జామియా విద్యార్థులకు అండగా నిల్చిన వీసీ - పోలీసులపై కేసు నమోదు చేస్తామని ప్రకటన‌


జామియా విద్యార్థులకు అండగా నిల్చిన వీసీ - పోలీసులపై కేసు నమోదు చేస్తామని ప్రకటన‌

జామియా


పౌరసత్వ సవరణ చట్టం(CAA)పై నిరసనలు తెలిపిన జామియా మిలియా యూనివర్సిటీ విద్యార్థులపై పోలీసుల దాడిని ఆ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ నజ్మా అఖ్తర్ తీవ్రంగా ఖండించారు.

తమ విశ్వవిద్యాలయంలోకి పోలీసులు ప్రవేశించి విద్యార్థులపై దాడి చేయడాన్ని తప్పుబట్టిన వైస్ ఛాన్సలర్ పోలీసులపై కేసు నమోదు చేస్తామని తెలిపారు. ʹʹధ్వంసమైన ఆస్తులను తిరిగి నిర్మించుకోవచ్చు. కానీ, విద్యార్థుల ఆందోళనలకు మీరు విలువ కట్టలేరుʹʹ అని వ్యాఖ్యానించిన ఆమె ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ

ʹʹబలవంతంగా యూనివర్సిటీలోకి చొరబడిన పోలీసు సిబ్బందిపై కేసు పెడతాం. జామియా విద్యార్ధుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు తీవ్రంగా కలచివేసింది. యూనివర్సిటీలో పెద్ద ఎత్తున ఆస్తినష్టం కలిగింది. ఈ నష్టాన్ని ఎలా చెల్లిస్తారు? కేవలం ఆస్తినష్టమే కాదు... భావోద్వేగాల పరంగా కూడా తీవ్ర నష్టం వాటిల్లింది. నిన్న జరిగిన ఘటన దురదృష్టకరం. ఎలాంటి పుకార్లను నమ్మవద్దని ప్రతి ఒక్కరికీ విన్నవిస్తున్నా...ʹʹ అని పేర్కొన్నారు.

ఈ ఘటనల్లో తమ వర్సిటీకి చెందిన ఇద్దరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారన్న వార్తలు నిజంకాదని నజ్మా అఖ్తర్ తెలిపారు. ʹʹమా విద్యార్థులు ఎవరూ చనిపోలేదు. ఈ ఆందోళనల్లో 200 మంది గాయపడ్డారు. వారిలో చాలా మంది మా విద్యార్థులే ఉన్నారుʹʹ అన్నారు.

Keywords : Jamia Millia Islamia University, cab, caa, police attack on students
(2020-06-25 07:44:02)



No. of visitors : 369

Suggested Posts


నేను ముస్లింను కాను కానీ పోరాటంలో ముందుభాగాన ఉన్నాను, అందుకే నన్ను టార్గెట్ చేశారు

పౌరసత్వ సవరణ బిల్లు (CAB)పై నిరసన కార్యక్రమాల సందర్భంగా పోలీసులు జామియా మిలియా యూనివర్సిటీపై దాడి చేసిన ఘటనలో యూనివర్సిటీ మొత్తం నెత్తురు ఏరులై పారింది. యూనివర్సిటీ రోడ్లు, లైబ్రరీ, హాస్టల్ గదులు విద్యార్హుల నెత్తురుతో తడిసిపోయింది.

అమిత్ షాకు బహిరంగ లేఖ‌ !

ʹʹసిటిజెన్‌ షిప్‌ అమెండ్‌ మెంట్‌ ఆక్ట్‌ 2019 గురించి ఏ ఒక్క భారతీయ పౌరుడూ భయపడనక్కరలేదుʹʹ అని ఎంత బాగా అన్నారు, అమిత్‌ భాయ్‌! ఆఫ్ఘనిస్తాన, పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌ లలో తాము ఎదుర్కొన్న మతపరమైన వివక్ష

NRC,CAA : ఫాసిస్టు చట్టంపై స్పందించండి - టెకీల బహిరంగ లేఖ

పౌరసత్వ సవరణ చట్టం (CAA), నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (NRC) లకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో భారతీయ ఐటీ నిపుణులు ఘాటుగా స్పందించారు. పౌరసత్వ సవరణ చట్టం ఫాసిస్ట్‌ చట్టంగా పేర్కొంటూ బహిరంగ లేఖ రాశారు.

