తెలంగాణలో పాత రోజులు మళ్ళీ దాపురించాయి... అణిచివేతే పాలకుల విధానమయ్యింది


తెలంగాణలో పాత రోజులు మళ్ళీ దాపురించాయి... అణిచివేతే పాలకుల విధానమయ్యింది

తెలంగాణలో

23 అక్టోబర్ 2019 - ఉ.10 గం.ల నుండి సా. 5.30 వరకు,
సుందరయ్య విజ్ఞాన కేంద్రం, బాగ్ లింగంపల్లి, హైదరాబాద్

భారత రాజ్యాంగం ప్రతీ పౌరుడికి వాక్, సభా స్వాతంత్ర్యాలతో పాటు తమకు నచ్చిన రాజకీయ విశ్వాసాలను కలిగి ఉండే అవకాశాన్ని కల్పించింది. భారత సంవిధానం పరిధిలో రాజకీయ ఆచరణ కూడా పౌరులందరి హక్కుగా ఎన్నో పోరాటాల ఫలితంగా వచ్చింది. వలస పాలన కాలంలో వెల్లివిరిసిన ప్రజాస్వామిక ఆకాంక్ష సామాజిక పెనుగులాటలో కొంతమేరకైన పరిపక్వమవుతూ వస్తుంది. ప్రజాస్వామిక భావనను సృజనాత్మకం చేయటం కోసం ప్రజలవైపు నిలబడిన బుద్ధి జీవులు ఎంతగానో కృషి చేసారు.

భారత సమాజంలో తెలంగాణ నేలకు అపురూపమైన చరిత్ర ఉంది. భూమితో సంభాషించిన రైతులు ఈ నేల విముక్తి కోసం పోరాటం చేసారు. నిరంకుశ నైజాం పాలనకు చరమ గీతం పాడి ప్రపంచ చరిత్రలో దిక్సూచిగా నిలిచారు. భిన్న ఆలోచనలు కలిగి ఉన్న వ్యక్తులు, సమూహాలు ప్రజాస్వామిక భావన కోసం ఒకటిగా నిలబడ్డారు. అట్లా తెలంగాణ నేలలో ఆంధ్ర జన సంఘం, ఆంధ్రమహాసభ, నిర్మాణాత్మక కృషి చేసాయి. ఆర్య సామాజికులు, కాంగ్రెస్ వాదులు, కమ్యూనిస్టులు కలిసి తెలంగాణలో స్వేచ్చా వాయువుల కోసం పని చేసారు. వెట్టి చాకిరి, నిత్య నిర్బంధాన్ని కూడా లెక్కచేయకుండా వేలాది ప్రాణాలను అర్పిస్తూ విముక్తికి బాటలు వేసి, ఈ నాటికి చరిత్రలో నిలిచి పోయారు.

ప్రత్యేక తెలంగాణ ఉద్యమ కాలంలోనైనా, వివిధ సామాజిక, రాజకీయ, సాంస్కృతిక పోరాటాల సందర్భంలోనైనా తెలంగాణ సమాజం, అణచివేతకు వ్యతిరేకంగా గొంతెత్తి నిలబడింది. చాలా సందర్భాల్లో పాలకపక్షానికి ప్రజలే నిజమైన ప్రతిపక్షంగా బరిగీసి నిలిచారు. మలిదశ ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సందర్భంలో భిన్న రాజకీయ విశ్వాసాలు కల్గిన వాళ్లు కూడా ప్రజాస్వామిక ఆకాంక్షను గెలిపించడం కోసం కృషిచేసారు. ఈ నేల మీద పోరాటాలు ముందుకు వచ్చిన ప్రతీ సందర్భంలో సామాజిక చైతన్యం వ్యక్తమయింది. ప్రజా పోరాటాలే ప్రజాస్వామిక భావనను విస్తృతం చేసాయి.

