మావి నిషేధిత సంఘాలు కావు


మావి నిషేధిత సంఘాలు కావు

మావి

హైద‌రాబాద్ న‌గ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్ ప‌లు ప్ర‌జా సంఘాల‌ను మావోయిస్టు అనుబంధ సంఘాలుగా ప్ర‌క‌టించ‌డాన్ని, వాటిని నిషేధిత సంస్థ‌లుగా పేర్కొన‌డాన్ని ఆయా సంఘాల నాయ‌కులు త‌ప్పుబ‌ట్టారు. క‌మిష‌న‌ర్ అంజ‌ని కుమార్ ప్ర‌క‌ట‌న‌కు స్పంద‌న‌గా ప్ర‌జా సంఘాలు విడుద‌ల చేసిన ప‌త్రికా ప్ర‌క‌ట‌న పూర్తి పాఠం.

ఎలాంటి ఆధారాలు లేకుండా ఒక ప్రభుత్వ అధికారిగా హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ శ్రీ అంజన్కుమార్ ప్రజా సంఘాలను నిషేదిత సంఘాలుగా మీడియా ద్వారా ప్రచారం చేయడాన్ని, ఆయన ఒక అధికారిగా కాకుండా రాజకీయ నాయకుడిగా మాట్లాడడాన్ని మేము ఖండిస్తున్నాం.

గత 50 సంవత్సరాలుగా ప్రజా జీవితంలో వివిధ రకాల ప్రజా సమస్యల మీద పోరాడుతున్న ప్రజా సంఘాల మీద దుష్ప్రచారం చేస్తూ నిషేదిత సంఘాల జాబితా లో చేర్చడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రచయితలుగా, కళాకారులుగా, హక్కుల కార్యకర్తలుగా, ప్రత్యేక తెలంగాణ ఉద్యమ నాయకులుగా, మహిళా సంఘాల బాధ్యులుగా, విద్యారంగ సమస్యల మీద పనిచేసే విద్యార్థులుగా, కుల అణిచివేతకు వ్యతిరేకంగా పనిచేసే కార్యకర్తలుగా, వివిధ రకాల విస్థాపనకు వ్యతిరేకంగా పోరాడే కార్యకర్తలుగా, ఆదివాసీ సంఘాలుగా పని చేస్తూ ప్రజల పక్షాన పోరాడుతున్న సంఘాలను కేసీఆర్ ప్రభుత్వం నిషేధిత సంఘాలుగా మా మీద తప్పుడు ప్రచారం చేయడాన్ని వ్యతిరేకిస్తున్నాము.

1996 నుండి జరిగిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో మా సంఘాలన్నీ ప్రజలతో కలిసి పోరాటంలో చురుగ్గా పాల్గొన్నాయి. రాజకీయ పార్టీలు మౌనంగా ఉన్నప్పుడు తెలంగాణ ప్రజలు నిరాశ చెందకుండా ఉద్యమ చైతన్యాన్ని ప్రోది చేసిన చరిత్ర మా సంఘాలకు ఉంది. తెలంగాణలో పౌర, ప్రజాస్వామిక విలువల కోసం గత యాభై ఏళ్లుగా పని చేస్తూ మేము నిరంతరం ప్రజల వైపు నిలబడి పోరాడుతున్నాము.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఈ రాష్ట్రంలో ఎన్నో రకాల అపరిశ్కుత సమస్యలు ఉన్నాయి. నిరుద్యోగం, దళితులపై దాడులు, ఆదివాసులను భూనిర్వాసితులు చేయడం, మహిళల, ముస్లింల మీద దాడులు మొదలైన ప్రజా సమస్యల మీద, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తలో మీడియా మీద నిషేధం ప్రకటించిన సందర్భంలో కూడా మా సంఘాలు ప్రజాస్వామిక గొంతును నిర్బంధించడాన్ని వ్యతిరేకిస్తూ పోరాటం చేసాయి.

ఇందిరాపార్కు వద్ద ధర్నా చౌక్ ను ప్రభుత్వం ఎత్తివేసిన సందర్భంలో ధర్నా చౌక్ పరిరక్షణ కోసం కోర్టు లోపలా, బయటా అనేక పోరాటాలు చేసి ధర్నా చౌక్ కాపాడటంలో ప్రజా సంఘాలు క్రియాశీలకంగా పని చేశాయి.