నిరాశ‌ల న‌డుమ‌ కొత్త ఆశ

డీమానిటైజేష‌న్‌, జీఎస్‌టీ, 370 ఆర్టిక‌ల్ ర‌ద్దు, అయోద్య తీర్పులాంటి ఉప‌ద్రవాలు వ‌చ్చినా స‌మాజం క‌ద‌ల‌వ‌ల‌సినంత క‌ద‌ల‌లేద‌ని, కానీ ఇప్పుడు ఆ నిరాశలోంచి కొత్త కాంతి పుంజాలు వెలుగుచూస్తున్నాయ‌ని అన్నారు. ఇప్పుడు ఎన్ఆర్‌సీకి వ్య‌తిరేకంగా జ‌రుగుతున్న ఆందోళ‌న‌ల్లో క‌నిపించే యువ‌తే ఆ ఆశ అన్నారు.

వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్ లను యూనివర్సిటీ నుండి బహిష్కరించిన విద్యార్థులు, అధ్యాపకులు, ఉద్యోగులు

ఇప్పటి వరకు విద్యార్థులను కాలేజీల నుండి, యూనివర్సిటీల నుండి బహిష్కరించే వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్, ప్రిన్సిపాల్ లనే చూశాం కదా.... తప్పు చేసిన వైస్ ఛాన్సలర్ ను, రిజిస్ట్రార్ లను యూనివర్సిటీ నుండి బహిష్కరించిన విద్యార్థులు, అద్యాపకులు, ఉద్యోగుల గురించి విన్నారా ఎప్పుడైనా ?

CAA,NRC : ఈ దేశ ప్రజలపై పాలకుల హింసాకాండకు ఉత్తరప్రదేశ్ ఓ ఉదహరణ‌

పౌరసత్వ సవరణ చట్టానికి (CAA) వ్యతిరేకంగా ఉత్తరప్రదేశ్‌లో శాంతియుత నిరసనలు చేస్తున్న విద్యార్థులు, యువకులు, సామాజిక, హక్కుల కార్యకర్తలపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ నేతృత్వంలోని బీజేపీ సర్కారు కేసులు పెడుతున్నది.

NPR పేరుతో NRC అమలు చేయబోతున్నరు... IAS కన్నన్ గోపీనాథన్

ఎన్పీఆర్ పేరుతో అమిత్ షా ఎన్నార్సీ అమలు చేయదల్చుకున్నాడని మాజీ ఐఏఎస్ కన్నన్ గోపీ నాథన్ మండి పడ్డారు. ఎన్నార్సీ, సీఏఏ లకు వ్యతిరేకంగా ముంబైలో జరిగిన ఓ ప్రదర్శనను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.

హైదరాబాద్‌ను తాకిన ʹజామియాʹ నిరసన సెగ.. వందలాది మంది విద్యార్థుల ఆందోళన

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ విద్యార్థులు చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. ఆందోళన చేపట్టిన విద్యార్థులపై ఢిల్లీ పోలీసులు అత్యంత దారుణంగా దాడులు చేశారు. ఈ దాడులకు నిరసనగా, జామియా విద్యార్థులకు మద్దతుగా హైదరాబాద్‌లో నిరసనలు వెల్లువెత్తాయి.

ఎన్నార్పీలో సరైన వివరాలు ఇవ్వకండి - ప్రజలకు అరుంధతీ రాయ్ పిలుపు

కేంద్ర ప్రభుత్వందొడ్డి దారిన ఎన్నార్సీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోందని ప్రముఖ రచయిత్రి, సామాజిక కార్యకర్త అరుంధతి రాయ్ ఆరోపించారు. ఎన్‌ఆర్‌పీ అనేది ఎన్‌ఆర్‌సీకి డేటాబేస్‌గా ఉపమోగపడుతుందని ఆమె అన్నారు. ఢిల్లీ యూనివర్సిటీలో ఎన్‌ఆర్‌సీని వ్యతిరేకిస్తూ నిర్వహించిన నిరసన కార్యక్రమంలో బుధవారం ఆమె పాల్గొన్నారు.

