ప్రొఫెసర్ సాయిబాబాను వెంటనే ఆసుపత్రికి తరలించి సరైన వైద్యం అందించాలి - విరసం


ప్రొఫెసర్ సాయిబాబాను వెంటనే ఆసుపత్రికి తరలించి సరైన వైద్యం అందించాలి - విరసం

ప్రొఫెసర్

(విప్లవ రచయితల సంఘం మీడియా ప్రకటన పూర్తి పాఠం)

ప్రొఫెసర్ సాయిబాబాను వెంటనే ఆసుపత్రికి తరలించి సరైన వైద్యం అందించాలి.
నాగపూర్ జైలు అధికారులు, పోలీసు శాఖ, కోర్టులు ఆరెస్సెస్ విభాగాలుగా పనిచేస్తుండటం దేశానికి సిగ్గుచేటు

నాగపూర్ జైల్లో ఉన్న ప్రొఫెసర్ సాయిబాబా ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా బెయిల్ మంజూరు చేయాలని ఆయన కుటుంబ సభ్యలు హైకోర్టుకు విన్నవించుకుంటే, జైల్లో ఆయనకు ఫస్ట్ క్లాస్ వైద్యం అందిస్తున్నామని పోలీసుల వాదనకు వంతపాడిన కోర్టు బెయిల్ నిరాకరించింది. ఆర్నెల్ల తర్వాత నిన్న సాయిబాబాను చూడ్డానికి ఆయన తమ్ముడు రాందేవ్, అడ్వకేట్ బల్లా రవీంద్రనాథ్ వెళితే ఆయన ఆరోగ్యం ఏమాత్రం మెరుగుపడకపోగా, మరింత దిగజారిందని తెలిసింది. సరైన వైద్యం లేక ఆయన ఎడమ భుజంలో నొప్పి తీవ్రమయింది. జులై 22న ఎం.ఆర్.ఐ. పరీక్షలు చేశారు, కాని రెండు నెలల వరకు ఆయన్ను న్యూరాలజిస్ట్ వద్దకు తీసుకుపోలేదు. ఆ కాలమంతా ఆయనకు జ్వరం వస్తూ పోతూ ఉంది. సెప్టెంబర్ 23 నాడు ఆయన్ను హాస్పిటల్ కు తీసుకెళితే, అప్పుడు నాగపూర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ న్యూరాలజీ డాక్టర్లు ఎం.ఆర్.ఐ. రిపోర్టులు చూసి ఇదివరకే క్షీణించిన ఎడమ భుజం కండరాలలో ఇన్ఫెక్షన్ వ్యాపించిందని చెప్పారు. ఇది సీరియస్ కేసని, ఈ ఇన్ఫెక్షన్ వల్లనే ఆయనకు చలి జ్వరం వస్తున్నదని,
వెంటనే అడ్మిట్ చేయమని చెప్పారు. అయితే పోలీసులు ఆయన్ను తిరిగి జైలుకు తీసుకెళ్ళారు. బహుశా అక్టోబర్ 1 లేదా 2న ఆయన్ను ఆసుపత్రిలో చేర్చవచ్చని సమాచారం. అయితే ఆయనకు ఇతరేతర తీవ్ర అనారోగ్య సమస్యలు కూడా ఉన్నాయి. న్యూరాలజిస్ట్ చెప్పిన దాని ప్రకారం ఆ హాస్పిటల్ లో సాయిబాబాకు వైద్యం అందించడానికి అవసరమైన సదుపాయాలు లేవు.

కనుక అన్ని సదుపాయాలు ఉన్న ఆసుపత్రికి ఆయన్ను వెంటనే తరలించాలి. రెండు కాళ్ళు పని చేయని మనిషికి, ఒక చేయి కూడా కదలని స్థితి ఏర్పడటం ఎటువంటిదో ఊహించవచ్చు. ఈ విధంగా మనిషిని ముట్టుకోకుండా కూడా చిత్ర హింసలు పెట్టవచ్చని నాగపూర్ జైలు అధికారులు నిరూపిస్తున్నారు. ఆయన నేరం చేసాడా లేదా అన్నదాంతో సంబంధం, లేకుండానే జైలు నిబంధనల ప్రకారం కూడా ఇది తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘన. శాంతి, అహింస, బుద్ధుడు అంటూ ఐక్యరాజ్యసమితి వేదిక మీద నిస్సిగ్గుగా మాట్లాడగలిగే మన ప్రధాని, మేధావుల మీద అధికారిక హింసను, ముస్లింలు, దళితులు, ఆదివాసుల మీద అనధికారిక హింసను ఉన్మాద స్థాయిలో అమలుచేస్తున్నాడు. అత్యాచార నిందితుడు చిన్మయనందను ఆసుపత్రికి, బాధితురాలిన జైలుకు తలలించగల ఘనులు మన పాలకులు.