ప్రజల వైపు నిలబడి నిజాయితీగా పోరాడుతున్న మా ప్రజా సంఘాల గొంతును నొక్కే కుట్రను ప్రభుత్వం రచిస్తుంది. ప్రభుత్వం తెలంగాణ సమాజంలో ప్రత్యామ్నాయ ఆలోచనకు తావు లేకుండా, ప్రజాస్వామిక విలువలకు అవకాశం లేకుండా నియంతృత్వంగా పరిపాలిస్తున్న KCR రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నాడు. తెలంగాణ సమాజంలో ఆర్టీసీ కార్మికులు తమ హక్కుల కోసం రోడ్డెక్కి పోరాటం చేస్తున్న సందర్భంలో వీరి పోరాటానికి సంఘీభావం లేకుండా ప్రజలను తప్పుదారి పట్టించడం కోసం మా సంఘాల మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు.

ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎత్తిచూపుతున్న వారిని మావోయిస్టుల పేరుమీద భయపెట్టడం పాలకులకు అలవాటయింది. ఈరోజు మా సంఘాల మీద దాడి చేస్తున్న పాలకులు రేపు ఇంకొందరి మీదకు వస్తారని ప్రజాస్వామికవాదులు గమనించాలని కోరుతున్నాము. ప్రజా సంఘాల మీద కేసీఆర్, నరేంద్ర మోడీ ప్రభుత్వం కొనసాగిస్తున్న దాడిని ఖండించాలని తెలంగాణ కవులు కళాకారులకు రచయితలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ప్రభుత్వ చర్యను ప్రజా సంఘాలు, కవులు, కళాకారులు, రచయితలు, మేధావులు, ప్రజాస్వామిక వాదులు ఖండించాలని విజ్ఞప్తి చేస్తున్నాము.

1.మానవ హక్కుల వేదిక.
2 పౌర హక్కుల సంఘం.
3. విప్లవ రచయితల సంఘం
4.కులనిర్మూలన పోరాట సమితి
5.రాజకీయ ఖైదీల విడుదల కమిటీ
6.తెలంగాణ ప్రజాస్వామిక వేదిక
7.తెలంగాణ ప్రజా ఫ్రంట్.
8.చైతన్య మహిళా సంఘం.
9 ప్రజా కళా మండలి.
10.అమరుల బంధుమిత్రుల సంఘం.
11.తెలంగాణ విద్యార్థి వేదిక
12.డెమోక్రటిక్ స్టూడెంట్ యూనియన్.
13 తెలంగాణ విద్యార్థి సంఘం
14.ఆదివాసీ విద్యార్థి సంఘం
15.తెలంగాణ యువజన సంఘం
16.తెలంగాణ అసంఘటిత కార్మిక సంఘాల సమాఖ్య.
17.గిరిజన ఐక్యవేదిక.
18.దేశ భక్త ప్రజాతంత్ర ఉద్యమం.
19.తెలంగాణ రైతాంగ సమితి.
20. తుడుం దెబ్బ.
21. భూ నిర్వాసిత వ్యతిరేక పోరాట కమిటీ.
22. పీపుల్స్ ఆగనేస్ట్ పోలవరం ప్రాజెక్ట్.
23. విస్తాపన విరోధి జన వికాస్ ఆందోళన.

Keywords : virasam, clc, tvv, telangana, maoists, police
(2019-11-12 12:15:59)No. of visitors : 387

Suggested Posts


శృతిని అత్యాచారం చేసి, హింసలు పెట్టి చంపారు - వరవరరావు

వరంగల్ జిల్లాలో మంగళవారంనాడు ఎన్ కౌంటర్ జరిగినట్టు పోలీసులు చెబుతున్నది అబద్దమని శృతిని విద్యాసాగర్ లను పోలీసులు పట్టుకొని చిత్రహింసలు పెట్టి చంపారని విప్లవ రచయిత వరవరరావు ఆరోపించారు....

అది ఎన్‌కౌంట‌ర్ కాదు - అత్యాచారం చేసి చంపేశారు : నిజ‌నిర్థార‌ణ బృందం

హిడ్మే ఒంటిపై దుస్తులను తొల‌గించి... సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు. శరీర భాగాల‌న్నింటినీ క‌త్తుల‌తో కోశారు. ఆ త‌రువాత చాతీపై, క‌డుపులో తూటాల వ‌ర్షం కురిపించారు. మృత‌దేహాన్ని సుక్మా ప‌ట్ట‌ణానికి త‌ర‌లించారు. 14వ తేది విష‌యం తెలుసుకున్న గ్రామ‌స్తులు....