పోలీసుల దాడిలో కన్ను కోల్పోయిన విద్యార్థి ఏమంటున్నాడు

దేశ రాజధాని ఢిల్లీకి వచ్చి చాలా పెద్ద తప్పు చేశానని పోలీసుల దాడిలో కన్ను పోగొట్టుకున్న‌ జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయంలో విద్యార్థి మిన్హాజుద్దీన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 15న జామియా యూనివర్సిటీలో పౌరసత్వ సవరణ చట్టానికి

Search Engine

కేరళ:పావంగడ్ పట్టణంలో మావోయిస్టుల పోస్టర్లు,బ్యానర్లు... దళిత,గిరిజన,మైనారిటీలపై దాడులకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపు
ʹగౌరీ లంకేష్ ను గుర్తుకు తెచ్చుకోʹ - జర్నలిస్టు రానా అయూబ్ కు హత్య, రేప్ బెదిరింపులు
జూలై 4,5 తేదీల్లో విరసం యాభయ్యో ఆవిర్భావ సభలు... ఆన్ లైన్ లో
పోలీసు స్టేషన్ లో బాలికపై దుర్మార్గం....రోజుల తరబడి గ్యాంగ్ రేప్ చేసిన ఇన్‌స్పెక్టర్, పోలీసులు
తమిళనాడు కస్టడీ మరణాలు: 5గురు పోలీసుల అరెస్టు... పటాకులు పేల్చి డ్యాన్సులు చేసిన జనం
బొగ్గు గని కార్మికుల మూడు రోజుల సమ్మెకు ప్రజా ఫ్రంట్ మద్దతు
తూచ్..మేము మందు కనిపెట్టలేదు...కరోనా మందుపై యూ టర్న్ తీసుకున్న పతంజలి
జ్యుడిషియల్ టీం పై పోలీసుల వేధింపులు... పోలీస్ స్టేషన్‌ను స్వాధీనం చేసుకోవాలని హైకోర్టు ఆదేశం
అఖిల్ గొగొయ్ ని విడుదల చేయాలంటూ1200 మంది ఖైదీల నిరాహార దీక్ష
143 Bangladesh intellectuals demand the release of Varavara Rao
దేశంలో రోజుకు ఐదు కస్టోడియల్ మరణాలు
బొగ్గుగని కార్మికుల దేశవ్యాప్త సమ్మెకు పౌరహక్కుల సంఘం మద్దతు
హక్కుల కార్యకర్త సోనీ సోరీని హత్య చేసేందుకు పోలీసులు కుట్ర చేస్తున్నారా ?
జార్జ్ ఫ్లాయిడ్స్ ఆఫ్ ఇండియా....ఇలాంటి హత్యలు ఎన్నో!
పోలీసుల క్రూరత్వం... తండ్రీ కొడుకుల హత్య...మాట‌ల‌కంద‌ని హింస‌
మూడురోజుల పాటు మావోయిస్టుల భారీ బహిరంగ సభ...వేలాదిగా పాల్గొన్న జనం
ముస్లిం స్వాతంత్ర్య సమరయోధుడిపై సినిమా... మతోన్మాద శక్తుల హెచ్చరికలు
అఫ్ఘ‌నిస్తాన్ మావోయిస్టు పార్టీ చైర్మన్ కామ్రేడ్ జియా అమర్ రహే !
ఇప్పుడు పోరాటం ఒక్కటే...మన ఉనికిని నిలబెడుతుంది -అరుంధతీ రాయ్
రాజకీయ ఖైదీలందరినీ విడుదల చేయాలంటూ పంజాబ్ లో ఆందోళనలు...రాష్ట్రపతికి లేఖ‌ !
రమాకాంత్ అమర్ రహే! ఈ విప్లవ యోధుడి అమరత్వానికి ఇరవై నాలుగేళ్లు...
A very worrying letter from Gautamʹs partner Sahba. Remember that Maharashtra is the epicenter of the Covid epidemic.
వరవరరావుతో సహా హక్కుల కార్యకర్త‌లందరినీ విడుదల చేయాలి....500 మంది ప్రముఖుల లేఖ !
ప్రైవేటు కంపనీలకు బొగ్గు తవ్వకాలకు అనుమతిపై నిరసనకు పిలుపునిచ్చిన జార్ఖండ్ జన్ అధికార్ మహాసభ
సిఆర్ పి ఎఫ్ క్యాంప్ ఏర్పాటుకు నిరసనగా ఆదివాసీల భారీ ర్యాలీ...పోలీసులతో ఘర్షణ
more..


జామియా