రేప్ బాధితురాలు కోర్టుకు వెళ్తుండగా మళ్ళీ దాడి చేసిన రేపిస్టులు... సజీవదహనానికి యత్నం

రేప్

లైంగిక దాడికి గురైన యువతి కేసు విచారణలో భాగంగా గురువారం కోర్టుకు వెళుతున్న క్రమంలో గ్రామ శివార్లలో ఆమెకు నిప్పంటించిన ఘటన ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావ్‌ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో యువతికి 60 నుంచి 70 శాతం కాలిన గాయాలయ్యాయని, తదుపరి చికిత్స కోసం లక్నో ఆస్పత్రికి తరలించామని పోలీసులు తెలిపారు.ఈ ఏడాది మార్చిలో తన గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని 23 సంవత్సరాల బాధితురాలు ఫిర్యాదు చేశారు. ఇక మహిళకు నిప్పంటించిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వీరిలో యువతిపై లైంగిక దాడికి పాల్పడిన ఓ నిందితుడు ఉన్నాడని పోలీసులు తెలిపారు. కేసులో ముగ్గురిని ఇప్పటికే అరెస్ట్‌ చేశామని , మరో ఇద్దరి కోసం గాలిస్తున్నామని ఉన్నావ్‌ సీనియర్‌ పోలీస్‌ అధికారి విక్రాంత్‌ విర్‌ తెలిపారు.
ఉన్నావ్‌లో తనపై ఇద్దరు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడి ఆ దృశ్యాన్ని వీడియో తీశారని ఈ ఏడాది మార్చిలో పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితురాలు పేర్కొన్నారు. ఇద్దరు నిందితుల్లో ఒకరిని యూపీ పోలీసులు అరెస్ట్‌ చేయగా అతను బెయిల్‌పై విడుదలయ్యాడు. మరో నిందితుడిని ఇప్పటివరకూ అరెస్ట్‌ చేయకపోవడం గమనార్హం. నిందితుడి ఆస్తులను అటాచ్‌ చేసి ఆయనపై లుక్‌అవుట్‌ నోటీస్‌ జారీ చేశామని పోలీసులు చెబుతున్నారు. బాధితురాలిని కాపాడటమే ప్రస్తుతం తమ ముందున్న కర్తవ్యమని పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్ట్‌ చేశామని, ప్రధాన నిందితుడు శివం త్రివేదీ ఇంకా పరారీలో ఉన్నాడని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు.
అయితే తనకు జరిగిన అన్యాయంపై ఇప్పటికే న్యాయ పోరాటం చేస్తున్న బాధితురాలు, ఈరోజు జరిగిన దాడిలో కూడా చూపించిన తెగువ, సాహసం చర్చనీయాంశమైంది. తనే స్వయంగా పోలీసు ఎమర్జెన్సీ నెంబరు 112 ఫోన్‌ చేసింది. ఆమె ఫోన్‌ కాల్‌తోనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అలాగే తనపై దాడిచేసిన వ్యక్తులు పేర్లను పోలీసులకు వెల్లడించింది.

ఈ ఘటనలో​ ప్రత్యక్ష సాక్షి అందించిన కథనం ప్రకారం, మంటల్లో కాలిపోతూ కూడా దాదాపు కిలోమీటరు దూరం పరుగెత్తింది. సహాయం కోసం అర్ధిస్తోంది. ఆమెకు సహాయం చేసేందుకు దగ్గరికెళ్లి ఆమెను పలకరించాను. తన పేరు చెప్పిన వెంటనే.. తన దగ్గరినుంచి ఫోన్‌ తీసుకుని పోలీసుల అత్యవర నంబరుకు కాల్‌ చేసిందని ఆయన చెప్పారు. ఆమె మంటల్లో కాలిపోతున్న ఆ దృశ్యం ఇప్పటికే తనను భయాందోళనకు గురిచేస్తోందన్నారు. ఇంతలో పోలీసులొచ్చి ఆమెను ఆసుపత్రికి తరలించారంటూ ఈ దారుణాన్ని గుర్తు చేసుకున్నారు.

Keywords : uttarapradesh, rape, unnav
(2024-03-21 23:09:36)



No. of visitors : 848

Suggested Posts


ఉరిశిక్ష‌లు, ʹఎన్‌కౌంట‌ర్ʹ హ‌త్య‌ల‌తో నేరాల నియంత్ర‌ణ సాధ్య‌మేనా?

నిర్భ‌య ఘ‌ట‌నకు ముందూ, ఆ త‌రువాత వేలాది మంది యువ‌తులు, స్త్రీలు అత్యాచారాల‌కు గుర‌య్యారు. వ‌రంగ‌ల్‌లో స్వ‌ప్నిక‌, ప్ర‌ణీత‌ల‌పై యాసిడ్ దాడికి పాల్ప‌డ్డ నిందితుల‌ను పోలీసులు ʹహ‌త్యʹ చేశారు. అయినా... ఆ త‌రువాత కూడా స్త్రీల‌పై అకృత్యాలు ఎక్క‌డా ఆగ‌లేదు.

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


రేప్