అది ఎన్కౌంటర్ కాదు.. 17 మందిని ఏకపక్షంగా కాల్చి చంపారు : జుడీషియల్ కమీషన్ వెల్లడి


అది ఎన్కౌంటర్ కాదు.. 17 మందిని ఏకపక్షంగా కాల్చి చంపారు : జుడీషియల్ కమీషన్ వెల్లడి

అది

ఏవోబీలో.. దండకారణ్యంలో.. గడ్చిరోలీలో.. జార్ఖండ్, బీహార్, కేరళ, తెలంగాణ‌.. ఇలా దేశవ్యాప్తంగా ఎన్నో ప్రాంతాల్లో మావోయిస్టుల పేరుతో రోజూ ఎన్నో ఎన్‌కౌంటర్లు జరుగుతున్నాయి. వాటిలో అత్యధికం నకిలీ ఎన్‌కౌంటర్లన్నది బహిర‍ంగ రహస్యమే. పౌరహక్కుల సంఘాలు, ఇతర ప్రజాసంఘాలు ఈ ఎన్‌కౌంటర్లపై విచారణ జరుపాలని ఎన్ని సార్లు డిమాండ్ చేసినా ప్రభుత్వం మాత్రం నోరు మెదుపదు.

గత కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్న అనేక నకిలీ ఎన్‌కౌంటర్లలో అనేక మంది అమాయకులు మరణించారు. అలా ఏడేండ్ల క్రితం పారా మిలటరీ బలగాలు 17 మంది ఆదివాసులను కాల్చి చంపి చనిపోయిన వాళ్ళు మావోయిస్టులని ఎకౌంటర్ లో మరణించారని ప్రకటించిన సంఘటనలో నిజా నిజాలు ఇప్పుడు బైటపడ్డాయి. ( నిజానికి ఘటన జరిగిన వెంటనే పోలీసులు 17 మంది ఆదివాసులను హత్య చేశారనే విష‌యం బైటపడ్డప్పటికీ ఇప్పుడు ఓ న్యాయమూర్తి అధ్య‌క్షతన ఏర్పడ్డ కమీషనే అవి హత్యలే అని తేల్చింది)

చత్తీస్‌గడ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా సర్కేగూడలో 2012 జూన్ 28న భద్రతా దళాలకు మావోయిస్టులకు జరిగిన ఎన్‌కౌంటర్ లో 17 మంది మావోయిస్టులు మరణించారని పోలీసులు ప్రకటించారు. ఆనాడే వాళ్లు మావోయిస్టులు కాదని, చనిపోయిన వాళ్ళంతా ఆదివాసులని ఎంతగా మొత్తుకున్నా.. భద్రతా దళాలు, అధికారులు, ప్రభుత్వం చనిపోయిన వాళ్లు మావోయిస్టులనే వాదించింది.

కాగా, దానిపై జ్యుడీషియల్ దర్యాప్తు జరుపగా సంచలన విషయాలు వెల్లడయ్యాయి. ఆ ఘటనపై వీకే అగర్వాల్ నేతృత్వంలోని జ్యుడీషియల్ కమిషన్ చేసిన దర్యాప్తు నివేదికను చత్తీస్‌గడ్ ప్రభుత్వానికి సమర్పించగా.. ఆ నివేదిక ఆదివారం రాత్రి లీకైంది.

వాస్తవానికి జూన్ 28న సర్కేగూడ గ్రామస్థులు ʹబీజ్ పందుమ్ʹ(విత్తన‌ పండుగ) వేడుకల గురించి చర్చించడానికి సమావేశమయ్యారు. అయితే మావోయిస్టులు ఆ గ్రామంలో సమావేశమయినట్లు భద్రతా సిబ్బందికి సమాచారం అందడంతో అక్కడకు చేరుకొని గ్రామస్థులపై కాల్పులు జరిపారు. అసలు గ్రామస్థుల వైపు నుంచి కాల్పులు జరపడం కాని, ప్రతిఘటించడం కాని జరగలేదు.

అక్కడ సమావేశమైన వాళ్లు మావోయిస్టులు అనడానికి ఎలాంటి ఆధారాలు కూడా లేవు. చాలా మందిని దగ్గర నుంచే కాల్చి చంపారని దర్యాప్తులో తేలింది. భద్రతా దళాలు కంగారులోనో, పొరపాటుగానో ఆదివాసులపై కాల్పులు జరిపారని కమిషన్ పేర్కొంది. ఎన్‌కౌంటర్ జరగలేదని తమ దర్యాప్తులో తేలిందని కమిషన్ తేల్చి చెప్పింది. ఇప్పుడు ఈ నివేదిక సంచలనంగా మారింది. ఆనాడు కావాలనే భద్రతా దళాలు ఆదివాసులను మావోయిస్టులుగా చిత్రీకరించినట్లు తేటతెల్లమైంది.

