దొరతనం గెలుసుడా ఓడుడా? - ఎన్.వేణుగోపాల్


దొరతనం గెలుసుడా ఓడుడా? - ఎన్.వేణుగోపాల్

దొరతనం

వీక్షణం డిసెంబర్ 2019 సంచికలో ఎడిటర్ ఎన్.వేణుగోపాల్ రాసిన‌ తెలంగాణ సంపాదకీయ వ్యాఖ్య

దొరా, దొరతనం జూపుకుంటానవులే. కని నాకు ఒక్క ముచ్చట సమజైత లేదు. ఇంకా నీ చింతమడక దొరతనమే నడుస్తాందని అనుకుంటానవా ఏంది. జగిత్యాల్ల, సిరిసిల్లల పడిపోయిన గడీలు యాదికస్తలేవా? అది గుడ పోనీ, దొరతనం పోయిందంటరు గాదు బాంచెన్, గదేందో నాకు నోరు దిరగది గని పజాసామ్యమో ఏందో అంటరు గద. గద్దెమీద కూసున్నోని ఇష్టం కాదు, జనం ఇష్టమే చెల్లుతదంటరు గాదు. గట్ల జనం వోట్లు గుద్దితెనె గద నలుపై ఏండ్ల సంది రాజకీయాల్ల ఉన్నవు, ముప్పై ఏండ్ల సంది ఎమ్మెల్లేగనే ఉన్నవట గద. మరి గిదేంది దొరా. నా మాటినకపోతే జీతగాణ్ని చెట్టుగ్గట్టి గుత్పలు ఇరిగిపోయేదాక కొట్టుడే, చంపిపారేసుడే, పొలంల తొక్కుడే, గడ్డివాముల ఇసిరేసి అగ్గిపెట్టుడే అని మీ తాతలనాడు అనుకున్నట్టే ఇయాల గుడ అనుకోబడ్తివి. పని పాటలోల్లకు, సుద్దరోల్లకు ఇంత గమాండా అని మీ తాతలు అన్నట్టే అనబడ్తివి బాంచెన్. అన్నాలం గాదు నాయిన. అట్ల జేసుడొదిలిపెట్టు, మనిషైనోడు అట్ల సోంచాయిస్తడా దొరా అసలు. ఇంతకు నీకు ఇంత గుస్స యాడికెల్లి వచ్చె? గా ఎర్రబస్సుల కండక్టర్లు, డైబర్లు, మెకానికులు, పాపం బట్టపేగులోల్లు గాదు నాయిన. ఇయాల దింటె రేపటికెట్ల అనుకునేటోల్లు గాదు తండ్రి. గవాండ్ల మీదనా నీ గుస్స? ఇంతకు ఏమడిగిరి వాండ్లు, ఏమన్న నీ జాయిదాద్ దోచి పెట్టుమనిరా, ఎన్న గాల్చి పెట్టుమనిరా? మేము సర్కారు నౌకర్లమే గద, సర్కారు నౌకర్లకిచ్చినంత మాకియ్యి అనిరి. ఊ అంటె తీసేసుడు, ఆ అంటె తీసేసుడు వద్దనిరి. కొత్త బస్సులు కొనమనిరి. ఇంకెక్కువ ఊళ్లకు బస్సులెయ్యిమనిరి. సర్కారు అన్నాక అన్ని మాటలినాలె గద, మాట ముచ్చట పెట్టాలె గద. వాండ్లు రూపాయి అడిగిండ్రనుకో, నువ్వు పావులే ఇస్తనను, పది పైసలే ఇస్తనను. ఏదో ఒకటి కూసోబెట్టి మాట్లాడాలె గద. అసలు మాట్లాడనే మాట్లాడ. ఇంగ వాని ముఖం నేను జూడ అని పాతకాలపు దొర లెక్క అంటె ఎట్ల బాంచెన్. అయిపాయె, రాజెక్కువనా మొండెక్కువనా అని పాత శాత్రం ఉండె. ఇయాల రాజువు నువ్వేనాయె, మొండివి నువ్వేనాయె. రాజ్జెం ఆగుతదా దొరా? ఆ కచ్చీరోని పాడుగాను, వాడు నానబెట్టి నానబెట్టి ఎటు గానియ్యకపాయె. మారె, మా జనం గుడ అటు నీకు సై అనకపోయిరి, ఇటు మజ్దూర్లకు సై అనకపోయిరి. మన్నుదిన్న పాములోలె మాట్లాడకుంట గూసునిరి. అయితె గీ సంగతి జెప్పకపోతివి. నువ్వేదో దొరతనాన్నే ఇట్ల బిర్రబిగిసి ఉన్నవని నేననుకుంటాన. కని నిన్న గాయినెవలో వచ్చి, ఉట్టి దొరతనం ఒక్కటే గాదు, దొర దగ్గర ఇంకో మతలబున్నది అనె. నిచ్చమేనా బాంచెన్. అగో, నువ్వు బస్సులన్ని బంజేయాలని అనుకుంటానవట గద. నీ దోస్తులు బస్సులు కొని పెట్టుకున్నరట గద. ఇగ వాండ్ల బస్సులే రయ్యి రయ్యిన తిరుగుతయట గద. మరి మా ఊరికి పల్లెవెలుగు బస్సుంటదా పోతదా బాంచెన్? బస్సు స్టాండ్ల జాగలు, డిపోల జాగలు అన్ని గుడ అడ్డికి పావుసేరుకు నీ దోస్తులకే అమ్మి పారేత్తన్నవట గద. మరి గంత కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నది గిందుకేనా దొరా? బంగారి తెలంగాణ, బంగారి తెలంగాణ అంటాంటె ఇంకేందో అనుకుంటి, గిప్పుడు ఎరుకైతాంది, తెలంగాణ పేరు మాకు, బంగారం నీకూ నీ దోస్తులకా దొరా? వారెవ్వా అవ్వల్ దర్జగున్నదీ మాట. కాని దొరా, ఆర్టీసీ మజ్దూర్లు గుడ అవ్వల్ దర్జకు అయ్యల తీర్గ ఉన్నరు. నువ్వు గుడ్లురిమి చూడు, గద్దిరిచ్చు, కొలువు ఊడబీకుత అను, వాండ్లు మాత్రం అర్గీజు కదలలే. యాబై వేల మందిల నీ మాటిన్నోల్లు మూడు వందల మందేనా బాంచెన్ . అబ్బ దొరతనం పడిపోయిందని ఇంక నీకు తెలివైతలేదా…

