చలో ట్యాంక్ బండ్ లో మావోయిస్టులున్నారన్న సీపీ... ఉక్కుపాదం మోపడం కోసమే ఈ ఆరోపణలన్న‌ ఆర్టీసీ జేఏసీ

చలో

చలో టాంక్ బండ్ కార్యక్రమంలో మావోయిస్టులు పాల్గొన్నారని హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీకుమార్ సంచలన ఆరోపణలు చేశారు. ఆర్టీసీ కార్మికులు.. మావోయిస్టు సంఘాలతో చేతులు కలిపారని సీపీ ఆరోపించారు. మావోయిస్టు అనుబంధ సంఘాలతో కలిసి ఆర్టీసీ కార్మికులు పోలీసులపై రాళ్లు రువ్వారని ఆయన ఆరోపించారు. ఈ ఘటనలో ఏడుగురు పోలీసులకు తీవ్రగాయాలయ్యాయని వెల్లడించారు. పోలీసులపై దాడి చేసినవారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. ఆర్టీసీ సమ్మెలో మావోయిస్టులు ఉన్నారు కాబట్టే చలో టాంక్ బండ్ కు అనుమతి ఇవ్వలేదన్నారు.

అయితే సీపీ ఆరోపణలు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. ʹచలో ట్యాంక్‌బండ్ʹ కార్యక్రమంలో పాల్గొన్నదంతా కార్మికులేనని ఆయన చెప్పారు. మావోయిస్టులు ఉన్నారంటూ అనవసర ఆరోపణలు చేసి సమ్మెపై ఉక్కుపాదం మోపాలని చూస్తున్నారని ఆరోపించారు. ఎన్ని నిర్బంధాలు ఎదురైనా ʹచలో ట్యాంక్‌బండ్ʹను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ఆయన ధన్యవాదాలు చెప్పారు. సహకరించిన రాజకీయ పార్టీలు.. ప్రజాసంఘాలు.. విద్యార్థి సంఘాలకు కృతజ్ఞతలు తెలిపారు. పోలీసుల దమనఖాండను ఖండిస్తున్నామన్నారు. పోలీసుల దమన ఖాండకు నిరసనగా ఆదివారం నల్లబ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం చేపట్టాలని అశ్వత్థామ‌రెడ్డి పిలుపునిచ్చారు.

Keywords : rtc strike, challo tank band, police, maoists
(2024-04-13 23:08:48)



No. of visitors : 830

Suggested Posts


ఆర్టీసీని ప్రైవేటు పరం చేయడానికి టీఆరెస్ ప్రభుత్వం కుట్ర... సమ్మెకు ప్రజలందరూ మద్దతు తెలపాలి ...మావోయిస్టు పార్టీ

ఆర్టీసి కార్మికులంతా తమ డిమాండ్లు నెరవేరే వరకు సమ్మెను విరమించకుండా విరోచితంగా పోరాడండి. పోరాడితేనే మన సమస్యలకు అంతిమ పరిష్కారాలుంటాయి. లేదంటే వున్న ఉద్యోగాలు పోయి బజారున పడుతారు. అవసరమైతే త్యాగాలకు సిద్ధం కండి. కార్మికుల న్యాయమైన డిమాండకు అన్ని సెక్షన్ల ప్రజలంతా తమ సంపూర్ణ మద్దతును అందించండి. వారితో భుజం కలిపి పోరాడండి.

ఆర్టీసీ నష్టాలకు కారణమెవరు ? సమ్మె ఎవరి కోసం ?

తెలంగాణ ప్రభుత్వం సాలీనా సుమారు 1000 కోట్ల రూపాయలు ఆర్టీసీ నుండి వసూలు చేస్తోంది. 2014 నుండి 2019 వరకు ఈ 5 సంవత్సరాల కాలంలో 5 వేల కోట్ల రూపాయలు ఆర్టీసి ప్రభుత్వానికి చెల్లిస్తే, ప్రభుత్వం మాత్రం కేవలం 710 కోట్ల రూపాయలు మాత్రం ఆర్టీసికి ఇచ్చి చేతులు దులుపుకుంది.

