాంతంలోనే చాలా మంది మైదాన ప్రాంతపు చిన్న రైతులు అడవుల్లోకి తరలిపోయి చెట్లు నరికి వ్యవసాయం చేసుకోవడం మొదలైంది. ప్రపంచ మార్కెట్‌ అవసరాల కోసం వెలిసిన ఆధునిక వ్యవసాయ క్షేత్రాలు, యంత్రీకరణ వల్ల చాలా మందికి పని లేకుండా పోయి ప్రజలు వలసలు పోవలసి వచ్చింది. భూమి అంతకంతకూ కొద్ది మంది చేతుల్లో కేంద్రీకరించబడింది. వలసలు పెరుగుతూపోయి నగరాలు పట్టకుండా అయిపోయాయి. మురికివాడలు విస్తరించాయి. ఇట్లా వలస వచ్చిన జనాభాను నగరాలు పోషించలేకపోయాయి. ఆర్థిక సంక్షోభం, సైనిక పాలన బ్రెజిల్‌ను అశాంతితో కుదిపేశాయి. అలజడులు రేగాయి. ప్రజలకు ఉపాధి కల్పించలేని పాలకులు అనివార్యంగా కొంత జనాభాను అడవులవైపు పంపాల్సి వచ్చింది. అమేజాన్‌ అడవులల్లోకి రోడ్లు కూడా పడడంతో సులభంగా మైదాన ప్రాంతం వాళ్లు లోలోపలికి వెళ్లగలిగారు.

ఎగుమతుల కోసం పండించే పంటలకు ప్రోత్సాహకాలు, అటవీ ప్రాంతంలో నివాసాలు, వ్యవసాయ క్షేత్రాల కోసం కూడా ప్రపంచ బ్యాంకు సహకారం ఉంది. ఇటువంటి అభివృద్ధి ప్రణాళికలే బొలీవియా, మొజాంబిక్‌, ఇండొనేషియా, వియత్నాం వంటి దేశాల్లో కూడా రచించారు. మౌలిక సదుపాయాలు మెరుగుపరిచి పేద దేశాలను అభివృద్ధి వైపు నడిపించే ఘనమైన లక్ష్యాలు ప్రకటించే ప్రపంచ బ్యాంకు మొదట భారీ రోడ్ల ప్రాజెక్టుతో బయలుదేరుతుంది. సులభంగా ముడిసరుకులు తరలించేందుకు మార్గాలనేర్పరచుకుంటుంది. తమ పరిశ్రమలకు విద్యుత్తు, నీటి సౌకర్యం కోసం పెద్ద పెద్ద డ్యాములు కట్టించుకుంటుంది. తిరిగి తానే సాయం చేస్తున్నట్లు భ్రమింపజేస్తుంది. ఇది ఎప్పటి నుండో నడుస్తున్న పాత కథే. ఈ బలిసిన బహుళజాతి సంస్థలే పర్యావరణ పరిరక్షణ కోసం కూడా సాయం చేస్తామంటాయి.

పెద్ద పెద్ద మైనింగ్‌ సంస్థలు, ప్లాంటేషన్ల దగ్గరి నుండి భూమి, భుక్తి కరువై నిలువనీడ లేక అడవుల్లోకి వలసపోయి సాగు చేసుకుంటున్న పేద రైతుల దాకా అందరూ అడవినే ఆధారం చేసుకున్నారు. అడవిలో పెట్టుబడి కార్చిచ్చు ఎప్పుడో పడింది. అది దశాబ్దాలుగా పర్యావరణాన్ని దహిస్తూనే ఉంది. కానీ మంటల పాపం రైతులు మోస్తున్నారు. ఇదంతా ఇలా ఉంటే ఆదివాసీలు అత్యంత దారుణమైన దోపిడికి గురవుతున్నారు. సుమారు పది లక్షల మంది ఆదివాసులు ఎప్పటి నుండో ఈ అడవుల్లో ప్రకృతితో మమేకమై జీవిస్తున్నారు. ప్రపంచంలో ఎక్కడైనా వీరి ఉనికి అడవికి, పర్యావరణానికి ఎన్నడూ హాని చేయదు. పైగా అడవులను పరిరక్షించేది కూడా ఆదివాసులే. సాధారణంగా ఆదివాసుల పోడు వ్యవసాయం ఎలా ఉంటుందంటే ఒకసారి నరికిన అడవి పునరుద్ధరణ చెందే కాలం కన్నా వేగంగా వాళ్లు అడవిని కొట్టివేయరు. ప్రకృతి సహజ పునరుత్పత్తి క్రమానికి, వీరి ఉత్పత్తి క్రమానికి సుమారుగా వైరుధ్యం ఉండదు. దీనికి విరుద్ధంగా విశాలమైన అటవీ ప్రాంతాలను ధ్వంసం చేసే భారీ ప్రాజెక్టులకు, మైనింగ్‌ కార్యకలాపాలకు వ్యతిరేకంగా అమేజాన్‌ ఆదివాసులు పోరాడుతున్నారు. వీరి ప్రాచీన ఉత్పత్తి విధానం ప్రకృతితో స్నేహపూరితంగా ఉంటుంది కానీ, భారీ లాభాలనాశించే వ్యవసాయ పరిశ్రమ అవసరాలకు అది తగనిది. కాబట్టి పెట్టుబడిదారీ విధానం ఆదివాసీ ప్రాంతాల్లోకి మైదాన ప్రాంతాల వాళ్లను తరలించి ఆధునిక వ్యవసాయ పద్ధతుల్ని అమలుజరుపుతుంది. ఫలితంగా ఆదివాసీ సమాజం సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అడవి తగలబడుతుంటే నిస్సహాయంగా పరుగులు తీసిన వన్యప్రాణుల అవస్థా, వీరి అవస్థా ఒకటే.