ఎన్.వేణుగోపాల్

Keywords : telangana, RTC, Strike, kcr,
(2020-01-18 10:06:40)No. of visitors : 510

Suggested Posts


0 results

Search Engine

నా కొడుకు ఏ తప్పూ చేయలేదు.. పేదల కోసం, తెలంగాణ కోసం కొట్లాడిండు : కాశీం తల్లి వీరమ్మ‌
నిరసన తెలుపుతున్న మహిళల ఆహారం, దుప్పట్లు ఎత్తుకొని పారిపోయిన పోలీసులు
Condemning arbitrary arrest of Prof. C. Kaseem
జ్యుడీషియల్ రిమాండుకు ప్రొఫెసర్ కాసీం.. చీఫ్ జస్టీస్ ఇంట్లో ముగిసిన విచారణ
తనను అరెస్టు చేయడానికి వచ్చిన పోలీసులకు ʹజాషువా పద్యంʹ వినిపించిన కాశీం...!
ప్రొఫెసర్ కాసీం అరెస్టు.. తెలంగాణ పోలీసులపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం
కామ్రేడ్ కాశీం కోసం... ప్రజాస్వామిక హక్కుల కోసం అందరం గొంతు విప్పుదాం
కట్టుకథ ఆధారంగా కాశీం అరెస్ట్...!!
ʹప్రొఫెసర్ కాశీంను అణగారిన ప్రజల వైపు నిలబడ్డందుకే అరెస్ట్ చేశారుʹ
ఉరిశిక్ష‌లు, ʹఎన్‌కౌంట‌ర్ʹ హ‌త్య‌ల‌తో నేరాల నియంత్ర‌ణ సాధ్య‌మేనా?
రాజ్యాంగమే నా బలం,ఆ బలంతోనే పోరాటం కొనసాగిస్తా - ఆజాద్
మోడీ భారత పౌరుడనే రుజువుందా ? ఆర్టీఐ ద్వారా అడిగిన కేరళవాసి
వాళ్ళిద్దరి కోసం..!
జేఎన్‌యూ తర్వాత‌...ఇప్పుడు మరో యూనివర్సిటీ విద్యార్థులపై దాడి
మమ్మల్ని ఈ దేశం నుండి బహిష్కరించండి - రాష్ట్రపతికి లేఖ రాసిన ʹఉనాʹ దళితులు
JNU పై దాడి చేసిందెవరో తేల్చి చెప్పిన వార్డెన్ల నివేదిక‌
భీం ఆర్మీ ఛీఫ్ ఆజాద్ కు బెయిల్...నెల రోజులు సహరన్ పూర్ లోనే ఉండాలని కండీషన్
మోడీషా రాజ్య నిర్బంధంలో మగ్గుతున్న భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ విడుదలకై ఉద్యమిద్దాం
విద్వేషం అతని మతం.. అణచివేత అతని ఆయుధం..!
మీరు చేస్తే గొప్ప పని ప్రజలు చేస్తే హింసనా జగ్గీ గారు
ఈ ప్రభుత్వమే నిర్బంధ కేంద్రాల్లోకి నెట్టబడే రోజొస్తుంది : అరుంధతి రాయ్
మన చేతుల మీది నెత్తుటి మరకలు కడగడానికి ఎన్ని సముద్రాలు కావాలి?
నిజం ఎప్పటికి బయటకు వస్తుంది?
విరసం అధ్యక్ష కార్యదర్శులుగా అరసవెల్లి కృష్ణ,కాశీం
50 ఏళ్ల.. దుఃఖం, నిర్భంధం, ధిక్కారం, స్పూర్తి... 50 ఏళ్ల విరసం మహాసభలు
more..


దొరతనం