ప్రజల పక్షాన మాట్లాడుతున్నందుకే ఈ అక్రమ కేసులు : విరసం


ప్రజల పక్షాన మాట్లాడుతున్నందుకే ఈ అక్రమ కేసులు : విరసం

విప్లవ రచయితల సంఘం (విరసం) కార్యవర్గ సభ్యుడు, వీక్షణం ఎడిటర్ ఎన్. వేణుగోపాల్, తెలంగాణ ప్రజా ఫ్రంట్ కార్యదర్శి మెంచు రమేష్, కార్యవర్గ సభ్యుడు నలమాస కృష్ణపై పోలీసులు తెలంగాణ ప్రజా భద్రతా చట్టం, యూఏపీఏ, రాజద్రోహం తదితర కేసులను నమోదు చేశారు. ఈ కేసులు అక్రమమని.. ప్రజాగళాన్ని వినిపిస్తున్నందుకే రచయితలు, ప్రజా సంఘాల నాయకులపై తెలంగాణ, కేంద్ర ప్రభుత్వాలు అక్రమ కేసులు పెడుతున్నాయని .. వీటిని తెలంగాణ సమాజమంతా తీవ్రంగా ఖండిచాలని విరసం కోరింది. ఇవాళ సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో జరిగిన ఒక సమావేశంలో విరసం సభ్యులు మాట్లాడారు.

ఈ నెల 12న విప్లవ రచయితలు బి. అనురాధ, రవిశర్మల ఇంటిపై పోలీసులు దాడి చేసి 14 గంటల పాటు సోదాలు నిర్వహించారు. అనంతరం వారిపై అనేక ఆరోపణలు చేస్తూ అక్రమంగా అరెస్టు చేశారు. హిందూత్వ ఫాసిస్టు దాడి వ్యతిరేక వేదిక తరపున వాళ్లు 12వ తేదీన ప్రెస్ మీట్ నిర్వహించాల్సి ఉంది. రామ జన్మభూమి - బాబ్రీ మసీదు వివాదంపై సుప్రీం కోర్టు తీర్పును నిరసిస్తూ ఈ పాత్రికేయ సమావేశం నిర్వహించాలని అనుకుంటుండగానే.. ఆ రోజు ఉదయం పోలీసులు అకస్మాత్తుగా వారి ఇంటిపై దాడి చేసి అరెస్టు చేశారు. అంతే కాకుండా వారిద్దరినీ అరెస్టు చేసిన ఎఫ్ఐఆర్ కాపీలో ప్రొఫెసర్ కాశీం, ఎన్. వేణుగోపాల్, మెంచు రమేష్‌ పేర్లను కూడా చేర్చి.. వీరందరూ పరారీలో ఉన్నారని అబద్దాలు, తప్పుడు ఆరోపణలు రాశారు.

తెలంగాణలో రాజకీయంగా చైతన్యం ఉన్న ప్రతీ వారికి డాక్టర్ కాశీం ఏం చేస్తుంటారో అందరికీ తెలుసు. ఆయన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పని చేస్తూ గత 10 ఏండ్లుగా విరసం కార్యవర్గ సభ్యునిగా పని చేస్తున్నాడు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో విద్యార్థిగా, రచయితగా క్రియాశీలకంగా పని చేశాడు. రాజకీయ, సామాజిక, సాహిత్య వ్యాసాలు ఎన్నో రాశాడు. ప్రస్తుతం ʹనడుస్తున్న తెలంగాణʹ అనే మాస పత్రికకు ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నాడు. నిత్యం ప్రజా జీవితంలో ఉంటూ బహిరంగ జీవితం గడుపుతున్న వ్యక్తిపై అనేక అక్రమ ఆరోపణలతో కేసు పెట్టడమే కాకుండా పరారీలో ఉన్నాడనే నింద వేశారు.

