జగన్ ది నరహంతక పాలన.. ఏవోబీ ఎన్ కౌంటర్ కు నిరసనగా అక్టోబర్ 3న బంద్ - మావోయిస్టు నేత గణేష్


జగన్ ది నరహంతక పాలన.. ఏవోబీ ఎన్ కౌంటర్ కు నిరసనగా అక్టోబర్ 3న బంద్ - మావోయిస్టు నేత గణేష్

జగన్

(సీపీఐ మావోయిస్టు పార్టీ ఆంధ్రా‍ఒడిశా బోర్డర్‌(ఏవోబీ) స్పెషల్‌ జోన్‌ కమిటీ కార్యదర్శి గణేశ్ ఆంధ్రజ్యోతి ప్రతినిధికిచ్చిన ఇంటర్వ్యూ)

*మన్యంలో రక్తపుటేరులు పారిస్తున్నారు
*హత్యలకు వైసీపీ నేతలదే బాధ్యత‌
*ఎన్ కౌంట్ర కు నిరసనగా అక్టోబర్ 3న ఏవోబీ బంద్

బూటకపు వాగ్దానాలతో ప్రజలను మోసగించి అధికారంలోకి వచ్చిన వైఎస్‌ జగన్‌ నరహంతక పాలనకు శ్రీకారం చుట్టారని సీపీఐ మావోయిస్టు పార్టీ ఆంధ్రా-ఒడిశా బోర్డర్‌(ఏవోబీ) స్పెషల్‌ జోన్‌ కమిటీ కార్యదర్శి గణేశ్‌ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మన్యంలో వందలాదిమంది సాయుధ బలగాలను దింపి రక్తపుటేరులు పారిస్తున్నారని మండిపడ్డారు. గురువారం ఆయన ఆంధ్రజ్యోతి ప్రతినిధితో మాట్లాడుతూ.. ʹరెండు దశాబ్దాలుగా విశాఖ మన్యంలో బాక్సైట్‌ తవ్వకాలను వ్యతిరేకిస్తూ మావోయిస్టు పార్టీ నాయకత్వంలో గిరిజనులు పోరాటాలు చేస్తున్నారు. ప్రజా ఆందోళనకు తలవంచి బా క్సైట్‌ తవ్వకాలను నిలిపివేస్తున్నామని ప్రభుత్వానికి ప్రకటించక తప్పలేదు. పైకి ఆదివాసీల అభీష్టానికి అనుకూలంగా ప్రభుత్వం పనిచేస్తుందని జగన్‌ చెబుతున్నారు. విప్లవోద్యమాన్ని, ఆదివాసీ ఆందోళనలను క్రూరంగా అణచివేసిన చరిత్ర కలిగిన పోలీస్‌ అధికారులకు పదోన్నతులు కల్పించి తన నిజమైన ముఖాన్ని జగన్‌ చాటుకున్నాడు. మన్యంలో వేలాది బలగాలను దింపి అడవులను జల్లెడ పడుతున్నారు. వందలాది మందిని జైళ్లలో నిర్బంధించారు. ఆదీవాసీలకు నాయకత్వం వహిస్తున్న మావోయిస్టు పార్టీ నిర్మూలన కోసం హంతక వేట సాగిస్తున్నారు.. అందులో భాగంగానే ఈనెల 22న మాదిమల్ల అన్నవరం అటవీప్రాంతంలో ఆదివాసీలతో సమావేశానికి వెళ్తున్న దళాన్ని చుట్టుముట్టి ఏకపక్షంగా కాల్పులు జరిపారు. ఇందులో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని ఒక రోజంతా చిత్రహింసలకు గురిచేసి హత్య చేసి మరో ఎన్‌కౌంటర్‌ జరిగిందని పోలీసులు కట్టుకథలు అల్లారు. శవాల ఫొటోలు వెంటనే విడుదల చేయకుండా కావాలనే నిర్లక్ష్యం చేశారు.

శవాలను కుటుంబాలకు అప్పగించకుండా అమానవీయంగా ప్రవర్తించి జగన్‌ మార్క్‌ పాలనను రుచి చూపించారు. దుర్మార్గమైన ప్రభుత్వ విధానాన్ని ప్రజలంతా ఖండించాలని కోరుతున్నాం. ఈ దాడులను వ్యతిరేకిస్తూ ఎక్కడికక్కడ ప్రజలు ఆందోళనలు నిర్వహించాలిʹ అని పేర్కొన్నారు. ఏవోబీలో జరిగిన హత్యాకాండకు అధికార పార్టీ నాయకులే బాధ్యత వహించాలని గణేశ్‌ హెచ్చరించారు. ʹఈ హత్యాకాండకు నిరసనగా మావోయిస్టు పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు అక్టోబరు 3న బంద్‌ను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాంʹ అని గణేశ్‌ పిలుపు నిచ్చారు.

