కేసీఆర్ అప్రజాస్వామిక పాలన‌: అనురాధ, రవిల అరెస్ట్ - రాజద్రోహం, యూఏపీఏ కేసులు బనాయింపు


కేసీఆర్ అప్రజాస్వామిక పాలన‌: అనురాధ, రవిల అరెస్ట్ - రాజద్రోహం, యూఏపీఏ కేసులు బనాయింపు

కేసీఆర్

కేసీఆర్ సర్కార్ తెలంగాణలో కొనసాగిస్తున్న అప్రజాస్వామిక, నిరంకుశ పాలనకు మరో ఉదహరణ ఇది. ప్రజల హక్కుల కోసం పోరాడుతున్న నార్ల రవి, బెల్లపు అనురాధలను అరెస్టు చేసి దుర్మార్గమైన రాజద్రోహం, యూఏపీఏ కేసులు బనాయించారు. హైదరాబాద్ లోని వాళ్ళ ఇంటిపై ఈ రోజు ఉదయం 7 గంటల ప్రాంతంలో దాడి చేసిన పోలీసులు రాత్రి 9.30 దాకా వారిని, రవి తల్లిని, ఏమయ్యిందో అని చూడడానికి వెళ్ళిన రవి సోదరిని, సోదరుడిని, తండ్రిని ఇంట్లోనుండి బైటికి రాకుండా బంధించి (ఇది రాస్తున్న సమయానికి ఇంకా వాళ్ళను బైటికి తీసుకరాలేదు)వస్తువులను ఛిన్నాభిన్నం చేశారు. చివరకు రాత్రి వారిని అరెస్టు చేసినట్టు ఓ ప్రెస్ నోట్ మీడియాకు రిలీజ్ చేశారు.
పోలీసులు ప్రెస్ నోట్ లో చెప్పినట్టు వారిద్దరూ మావోయిస్టు పార్టీలో పని చేసింది నిజమే.వారిద్దరిపై అనేక కేసులున్నవి అని పోలీసులు చెబుతున్నారు. అందులో రవి మీద‌ ఒక కేసు తప్ప మిగతావన్నీ కొట్టేశారన్నది పచ్చి నిజం. ఆ కేసుకు ఆయన క్రమం తప్పకుండా హాజరవుతున్నాడు. వాళ్ళిద్దరూ ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉంటున్నారు. పోలీసులే చెప్పినట్టు దేశ వ్యాప్తంగా ఏర్పడ్డ హిందుత్వ ఫాసిస్టు వ్యతిరేక వేదికలో చురుకుగా పాల్గొంటున్నారు. దేసంలో రోజు రోజుకూ పెరుగుతున్న మత ఫాసిజానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. అయోద్య తీర్పుపై ఈ రోజు సుందరయ్య విఙాన కేంద్రంలో ప్రెస్ మీట్ పెట్టాల్సి ఉన్నది. ఆ ప్రెస్ మీట్ జరగనివ్వకుండా ఆ మీట్ కు వస్తున్న అరుణోదయ అధ్యక్షుడు బైరాగిని, సీపీఐ ఎంఎల్ న్యూ డెమాక్రసీ నాయకులు వేములపల్లి వెంకట్రామయ్య, సూర్యంలను అరెస్టు చేశారు.
ఇక రవి, అనురాధల విషయంలో పోలీసులు పొద్దటి నుండి చాలా రహస్యంగా వ్యవహరించారు. మీడియాకు ఆ ఇంటి దగ్గరికి వెళ్ళినా లోపలికి రానివ్వలేదు. మీడియా అడిగే ప్రశ్నలకు జవాబు ఇవ్వలేదు. ఇక రాత్రి 7.30 ప్రాంతంలో అనురాధ, రవిలను అరెస్టు చేశామంటూ ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు కానీ వాళ్ళిద్దరిని (ఇది రాస్తున్న సమయానికి)ఇంట్లో నుండి బైటికి తీసుకరాలేదు.
దాదాపు మూడేళ్ళుగా రవి, అంతకు ముందునుండే అనురాధలు హైదరాబాద్ లోనే ఉంటున్నారు. జైలు నుండి విడుదలై వాళ్ళిద్దరూ హైదరాబాద్ లోనే ఉంటున్నారు. ఇంత కాలం లేనిది ఇప్పుడెందుకు వాళ్ళను అరెస్టు చేసినట్టు. వాళ్ళిద్దరూ హిందూ ఫాసిజానికి వ్యతిరేకంగా చురుకుగా పోరాడటం, అందుకోసం దేశవ్యాప్త సంస్థ ఏర్పడటం హిందూ ఫాసిస్టు రాజ్యానికి మింగుడుబడటం లేదు. దేశాన్ని మతోన్మాద రాజ్యంగా మార్చడానికి ఆరెస్సెస్, మోడీ, అమిత్ షా అండ్ బ్యాచ్ కు తెలంగాణలో కేసీఆర్ మంచి మిత్రుడుగా దొరికాడు. మిగతా విషయాల్లో ఎంత కొట్టుకుంటున్నట్టు నటించినా ఫాసిస్టు రాజ్యం స్తాపించడంలో ఒకరికొకరు తోడుగానే ఉన్నారు. అందుకే ఈ రోజు అయోద్య తీర్పుకు వ్యతిరేకంగా ఎవ్వరు మాట్లాడినా అటు మోడి బ్యాచ్ కానీ కేసీఆర్ బ్యాచ్ కానీ సహించలేకున్నది. రవి అనురాధలపై పెట్టిన రాజద్రోహం, యూఏపీఏ కేసులకు ఎలాంటి ఆధారాలూ లేవు. మొత్తం ప్రెస్ నోట్ లో కొట్టి వేయబడ్డ వాళ్ళిద్దరి పాత కేసుల గురించి రాశారు తప్ప కొత్తగా వాళ్ళు తవ్వి తీసిందేమీ లేదు.

