100 కి డయల్ చేసి ఉంటే...! విక్టిమ్ బ్లేమింగ్ - సీ.వనజ

100

సీనియర్ జర్నలిస్టు సీ.వనజ తన ఫేస్ బుక్ టైంలైన్ పై పోస్ట్ చేసిన ఈ ఆర్టికల్ మీ కోసం....
100 కి డయల్ చేసి ఉంటే బతికి ఉండేది. 100 కి డయల్ చేసి ఉంటే బతికి ఉండేది. ఉదయం నుంచి వాట్సప్ లో సోషల్ మీడియాలో వినివిని చికాకొస్తోంది. చివరికి డీజీపీ, పోలీసు కమిషనర్లు, హోం మంత్రి కూడా ఇదే పాట. ఆమె 100 కి డయల్ చెయ్యలేదు కనుక అమెకిలా జరిగింది. ఆమె అలాంటి బట్టలు వేసుకుంది కనుక అలా జరిగింది. ఆమె ఆ టైమ్ లో బయటికి వెళ్ళింది కనుక అలా జరిగింది అనటానికి దీనికి తేడా ఏమిటి? ఇంకొంత మంది ఇంకో అడుగు ముందుకు వేసి ఫోన్ స్విచ్ ఆఫ్ అయిన వెంటనే వాళ్ళ తల్లితండ్రులు అక్కడికి ఎందుకు పోలేదు అనికూడ అంటున్నారు. ఇదంతా కూడా విక్టిమ్ బ్లేమింగ్.
ఒకవైపు వ్యవస్థల ధ్వంసం మరోవైపు బాధ్యతా రహిత మైన ప్రభుత్వాలు ఉన్నపుడు సమాజం ఇలా విక్టిమ్ బ్లేమింగ్ చేసుకొని తప్పుడు సమాధానాలతో సంతృప్తి పడుతుంది. ఈ విక్టిమ్ బ్లేమింగ్ కి వాలిడిటీ ఇవ్వటానికి మనకు ఆస్థాన ప్రవచన కర్తలు ఎలాగూ ఉన్నారు కద.
నిజంగా 100 కి డయల్ చేస్తే ఆమె save అయ్యేదా? ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ అయిన గంటలోపల ఆమె తల్లి తండ్రులు మూడు పోలీసు స్టేషన్లను ఫోన్ లో అప్రోచ్ అయ్యారు. ఎవరికి వారు తమ jurisdiction కాదని తప్పించుకున్నారట. ఇది నిర్భయ ఘటనలో కూడా చూసాం. ఆమె చావు బతుకుల్లో రోడ్డు మీద పడి ఉంటే పోలీసులు jurisdiction అనే వికృత క్రీడ గంటకు పైగా ఆడారు. ఆ తర్వాత జరిగిన చర్చల్లో, నిర్భయ చట్టం వచ్చిన సందర్భంలో ఒక crime ని ఆపడానికి ఇది సాకు కాకూడదని కోర్టు లు తేల్చాయి. కంప్లైంట్ ఎక్కడ ఇచ్చిన తీసుకుని, zero FIR బుక్ చేసి తర్వాత jurisdiction ఉన్న PS కి ట్రాన్స్ఫర్ చెయ్యాలని స్పష్టంగా చట్టం ఉంది. కానీ jurisdiction వికృత క్రీడ అలవాటయిన వాళ్లకు ఈ చట్టం ఎక్కదు. 100 కి డయల్ చేసినా ఇదే వికృత క్రీడ ఉంటుంది. 100 కి వచ్చే పోలీసులు కూడా వాళ్ళే కదా. 100 కి డయల్ చెస్తీ రెస్పాన్స్ రాని వెలాది కథల మాటేమిటి.