అయితే ఎందరో త్యాగ ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో మరోసారి ఫ్యూడలిజం, నిరంకుశత్వం పాలకులలో వ్యక్తమవుతున్నాయి. భిన్నాభిప్రాయాన్ని సహించలేని తనం పెరిగిపోయింది. ప్రజాస్వామ్యం స్థానంలో వ్యక్తిస్వామ్యం ప్రవేశించింది. ప్రజల చేత ఎన్నికైన సభ్యులు, చట్టసభలు నిమిత్త మాత్రమయ్యాయి. డిసెంట్ కు తావు లేకుండా పోయింది. ఉద్యమ కాలంలో ప్రజల నుంచి వ్యక్తమైన ప్రజాస్వామిక ఆకాంక్షలన్ని పూర్వ పక్షమయ్యాయి. నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదాలు నెరవేరని కలలయ్యాయి. ఎప్పటినుంచో నిరసన తెల్పడానికి కేంద్రమైన ఇందిరాపార్కు ధర్నా శిబిరాన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం ఏతేస్తే ప్రజలు పోరాడి సాధించుకోవాల్సి వచ్చింది. ఎన్‌కౌంటర్ల పరంపర కొనసాగుతూనే ఉంది. నచ్చని వారిని పీక నొక్కుడు సిద్ధాంతానికి ప్రాధాన్యత పెరిగింది. న్యాయానికి అక్రమ కేసులు, జైళ్లు తప్పటం లేదు. పార్లమెంట్ విలువలను కూడా వదిలేసి ప్రతిపక్ష పార్టీలను నిర్వీర్యం చేస్తున్నారు. రాజ్యాంగం కల్పించిన కార్మికుల సమ్మె హక్కును కూడా ఖాతరు చేసే పరిస్థితి లేదు. ఆర్టీసీని రక్షించుకోవడం కోసం కార్మికులు ఆత్మబలిదానాలు చేసుకుంటూ, పోరాడుతుంటే పాలకులు అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు. తెలంగాణలో బహుళజాతి కంపెనీల అభివృద్ధి నమూనా కొనసాగుతున్నది. అసమ అభివృద్ధి రథ చక్రాల కింద దళితులు, ఆదివాసీలు, మత మైనార్టీలు, మహిళలు నలిగిపోతున్నారు.

భిన్న రూపాలలో జరుగుతున్న ఈ అన్యాయాన్ని, దోపిడిని, అణచివేతను వ్యతిరేకిస్తూ, ప్రతిఘటిస్తూ ప్రజా సమూహాలు తమకు తోచిన పద్ధతిలో కదులుతున్నాయి. పెనుగులాడుతున్న ప్రజలకు నాయకత్వం వహిస్తున్న వామపక్ష, విప్లవ పార్టీలు, ప్రజా సంఘాల మీద తెలంగాణ ప్రభుత్వం అప్రకటిత, ప్రకటిత నిర్బంధాన్ని, నిషేధాన్ని కొనసాగిస్తున్నది. ఇందులో భాగంగానే 23 ప్రజా సంఘాలు నిషేధిత జాబితాలో ఉన్నట్లు హైదరాబాద్ నగర పోలీస్ కమీషనర్ శ్రీ అంజనీకుమార్ 11 అక్టోబర్, 2019న మీడియా సమావేశంలో ప్రకటించారు. అర్ధ శతాబ్ద కాలంగా ప్రజా క్షేత్రంలో ఉండి పని చేస్తున్న సంఘాలను బాధ్యతారాహిత్యంగా ఒక పోలీస్ అధికారి నిషేధిత జాబితా పేరుతో తప్పుడు ప్రచారానికి పూనుకున్నాడు. లేని నిషేధం ఉన్నట్లు ప్రచారం చేసి ప్రజలను, సంఘాల కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేయాలని ప్రభుత్వం, అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో వివిధ ప్రజా సంఘాల్లో పని చేస్తున్న నాయకులకు నిషేధిత సంస్థలతో సంబంధాలను అంటగట్టి గద్వాల జిల్లా కేంద్రంగా కుట్ర కేసును నమోదు చేసారు. ఈ కేసులో తెలంగాణ ప్రజాఫ్రంట్ ఉపాధ్యక్షుడు నలమాస కృష్ణను, ఓయూలో ఎకనామిక్స్ లెక్చరర్ డా.జగనను, తెలంగాణ విద్యార్థి వేదిక అధ్యక్షుడు మద్దిలేటిని, నాగరాజు, బలరాంను అరెస్ట్ చేసారు. అదే విధంగా తెలంగాణ ప్రజాఫ్రంట్ ప్రధాన కార్యదర్శి మెంచు రమేష్, చైతన్య మహిళా సంఘం కార్యదర్శి శిల్ప, కార్యవర్గ సభ్యురాలు రేణుకపై ఇదే కేసును మోపారు.