విప్లవ కవి వరవరరావు తో సహా 11 మంది హక్కుల కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి, బెయిల్ కూడా రాకుండా కుట్ర చేస్తూ సంవత్సరానికి పైగా పూణే జైల్లో బంధీలుగా ఉంచారు. ప్రజలకోసం ధైర్యంగా మాట్లాడే గొంతులు లేకుండా చేయడమే ఫాసిస్టు రాజ్యం చేస్తున్న పని అందులో భాగంగానే ఇప్పుడు అనురాధ, రవిలపై అక్రమ కేసులు బనాయించారు. న్యాయ వ్యవస్థ కూడా రాజ్యంలో భాగమనేది మనకు అర్దమైతే రాబోయే కాలంలో ఈ దేశానికి ఏ గతి పట్టబోతుందో తెలుస్తుంది.
ఇది రాచకొండ పోలీసులు రిలీజ్ చేసిన ప్రెస్ నోట్Keywords : telangana, kcr, narendra modi, hindutva, anuradha, ravi
(2019-12-08 02:07:11)No. of visitors : 1057

Suggested Posts


గూడ అంజన్నకు జోహార్లు !

ʹఊరు మనదిరా.. ఈ వాడ మనదిరాʹ పాటతో అంజయ్యకు గుర్తింపు వచ్చింది. ఆయన రాసిన ఈ పాట తెలంగాణా ప్రతి పల్లె, ప్రతి ఇల్లు పాడుకుంది. ఆ పాట ప్రతి పల్లెలో సంఘం ఏర్పాటుకు మార్గమయ్యింది. ఈ ఊరు మనది... ఈ వాడ మనది.... దొర ఎవడురో అంటూ విప్లవకారుల నాయకత్వంలో తెలంగాణా పల్లెలు దొరల గడీల మీద...

విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్

తెలంగాణను విముక్తి చేయడానికి వచ్చిందని చెప్పబడుతున్న సైన్యం 1948 సెప్టెంబర్18 నుంచి1951 అక్టోబర్ దాకా వేల మంది తెలంగాణ రైతుకూలీలను, పోరాటయోధులను కాల్చిచంపింది. నైజాం సైన్యాలు, రజాకార్లు చేసిన హత్యల కన్న, 1948 సెప్టెంబర్ తర్వాత కేంద్రప్రభుత్వ సైనిక బలగాలు చేసిన హత్యలు,అకృత్యాలు ఎక్కువ....

 విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్

సెప్టెంబర్ 17, 1948 ని ʹహైదరాబాద్ విమోచన దినంʹ అని అభివర్ణిస్తే చరిత్ర మాత్రం ఫక్కున నవ్వుతుంది. ఏ ఒక్క చారిత్రక కోణం నుంచి చూసినా అది తెలంగాణ విమోచన కాదు. కావడానికి అవకాశం లేదు. ఎక్కువలో ఎక్కువ అది హైదరాబాద్ రాజ్యాన్ని భారత ప్రభుత్వ పాలన...

సమైక్య సభలో తెలంగాణను నినదించిన‌ శ్రీనివాస్ గౌడ్ ను తెలంగాణ ప్రభుత్వం సస్పెండ్ చేసింది

సమైక్య గూండాల చేతుల్లో దెబ్బలు తిని నెత్తురోడుతూ కూడా జై తెలంగాణ అని నినదించిన చేగోను... లాఠీలతో చితకబాదుతున్నా... ఆగకుండా తెలంగాణను నినధించిన పోలీసు శ్రీనివాస గౌడ్ నుమర్చి పోగలమా ? తన నేల తల్లి విముక్తి కోసం ఉద్యోగాన్ని లెక్క చేయకుండా నినాదాలు చేసి....

ʹనా భర్తను పోలీసులు కొట్టి చంపారుʹ

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట పోలీసులు కరీంనగర్ జిల్లా బావుపేటకి చెందిన వెంకటేశ్ ను దొంగతనం చేశాడనే పేరుతో అరెస్ట్ చేశారు. జులై 13 న కోర్టులో హాజరుపరచగా వెంకటేశ్ నుకోర్టు జ్యుడిషియల్ కస్టడికి ఆదేశించింది. ఆరోగ్యంబాగా లేదని చెప్పి వెంకటేష్ ను....

జైళ్ళలో పేదలే మగ్గుతున్నారు... ప్రజలకు పోలీసులతో ఎలాంటి లాభం లేదు... తెలంగాణ ఐపీఎస్ అధికారి

ʹభారత దేశం జైళ్ళలో 90 శాతం పేదలే మగ్గుతున్నారు. కొంతమందికి కనీసం ఎందుకు అరెస్ట్ అయ్యామో.. ఏ కేసులో అరెస్ట్ అయ్యి జైల్‌కు వచ్చామో కూడా తెలియదుʹʹ ఈ మాటలన్నది హక్కుల సంఘాల కార్యకర్తలు కాదు. కమ్యూనిస్టులు కాదు. మావోయిస్టులసలే కాదు. ఓ ఐపీఎస్ అధికారి ఈ మాటలు మాట్లాడారు.

కెసిఆర్ రెండేళ్లపాలన - విద్యారంగం - వరవరరావు

ఒక తెలంగాణ కవి తెలంగాణ ప్రభుత్వాధినేతను గరుత్మంతునితో పోల్చాడు. చూపు బహు తీక్షణం అని, రెండు కండ్ల తార్మికుడని, ఈ గరుత్మంతుని ముక్కు అంత పెద్దదని ఎంత ఎత్తుకు ఎదిగినా గూడు లేని తెలంగాణ గుడ్డుమీదే ధ్యాస అని అభివర్ణించాడు.

మార్చ్13 ఎంఆర్‌పిఎస్ బంద్ ను విజయవంత చేయండి - మావోయిస్టు పార్టీ ప్రకటన‌

ఇరవయ్యేళ్లకు పూర్వమే ముఖ్యమంత్రి నివాసాన్ని లక్షలాది మందితో ముట్టడించడం మొదలు గాంధీభవన్‌ ముట్టడి, పెరేడ్‌ గ్రౌండ్స్‌లో మెరుపు సమ్మె, కలెక్టరాఫీసుల ముందు ధర్నాలు, పాలకవర్గాల ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా భారతీ మాదిగ స్మృతిలో ఊరేగింపు వంటి ఎన్నో మిలిటెంట్‌ ఉద్యమాలు నిర్వహించారు.

