ఒక ప్రొఫెసర్ - ఏడు కుట్ర కేసులు


ఒక ప్రొఫెసర్ - ఏడు కుట్ర కేసులు

ఒక


తెలంగాణలో ఏ ప్రజాఉద్యమ కార్యకర్త మీద కేసు నమోదైనా ఈయన పేరు చేరుస్తారు. విద్యార్థులతోనూ, యువజనులతోనూ, ప్రజాస్వామిక తెలంగాణవాదులతోనూ కలిసి కుట్ర చేస్తున్నాడని నిరంతరం అభియోగం మోస్తుంటాడు.

విరసం కార్యవర్గ సభ్యుడిగా మాకాయన కామ్రేడ్ కాశీం. తెలుగు ప్రొఫెసర్ గా, కవిగా, విమర్శకుడిగా అకాడెమిక్, సాహిత్య బృందాల్లో చిరపరిచితుడు. నడుస్తున్న తెలంగాణ పత్రిక సంపాదకుడిగా తెలంగాణ పాఠకులకు దగ్గరైన మనిషి. అంతకన్నా కూడా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కెసిఆర్ పుట్టక ముందు నుండి విద్యార్థి ఉద్యమ నాయకుడిగా, సామాజిక విశ్లేషకుడిగా, వక్తగా తెలంగాణ వ్యాప్తంగానే కాదు, ఆంధ్రప్రదేశ్ లోనూ ప్రముఖంగా తెలిసిన పేరు.

రాష్ట్రం ఏర్పడ్డాక ప్రజల పక్షానే మిగిలిన కొద్ది మంది మేధావుల్లో ఒకరు. బహుశా అదే ఆయన నేరం. ప్రజల పక్షం- దళితులు, ఆదివాసులు, కార్మికుల పక్షం నిలిచి ఉండడం కుట్ర. నిజమైన ప్రజాస్వామ్యాన్ని కోరుకోవడం, ప్రజాస్వామిక తెలంగాణను స్వప్నించడం నేరపూరిత సాహసం. తను విశ్వసించే విప్లవ రాజకీయాలు, రచించిన డజను పుస్తకాలు అరడజను ఊపా కేసులను ఆహ్వానించాయి. హైదరాబాదులో ఫాసిస్టు వ్యతిరేక వేదిక బాధ్యులు అనురాధ, రవి లను అరెస్టు చేసినప్పుడు పోలీసు రాసిన ఎఫ్.ఐ.ఆర్.లో మరోసారి కాశీం పేరు చేర్చారు.

హాస్యాస్పదం అనడకం కన్నా అత్యంత వికారమైన సంగతి ఏమిటంటే ప్రతి రోజూ యూనివర్సిటీ క్యాంపస్ లో, రెండు రాష్టాల్లో అనేక వేదికల మీద కనిపించే కాశీం పోలీసులు దృష్టిలో పరారీలో ఉన్న నిందితుడు. ఈయనే కాదు ఎన్.వేణుగోపాల్, వాళ్ళే అరెస్టు చేసి జైల్లో పెట్టిన నలమాస కృష్ణ ఆచూకీ కూడా తెలీదట. కాశీంపై ప్రభుత్వానికి ఎందుకంత కక్ష? ప్రొఫెసర్ గా తరగతి గోడలకు పరిమితం కాకుండా విశాల సమాజాన్ని తన మేధో, కార్యరంగం చేసుకున్నందుకా? తన జీతమేదో తీసుకొని తన కుటుంబం కోసం, పిల్లల కోసం ఇంత కూడబెట్టి ఇంకా ఉన్నత సోపానాలకు దారులేసుకోకుండా లోకంలో అందరి బాధలూ తనవే అని అందరికోసం మాట్లాడుతున్నందుకా? బాల్యం నుండే తెలంగాణను పలవరించి, ఉద్యమంలో దాడులు, కేసులు ఎదుర్కొని రాష్ట్రం ఏర్పడ్డాక కూడా అధికారానికి రాజీపడకపోవడమా? ఒక్కరి మీద ఇన్ని కుట్రలు రాజ్యం బరితెగింపా, భయమా?
- వరలక్ష్మి

Keywords : telangana, kashim, virasam, kcr
(2019-12-07 20:57:18)No. of visitors : 469

Suggested Posts


మహాశ్వేతా దేవి - మన తెలంగాణ సాగర హారంః వరవర రావు

మన మహా సాగరహారం ʹచలో హైదరాబాద్ అంటూ తెలంగాణ మార్చ్ చేసిన సెప్టెంబర్ 30, 2012 మహత్తర మధ్యాహ్నం మహాశ్వేతాదేవి కూడా మన ఊర్లో ఉన్నారు. ఆ రోజు ఆమెను మన మధ్యకు తెచ్చుకొని ఉంటే....