పొరపాటుగానో, కంగారులోనో భద్రతా సిబ్బంది 17 మంది ఆదివాసులను కాల్చి చంపారని జ్యూడీషియల్ కమిషన్ తన రిపోర్టులో పేర్కొన్న అంశాన్ని హక్కుల సంఘాలు తోసిపుచ్చుతున్నాయి. ప్రజలని భయపెట్టడానికి కావాలనే భద్రతా దళాలు ఈ హత్యాకాండకు పాల్పడ్డాయని ఆరోపిస్తున్నాయి.

Keywords : Maoists, Judicial Commission, VK Agarwal, Chattisgarh, Sarkeguda Case, Report, Encounter
(2019-12-08 01:12:29)No. of visitors : 890

Suggested Posts


0 results

Search Engine

నేను చనిపోయినా వారికి శిక్షపడాలి....ఉన్నావ్ అత్యాచార బాధితురాలి చివరి కోరిక‌
మా పేరు మీద కస్టడీ హత్యలు వద్దు..!
కూలి డబ్బులు అడిగినందుకు దళితుడిని జేసీబీతో తొక్కించి చంపాడు..!
క్షీణించిన వరవరరావు ఆరోగ్యం - ట్రీట్ మెంట్ కోసం పూణే ప్రభుత్వ‌ హాస్పటల్ కు...
రేప్ బాధితురాలు కోర్టుకు వెళ్తుండగా మళ్ళీ దాడి చేసిన రేపిస్టులు... సజీవదహనానికి యత్నం
ఇండియాస్ డాటర్స్.. ఇంకెంత కాలం ఈ దారుణాలు..? ఈ డాక్యుమెంటరీ చూడండి..!
20 వసంతాల నెత్తుటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
ప్రియాంక హత్య : ఢిల్లీలో పగిలిన చిన్ని గుండె !
100 కి డయల్ చేసి ఉంటే...! విక్టిమ్ బ్లేమింగ్ - సీ.వనజ
దొరతనం గెలుసుడా ఓడుడా? - ఎన్.వేణుగోపాల్
ʹఆకలి, పేదరికంతో చచ్చిపోతున్నాʹ.. కంటతడి పెట్టిస్తున్న ఓ చిన్నారి సూసైడ్ లెటర్
ఈ తెలంగాణ మీదే.. మాది కాదు : కేసీఆర్‌కు ఒక ఆర్టీసీ కండక్టర్ బహిరంగ రాజీనామా లేఖ
మహిళా కార్యకర్తలపై అక్రమకేసులకు వ్యతిరేకంగా పోరాడుదాం !
కిషన్ జీ... పీడితుల యుద్ద గీతి !
ఒక ప్రొఫెసర్ - ఏడు కుట్ర కేసులు
ప్రజల పక్షాన మాట్లాడుతున్నందుకే ఈ అక్రమ కేసులు : విరసం
Withdraw the False Case against Veekshanam Editor!
వీక్ష‌ణం సంపాద‌కుడిపై UAPA కేసు
భగత్ సింగ్ తుపాకీ - జార్జిరెడ్డి సినిమా...!!
Arrest of B Anuradha & N Ravi Sharma – Fact and Fiction
అనూరాధ, రవి శర్మల అరెస్టు – వాస్తవమూ కల్పనా..!
కేసీఆర్ అప్రజాస్వామిక పాలన‌: అనురాధ, రవిల అరెస్ట్ - రాజద్రోహం, యూఏపీఏ కేసులు బనాయింపు
ఫీజుల పెంపును నిరసిస్తూ.. కేంద్ర మంత్రిని నిర్బంధించిన జేఎన్‌యూ విద్యార్థులు..!
పోలీసుల అడ్డంకులు ఛేదించుకుని సమరోత్సాహంతో ట్యాంక్ బండ్ పైకి దూసుకొచ్చిన‌ కార్మికులు
చలో ట్యాంక్ బండ్ లో మావోయిస్టులున్నారన్న సీపీ... ఉక్కుపాదం మోపడం కోసమే ఈ ఆరోపణలన్న‌ ఆర్టీసీ జేఏసీ
more..


అది