రాజ్యం పెంచి పోషించిన ప్రజా హంతకుడు నయీం - మావోయిస్టు పార్టీ

హంతక ప్రభుత్వాల పోలీసు యంత్రాంగం ఎస్ఐబి డైరెక్షన్లో ఎంతో మంది ప్రజలను, పౌరహక్కుల నేతలను, ఉద్యమకారులను కిరాతకంగా చంపిన ప్రజా హంతకుడు నయీం చావు వార్త పీడిత ప్రజలకు పండుగ వంటిదే కాకుంటే తనను పెంచి, పోషించి ఎన్నో చీకటి హత్యలకు ఆయుధంగా వాడుకున్న దోపిడీ పాలక వర్గం చేతిలో కన్నా ప్రజల చేతిలో నయినాం ఖతం అయితే ప్రజలు ఎక్కువగా సంతోషపడేవాళ్ళు...

శ్రుతి పాడిన పాట దోపిడి గుండెల్లో తూట !

శ్రుతి.... చిన్నప్పటినుండే విప్లవ భావాలతో పెరిగింది. సమాజాన్ని నిశితంగా గమనిస్తూ, సమాజాన్ని చదువుతూ పెరిగింది. వేదికలెక్కి సమాజాన్ని చైతన్య పరిచే పాటలు పాడింది. ఎమ్ టెక్ చదివిన శ్రుతి తన తండ్రి సుదర్శన్ చెప్పినట్టు అమెరికాకు కాకుండా అడవిలోకి....

చీప్ లిక్కర్ తో గ్రామజ్యోతిని వెలిగిస్తారా - మావోయిస్టు జగన్ ప్రశ్న

ప్రభుత్వం హరితహారం లో మొక్కలు నాటడం కోసం ఆదివాసులను భూముల్లోంచి వెళ్ళగొడతోందని జగన్ మండి పడ్డారు. ఒక వైపు ప్రజలను చీప్ లిక్కర్ లో ముంచి తేల్చే కుట్రలు చేస్తూ మరో వైపు గ్రామ జ్యోతి కార్యక్రమాన్ని మొదలు పెట్టడం పై జగన్ మండి పడ్డారు. చీప్ లిక్కర్ తో గ్రామ జ్యోతిని వెలిగిస్తారా

ఫేస్ బుక్ మిత్రుడి ఎన్ కౌంటర్ !

సార్ మీరు నాకు తెలుసు... మీరు నాఫేస్ బుక్ ఫ్రెండ్ సార్..... దండకారణ్యంలో భుజానికి తుపాకీ వేసుకొని తీక్షణంగా పరిసరాలను పరీక్షిస్తూనే మరో చేత్తో వంట చేస్తున్న.. ప్రతిక్షణం యుద్దం మధ్యలో జీవిస్తున్న ఓ మావోయిస్టు గెరిల్లా ఆమాట అనడంతో నేను షాక్ తిన్నాను.....

నక్సల్బరీ రాజకీయాలను ఎత్తి పట్టండి - ‍మావోయిస్టు పార్టీ నేత గణపతి పిలుపు

నేడు దేశంలో బ్రాహ్మణవాద శక్తులు ప్రభుత్వాన్ని పాలిస్తున్న నేపథ్యంలో దేశంలో అసహన పరిస్థితులు నెలకొన్నాయని, వాటికి వ్యతిరేకంగా మేథావులను, కార్మిక, శ్రామిక, ప్రజాస్వామ్య వర్గాలను, దళితులను, మైనారిటీ మతాలను, విద్యార్థులను సంఘటితం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని గణపతి చెప్పారు.....

ఈ విప్లవ యోధుడి అమరత్వానికి 21 యేండ్లు !

అది 1996 జూన్ 23 ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల దగ్గర నస్పూర్ కాలానిలో ఓ ఇల్లు.... ఆ ఇంటిని 500 మంది పోలీసులు చుట్టుముట్టారు. ఎలాంటి హెచ్చరికలు లేవు... లొంగి పొమ్మన్న మాటలు లేవు. ఏక పక్షంగా తూటాల వర్షం కురిపించిడం....

ఈ నెల 26 న తెలంగాణ బంద్ కు మావోయిస్టు పార్టీ పిలుపు

గొల్లగూడెం ఎన్ కౌంటర్ కు నిరసనగా ఈ నెల 26 న తెలంగాణ బంద్ ను జయప్రదం చేయాలని సీపీఐ మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ పిలుపునిచ్చారు. మహారాష్ట్రా గడ్చిరోలి జిల్లా, వెంకటాపురం పోలీస్ స్టేషన్ పరిధి గొల్లగూడెం అడవుల్లో...