తక్షణం ప్రొఫెసర్ సాయిబాబాకు మెరుగైన వైద్యం అందించాలని, ఆయనకు బెయిల్ మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేద్దాం. ప్రజాస్వామికవాదులందరూ దీనిపై గొంతువిప్పాలని విజ్ఞప్తి.

--విరసం
29-09-2019

Keywords : professor saibaba, nagpur, jail, police, court
(2020-01-16 07:20:05)No. of visitors : 620

Suggested Posts


Saibaba being denied even food by jail authorities. humiliation under humid conditions

After the Nagpur High Court Bench rejected Prof G.N. Saibabaʹs bail application, the food previous provided by the jail authorities have been withdrawn. They stopped giving

Release Prof G.N Saibaba From Jail - Justice Markandey Katju

I am sending this appeal seeking release of Prof. Saibaba who has been given life sentence by Gadchiroli Distt Court, and whose appeal is pending before the Nagpur Bench of Bombay High Court.

బుధవారం సాయంత్రం సాయిబాబాతో....

ఆయనకు రెండు కాళ్ళు లేవు... నడవలేడు...ఎక్కడికి వెళ్ళాలన్నా చక్రాల కుర్చీనే.. జైల్లో మరింత అనారోగ్యం పాలయ్యాడు... పాలకుల కర్కషత్వంతో ఒక చేయి కూడా పనికి రాకుండా పోయింది. అతని పేరు సాయిబాబా. ప్రొఫెసర్ సాయిబాబా. ఢిల్లీ యూనివర్సిటీలో ఇంగ్లీష్ బోధిస్తాడు... పాలకు దృష్టిలో మావోయిస్టు...

గూగీ వా థియాంగో...జి.ఎన్‌. సాయిబాబా...యుద్దకాలంలో స్వప్నాలు

నేను ఆ నవలను కెన్యాలో కామిటి అత్యంత భద్రతా కారాగారంలో 1978లో టాయిలెట్‌ పేపర్‌ మీద రాశాను.ఇప్పుడు సాయిబాబా మరొక జైలులో, భారతదేశంలో మహారాష్ట్రలో నాగపూర్‌ అత్యంత భద్రతా కారాగారంలో ఒక ఒంటరి కొట్టులో ఉండి నా మరొక పుస్తకాన్ని అనువాదం చేయడం ఎంత చారిత్రక వైచిత్రి?!

Condemn the irrational and illegal conviction of Prof GN Saibaba and others

The judgment is illegal, irrational, atrocious and highly motivated, to say the least. None of the charges framed against the accused stand a real test of judicial inquiry as all of them are fabricated and the evidences are concocted or drawn out of context....

DU refuses to reinstate Saibaba despite VP push

Delhi Universityʹs Ram Lal Anand College has decided not to reinstate Professor GN Saibaba, who was granted bail by the Supreme Court in April in a case...

చావుబతుకుల మధ్య సాయిబాబా..ఆయనకు మెడికల్‌ బెయిల్‌ ఇవ్వాలి

తన చేతులు విడుపులేకుండా వణుకుతున్నాయి. బరువు కూడా బాగా కోల్పోయారు. ఇప్పుడు తనను కుర్చీలోంచి పడకమీదికి మార్చాలంటే కనీసం ఇద్దరు మనుషుల సహాయం అవసరం. డిసెంబర్‌ 26న వైద్య పరీ క్షల సమయంలో కూడా సాయి సోదరుడు, ఒక పోలీసు కలిసి తనను అనేక సార్లు చేతుల మీద ఎత్తుకుని మార్చాల్సి వచ్చింది.