కష్టజీవికి ఇరువైపుల నిలబడిన సాహిత్య, కళా సంస్థలను, పౌర ప్రజాస్వామిక హక్కుల కోసం నినదిస్తున్న హక్కుల సంఘాలను, దళితులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ పోరాడుతున్న కుల సంఘాలను, సమాజంలో సగ భాగమైన స్త్రీల కోసం పని చేస్తున్న మహిళా సంస్థలను, తెలంగాణ సాధనలో అగ్రభాగాన నిలిచిన ప్రజా, విద్యార్థి సంఘాలను, ఆదివానీ అస్తిత్వం కోసం నినదిస్తున్న సంస్థలను, వివిధ రకాలుగా ప్రజా క్షేత్రంలో పని చేస్తున్న వారిని నిషేధం పేరు మీద ప్రజల పక్షం వహించి పోరాటం చేయకుండా అడ్డుకోవడానికి ప్రభుత్వం ఈ తప్పుడు ప్రచారానికి పూనుకున్నది. అబద్దపు ప్రచారంలో ప్రజాస్వామిక గొంతులను నిలువరించాలనుకోవడం నియంతృత్వం అవుతుంది. ప్రజల చేత ఎన్నుకోబడిన నిజమైన ప్రభుత్వాలకు ఇది సరైనది కాదు.

పోలీసు అధికారులు కూడా ప్రజాసేవకులుగా కాకుండా ప్రభుత్వ విధానాల ప్రచార కర్తలుగా మారటం చాలా విషాదం. ప్రజా జీవితంలో ఉన్న సంస్థలపై తప్పుడు ప్రచారం చేయడం సరైనది కాదు. వెంటనే ప్రభుత్వం ఈ తప్పుడు ప్రచారాన్ని ఆపి ఈ సందర్భంలో ప్రజాసంఘాల నాయకుల మీద మోపిన అక్రమకేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నాము. తెలంగాణలో పౌర, ప్రజాస్వామిక హక్కులకు భంగం వాటిల్లే చర్యలను మానుకోవాలని కోరుతున్నాము. తమ న్యాయమైన హక్కుల కోసం రోడ్డు మీదికి వచ్చి పోరాడుతున్న ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించి ప్రశాంత వాతావరణాన్ని కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.

వామ‌ప‌క్ష, విప్ల‌వ పార్టీలు, ప్ర‌జా సంఘాలు
సీపీఎం, సీపీఐ, సీపీఐ (ఎ.ఎల్) న్యూ డెమోక్రసీ, సీపీఐ (ఎ.ఎల్), సీపీఐ (ఎ.ఎల్)న్యూ డెమోక్ర‌సీ, తెలంగాణ జనసమితి, తెలంగాణ ఇంటిపార్టీ, ఏసీఎఫ్, బీసీ సంక్షేమ సంఘం, ఎంఆర్‌పీఎస్, బీసీ సంక్షేమ సంఘం, వహదత్-ఎ-ఇస్లామి హింద్, సివిల్ లిబర్టీస్ మానిటరింగ్ కమిటీ, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు యూనియన్, మానవ హక్కుల వేదిక, విప్లవ రచయితల సంఘం, కులనిర్మూలన పోరాట సమితి, రాజకీయ ఖైదీల విడుదల కమిటీ, తెలంగాణ ప్రజాస్వామిక వేదిక, తెలంగాణ ప్రజా ఫ్రంట్, చైతన్య మహిళా సంఘం, ప్రజాకళా మండలి, అమరుల బంధుమిత్రుల సంఘం, తెలంగాణ విద్యార్థి వేదిక, డెమోక్రటిక్ స్టూడెంట్ యూనియన్, తెలంగాణ విద్యార్థి సంఘం, ఆదివాసీ విద్యార్థి సంఘం, తెలంగాణ యువజన సంఘం, తెలంగాణ అసంఘటిత కార్మిక సంఘాల సమాఖ్య, గిరిజన ఐక్యవేదిక, దేశ భక్త ప్రజాతంత్ర ఉద్యమం, తెలంగాణ రైతాంగ సమితి, తుడుం దెబ్బ, భూ నిర్వాసిత వ్యతిరేక పోరాట కమిటీ, పీపుల్స్ ఎగెనెపోలవరం ప్రాజెక్ట్, విస్తాపన్‌ విరోద్‌ జన వికాస్ ఆందోళన్‌