జనతన రాజ్యంలో నక్సల్బరీ వేడుకలు... 80 వేల మందితో సభ‌ (వీడియో)

మావోయిస్టు పార్టీ ద‌క్షిణ బ‌స్త‌ర్ డివిజ‌న్ క‌మిటీ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన న‌క్స‌ల్బ‌రీ వేడుక‌లు ప్ర‌పంచానికి ఇప్ప‌డు కొత్త ఆశనిస్తున్నాయి. ఒక్క‌రిద్ద‌రు కాదు.. దాదాపు 80 వేల మంది ఆదివాసీలు. సుశిక్షితులైన ప్ర‌జా విముక్తి గెరిల్లాలతో క‌లిసి క‌దంతొక్కారు.

Search Engine

కేసీఆర్ అప్రజాస్వామిక పాలన‌: అనురాధ, రవిల అరెస్ట్ - రాజద్రోహం, యూఏపీఏ కేసులు బనాయింపు
ఫీజుల పెంపును నిరసిస్తూ.. కేంద్ర మంత్రిని నిర్బంధించిన జేఎన్‌యూ విద్యార్థులు..!
పోలీసుల అడ్డంకులు ఛేదించుకుని సమరోత్సాహంతో ట్యాంక్ బండ్ పైకి దూసుకొచ్చిన‌ కార్మికులు
చలో ట్యాంక్ బండ్ లో మావోయిస్టులున్నారన్న సీపీ... ఉక్కుపాదం మోపడం కోసమే ఈ ఆరోపణలన్న‌ ఆర్టీసీ జేఏసీ
వేలాది పోలీసు బలగాల నిర్బంధాల మధ్య‌ చలో టాంక్ బండ్ విజయవంతం
ఆర్టీసీ సమ్మెకు రాజకీయ ఖైదీల మద్దతు.. జైళ్లో నిరసన.. చలో ట్యాంక్‌బండ్ విజయవంతం చేయండి..!
భగత్ సింగ్ పిస్టల్ – అనేకానేక స్మృతులు
జర్నలిస్టులు, దళిత, మానవహక్కుల కార్యకర్తల వాట్సప్ ఖాతాలు హ్యాక్
దొర ప్రతాపమంత మజ్దూర్ల మీదనే!
తెలంగాణలో పాత రోజులు మళ్ళీ దాపురించాయి... అణిచివేతే పాలకుల విధానమయ్యింది
ఆర్టీసీ సమ్మె పై నిర్భందం...పౌరహక్కుల సంఘం ఆగ్రహం
భారత విప్లవోద్యమంలో చారుమజుందార్‌ - రేపే శతజయంతి సదస్సు
నలమాస కృష్ణ, మద్దిలేటిల అరెస్టు చట్టబద్దం కాదు - హైకోర్టు
ʹఆవులగురించి కాదు ఆడపిల్లల గురించి శ్రద్ద పెట్టండిʹ
ఈ కుట్ర కేసు వెనుక ఉన్న కుట్రలో అసలు కథ‌ ఇంకోటి ఉంది
నలమాస కృష్ణ, మద్దిలేటి అరెస్ట్...అక్రమం అంటున్న ప్రజా సంఘాలు
RTC కార్మికులారా ఆత్మహత్యలు వ‌ద్దు.. తెలంగాణ సమాజం మీ వెంట‌ ఉంది.. పోరాడి హక్కులు సాదించుకుందాం !
దేశానికి రానున్నవి చీకటిరోజులు
పోలీస్ క‌మిష‌న‌ర్ ప్ర‌క‌ట‌న‌పై కేసీఆర్ స్పందించాలి : ప‌్ర‌జా సంఘాలు
కేసీఆర్ ఓ నియంత : విరసం కార్య‌ద‌ర్శి పాణి
Condemn arrest and onslaught on TVV and others activists - SFS
ʹనల్లమల గురించి మాట్లాడినందుకే నాభర్తను అరెస్ట్ చేశారు..ఆయనెక్కడున్నడో నాకు చూపించాలిʹ
స్టూడెంట్ మార్చ్ పత్రిక ఎడిటర్, విరసం కార్యవర్గ సభ్యుడు డా. జగన్ ను విడుదల చేయాలి
దేశవ్యాప్త నిరసనలతో వెనక్కి తగ్గిన పోలీసులు...49 మంది ప్రముఖలపై కేసు విత్ డ్రా
Over 140Telugu Literary Persons Endorse Letter to PM by 49 Celebrities, Condemn FIR
more..


మావి