కానీ ఆ తల్లితండ్రులు రాత్రి 11.00 గంటలకు jurisdiction కనుక్కుని స్వయంగా పోలీస్ స్టేషన్ కి వెళ్తే వాళ్ళకు వచ్చిన సమాధానం ఏమిటి? ఎవరితో అయినా పోయి ఉంటుంది. చివరి ఫొన్ కాల్ లో ఫలానా పరిస్థితి లో ఉన్నానని, భయం వేస్తుందని, ఒక అమ్మాయి ఏడుస్తూ చెప్పిందని చెప్తే కూడా లేచిపోయి ఉంటుందిలే అన్నదే ఫ్రెండ్లీ పోలీసు సమాధానం. ఇలాంటి సమాధానాలు ఇచ్చే కదా హజిపుర్ లో ముగ్గురు ముక్కుపచ్చలారని ఆడపిల్లలను బలి ఇచ్చింది. అదే పాఠంగా తీసుకుని పోలీసులను, వ్యవస్థను అప్పుడే సెట్ రైట్ చేసి ఉంటే ఇవ్వాళ ఇది అపగలిగే వాళ్ళు కాదా? ఏ అమ్మాయి మిస్సింగ్ కంప్లైంట్ వచ్చినా ఒళ్ళు దగ్గర పెట్టుకొని రెస్పాండ్ అవ్వండి అని కింది దాకా మెసేజ్ పంపాల్సిన అధికారులు, మంత్రులు, ఆడపిల్ల వైపు చూస్తే కళ్లు పీకేస్తామన్న ముఖ్యమంత్రులు ఆపని చెయ్యకుండా విక్టిమ్ బ్లేమింగ్ కి దిగటం ఎలాంటి దగుల్బాజీ తనం.
మరోవైపు సమాజంలో విపరీతంగా పెరిగిపోతున్న హింసా సంస్కృతి నీ మార్చటానికి ప్రభుత్వాలు ఎం చేస్తున్నాయి? ఏడాది తర్వాత ఏడాది మహిళలపై హింస లో తెలంగాణ అగ్రభాగాన నిలబడుతుంటే ఏలిన వారు దాన్ని మార్చటానికి ఏమైనా చేస్తున్నట్లు ఎప్పుడైనా ఒక్క మాటైనా మాట్లాడటం విన్నారా? మీకు మెక్కటానికి బంగారు తెలంగాణా వచ్చింది సరే మా జెండర్ సేఫ్ తెలంగాణా ఎప్పటికైనా వస్తుందా? అప్పుడప్పుడూ ట్విట్టర్ లో సెలెక్టివ్ outrage చూపిస్తే ఇది ఆగుతుందా? అసలు దీన్ని మార్చటానికి మీ దగ్గర ఏదైనా ప్లాన్ ఉందా?
అన్నిటికీ ప్రభుత్వాలని అంటే ఎలా ఇంటినుంచి మార్పు రావాలి అని సన్నాయి నొక్కులు నొక్కకండి. ప్రభుత్వాలు చెయ్యాల్సింది చాలా ఉంది. జెండర్ ఎడ్యుకేషన్ తేవాలి స్కూలు స్థాయి నుంచి. ప్రభుత్వం లో ప్రతి ఉద్యోగికి జెండర్ training ఇవ్వాలి. అటు పేదరికం వల్ల పట్టించుకునే కుటుంబం లేక, ఇటు బతకటానికి అవసరమయ్యే ఏ skill రాక నేర్పే వాళ్ళూ లేక ఫ్రస్టేషన్ నుంచి మీరు ఫ్రీగా అందిస్తున్న పోర్న్ చూసి పెర్వర్ట్ లు గా మారుతున్న teens ని reach out కావాలి. చెయ్యదలుచుకుంటే ఇన్కా చాలా ఉన్నయి. ప్రపంచంలో ఎక్కడైనా ఇలాంటీ మార్పులు ఉద్యమాల వల్ల దాని వల్ల ఏర్పడె పొలిటికల్ విల్ వల్ల మాత్రమే జరుగుతాయి. మనకు ఉద్యమాలు గిట్టవు. పొలిటికల్ విల్ లేదు.
చెయ్యాల్సినవి ఎమీ చెయ్యకుండా అడుగడుగునా బాధ్యతా రాహిత్యం ప్రదర్సిస్తూ కెవలం విక్టిమ్ బ్లేమింగ్ చెస్తున్న, twitter సానుభూతులు, పరిష్కారాలు చూపిస్తున్న అధికారులను, మంత్రులను చూస్తుంటే పరమ అసహ్యం వెస్తుంది. చీ...
- సీ.వనజ

Keywords : priyanka reddy, rape, murder, hyderabad, telangana, police,
(2024-04-03 07:11:39)



No. of visitors : 1527

Suggested Posts


మహాత్ముడైన రేప్ నిందితుడు - పాఠం భోధిస్తున్న టీచర్లు

అక్కడ పిల్లలకు స్కూళ్ళలో మహాత్ముల గురించి భోధిస్తారు.... అందులో తప్పేం ఉంది ? రామకృష్ణపరమహంస, వివేకానంద, మహాత్మా గాంధీ, మదర్ తెరిసాల గురించి భోధిస్తారు... వీళ్ళగురించి చెప్పకూడదా ? వీళ్ళతో పాటు.....

ఆ అక్కాచెల్లెళ్ల‌ను రేప్ చేయండి...అగ్ర‌కుల పంచాయ‌తీ తీర్పు !

బుస‌లు కొడుతున్న ఉగ్ర‌కుల ఉన్మాదం ద‌ళితులపై, స్త్రీలపై చేస్తున్న అమానుషాలు స‌భ్య‌స‌మాజం సిగ్గుతో త‌ల‌దించుకునేలా ఉన్నాయి. అగ్ర‌కుల అమ్మాయిని ద‌ళిత యువ‌కుడు ప్రేమించాడ‌న్న అక్రోశంతో ఆ యువ‌కుడి చెల్లెళ్ల‌ను రేప్ చేయాల‌ని తీర్పు ఇచ్చిన దుర్మార్గ‌పు పంచాయ‌తీ క‌థ ఇది........

సంస్కృతి రక్షకులమనే ఫోజు - అమ్మాయి పై రేప్ ప్రయత్నం

తాము నీతి మంతులమని, సంస్కృతి రక్షకులమని ఫోజులు కొడుతూ ఓ అమ్మాయిని రేప్ చేయడానికి ప్రయత్నించిన ఓగుంపు దుర్మార్గమిది.....

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


100