ఇక వేణుగోపాల్ ముప్పై ఏండ్లకు పైగా విప్లవ రచయితగా, మార్క్సిస్టు మేధావిగా సాహిత్య రంగంలో పని చేశారు. కవిత్వం, సాహిత్య విమర్శ, రాజకీయార్థిక విశ్లేషణ, చరిత్ర పరిశోధన వంటి అనేక రంగాల్లో కృషి చేస్తున్నాడు. వీక్షణం రాజకీయార్థ మాస పత్రికకు ఎడిటర్‌గా, వక్తగా ఉంటు నిత్యం ప్రజాజీవితం గడుపుతున్న బాధ్యతాయుత ఆలోచనాపరుడు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో కూడా తన రచనలు, ఉపన్యాసాల ద్వారా విస్తృత ప్రాచుర్యం కల్పించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక విధానాలపై ప్రజాపక్షాన నిలిచి తన గొంతు వినిపించినందుకే ఆయనపై ఈ అక్రమ కేసు పెట్టారు.

మెంచు రమేష్ గురించి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతీ ఒక్కరికీ పరిచయమే. తెలంగాణ ఉద్యమకాలంలో ఏర్పడిన తెలంగాణ ప్రజా ఫ్రంట్‌లో మొదటి నుంచి నాయకత్వ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. భౌగోళిక తెలంగాణ వల్ల ఆకాంక్షలు నెరవేరవని.. ప్రజాస్వామిక తెలంగాణతోనే రాష్ట్ర సమస్యలు పరిష్కారమవుతాయనే అవగాహనతో ఆ సంస్థ పని చేస్తోంది. ఈ సంస్థ తెలంగాణ ఉద్యమ సమయంలో అనేక పోరాటాలు చేసింది. కేసీఆర్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య పరిరక్షణకు జరుగుతున్న పోరాటాల్లో వ్యక్తిగా, టీపీఎఫ్ ద్వారా ప్రజా ఉద్యమ నిర్మాణం చేస్తున్నాడు. కనీస హక్కుల కోసం ఉద్యమిస్తున్నందుకే రమేష్ మీద దుర్మార్గమైన నేరారోపణలు చేస్తూ కేసులు పెట్టారు.

మేధావులు, ప్రజాసంఘ నాయకులు, రచయితలు ప్రజల పక్షాన మాట్లాడకుండా ఉంచేందుకే బీజేపీ కనుసన్నల్లోని తెలంగాణ పోలీసులు ఇలాంటి అక్రమ కేసులు పెడుతున్నారు. ఈ నిర్బంధ విధానాలను ఖండించాలని విరసం కోరింది. కాసీం, వేణుగోపాల్, రమేష్ మీద అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని.. జైల్లో ఉన్న అనురాధ, రవిశర్మలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసింది.

Keywords : Virasam, Kasim, Venugopal, Menchu Ramesh, Veekshanam, Telangana Praja Front, UAPA, Cases, Telangana, Police
(2020-06-03 11:04:04)No. of visitors : 761

Suggested Posts


మహాశ్వేతా దేవి - మన తెలంగాణ సాగర హారంః వరవర రావు

మన మహా సాగరహారం ʹచలో హైదరాబాద్ అంటూ తెలంగాణ మార్చ్ చేసిన సెప్టెంబర్ 30, 2012 మహత్తర మధ్యాహ్నం మహాశ్వేతాదేవి కూడా మన ఊర్లో ఉన్నారు. ఆ రోజు ఆమెను మన మధ్యకు తెచ్చుకొని ఉంటే....

సెప్టెంబర్ 17 - ఇండియన్ యూనియన్ సైనిక దురాక్రమణ దినం - వరవరరావు

1947 ఆగస్ట్ 15న విలీనానికి అంగీకరించకుండా షరతులు విధిస్తూ వచ్చిన నిజాంను నెహ్రూ - పటేల్ ప్రభుత్వం సగౌరవంగా, సాదరంగా చర్చలకు ఆహ్వానించింది. అప్పటికే నిజాంను వ్యతిరేకిస్తూ వీరోచిత పోరాటం నడుపుతున్న కమ్యూనిస్టులను మాత్రమే కాదు, కనీసం కాంగ్రెస్ ను కూడా ఈ చర్చల్లో భాగం చేయలేదు....

ఆదివాసి.. లంబాడా వివాదం ‍- ఎం.రత్నమాల

మహారాష్ట్ర ప్రభుత్వం లంబాడాలను ఆదివాసి తెగగా గుర్తించడం లేదు కనుక ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం లంబాడాలను ఆదివాసి షెడ్యూల్డు తెగగా ప్రకటించడంతో దీన్ని అవకాశంగా తీసుకుని మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్‌ (పాత) జిల్లాకు లంబాడాల వలసలు పెద్ద ఎత్తున వెల్లువలా సాగాయి.....

ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ పోరాటానికి విరసం మద్దతు

అట్టడుగున ఉన్న మనిషికి ఫలితాలు అందినప్పుడే సామాజిక న్యాయం జరిగినట్టు లెక్క. మాదిగ, డక్కలి, చిందు, మాష్టి, బుడగజంగం, దాసరి, బేగరి కులాలకు ఈ నాటికీ ఎస్సీ రిజర్వేషన్ ఫలాలు అందడం లేదు....

ʹఅరుణోదయʹ పై పోలీసుల దాడిని ఖండించిన విరసం

తెలంగాణ ఉద్యమంలో ఆట పాటతో ఆరుణోదయ కళాకారులు గ్రామ గ్రామాన తిరిగి ప్రజల్లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తమ వంతు కృషి చేశారు. ఆ సంస్థ కార్యాలయాన్ని దౌర్జన్యంగా మూసేయడం అత్యంత నిరంకుశమైన......

అమరుడు బొజ్జా తారకం — ʹనది పుట్టిన గొంతుకʹ - వరవరరావు

గోదావరి తెలంగాణలో ప్రవేశించిన నిజామాబాద్ కు 1968లో వచ్చిన తారకం గారు ఇక్కడి మట్టిలోని ఎరుపులోనూ, ఇక్కడి నీళ్లలోని ప్రవాహ గుణంలోనూ కలగలిసిపోయారు. 1968 నుంచి 78 దాకా ఒక దశాబ్దం పాటు విప్లవోద్యమాలకు, విప్లవ సాహిత్యానికి నిజామాబాద్ చిరునామా బొజ్ఞాతారకం....

ʹఅన్నలు మల్లొస్తరు బిడ్డా.. ఆల్లొస్తే వాళ్ళకు గిన్ని మంచి నీల్లో, తిండో పెట్టాలనే బతుకుతాన్నʹ

అందుకే అంత నిర్బంధంల కూడా నా కొడుకు అంత్యక్రియలకు వచ్చిన జనాలకు మా ఖిలా వరంగల్ సరిపోలె. ఎక్కడోల్లను అక్కడ అరెస్ట్ చేసినా వచ్చిండ్రు. ఎవరో నక్సలైట్ అట, చిన్న పిల్లగాడేనట, బలే తెలివికల్లోడట అని అనుకుంట జనాలు వచ్చిండ్రు. పద్దెనిమిది నిండి పందొమ్మిది పడగానే చంపేసిండ్రు.

ఉత్తేజకరంగా సాగిన విరసం సాహిత్యపాఠశాల‌

అంతకుముందు అంతర్జాతీయ శ్రామికవర్గ పతాకావిష్కరణతో కార్యక్రమాలను ప్రారం భించారు. అమరుడు పులి అంజన్న తల్లి సైదమ్మ ఎర్ర జెండాను, సీనియర్ విరసం సభ్యురాలు రత్నమాల విప్లవ రచయితల సంఘం జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా అమరుడు శేషయ్య సోదరుడు సాంబయ్య, అమరుడు వివేక్ తండ్రి యోగానంద్ అమరుల స్థూపాన్ని ఆవిష్క రించారు.

ఆ నిండైన సాహిత్య సామాజిక జీవితం రచయితలందరికీ ఆదర్శం - విరసం

ʹరచయితలందరూ తమ తరానికి జవాబుదారులు; తమకు తాము జవాబు చెప్పుకోవాల్సిన వాళ్ళు... అంతస్సాక్షి ఉన్న రచయిత పీడిత ప్రజల పక్షాన దృఢంగా నిలవాలి. అలా కాకపోతే ఆ రచయితల్ని నిర్దోషులుగా నిర్ణయించే ప్రశ్నే లేదు.ʹ....

