కూలి డబ్బులు అడిగినందుకు దళితుడిని జేసీబీతో తొక్కించి చంపాడు..!


కూలి డబ్బులు అడిగినందుకు దళితుడిని జేసీబీతో తొక్కించి చంపాడు..!

కూలి

దేశంలో ఏదో ఒక మూల దళితులపై ప్రతినిత్యం దాడులు జరుగుతూనే ఉన్నాయి. అకారణంగా దళితులపై దాడులు చేస్తూ.. వారిని చంపేస్తున్నారు. తాజాగా తను కష్టపడి పని చేసిన దానికి కూలి అడిగినందుకు ఒక దళితుడిని జేసీబీతో తొక్కించి అత్యంత పాశవికంగా హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. యూపీలోని ప్రతాప్ గడ్ జిల్లా రాణీగంజ్ కైథెలీ గ్రామంలో ఈ దారుణ సంఘటన జరిగింది. ఈ పాశవిక హత్య స్థానికంగా కలకలం సృష్టించింది.

రాణీగంజ్ కైథెలా గ్రామానికి చెందిన శ్రీనాథ్ సరోజ్ కుమారుడు విపిన్ సరోజ్ అనే 18 సంవత్సరాల యువకుడు అదే ప్రాంతంలో ఉంటున్న వికాస్‌సింగ్‌కు చెందిన జేసీబీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. పని చేసిన తరువాత యజమాని వికాస్‌సింగ్‌‌ను బుధవారం (డిసెంబర్ 4) తనకు రావాల్సిన డబ్బులు ఇవ్వమని అడిగాడు. దీంతో ఆగ్రహించిన వికాస్ సింగ్ డ్రైవర్ సరోజ్‌ను నానా మాటలు అన్నాడు.

బూతులు తిట్టడమే కాకుండా.. పని చేసిన వెంటనే డబ్బులెందుకు ఇవ్వాలంటకూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. నానా బూతులు తిడుతూనే విపిన్ సరోజ్‌ను జేసీబీతో తొక్కించి చంపేశాడు. అతడు చనిపోయాడని గుర్తించి వికాస్ అక్కడి నుంచి పరారయ్యాడు.

తమ కొడుకు చావు గురించి తెలుసుకున్న అతని తల్లిదండ్రులు ఘటనాస్థలానికి పరుగు పరుగున వచ్చారు. గుండెలు అవిసేలా రోదించారు. సరోజ్ మరణంతో స్థానికంగానే కాకుండా చుట్టు పక్కల గ్రామాల్లో ఉద్రిక్తత నెలకొంది. వికాస్ సింగ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ విపిన్ సరోజ్ మృత దేహంతో లక్నో-వారణాసి రహదారిపై ఆందోళన చేపట్టారు.

దళితులమనే చులకన భావంతోనే.. తాము కష్టపడి పని చేసిన డబ్బులు కూడా ఇవ్వడానికి నిరాకరిస్తున్నారని... కూలి డబ్బులు అడిగినందుకే తమ బిడ్డను అన్యాయంగా చంపేశారని విపిన్ తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు. తమకు న్యాయం చేయాలని.. వెంటనే వికాస్ సింగ్‌ను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని మృతుడి తండ్రి శ్రీనాథ్ డిమాండ్ చేశాడు. అతనికి మద్దతుగా వందలాది మంది గ్రామస్థులు రోడ్డుపై బైఠాయించారు.

విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు తరలించారు. వికాస్ కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు.

Keywords : Vipin Saroj, JCB Driver, UP, Murdered, Dalit
(2020-01-16 20:39:31)No. of visitors : 338

Suggested Posts


0 results

Search Engine

తనను అరెస్టు చేయడానికి వచ్చిన పోలీసులకు ʹజాషువా పద్యంʹ వినిపించిన కాశీం...!
ప్రొఫెసర్ కాసీం అరెస్టు.. తెలంగాణ పోలీసులపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం
కామ్రేడ్ కాశీం కోసం... ప్రజాస్వామిక హక్కుల కోసం అందరం గొంతు విప్పుదాం
కట్టుకథ ఆధారంగా కాశీం అరెస్ట్...!!
ʹప్రొఫెసర్ కాశీంను అణగారిన ప్రజల వైపు నిలబడ్డందుకే అరెస్ట్ చేశారుʹ
ఉరిశిక్ష‌లు, ʹఎన్‌కౌంట‌ర్ʹ హ‌త్య‌ల‌తో నేరాల నియంత్ర‌ణ సాధ్య‌మేనా?
రాజ్యాంగమే నా బలం,ఆ బలంతోనే పోరాటం కొనసాగిస్తా - ఆజాద్
మోడీ భారత పౌరుడనే రుజువుందా ? ఆర్టీఐ ద్వారా అడిగిన కేరళవాసి
వాళ్ళిద్దరి కోసం..!
జేఎన్‌యూ తర్వాత‌...ఇప్పుడు మరో యూనివర్సిటీ విద్యార్థులపై దాడి
మమ్మల్ని ఈ దేశం నుండి బహిష్కరించండి - రాష్ట్రపతికి లేఖ రాసిన ʹఉనాʹ దళితులు
JNU పై దాడి చేసిందెవరో తేల్చి చెప్పిన వార్డెన్ల నివేదిక‌
భీం ఆర్మీ ఛీఫ్ ఆజాద్ కు బెయిల్...నెల రోజులు సహరన్ పూర్ లోనే ఉండాలని కండీషన్
మోడీషా రాజ్య నిర్బంధంలో మగ్గుతున్న భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ విడుదలకై ఉద్యమిద్దాం
విద్వేషం అతని మతం.. అణచివేత అతని ఆయుధం..!
మీరు చేస్తే గొప్ప పని ప్రజలు చేస్తే హింసనా జగ్గీ గారు
ఈ ప్రభుత్వమే నిర్బంధ కేంద్రాల్లోకి నెట్టబడే రోజొస్తుంది : అరుంధతి రాయ్
మన చేతుల మీది నెత్తుటి మరకలు కడగడానికి ఎన్ని సముద్రాలు కావాలి?
నిజం ఎప్పటికి బయటకు వస్తుంది?
విరసం అధ్యక్ష కార్యదర్శులుగా అరసవెల్లి కృష్ణ,కాశీం
50 ఏళ్ల.. దుఃఖం, నిర్భంధం, ధిక్కారం, స్పూర్తి... 50 ఏళ్ల విరసం మహాసభలు
విరసం 50 ఏళ్ళ సభలు...నోమ్ ఛామ్ స్కీ సందేశం
సృజ‌నాత్మ‌క ధిక్కారం.. విర‌సం 50 ఏళ్ల స‌భ‌లు ప్రారంభం
విరసం 50 ఏళ్ల సభలు.. పూణే జైలు నుంచి వరవరరావు సందేశం
CPI (Maoist) oppose Citizenship Amendment Act, calls to intensify mass campaign against it
more..


కూలి