ప్రియాంక హత్య : ఢిల్లీలో పగిలిన చిన్ని గుండె !


ప్రియాంక హత్య : ఢిల్లీలో పగిలిన చిన్ని గుండె !

హైదరాబాద్‌లో వైద్యురాలు ప్రియాంక రెడ్డి హత్యాచార ఘటనతో ఢిల్లీలో ఓ యువతి గుండె పగిలి ఒక్కతే రోడ్డెక్కింది. ఈ దేశంలో నాకెందుకు రక్షణ లేదంటూ ప్లకార్డ్ పట్టుకొని శనివారం ఉదయం పార్లమెంటు సమీపంలో ఒక పేవ్‌మెంట్‌పై కూర్చుని నిరసన తెలిపింది.

ప్రియాంక ఘటన తర్వాత అను దుబే అనే ఈ యువతి గుండెలు పగిలేలా రోధించింది. ఈ దేశంలో స్త్రీకి రక్షణ ఎందుకు లేకుండా పోయిందని ఈ పాలకులను ప్రశ్నించాలని ఒంటరిగానే బయలుదేరింది. ʹʹమహిళలపై అత్యాచారం, లైంగిక దాడుల కేసులు వినీ వినీ అలసిపోయాను. అందుకే నిరసన తెలియజేస్తున్నాను. మా పరిస్థితి ఏంటని ప్రభుత్వాన్ని, అధికారులను ప్రశ్నించాలనుకుంటున్నాను నాతో పాటు, భారతదేశంలో పుట్టిన ఆడపిల్లలందరికీ రక్షణ కావాలని కోరుకుంటున్నారు. భారతదేశంలో పుట్టినందుకు అసహ్యంగానూ, బాధగానూ వుందిʹʹ అంటూ ఆమె ఆవేదనకు లోనయ్యారు.

అను దుబే ప్రశ్నలకు జవాబులు ఇవ్వ‌ లేని పాలకులు ప్రతిసారి లాగే ఆమెను బలవంతంగా అరెస్టు చేశారు. ఎత్తి వ్యాన్ లో పడేసి పోలీసు స్టేషన్ తీసుకెళ్ళారు. పోలీసు స్టేషన్ దగ్గరికి వెళ్ళిన మీడియాతో మాట్లాడుతూ ఆమె బోరున విలపించింది.

ʹʹదేశంలో ప్రతినిమిషానికి మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి. హైదరాబాద్‌లో ఇద్దరు అమ్మాయిలను దారుణంగా రేప్‌ చేసి కాల్చి చంపారు. నేను ప్రియాంకలా కాలి పోవాలనుకోవడంలేదు..స్వేచ్ఛగా నా పని నేను చేసుకోవాలనుకుంటున్నాను. రాత్రంతా నిద్ర పట్టలేదు.. ఇది నా ఒక్కదాని బాధ కాదు, అందరికీ న్యాయం కావాలి. రక్షణ కావాలని నిరసన తెలుపుతోంటే.. ముగ్గురు మహిళా పోలీస్‌ కానిస్లేబుళ్లు వేధించి, రక్తం వచ్చేలా కొట్టారుʹʹ అంటూ అను మీడియా ముందు కన్నీంటి పర్యంతమయ్యారు అను దుబే.

Keywords : priyankareddy, telangana, delhi, anu dube,
(2020-01-19 06:57:58)No. of visitors : 313

Suggested Posts


0 results

Search Engine

నా కొడుకు ఏ తప్పూ చేయలేదు.. పేదల కోసం, తెలంగాణ కోసం కొట్లాడిండు : కాశీం తల్లి వీరమ్మ‌
నిరసన తెలుపుతున్న మహిళల ఆహారం, దుప్పట్లు ఎత్తుకొని పారిపోయిన పోలీసులు
Condemning arbitrary arrest of Prof. C. Kaseem
జ్యుడీషియల్ రిమాండుకు ప్రొఫెసర్ కాసీం.. చీఫ్ జస్టీస్ ఇంట్లో ముగిసిన విచారణ
తనను అరెస్టు చేయడానికి వచ్చిన పోలీసులకు ʹజాషువా పద్యంʹ వినిపించిన కాశీం...!
ప్రొఫెసర్ కాసీం అరెస్టు.. తెలంగాణ పోలీసులపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం
కామ్రేడ్ కాశీం కోసం... ప్రజాస్వామిక హక్కుల కోసం అందరం గొంతు విప్పుదాం
కట్టుకథ ఆధారంగా కాశీం అరెస్ట్...!!
ʹప్రొఫెసర్ కాశీంను అణగారిన ప్రజల వైపు నిలబడ్డందుకే అరెస్ట్ చేశారుʹ
ఉరిశిక్ష‌లు, ʹఎన్‌కౌంట‌ర్ʹ హ‌త్య‌ల‌తో నేరాల నియంత్ర‌ణ సాధ్య‌మేనా?
రాజ్యాంగమే నా బలం,ఆ బలంతోనే పోరాటం కొనసాగిస్తా - ఆజాద్
మోడీ భారత పౌరుడనే రుజువుందా ? ఆర్టీఐ ద్వారా అడిగిన కేరళవాసి
వాళ్ళిద్దరి కోసం..!
జేఎన్‌యూ తర్వాత‌...ఇప్పుడు మరో యూనివర్సిటీ విద్యార్థులపై దాడి
మమ్మల్ని ఈ దేశం నుండి బహిష్కరించండి - రాష్ట్రపతికి లేఖ రాసిన ʹఉనాʹ దళితులు
JNU పై దాడి చేసిందెవరో తేల్చి చెప్పిన వార్డెన్ల నివేదిక‌
భీం ఆర్మీ ఛీఫ్ ఆజాద్ కు బెయిల్...నెల రోజులు సహరన్ పూర్ లోనే ఉండాలని కండీషన్
మోడీషా రాజ్య నిర్బంధంలో మగ్గుతున్న భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ విడుదలకై ఉద్యమిద్దాం
విద్వేషం అతని మతం.. అణచివేత అతని ఆయుధం..!
మీరు చేస్తే గొప్ప పని ప్రజలు చేస్తే హింసనా జగ్గీ గారు
ఈ ప్రభుత్వమే నిర్బంధ కేంద్రాల్లోకి నెట్టబడే రోజొస్తుంది : అరుంధతి రాయ్
మన చేతుల మీది నెత్తుటి మరకలు కడగడానికి ఎన్ని సముద్రాలు కావాలి?
నిజం ఎప్పటికి బయటకు వస్తుంది?
విరసం అధ్యక్ష కార్యదర్శులుగా అరసవెల్లి కృష్ణ,కాశీం
50 ఏళ్ల.. దుఃఖం, నిర్భంధం, ధిక్కారం, స్పూర్తి... 50 ఏళ్ల విరసం మహాసభలు
more..


ప్రియాంక