ఉస్మానియా గుండె నిండా... ఈ దేశపు విప్లవ జెండా

ఉస్మానియాలో ఆరెస్యూ నాయకులైన రాంచందర్, మల్లోజుల కోటేశ్వర్ రావు, పటేల్ సుధాకర్, సంతోష్ రెడ్డి ఎలియాస్ మహేష్ , ఆ తర్వాత కాలంలో మావోయిస్టు పార్టీ నాయకత్వంలో ప్రత్యామ్నాయ రాజకీయాలతో భారత దేశంలో సాగుతున్న విప్లవానికి నాయకత్వం వహించినవారు... దేశ‌ విప్లవంలో తమ ప్రాణాలను త్యాగం చేసిన మారోజు వీరన్న, దామోదర్ రెడ్డి, విజయ కుమార్, రామేశ్వర్ లు ఉస్మానియా...

ʹనీ బాంచెన్ దొరా కాల్మొక్తʹ

జిల్లా కలెక్టర్ శరత్ మాట్లాడుతూ ఖిల్లాలో తొలిసారిగా గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు పాదాభివందనం చేస్తున్నానంటూ ...

Search Engine

నేను చనిపోయినా వారికి శిక్షపడాలి....ఉన్నావ్ అత్యాచార బాధితురాలి చివరి కోరిక‌
మా పేరు మీద కస్టడీ హత్యలు వద్దు..!
కూలి డబ్బులు అడిగినందుకు దళితుడిని జేసీబీతో తొక్కించి చంపాడు..!
క్షీణించిన వరవరరావు ఆరోగ్యం - ట్రీట్ మెంట్ కోసం పూణే ప్రభుత్వ‌ హాస్పటల్ కు...
రేప్ బాధితురాలు కోర్టుకు వెళ్తుండగా మళ్ళీ దాడి చేసిన రేపిస్టులు... సజీవదహనానికి యత్నం
అది ఎన్కౌంటర్ కాదు.. 17 మందిని ఏకపక్షంగా కాల్చి చంపారు : జుడీషియల్ కమీషన్ వెల్లడి
ఇండియాస్ డాటర్స్.. ఇంకెంత కాలం ఈ దారుణాలు..? ఈ డాక్యుమెంటరీ చూడండి..!
20 వసంతాల నెత్తుటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
ప్రియాంక హత్య : ఢిల్లీలో పగిలిన చిన్ని గుండె !
100 కి డయల్ చేసి ఉంటే...! విక్టిమ్ బ్లేమింగ్ - సీ.వనజ
దొరతనం గెలుసుడా ఓడుడా? - ఎన్.వేణుగోపాల్
ʹఆకలి, పేదరికంతో చచ్చిపోతున్నాʹ.. కంటతడి పెట్టిస్తున్న ఓ చిన్నారి సూసైడ్ లెటర్
ఈ తెలంగాణ మీదే.. మాది కాదు : కేసీఆర్‌కు ఒక ఆర్టీసీ కండక్టర్ బహిరంగ రాజీనామా లేఖ
మహిళా కార్యకర్తలపై అక్రమకేసులకు వ్యతిరేకంగా పోరాడుదాం !
కిషన్ జీ... పీడితుల యుద్ద గీతి !
ఒక ప్రొఫెసర్ - ఏడు కుట్ర కేసులు
ప్రజల పక్షాన మాట్లాడుతున్నందుకే ఈ అక్రమ కేసులు : విరసం
Withdraw the False Case against Veekshanam Editor!
వీక్ష‌ణం సంపాద‌కుడిపై UAPA కేసు
భగత్ సింగ్ తుపాకీ - జార్జిరెడ్డి సినిమా...!!
Arrest of B Anuradha & N Ravi Sharma – Fact and Fiction
అనూరాధ, రవి శర్మల అరెస్టు – వాస్తవమూ కల్పనా..!
ఫీజుల పెంపును నిరసిస్తూ.. కేంద్ర మంత్రిని నిర్బంధించిన జేఎన్‌యూ విద్యార్థులు..!
పోలీసుల అడ్డంకులు ఛేదించుకుని సమరోత్సాహంతో ట్యాంక్ బండ్ పైకి దూసుకొచ్చిన‌ కార్మికులు
చలో ట్యాంక్ బండ్ లో మావోయిస్టులున్నారన్న సీపీ... ఉక్కుపాదం మోపడం కోసమే ఈ ఆరోపణలన్న‌ ఆర్టీసీ జేఏసీ
more..


కేసీఆర్