ఫీజుల పెంపును నిరసిస్తూ.. కేంద్ర మంత్రిని నిర్బంధించిన జేఎన్‌యూ విద్యార్థులు..!


ఫీజుల పెంపును నిరసిస్తూ.. కేంద్ర మంత్రిని నిర్బంధించిన జేఎన్‌యూ విద్యార్థులు..!

దేశ రాజధాని ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) ప్రాంగణం మరో సారి విద్యార్థుల ఆందోళనతో అట్టుడుకుతోంది. హాస్టల్ ఫీజులను భారీగా పెంచడమే కాకుండా నిబంధనలను కూడా కఠినతరం చేయడాన్ని నిరసిస్తూ విద్యార్థులు ఇవాళ ఉదయం నుంచి ఆందోళన చేపట్టారు. యూనివర్సిటీలోని విద్యార్థులంతా ఒక్క సారిగా ఆందోళనకు దిగడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు.

జేఎన్‌యూ స్నాతకోత్సవంలో పాల్గొనడానికి వచ్చిన కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేష్‌ను విద్యార్థులు చుట్టుముట్టి ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. యూనివర్సిటీ గేట్లు వేసి మంత్రిని బయటకు వెళ్లకుండా నిర్బంధించారు. విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఉండటంతో పోలీసులు కూడా వారిని నియంత్రించడానికి బారీకేడ్లు ఏర్పాటు చేశారు. బారికేడ్లను దాటుకుంటూ వచ్చే విద్యార్థులపై పోలీసులు దాడి చేశారు. వారిపై వాటర్ కెనాన్లను ప్రయోగించడంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

హాస్టల్ మాన్యువల్‌ను ఎందుకు ఇంత కఠినతరంగా మార్చేశారని.. ఫీజులు ఎందుకు పెంచారని విద్యార్థులు మంత్రిని నిలదీశారు. వెంటమే తమ డిమాండ్లు ఆమోదించాలని.. అప్పటి వరకు మంత్రిని బయటకు పోనివ్వమని వారు పట్టుబడుతున్నారు.

Keywords : JNU, Students, Agitation, Fees Hike, Hostel Manual, Central Minister, Ramesh
(2020-08-08 09:19:16)No. of visitors : 459

Suggested Posts


0 results

Search Engine

ప్రజల పంటలను ధ్వంసం చేసిన పోలీసులు, ఫారెస్ట్ అధికారులు ... నిజనిర్దారణ కమిటీ రిపోర్ట్
అంబులెన్స్ సమయానికి రాక గర్భవతి మరణం... వార్త ప్రసారం చేసిన జర్నలిస్టు, టి వి చానెల్ పై కేసు
వీవీని విడుదల చేయాలి...ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, పబ్లిక్ సెక్టార్, కాంట్రాక్టు ఉద్యోగుల ఐక్య వేదిక డిమాండ్
పాలకుల అవినీతిని వెలికి తీసిన జర్నలిస్టులపై రాజద్రోహం కేసులు...అరెస్టులు
విప్లవ వాగ్గేయకారుడు వంగపండు ప్రసాదుకు నివాళి -విరసం
వీరుల కన్నతల్లి... అమరుల బంధువు...
ఇది భయపడాల్సిన సమయం కాదు... ఎదిరించాల్సిన సమయం...ప్రొఫెసర్ హానీబాబు భార్య డాక్టర్ జెన్నీ రోవేనా
వారిపై దాడి చేసింది సిఆర్‌పిఎఫ్ బలగాలే... మావోయిస్టులు కాదు...నిజనిర్దారణ కమిటీ రిపోర్టు
ముగిసిన అమ్మ ఎదురు చూపులు
ఏపీ జైళ్ళలో కరోనా పాజిటీవ్....ఖైదీలను విడుదల చేయాలి
ప్రొఫెసర్ సాయిబాబాను కాపాడుకుందాం... సహకరించండి... సాయిబాబా భార్య లేఖ‌
పోలీసు కూంబింగు‌ల మధ్య ఏవోబీలో భారీ ర్యాలీ ‍- అమరుల వారోత్సవాలు జరుపుకుంటున్న ప్రజలు
ప్రైవేట్ హాస్పిటల్స్ లో కరోనా పీజుల దోపిడీని అరికట్టాలి -CLC
అక్రమంగా అరెస్ట్ చేసిన ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ హనీ బాబును విడుదల చేయాలి - CLC
Condemn the impunity towards political prisoners
వరవరరావును విడుదల చేయాలి....765 మంది జర్నలిస్టుల లేఖ!
భీమా కోరేగావ్ కేసు: మరో ప్రొఫెసర్ అరెస్ట్
Condemn the arbitrary arrest of Prof. Hany Babu - CASR
కవిత్వంలో అమరత్వం...జూలై 28 - వరవరరావు
ఉద్యమాల ఉపాధ్యాయుడి జీవితమంతా ప్రజా ఉద్యమాలే
కుల నిర్మూలనవాది ఉసాకి జోహార్లు...పాపని నాగరాజు
ఉద్యమాల ఉపాధ్యాయుడు ఉ.సా.కు జోహార్లు !
వరవరరావు,సాయిబాబాలను విడుదల చేయాలంటూ 520 మంది రచయితల లేఖ‌ !
విలాస జీవితం ఎవరిది....డీజీపీకి మావోయిస్టుల సవాల్
వీవీ విడుదల కోసం బంద్ కు పిలుపునిచ్చిన మావోయిస్టు పార్టీ
more..


ఫీజుల