ప్రపంచానికి మా దేశపు అడవులే ఎందుకు ఊపిరినందించాలి అని బొల్సొనారో వితండవాదం చేస్తుండొచ్చు. తమకు అవసరమైనదానికన్నా ఎక్కువ అడవే ఉందని, కానీ వ్యవసాయానికి అవసరమైన భూమి కొరత ఉందని, అయినా గ్లోబల్‌ వార్మింగ్‌ వంటి ట్రాష్‌ మాట్లాడుతూ తమ అభివృద్ధికి అడ్డంపడే హక్కు ఎవరికీ లేదని అతను నోరు పారేసుకోవచ్చు. కానీ ఈ తరహా అభివృద్ధి విధానం, అభివృద్ధి వాదన ఎవరు ప్రవేశపెట్టారు? పర్యావరణ పరిరక్షణ గురించి యూరప్‌ మాకు పాఠాలు నేర్పుతుందా అని అతను అడగడంలో అసలే లాజిక్‌ లేదంటామా? అమేజాన్‌ తగలబడడానికి బ్రెజిల్‌ రైతులు కారణమా? అటవీ చట్టాలు అమలు చేయని ప్రపంచ పెట్టుబడి సేవకుడైన అధ్యక్షుడు కారణమా? ఆ ఒక్కడిని విలన్ను చేసి తప్పించుకుంటున్న సామ్రాజ్యవాదుల మాటేమిటి? ప్రపంచవ్యాప్తంగా దేశాలను తమ అదుపాజ్ఞల్లో పెట్టుకొని, పర్యావరణ చట్టాలను బలహీనపరిచి తమ పెట్టుబడులకు ప్రోత్సాహకాలిమ్మని ఒత్తిడి చేస్తున్న సామ్రాజ్యవాదులు అడవిని కాపాడ్డానికి సహాయం చేస్తామని అంటున్నాయి. ఎంత విచిత్రం కదూ!
- పి.వరలక్ష్మి

Keywords : amazon forest fire, virasam, varalakshmi
(2024-03-19 19:40:25)



No. of visitors : 810

Suggested Posts


కలకత్తాలో జరుగుతున్న చారుమజుందార్ శత జయంతి ఉత్సవాల్లో విరసం కార్యదర్శి పాణి స్పీచ్

నక్సల్బరీ లేకపోతే భారత పీడిత ప్రజానీకానికి విప్లవ‌ దారే లేకుండా పోయేది. కమ్యూనిస్టు రాజకీయాలు చర్చించుకోవడానికే తప్ప వర్గపోరాట బాట పట్టకపోయేవి. ఆ నక్సల్బరీ దారిని చూపినవాడు చారు మజుందార్. విప్లవ పార్టీకి వ్యూహాన్ని, ఎత్తుగడలను ఒక సాయుధ పోరాట మార్గాన్ని చూపించిన వాడు చారు మజుందార్.

ఆదివాసి.. లంబాడా వివాదం ‍- ఎం.రత్నమాల

మహారాష్ట్ర ప్రభుత్వం లంబాడాలను ఆదివాసి తెగగా గుర్తించడం లేదు కనుక ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం లంబాడాలను ఆదివాసి షెడ్యూల్డు తెగగా ప్రకటించడంతో దీన్ని అవకాశంగా తీసుకుని మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్‌ (పాత) జిల్లాకు లంబాడాల వలసలు పెద్ద ఎత్తున వెల్లువలా సాగాయి.....

మహాశ్వేతా దేవి - మన తెలంగాణ సాగర హారంః వరవర రావు

మన మహా సాగరహారం ʹచలో హైదరాబాద్ అంటూ తెలంగాణ మార్చ్ చేసిన సెప్టెంబర్ 30, 2012 మహత్తర మధ్యాహ్నం మహాశ్వేతాదేవి కూడా మన ఊర్లో ఉన్నారు. ఆ రోజు ఆమెను మన మధ్యకు తెచ్చుకొని ఉంటే....