ఆపరేషన్‌ సమాధాన్‌ పేరుతో మారణకాండ:


ఏవోబీలో వేలాది కమెండోలు, అర్థసైనిక బలగాలను మోహరించి ఆపరేషన్‌ సమాధాన్‌ పేరుతో నెల రోజులుగా ఆరాచకం సృష్టిస్తున్నారని గణేశ్‌ ఆరోపించారు. ʹగ్రామాలపై దాడులు అక్రమ అరెస్టులు, లాకప్‌ హత్యలు, ఎన్‌కౌంటర్ల పేరుతో కొనసాగిస్తున్న మారణ కాండను ప్రజలు ప్రతిఘటించాలి. ప్రజాస్వామిక ఉద్యమాలు, జాతుల పోరాటాలు, విప్లవోద్యమాలపై ఉక్కుపాదం మోపి రక్తపుటేరులు పారిస్తున్నారు. ప్రభుత్వాలను ప్రశ్నించే గొంతులను నొక్కి వేయడానికి ప్రజాస్వామిక శక్తులు, అభ్యుదయ వాదులు, దేశభక్తులు, విప్లవ సానుభూతిపరులు, మేధావులపై అర్బన్‌ మావోయిస్టులని ముద్ర వేస్తున్నారు. నల్ల చట్టాలను బనాయించి జైళ్లల్లో నిర్బంధిస్తున్నారు. వందలాది మంది విప్లవకారులను, ఆదివాసీలను, సాధారణ ప్రజలను సైతం హత్య చేస్తున్నారు. ఆగస్టు 23న మల్కనగిరి జిల్లాలో ప్రజలతో సమావేశ మై తిరిగి వస్తున్న మా దళంపై మాటు వేసి దాడి చేసి కామ్రేడ్‌ రాకేశ్‌ను అంతమొందించారు. ఈనెల 13న ధూళిపుట్‌ పంచాయతీలోని రంగని గూడెంకు చెందిన రాజు వంతల కుటుంబసభ్యులతో కలిసి నిత్యావసర వస్తువుల కోసం వారసంతకు వెళితే, పట్టుకుని జనతాబాయి క్యాంపులో తీవ్ర చిత్రహింసలకు గురిచేసి హత్య చేశారు. శవాన్ని ఊరవతల పడేశారు. ఈ హత్యను నిరసిస్తూ వేలాది మంది ప్రజలు ఆందోళన చేపట్టినా నిందితులపై కనీసం కేసు కూడా నమోదు చేయలేదుʹ అన్నారు.

అందరిదీ ఛత్తీస్‌గఢే..


ఈ నెల 22న ఏవోబీలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన వారి వివరాలను మావోయిస్టు నేత గణేశ్‌ ప్రకటించారు. మృతులంతా ఛత్తీ్‌సగఢ్‌వాసులే నని తెలిపారు. వారు రమేశ్‌, ప్లటూన్‌ కమిటీ కార్యదర్శి, విమల, ప్లటూన్‌ కమిటీ సభ్యురాలు, పార్టీ సభ్యులు అజయ్‌, భూమా, బుద్రి అని తెలిపారు.

Keywords : cpi maoist party, aob, ys jagan, andhrapradesh, fake encounters
(2019-10-13 14:15:33)No. of visitors : 842

Suggested Posts


శృతిని అత్యాచారం చేసి, హింసలు పెట్టి చంపారు - వరవరరావు

వరంగల్ జిల్లాలో మంగళవారంనాడు ఎన్ కౌంటర్ జరిగినట్టు పోలీసులు చెబుతున్నది అబద్దమని శృతిని విద్యాసాగర్ లను పోలీసులు పట్టుకొని చిత్రహింసలు పెట్టి చంపారని విప్లవ రచయిత వరవరరావు ఆరోపించారు....