“It’s The State That’s Violating the Constitution, Not Us”

At a south Delhi housing complex, Vasantha Kumari, wife of Prof GN Saibaba, waters the plants in her backyard in quiet reflection. Some of them, large tubs of month-old flower saplings, shoot up defiantly

Solidarity Statement from the US Coalition to Free Professor G.N. Saibaba

We in the US Coalition to Free Professor G.N. Saibaba heard about the Nagpur High Courtʹs outrageous decision to deny Saibaba bail on medical grounds. We are deeply disappointed, but not surprised. We have followed Saibabaʹs case closely and we know that his health continues to deteriorate.

Health of imprisoned DU Professor G.N. Saibaba is seriously deteriorating

According to court order I met Sai last on 26th December 2018 with his brother Ramdev, when he was taken to the Nagpur Government Medical College Hospital (GMCH). Usually, I see Sai through the barred glass panes of the mulakat window.

Search Engine

కట్టుకథ ఆధారంగా కాశీం అరెస్ట్...!!
ʹప్రొఫెసర్ కాశీంను అణగారిన ప్రజల వైపు నిలబడ్డందుకే అరెస్ట్ చేశారుʹ
ఉరిశిక్ష‌లు, ʹఎన్‌కౌంట‌ర్ʹ హ‌త్య‌ల‌తో నేరాల నియంత్ర‌ణ సాధ్య‌మేనా?
రాజ్యాంగమే నా బలం,ఆ బలంతోనే పోరాటం కొనసాగిస్తా - ఆజాద్
మోడీ భారత పౌరుడనే రుజువుందా ? ఆర్టీఐ ద్వారా అడిగిన కేరళవాసి
వాళ్ళిద్దరి కోసం..!
జేఎన్‌యూ తర్వాత‌...ఇప్పుడు మరో యూనివర్సిటీ విద్యార్థులపై దాడి
మమ్మల్ని ఈ దేశం నుండి బహిష్కరించండి - రాష్ట్రపతికి లేఖ రాసిన ʹఉనాʹ దళితులు
JNU పై దాడి చేసిందెవరో తేల్చి చెప్పిన వార్డెన్ల నివేదిక‌
భీం ఆర్మీ ఛీఫ్ ఆజాద్ కు బెయిల్...నెల రోజులు సహరన్ పూర్ లోనే ఉండాలని కండీషన్
మోడీషా రాజ్య నిర్బంధంలో మగ్గుతున్న భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ విడుదలకై ఉద్యమిద్దాం
విద్వేషం అతని మతం.. అణచివేత అతని ఆయుధం..!
మీరు చేస్తే గొప్ప పని ప్రజలు చేస్తే హింసనా జగ్గీ గారు
ఈ ప్రభుత్వమే నిర్బంధ కేంద్రాల్లోకి నెట్టబడే రోజొస్తుంది : అరుంధతి రాయ్
మన చేతుల మీది నెత్తుటి మరకలు కడగడానికి ఎన్ని సముద్రాలు కావాలి?
నిజం ఎప్పటికి బయటకు వస్తుంది?
విరసం అధ్యక్ష కార్యదర్శులుగా అరసవెల్లి కృష్ణ,కాశీం
50 ఏళ్ల.. దుఃఖం, నిర్భంధం, ధిక్కారం, స్పూర్తి... 50 ఏళ్ల విరసం మహాసభలు
విరసం 50 ఏళ్ళ సభలు...నోమ్ ఛామ్ స్కీ సందేశం
సృజ‌నాత్మ‌క ధిక్కారం.. విర‌సం 50 ఏళ్ల స‌భ‌లు ప్రారంభం
విరసం 50 ఏళ్ల సభలు.. పూణే జైలు నుంచి వరవరరావు సందేశం
CPI (Maoist) oppose Citizenship Amendment Act, calls to intensify mass campaign against it
అమిత్ షాకు బహిరంగ లేఖ‌ !
50 ఏళ్ళ ధిక్కారస్వరం...ఈ నెల11,12 తేదీల్లో విరసం రాష్ట్ర‌ మహాసభలు
నెత్తుటి ఏరులు పారినా ఎత్తిన జెండా దించకుండా... మళ్ళీ పిడికిలెత్తిన జేఎన్‌యూ
more..


ప్రొఫెసర్