సెప్టెంబర్ 17 - ఇండియన్ యూనియన్ సైనిక దురాక్రమణ దినం - వరవరరావు

1947 ఆగస్ట్ 15న విలీనానికి అంగీకరించకుండా షరతులు విధిస్తూ వచ్చిన నిజాంను నెహ్రూ - పటేల్ ప్రభుత్వం సగౌరవంగా, సాదరంగా చర్చలకు ఆహ్వానించింది. అప్పటికే నిజాంను వ్యతిరేకిస్తూ వీరోచిత పోరాటం నడుపుతున్న కమ్యూనిస్టులను మాత్రమే కాదు, కనీసం కాంగ్రెస్ ను కూడా ఈ చర్చల్లో భాగం చేయలేదు....

ఆదివాసి.. లంబాడా వివాదం ‍- ఎం.రత్నమాల

మహారాష్ట్ర ప్రభుత్వం లంబాడాలను ఆదివాసి తెగగా గుర్తించడం లేదు కనుక ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం లంబాడాలను ఆదివాసి షెడ్యూల్డు తెగగా ప్రకటించడంతో దీన్ని అవకాశంగా తీసుకుని మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్‌ (పాత) జిల్లాకు లంబాడాల వలసలు పెద్ద ఎత్తున వెల్లువలా సాగాయి.....

ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ పోరాటానికి విరసం మద్దతు

అట్టడుగున ఉన్న మనిషికి ఫలితాలు అందినప్పుడే సామాజిక న్యాయం జరిగినట్టు లెక్క. మాదిగ, డక్కలి, చిందు, మాష్టి, బుడగజంగం, దాసరి, బేగరి కులాలకు ఈ నాటికీ ఎస్సీ రిజర్వేషన్ ఫలాలు అందడం లేదు....

ʹఅరుణోదయʹ పై పోలీసుల దాడిని ఖండించిన విరసం

తెలంగాణ ఉద్యమంలో ఆట పాటతో ఆరుణోదయ కళాకారులు గ్రామ గ్రామాన తిరిగి ప్రజల్లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తమ వంతు కృషి చేశారు. ఆ సంస్థ కార్యాలయాన్ని దౌర్జన్యంగా మూసేయడం అత్యంత నిరంకుశమైన......

ఆ నిండైన సాహిత్య సామాజిక జీవితం రచయితలందరికీ ఆదర్శం - విరసం

ʹరచయితలందరూ తమ తరానికి జవాబుదారులు; తమకు తాము జవాబు చెప్పుకోవాల్సిన వాళ్ళు... అంతస్సాక్షి ఉన్న రచయిత పీడిత ప్రజల పక్షాన దృఢంగా నిలవాలి. అలా కాకపోతే ఆ రచయితల్ని నిర్దోషులుగా నిర్ణయించే ప్రశ్నే లేదు.ʹ....

ఉత్తేజకరంగా సాగిన విరసం సాహిత్యపాఠశాల‌

అంతకుముందు అంతర్జాతీయ శ్రామికవర్గ పతాకావిష్కరణతో కార్యక్రమాలను ప్రారం భించారు. అమరుడు పులి అంజన్న తల్లి సైదమ్మ ఎర్ర జెండాను, సీనియర్ విరసం సభ్యురాలు రత్నమాల విప్లవ రచయితల సంఘం జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా అమరుడు శేషయ్య సోదరుడు సాంబయ్య, అమరుడు వివేక్ తండ్రి యోగానంద్ అమరుల స్థూపాన్ని ఆవిష్క రించారు.

అమరుడు బొజ్జా తారకం — ʹనది పుట్టిన గొంతుకʹ - వరవరరావు

గోదావరి తెలంగాణలో ప్రవేశించిన నిజామాబాద్ కు 1968లో వచ్చిన తారకం గారు ఇక్కడి మట్టిలోని ఎరుపులోనూ, ఇక్కడి నీళ్లలోని ప్రవాహ గుణంలోనూ కలగలిసిపోయారు. 1968 నుంచి 78 దాకా ఒక దశాబ్దం పాటు విప్లవోద్యమాలకు, విప్లవ సాహిత్యానికి నిజామాబాద్ చిరునామా బొజ్ఞాతారకం....