అది ఎన్‌కౌంట‌ర్ కాదు - అత్యాచారం చేసి చంపేశారు : నిజ‌నిర్థార‌ణ బృందం

హిడ్మే ఒంటిపై దుస్తులను తొల‌గించి... సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు. శరీర భాగాల‌న్నింటినీ క‌త్తుల‌తో కోశారు. ఆ త‌రువాత చాతీపై, క‌డుపులో తూటాల వ‌ర్షం కురిపించారు. మృత‌దేహాన్ని సుక్మా ప‌ట్ట‌ణానికి త‌ర‌లించారు. 14వ తేది విష‌యం తెలుసుకున్న గ్రామ‌స్తులు....

రాజ్యం పెంచి పోషించిన ప్రజా హంతకుడు నయీం - మావోయిస్టు పార్టీ

హంతక ప్రభుత్వాల పోలీసు యంత్రాంగం ఎస్ఐబి డైరెక్షన్లో ఎంతో మంది ప్రజలను, పౌరహక్కుల నేతలను, ఉద్యమకారులను కిరాతకంగా చంపిన ప్రజా హంతకుడు నయీం చావు వార్త పీడిత ప్రజలకు పండుగ వంటిదే కాకుంటే తనను పెంచి, పోషించి ఎన్నో చీకటి హత్యలకు ఆయుధంగా వాడుకున్న దోపిడీ పాలక వర్గం చేతిలో కన్నా ప్రజల చేతిలో నయినాం ఖతం అయితే ప్రజలు ఎక్కువగా సంతోషపడేవాళ్ళు...

శ్రుతి పాడిన పాట దోపిడి గుండెల్లో తూట !

శ్రుతి.... చిన్నప్పటినుండే విప్లవ భావాలతో పెరిగింది. సమాజాన్ని నిశితంగా గమనిస్తూ, సమాజాన్ని చదువుతూ పెరిగింది. వేదికలెక్కి సమాజాన్ని చైతన్య పరిచే పాటలు పాడింది. ఎమ్ టెక్ చదివిన శ్రుతి తన తండ్రి సుదర్శన్ చెప్పినట్టు అమెరికాకు కాకుండా అడవిలోకి....

చీప్ లిక్కర్ తో గ్రామజ్యోతిని వెలిగిస్తారా - మావోయిస్టు జగన్ ప్రశ్న

ప్రభుత్వం హరితహారం లో మొక్కలు నాటడం కోసం ఆదివాసులను భూముల్లోంచి వెళ్ళగొడతోందని జగన్ మండి పడ్డారు. ఒక వైపు ప్రజలను చీప్ లిక్కర్ లో ముంచి తేల్చే కుట్రలు చేస్తూ మరో వైపు గ్రామ జ్యోతి కార్యక్రమాన్ని మొదలు పెట్టడం పై జగన్ మండి పడ్డారు. చీప్ లిక్కర్ తో గ్రామ జ్యోతిని వెలిగిస్తారా

ఫేస్ బుక్ మిత్రుడి ఎన్ కౌంటర్ !

సార్ మీరు నాకు తెలుసు... మీరు నాఫేస్ బుక్ ఫ్రెండ్ సార్..... దండకారణ్యంలో భుజానికి తుపాకీ వేసుకొని తీక్షణంగా పరిసరాలను పరీక్షిస్తూనే మరో చేత్తో వంట చేస్తున్న.. ప్రతిక్షణం యుద్దం మధ్యలో జీవిస్తున్న ఓ మావోయిస్టు గెరిల్లా ఆమాట అనడంతో నేను షాక్ తిన్నాను.....

నక్సల్బరీ రాజకీయాలను ఎత్తి పట్టండి - ‍మావోయిస్టు పార్టీ నేత గణపతి పిలుపు

నేడు దేశంలో బ్రాహ్మణవాద శక్తులు ప్రభుత్వాన్ని పాలిస్తున్న నేపథ్యంలో దేశంలో అసహన పరిస్థితులు నెలకొన్నాయని, వాటికి వ్యతిరేకంగా మేథావులను, కార్మిక, శ్రామిక, ప్రజాస్వామ్య వర్గాలను, దళితులను, మైనారిటీ మతాలను, విద్యార్థులను సంఘటితం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని గణపతి చెప్పారు.....

ఈ విప్లవ యోధుడి అమరత్వానికి 21 యేండ్లు !

అది 1996 జూన్ 23 ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల దగ్గర నస్పూర్ కాలానిలో ఓ ఇల్లు.... ఆ ఇంటిని 500 మంది పోలీసులు చుట్టుముట్టారు. ఎలాంటి హెచ్చరికలు లేవు... లొంగి పొమ్మన్న మాటలు లేవు. ఏక పక్షంగా తూటాల వర్షం కురిపించిడం....