సభాధ్యక్షత : ప్రొ.సి. కాశీం
వక్తలు:
తమ్మినేని వీరభద్రం, సీపీఎం
చాడ వెంకట్ రెడ్డి, సీపీఐ
వేములపల్లి వెంకటరామయ్య సీపీఐ (ఎ.ఎల్)న్యూ డెమోక్రసీ
సాదినేని వెంకటేశ్వరరావు - సీపీఐ (ఎ.ఎల్)న్యూ డెమోక్రసీ
ప్రొ. కోదండరామ్, తెలంగాణ జనసమితి
చెరుకు సుధాకర్, తెలంగాణ ఇంటి పార్టీ
విమల, ఏసీఎఫ్
ఆర్.కృష్ణయ్య, బీసీ సంక్షేమ సంఘం
మందకృష్ణ మాదిగ, ఎంఆర్ఎస్
జాజుల శ్రీనివాస్ గౌడ్, బీసీ సంక్షేమ సంఘం
జీవ‌న్‌కుమార్‌, హెస్ఆర్ఎఫ్
ప్రొ.హరగోపాల్
ప్రొ. లక్ష్మణ్, పౌరహక్కుల సంఘం
మౌలానా నసీరుద్దీన్, వహదత్ - ఎ - ఇస్లామి హింద్
లతీఫ్, సివిల్ లిబర్టీస్ మానిటరింగ్ కమిటీ
విరహత్ అలీ, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు యూనియన్
చుక్కా రామయ్య
ఆర్.నారాయణమూర్తి
పొత్తూరి వెంకటేశ్వరరావు
కె.శివారెడ్డి
ప్రొ.కాత్యాయని విద్మహే
దేవిప్రియ
నిఖిలేశ్వర్
జె.బి.రాజు
పాశం యాదగిరి
యాకూబ్
జయధీర్ తిరుమలరావు
వాసిరెడ్డి నవీన్

Keywords : Arrests, Telangana, TVV, TPF, Virasam, CLC
(2019-11-12 09:51:40)No. of visitors : 298

Suggested Posts


మహాశ్వేతా దేవి - మన తెలంగాణ సాగర హారంః వరవర రావు

మన మహా సాగరహారం ʹచలో హైదరాబాద్ అంటూ తెలంగాణ మార్చ్ చేసిన సెప్టెంబర్ 30, 2012 మహత్తర మధ్యాహ్నం మహాశ్వేతాదేవి కూడా మన ఊర్లో ఉన్నారు. ఆ రోజు ఆమెను మన మధ్యకు తెచ్చుకొని ఉంటే....

సెప్టెంబర్ 17 - ఇండియన్ యూనియన్ సైనిక దురాక్రమణ దినం - వరవరరావు

1947 ఆగస్ట్ 15న విలీనానికి అంగీకరించకుండా షరతులు విధిస్తూ వచ్చిన నిజాంను నెహ్రూ - పటేల్ ప్రభుత్వం సగౌరవంగా, సాదరంగా చర్చలకు ఆహ్వానించింది. అప్పటికే నిజాంను వ్యతిరేకిస్తూ వీరోచిత పోరాటం నడుపుతున్న కమ్యూనిస్టులను మాత్రమే కాదు, కనీసం కాంగ్రెస్ ను కూడా ఈ చర్చల్లో భాగం చేయలేదు....