ʹఇది ఆర్టీసీ ఉద్యోగుల పోరాట‌మే కాదు - కేసీఆర్ నియంతృత్వ వ్య‌తిరేక ప్ర‌జాస్వామిక పోరాటంʹ

ఉచితాలు, రాయితీలు, పింఛన్లు కాకుండా న్యాయమైన హక్కుల కోసం ఆర్టీసీ కార్మికులు పోరాడుతున్నారు. సంస్థను ప్రైవేటీకరించాలనే కుట్రను ప్రశ్నిస్తున్నారు. కాబట్టి ఇది ప్రజల పోరాటం. ప్రజా అవసరాలు తీర్చే పోరాటం. ఈ పోరాటానికి ప్రజలు, ప్రజాస్వామికవాదులు, మేధావులు, బుద్ధి జీవులు పూర్తిగా సంఘీభావం ప్రకటించాలి. ప్రజా రవాణా సంస్థ అయిన ఆర్టీసీని బతికించు కోవలసిన అవసరం ప్ర

ఆర్టీసీ సమ్మె పై నిర్భందం...పౌరహక్కుల సంఘం ఆగ్రహం

పారిశ్రామిక వివాదాల చట్టం 1947 ప్రకారముగా నెల రోజుల ముందు నోటీస్ ఇచ్చి చట్ట బద్ధమైన సమ్మె చేస్తున్నారు. దానికి ఆర్టీసి యాజమాన్యము, కార్మిక శాఖ, కార్మిక సంఘాలు చర్చలు జరిపి పరిష్కారముకు ఇరువురు కృషి చేయాలి. కాని తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి చట్ట విరుద్ధంగా జోక్యము చేసుకుని ముగ్గురు ఐ.ఎ.ఎస్ లతో కమిటీ వేసి మొక్కుబడిగా చర్చలు జరిపించి, కార్మిక సంఘాలు మొండిగా

వేలాది పోలీసు బలగాల నిర్బంధాల మధ్య‌ చలో టాంక్ బండ్ విజయవంతం

ఆర్టీసీ జేఏసీ ఇచ్చిన చలో టాంక్ బండ్ పిలుపు విజయవంతం అయ్యింది. ఆర్టీసీ కార్మికులు తమ సమస్య పరిష్కారం కోసం, ఆర్టీసీని రక్షించడం కోసం 35 రోజులుగా చేస్తున్న సమ్మె కొనసాగింపుగా ఈ రోజు తలపెట్టిన చలో టాంక్ బండ్ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది.

దొర ప్రతాపమంత మజ్దూర్ల మీదనే!

ఇంతకు ఏమడిగిండ్రయా వాండ్లు? ఏమన్న నీ బంగ్లలు ఇమ్మన్నరా, నీ జాగలిమ్మన్నరా, నీ ముల్లెలు ఇమ్మన్నరా? సర్కారు నౌకర్లతోటి సమానంగ తనఖా ఉండాలన్నరు. సర్కార్ల కలుపుమన్నరు. పని కాడ సౌలత్ జూడమన్నరు.

పోలీసుల అడ్డంకులు ఛేదించుకుని సమరోత్సాహంతో ట్యాంక్ బండ్ పైకి దూసుకొచ్చిన‌ కార్మికులు

తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెలో భాగంగా ఈ రోజు చలో ట్యాంక్ బండ్ కార్యక్రమంలో కార్మికులు పెద్దఎత్తున పాల్గొన్నారు. పోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎక్కడికక్కడ అరెస్టులు సాగించినా ట్యాంక్ బండ్ కు అన్ని వైపులనుండి కార్మికులు

RTC కార్మికులారా ఆత్మహత్యలు వ‌ద్దు.. తెలంగాణ సమాజం మీ వెంట‌ ఉంది.. పోరాడి హక్కులు సాదించుకుందాం !

సమ్మె కార్మికుని జన్మ హక్కు అయినప్పటికినీ ప్రభుత్వం వారితో చిత్తశుద్దితో చర్చలు చేయకుండా, సమ్మెలో పాల్గొన్నారని వారిని ఉద్యోగాలనుంచి తొలగించివేయడం లాంటి ప్రకటనలు చేయడం వల్ల‌ RTC కార్మికులు వారి కుటుంబాలు తీవ్రమైన అభద్రతకు లోనవతున్నారని, ఆ అభద్రతా బావనల్లోంచే ఈ ఆత్మహత్యలు జరుగుతున్నాయని పౌరహక్కుల సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


చలో