ʹఆయన జైల్లోనే చనిపోతారేమోʹ

90 శాతం అంగవైకల్యం కలిగిన సాయిబాబాను అన్యాయంగా జైల్లో పెట్టారని.. ఆయనేమైనా యుద్ద ఖైదీనా..? ప్రభుత్వ అనాలోచిత చర్యతో యుద్ధఖైదీ మాదిరి ఆయన జైల్లోనే తుది శ్వాస విడిచే పరిస్ధితి వచ్చిందని ...

చలసాని స్మృతిలో... - కే.కుమార్ వర్మ

బొడ్డపాడు నడిబొడ్డులో అమరవీరులను స్మరిస్తూ ఎర్ర జెండా చేతబట్టి తామాడ గణపతి ఇంటిముందునుండి దండుగా కదులుతున్నట్లుంది...

Search Engine

నేను చనిపోయినా వారికి శిక్షపడాలి....ఉన్నావ్ అత్యాచార బాధితురాలి చివరి కోరిక‌
మా పేరు మీద కస్టడీ హత్యలు వద్దు..!
కూలి డబ్బులు అడిగినందుకు దళితుడిని జేసీబీతో తొక్కించి చంపాడు..!
క్షీణించిన వరవరరావు ఆరోగ్యం - ట్రీట్ మెంట్ కోసం పూణే ప్రభుత్వ‌ హాస్పటల్ కు...
రేప్ బాధితురాలు కోర్టుకు వెళ్తుండగా మళ్ళీ దాడి చేసిన రేపిస్టులు... సజీవదహనానికి యత్నం
అది ఎన్కౌంటర్ కాదు.. 17 మందిని ఏకపక్షంగా కాల్చి చంపారు : జుడీషియల్ కమీషన్ వెల్లడి
ఇండియాస్ డాటర్స్.. ఇంకెంత కాలం ఈ దారుణాలు..? ఈ డాక్యుమెంటరీ చూడండి..!
20 వసంతాల నెత్తుటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
ప్రియాంక హత్య : ఢిల్లీలో పగిలిన చిన్ని గుండె !
100 కి డయల్ చేసి ఉంటే...! విక్టిమ్ బ్లేమింగ్ - సీ.వనజ
దొరతనం గెలుసుడా ఓడుడా? - ఎన్.వేణుగోపాల్
ʹఆకలి, పేదరికంతో చచ్చిపోతున్నాʹ.. కంటతడి పెట్టిస్తున్న ఓ చిన్నారి సూసైడ్ లెటర్
ఈ తెలంగాణ మీదే.. మాది కాదు : కేసీఆర్‌కు ఒక ఆర్టీసీ కండక్టర్ బహిరంగ రాజీనామా లేఖ
మహిళా కార్యకర్తలపై అక్రమకేసులకు వ్యతిరేకంగా పోరాడుదాం !
కిషన్ జీ... పీడితుల యుద్ద గీతి !
ప్రజల పక్షాన మాట్లాడుతున్నందుకే ఈ అక్రమ కేసులు : విరసం
Withdraw the False Case against Veekshanam Editor!
వీక్ష‌ణం సంపాద‌కుడిపై UAPA కేసు
భగత్ సింగ్ తుపాకీ - జార్జిరెడ్డి సినిమా...!!
Arrest of B Anuradha & N Ravi Sharma – Fact and Fiction
అనూరాధ, రవి శర్మల అరెస్టు – వాస్తవమూ కల్పనా..!
కేసీఆర్ అప్రజాస్వామిక పాలన‌: అనురాధ, రవిల అరెస్ట్ - రాజద్రోహం, యూఏపీఏ కేసులు బనాయింపు
ఫీజుల పెంపును నిరసిస్తూ.. కేంద్ర మంత్రిని నిర్బంధించిన జేఎన్‌యూ విద్యార్థులు..!
పోలీసుల అడ్డంకులు ఛేదించుకుని సమరోత్సాహంతో ట్యాంక్ బండ్ పైకి దూసుకొచ్చిన‌ కార్మికులు
చలో ట్యాంక్ బండ్ లో మావోయిస్టులున్నారన్న సీపీ... ఉక్కుపాదం మోపడం కోసమే ఈ ఆరోపణలన్న‌ ఆర్టీసీ జేఏసీ
more..


ఒక