ఆర్టీసీ సమ్మెకు రాజకీయ ఖైదీల మద్దతు.. జైళ్లో నిరసన.. చలో ట్యాంక్‌బండ్ విజయవంతం చేయండి..!


ఆర్టీసీ సమ్మెకు రాజకీయ ఖైదీల మద్దతు.. జైళ్లో నిరసన.. చలో ట్యాంక్‌బండ్ విజయవంతం చేయండి..!

ఆర్టీసీ

తమ న్యాయమైన డిమాండ్ల కోసం తెలంగాణ ఆర్టీసీ కార్మికులు గత 35 రోజులుగా చేస్తున్న నిరవధిక సమ్మెకు అనూహ్య మద్దతు లభించింది. వరంగల్ సెంట్రల్‌ జైలుతో పాటు.. తెలంగాణలో ఉన్న అన్ని జైళ్లలో ఉన్న రాజకీయ ఖైదీలు సమ్మెకు తమ మద్దతు ప్రకటించారు. తమ హక్కులు, డిమాండ్ల సాధన కోసం పోరాడుతున్న ఆర్టీసీ కార్మికులకు తమ సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని వారు ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకు గాను జైల్లోనే నిరహార దీక్ష చేస్తూ.. ప్రభుత్వ వైఖరి పట్ల తమ నిరసన వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిశ్రమలు తెరుచుకుంటాయని కొత్తగా ఉద్యోగాలు వస్తాయని అనుకుంటే.. ఉన్న ఉద్యోగాలకే రక్షణ లేకుండా పోయిందని వారు అన్నారు. ఆర్టీసీ సమస్యలను పరిష్కరించుకోవడమే కాకుండా.. ప్రజల ఉమ్మడి ఆస్తిని పరిరక్షించుకునే బాధ్యతను కార్మికులు తమ భుజాలపైకి ఎత్తుకున్నారని అన్నారు. సమ్మెకు పలు ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వడంతో పాటు న్యాయస్థానం కూడా సమ్మె న్యాయమైనదని చెప్పడం అభినందించగదినదని వారన్నారు.

ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా శనివారం తలపెట్టిన చలో ట్యాంక్‌బండ్ కార్యక్రమానికి తమ మద్దతు ఉందని వారు చెప్పారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు.

పూర్తి ప్రకటన కింద చూడండి

Keywords : ఆర్టీసీ సమ్మె, రాజకీయ ఖైదీలు,మద్దతు, RTC Strike, Political Prisoners
(2019-11-12 19:05:04)No. of visitors : 215

Suggested Posts


0 results

Search Engine

కేసీఆర్ అప్రజాస్వామిక పాలన‌: అనురాధ, రవిల అరెస్ట్ - రాజద్రోహం, యూఏపీఏ కేసులు బనాయింపు
ఫీజుల పెంపును నిరసిస్తూ.. కేంద్ర మంత్రిని నిర్బంధించిన జేఎన్‌యూ విద్యార్థులు..!
పోలీసుల అడ్డంకులు ఛేదించుకుని సమరోత్సాహంతో ట్యాంక్ బండ్ పైకి దూసుకొచ్చిన‌ కార్మికులు
చలో ట్యాంక్ బండ్ లో మావోయిస్టులున్నారన్న సీపీ... ఉక్కుపాదం మోపడం కోసమే ఈ ఆరోపణలన్న‌ ఆర్టీసీ జేఏసీ
వేలాది పోలీసు బలగాల నిర్బంధాల మధ్య‌ చలో టాంక్ బండ్ విజయవంతం
భగత్ సింగ్ పిస్టల్ – అనేకానేక స్మృతులు
జర్నలిస్టులు, దళిత, మానవహక్కుల కార్యకర్తల వాట్సప్ ఖాతాలు హ్యాక్
దొర ప్రతాపమంత మజ్దూర్ల మీదనే!
తెలంగాణలో పాత రోజులు మళ్ళీ దాపురించాయి... అణిచివేతే పాలకుల విధానమయ్యింది
ఆర్టీసీ సమ్మె పై నిర్భందం...పౌరహక్కుల సంఘం ఆగ్రహం
భారత విప్లవోద్యమంలో చారుమజుందార్‌ - రేపే శతజయంతి సదస్సు
నలమాస కృష్ణ, మద్దిలేటిల అరెస్టు చట్టబద్దం కాదు - హైకోర్టు
ʹఆవులగురించి కాదు ఆడపిల్లల గురించి శ్రద్ద పెట్టండిʹ
ఈ కుట్ర కేసు వెనుక ఉన్న కుట్రలో అసలు కథ‌ ఇంకోటి ఉంది
నలమాస కృష్ణ, మద్దిలేటి అరెస్ట్...అక్రమం అంటున్న ప్రజా సంఘాలు
RTC కార్మికులారా ఆత్మహత్యలు వ‌ద్దు.. తెలంగాణ సమాజం మీ వెంట‌ ఉంది.. పోరాడి హక్కులు సాదించుకుందాం !
దేశానికి రానున్నవి చీకటిరోజులు
మావి నిషేధిత సంఘాలు కావు
పోలీస్ క‌మిష‌న‌ర్ ప్ర‌క‌ట‌న‌పై కేసీఆర్ స్పందించాలి : ప‌్ర‌జా సంఘాలు
కేసీఆర్ ఓ నియంత : విరసం కార్య‌ద‌ర్శి పాణి
Condemn arrest and onslaught on TVV and others activists - SFS
ʹనల్లమల గురించి మాట్లాడినందుకే నాభర్తను అరెస్ట్ చేశారు..ఆయనెక్కడున్నడో నాకు చూపించాలిʹ
స్టూడెంట్ మార్చ్ పత్రిక ఎడిటర్, విరసం కార్యవర్గ సభ్యుడు డా. జగన్ ను విడుదల చేయాలి
దేశవ్యాప్త నిరసనలతో వెనక్కి తగ్గిన పోలీసులు...49 మంది ప్రముఖలపై కేసు విత్ డ్రా
Over 140Telugu Literary Persons Endorse Letter to PM by 49 Celebrities, Condemn FIR
more..


ఆర్టీసీ