ʹఆయన జైల్లోనే చనిపోతారేమోʹ

90 శాతం అంగవైకల్యం కలిగిన సాయిబాబాను అన్యాయంగా జైల్లో పెట్టారని.. ఆయనేమైనా యుద్ద ఖైదీనా..? ప్రభుత్వ అనాలోచిత చర్యతో యుద్ధఖైదీ మాదిరి ఆయన జైల్లోనే తుది శ్వాస విడిచే పరిస్ధితి వచ్చిందని ...

Search Engine

వీవీ,సాయిబాబాలతో సహా రాజకీయ ఖైదీల విడుదలకై వారం రోజుల కార్యక్రమాలు -నిర్బంధ వ్యతిరేక వేదిక పిలుపు
మానవత్వానికే మచ్చ తెచ్చిన ఆ దుర్మార్గుడితో కలిసి ఉండలేను... విడాకులు ఇప్పించండి
నోరు మూసుకో....ట్రంప్ కు పోలీసు చీఫ్ హెచ్చరిక‌
తెలంగాణకోసం పోరాడిన వారు జైళ్ళలో మగ్గుతున్నరు
వరవరరావు బెయిల్ పిటిషన్ మళ్ళీ వాయిదా !
వరవరరావు విడుదల కోసం ʹమాహాʹ సీఎంకు మాజీ కేంద్ర సమాచార కమీషనర్ల‌ లేఖ
వీవీ,సాయిబాబాల‌ జీవించే హక్కును కాపాడండి...పౌరహక్కుల సంఘం
కేసీఆర్ కు తెలంగాణ, ఏపీకి చెందిన 27 మంది ప్రముఖ రచయితల విజ్ఞప్తి
వీవీ, సాయిబాబాలను వెంటనే విడుదల చేయాలి -సామాజిక తెలంగాణ మహాసభ
వరవరరావును వెంటనే విడుదల చేయాలి - సీపీఐ (ఎంఎల్) జనశక్తి డిమాండ్
వరవరరావు ఆరోగ్యంపై ఆయన సహచరి హేమలత ప్రకటన‌
వీవీ, సాయిబాబాలతో సహా రాజకీయ ఖైదీలందరినీ విడుదల చేయాలంటూ దేశవ్యాప్త ప్రదర్శనలు
సామాజిక కార్యకర్తల‌ జీవించే హక్కును కాలరాస్తున్న‌ పాలకుల విధానాలపై రేపు(మే29) నిరసన
మంథని లో లాకప్ డెత్...పౌరహక్కుల సంఘం నిజ నిర్దారణ... విచారణకు ఆదేశించిన హైకోర్టు
దయనీయస్థితిలో జి.ఎన్.సాయిబాబా ఆరోగ్య పరిస్థితి- సహచరి వసంతకుమారి ఆందోళన
వరవరరావును విడుదల చేయాలి -జర్నలిస్టు,హక్కుల,ప్రజా సంఘాల డిమాండ్
వరవరరావు విడుదలకు తెలంగాణ ప్రభుత్వం చొరవ చేయాలి..వివిధ పార్టీల డిమాండ్
మా నాన్నను వెంటనే విడుదల చేయండి..వరవరరావు కూతుర్ల లేఖ‌
వీవీ, ఇతర సామాజిక‌ కార్యకర్తలున్న తలోజా జైలుతో సహా మూడు జైళ్ళలో కరోనాతో ముగ్గురు ఖైదీల మృతి !
తలోజా జైల్లో వ్యాపించిన కరోనా...అనారోగ్యంతో ఉన్నవీవీని తక్షణం విడుదల చేయాలని విరసం డిమాండ్
పింజ్రా తోడ్ కార్యకర్తలకు బెయిల్...కొద్ది నిమిషాల్లోనే మళ్ళీ అరెస్టు
రాజ్యాంగాన్ని, ప్రజల స్వేచ్ఛ, హక్కులను కాపాడడాన్ని సుప్రీం కోర్టు మానుకుంది...మార్కండేయ్ ఖట్జు
నక్సల్బరీ ప్రాసంగికత ‍- వరవరరావు (2)
నక్సల్బరీ ప్రాసంగికత ‍- వరవరరావు (1)
ఇది నక్సల్బరీ ప్రజ్వరిల్లినరోజు....అడవిలో ప్రవేశించాలనే ఆశయం నెరవేరిన రోజు...
more..


ప్రజల