సెప్టెంబర్ 17 - ఇండియన్ యూనియన్ సైనిక దురాక్రమణ దినం - వరవరరావు

1947 ఆగస్ట్ 15న విలీనానికి అంగీకరించకుండా షరతులు విధిస్తూ వచ్చిన నిజాంను నెహ్రూ - పటేల్ ప్రభుత్వం సగౌరవంగా, సాదరంగా చర్చలకు ఆహ్వానించింది. అప్పటికే నిజాంను వ్యతిరేకిస్తూ వీరోచిత పోరాటం నడుపుతున్న కమ్యూనిస్టులను మాత్రమే కాదు, కనీసం కాంగ్రెస్ ను కూడా ఈ చర్చల్లో భాగం చేయలేదు....

అమరుడు బొజ్జా తారకం — ʹనది పుట్టిన గొంతుకʹ - వరవరరావు

గోదావరి తెలంగాణలో ప్రవేశించిన నిజామాబాద్ కు 1968లో వచ్చిన తారకం గారు ఇక్కడి మట్టిలోని ఎరుపులోనూ, ఇక్కడి నీళ్లలోని ప్రవాహ గుణంలోనూ కలగలిసిపోయారు. 1968 నుంచి 78 దాకా ఒక దశాబ్దం పాటు విప్లవోద్యమాలకు, విప్లవ సాహిత్యానికి నిజామాబాద్ చిరునామా బొజ్ఞాతారకం....

ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ పోరాటానికి విరసం మద్దతు

అట్టడుగున ఉన్న మనిషికి ఫలితాలు అందినప్పుడే సామాజిక న్యాయం జరిగినట్టు లెక్క. మాదిగ, డక్కలి, చిందు, మాష్టి, బుడగజంగం, దాసరి, బేగరి కులాలకు ఈ నాటికీ ఎస్సీ రిజర్వేషన్ ఫలాలు అందడం లేదు....

ʹఅన్నలు మల్లొస్తరు బిడ్డా.. ఆల్లొస్తే వాళ్ళకు గిన్ని మంచి నీల్లో, తిండో పెట్టాలనే బతుకుతాన్నʹ

అందుకే అంత నిర్బంధంల కూడా నా కొడుకు అంత్యక్రియలకు వచ్చిన జనాలకు మా ఖిలా వరంగల్ సరిపోలె. ఎక్కడోల్లను అక్కడ అరెస్ట్ చేసినా వచ్చిండ్రు. ఎవరో నక్సలైట్ అట, చిన్న పిల్లగాడేనట, బలే తెలివికల్లోడట అని అనుకుంట జనాలు వచ్చిండ్రు. పద్దెనిమిది నిండి పందొమ్మిది పడగానే చంపేసిండ్రు.

కాగడాగా వెలిగిన క్షణం... అమరుడు యెం యెస్ ఆర్ కోసం ... నారాయణ స్వామి

ఎంత ప్రాణం శ్రీనుది బక్క పలుచగా ఉండేటోడు – ఎక్కడన్న సరిగ్గా తిన్నడో లేదో శరీరం లో బలం సత్తువ ఉన్నదో లేదో – ఆ దుర్మార్గులు పట్టుకొని చిత్రహింసలు పెడుతుంటే ఆ లేత శరీరం ఎంత గోస పడిందో ఎంత హింసకు గురైందో ఎంత అల్లల్లాడిందో – ఆ క్రూరులు చంపేయ్యబోతుంటే, చివరికి మేఘే ఢాకా తార లో సుప్రియ అరిచినట్టు నాకు బతకాలని ఉంది నాకు చావాలని లేదు నాకు బతకాలని ఉంది....

ఉత్తేజకరంగా సాగిన విరసం సాహిత్యపాఠశాల‌

అంతకుముందు అంతర్జాతీయ శ్రామికవర్గ పతాకావిష్కరణతో కార్యక్రమాలను ప్రారం భించారు. అమరుడు పులి అంజన్న తల్లి సైదమ్మ ఎర్ర జెండాను, సీనియర్ విరసం సభ్యురాలు రత్నమాల విప్లవ రచయితల సంఘం జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా అమరుడు శేషయ్య సోదరుడు సాంబయ్య, అమరుడు వివేక్ తండ్రి యోగానంద్ అమరుల స్థూపాన్ని ఆవిష్క రించారు.

ʹఅరుణోదయʹ పై పోలీసుల దాడిని ఖండించిన విరసం

తెలంగాణ ఉద్యమంలో ఆట పాటతో ఆరుణోదయ కళాకారులు గ్రామ గ్రామాన తిరిగి ప్రజల్లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తమ వంతు కృషి చేశారు. ఆ సంస్థ కార్యాలయాన్ని దౌర్జన్యంగా మూసేయడం అత్యంత నిరంకుశమైన......

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


అమేజాన్‌