ఈ నెల 26 న తెలంగాణ బంద్ కు మావోయిస్టు పార్టీ పిలుపు

గొల్లగూడెం ఎన్ కౌంటర్ కు నిరసనగా ఈ నెల 26 న తెలంగాణ బంద్ ను జయప్రదం చేయాలని సీపీఐ మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ పిలుపునిచ్చారు. మహారాష్ట్రా గడ్చిరోలి జిల్లా, వెంకటాపురం పోలీస్ స్టేషన్ పరిధి గొల్లగూడెం అడవుల్లో...

ఆ శవాలు మాట్లాడుతున్నవి...

శరీరాన్ని చీల్చేసినట్టుగా, పొడిచేసినట్టుగా కనపడుతున్న ఆ శవాలు మాట్లాడుతున్నవి. పురుగులు పట్టిన ఆ శవాలు మాట్లాడుతున్నవి.....

Search Engine

మావి నిషేధిత సంఘాలు కావు
పోలీస్ క‌మిష‌న‌ర్ ప్ర‌క‌ట‌న‌పై కేసీఆర్ స్పందించాలి : ప‌్ర‌జా సంఘాలు
కేసీఆర్ ఓ నియంత : విరసం కార్య‌ద‌ర్శి పాణి
Condemn arrest and onslaught on TVV and others activists - SFS
ʹనల్లమల గురించి మాట్లాడినందుకే నాభర్తను అరెస్ట్ చేశారు..ఆయనెక్కడున్నడో నాకు చూపించాలిʹ
స్టూడెంట్ మార్చ్ పత్రిక ఎడిటర్, విరసం కార్యవర్గ సభ్యుడు డా. జగన్ ను విడుదల చేయాలి
దేశవ్యాప్త నిరసనలతో వెనక్కి తగ్గిన పోలీసులు...49 మంది ప్రముఖలపై కేసు విత్ డ్రా
Over 140Telugu Literary Persons Endorse Letter to PM by 49 Celebrities, Condemn FIR
ʹఇది ఆర్టీసీ ఉద్యోగుల పోరాట‌మే కాదు - కేసీఆర్ నియంతృత్వ వ్య‌తిరేక ప్ర‌జాస్వామిక పోరాటంʹ
49 మంది ప్రముఖలపై కేసు ఎత్తివేయాలి ‍-140 మంది తెలుగు రచయితల బ‌హిరంగ‌లేఖ‌ !
ఆర్టీసీని ప్రైవేటు పరం చేయడానికి టీఆరెస్ ప్రభుత్వం కుట్ర... సమ్మెకు ప్రజలందరూ మద్దతు తెలపాలి ...మావోయిస్టు పార్టీ
చెట్లు నరకొద్దన్నందుకు పోలీసుల దాడి...38 మందిపై కేసు
ఆ 49 మంది కోసం ...ఇక మనమూ తేల్చుకోవాల్సిందే - పాణి
ఆర్టీసీ నష్టాలకు కారణమెవరు ? సమ్మె ఎవరి కోసం ?
జైళ్ళలో పేదలే మగ్గుతున్నారు... ప్రజలకు పోలీసులతో ఎలాంటి లాభం లేదు... తెలంగాణ ఐపీఎస్ అధికారి
ప్రొఫెసర్ సాయిబాబాను వెంటనే ఆసుపత్రికి తరలించి సరైన వైద్యం అందించాలి - విరసం
అమేజాన్‌ కార్చిచ్చుకు అసలు కారణం - పి.వరలక్ష్మి
మహాజనాద్భుత సాగరహారానికి ఏడేండ్లు -ఎన్ వేణుగోపాల్
ʹహైకోర్టు తీర్పు ప్రకారం మావోయిస్టుల మృతదేహాలను ABMS కు అప్పజెప్పాలిʹ
మావోయిస్టు అరుణ ఎక్కడ ?
ఐదు దశాబ్దాల వసంతగానం
మన్యంలో నెత్తురు పారిస్తున్న జగన్ సర్కార్
కశ్మీర్ లో దుర్మార్గం పై మహిళల నివేదిక
ఈ గొప్ప ప్రజాస్వామ్యాన్ని చూసి తెలంగాణమా గర్వించు !
పార్టీ స్వర్ణోత్సవాలను పల్లెపల్లెనా జరుపుకుందాం - మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ పిలుపు
more..


జగన్