ఆదివాసి.. లంబాడా వివాదం ‍- ఎం.రత్నమాల

మహారాష్ట్ర ప్రభుత్వం లంబాడాలను ఆదివాసి తెగగా గుర్తించడం లేదు కనుక ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం లంబాడాలను ఆదివాసి షెడ్యూల్డు తెగగా ప్రకటించడంతో దీన్ని అవకాశంగా తీసుకుని మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్‌ (పాత) జిల్లాకు లంబాడాల వలసలు పెద్ద ఎత్తున వెల్లువలా సాగాయి.....

ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ పోరాటానికి విరసం మద్దతు

అట్టడుగున ఉన్న మనిషికి ఫలితాలు అందినప్పుడే సామాజిక న్యాయం జరిగినట్టు లెక్క. మాదిగ, డక్కలి, చిందు, మాష్టి, బుడగజంగం, దాసరి, బేగరి కులాలకు ఈ నాటికీ ఎస్సీ రిజర్వేషన్ ఫలాలు అందడం లేదు....

ʹఅరుణోదయʹ పై పోలీసుల దాడిని ఖండించిన విరసం

తెలంగాణ ఉద్యమంలో ఆట పాటతో ఆరుణోదయ కళాకారులు గ్రామ గ్రామాన తిరిగి ప్రజల్లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తమ వంతు కృషి చేశారు. ఆ సంస్థ కార్యాలయాన్ని దౌర్జన్యంగా మూసేయడం అత్యంత నిరంకుశమైన......

ఆ నిండైన సాహిత్య సామాజిక జీవితం రచయితలందరికీ ఆదర్శం - విరసం

ʹరచయితలందరూ తమ తరానికి జవాబుదారులు; తమకు తాము జవాబు చెప్పుకోవాల్సిన వాళ్ళు... అంతస్సాక్షి ఉన్న రచయిత పీడిత ప్రజల పక్షాన దృఢంగా నిలవాలి. అలా కాకపోతే ఆ రచయితల్ని నిర్దోషులుగా నిర్ణయించే ప్రశ్నే లేదు.ʹ....

ఉత్తేజకరంగా సాగిన విరసం సాహిత్యపాఠశాల‌

అంతకుముందు అంతర్జాతీయ శ్రామికవర్గ పతాకావిష్కరణతో కార్యక్రమాలను ప్రారం భించారు. అమరుడు పులి అంజన్న తల్లి సైదమ్మ ఎర్ర జెండాను, సీనియర్ విరసం సభ్యురాలు రత్నమాల విప్లవ రచయితల సంఘం జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా అమరుడు శేషయ్య సోదరుడు సాంబయ్య, అమరుడు వివేక్ తండ్రి యోగానంద్ అమరుల స్థూపాన్ని ఆవిష్క రించారు.

ʹఆయన జైల్లోనే చనిపోతారేమోʹ

90 శాతం అంగవైకల్యం కలిగిన సాయిబాబాను అన్యాయంగా జైల్లో పెట్టారని.. ఆయనేమైనా యుద్ద ఖైదీనా..? ప్రభుత్వ అనాలోచిత చర్యతో యుద్ధఖైదీ మాదిరి ఆయన జైల్లోనే తుది శ్వాస విడిచే పరిస్ధితి వచ్చిందని ...

అమరుడు బొజ్జా తారకం — ʹనది పుట్టిన గొంతుకʹ - వరవరరావు

గోదావరి తెలంగాణలో ప్రవేశించిన నిజామాబాద్ కు 1968లో వచ్చిన తారకం గారు ఇక్కడి మట్టిలోని ఎరుపులోనూ, ఇక్కడి నీళ్లలోని ప్రవాహ గుణంలోనూ కలగలిసిపోయారు. 1968 నుంచి 78 దాకా ఒక దశాబ్దం పాటు విప్లవోద్యమాలకు, విప్లవ సాహిత్యానికి నిజామాబాద్ చిరునామా బొజ్ఞాతారకం....

చలసాని స్మృతిలో... - కే.కుమార్ వర్మ

బొడ్డపాడు నడిబొడ్డులో అమరవీరులను స్మరిస్తూ ఎర్ర జెండా చేతబట్టి తామాడ గణపతి ఇంటిముందునుండి దండుగా కదులుతున్నట్లుంది...

Search Engine

కేసీఆర్ అప్రజాస్వామిక పాలన‌: అనురాధ, రవిల అరెస్ట్ - రాజద్రోహం, యూఏపీఏ కేసులు బనాయింపు
ఫీజుల పెంపును నిరసిస్తూ.. కేంద్ర మంత్రిని నిర్బంధించిన జేఎన్‌యూ విద్యార్థులు..!
పోలీసుల అడ్డంకులు ఛేదించుకుని సమరోత్సాహంతో ట్యాంక్ బండ్ పైకి దూసుకొచ్చిన‌ కార్మికులు
చలో ట్యాంక్ బండ్ లో మావోయిస్టులున్నారన్న సీపీ... ఉక్కుపాదం మోపడం కోసమే ఈ ఆరోపణలన్న‌ ఆర్టీసీ జేఏసీ
వేలాది పోలీసు బలగాల నిర్బంధాల మధ్య‌ చలో టాంక్ బండ్ విజయవంతం
ఆర్టీసీ సమ్మెకు రాజకీయ ఖైదీల మద్దతు.. జైళ్లో నిరసన.. చలో ట్యాంక్‌బండ్ విజయవంతం చేయండి..!
భగత్ సింగ్ పిస్టల్ – అనేకానేక స్మృతులు
జర్నలిస్టులు, దళిత, మానవహక్కుల కార్యకర్తల వాట్సప్ ఖాతాలు హ్యాక్
దొర ప్రతాపమంత మజ్దూర్ల మీదనే!
ఆర్టీసీ సమ్మె పై నిర్భందం...పౌరహక్కుల సంఘం ఆగ్రహం
భారత విప్లవోద్యమంలో చారుమజుందార్‌ - రేపే శతజయంతి సదస్సు
నలమాస కృష్ణ, మద్దిలేటిల అరెస్టు చట్టబద్దం కాదు - హైకోర్టు
ʹఆవులగురించి కాదు ఆడపిల్లల గురించి శ్రద్ద పెట్టండిʹ
ఈ కుట్ర కేసు వెనుక ఉన్న కుట్రలో అసలు కథ‌ ఇంకోటి ఉంది
నలమాస కృష్ణ, మద్దిలేటి అరెస్ట్...అక్రమం అంటున్న ప్రజా సంఘాలు
RTC కార్మికులారా ఆత్మహత్యలు వ‌ద్దు.. తెలంగాణ సమాజం మీ వెంట‌ ఉంది.. పోరాడి హక్కులు సాదించుకుందాం !
దేశానికి రానున్నవి చీకటిరోజులు
మావి నిషేధిత సంఘాలు కావు
పోలీస్ క‌మిష‌న‌ర్ ప్ర‌క‌ట‌న‌పై కేసీఆర్ స్పందించాలి : ప‌్ర‌జా సంఘాలు
కేసీఆర్ ఓ నియంత : విరసం కార్య‌ద‌ర్శి పాణి
Condemn arrest and onslaught on TVV and others activists - SFS
ʹనల్లమల గురించి మాట్లాడినందుకే నాభర్తను అరెస్ట్ చేశారు..ఆయనెక్కడున్నడో నాకు చూపించాలిʹ
స్టూడెంట్ మార్చ్ పత్రిక ఎడిటర్, విరసం కార్యవర్గ సభ్యుడు డా. జగన్ ను విడుదల చేయాలి
దేశవ్యాప్త నిరసనలతో వెనక్కి తగ్గిన పోలీసులు...49 మంది ప్రముఖలపై కేసు విత్ డ్రా
Over 140Telugu Literary Persons Endorse Letter to PM by 49 Celebrities, Condemn FIR
more..


తెలంగాణలో