నేను కాశ్మీర్ వాడ్ని.. మహ్మదీయుడ్ని కూడా... నన్ను కాల్చేస్తారేమో..?!

నేను

"కాలీమా మార్గం లో వెళ్ళు. ఇదే నీకు ఉన్న ఆఖరి అవకాశం.... "
పోలీసులు కాశ్మీర్ కు చెందిన "రహూల్ బంక" అనే ముస్లిం విద్యార్థితో అంటున్నారు. ఆ సాయంత్రం, తరువాత .... ఆ రాత్రి ఏమి జరిగిందనేది అతను చెబుతున్నాడు. ఇది ఏమాత్రం కల్పితం కాదు.

సమయం ...డిసెంబర్ 15 తేదీ మధ్యాహ్నం సుమారు 12 గంటలు...చదువుకుందామని ఇబ్న్ ఇంష భవనంలో గల నేను లైబ్రరీ కి వెళ్ళేను.
జనవరిలో జరగ బోయే ఎమ్. ఫిల్./ పి.. హెచ్. డీ. ఇంటర్వ్యూ కోసం తయారవు తున్నాను. లైబ్రరీ కి వచ్చిన వెంటనే నిరసన కారుల్లో ఒక రకమైన తేడా కనపడింది. కొందరేమో నిరసన ప్రదర్శనకి సిద్ధమౌతుంటే, కొందరేమో పోస్టర్లు రాస్తున్నారు. రోడ్ల మీద కూడా జనం ఉన్నారు. అయితే వాళ్ళెవరూ జామియా విద్యార్థులు కారు. నేను లైబ్రరీ లోపలికి వెళ్లిపోయెను. సుమారు4 గంటలకి కాసేపు విరామం ఇద్దామని బయటకి వచ్చేసరికి NFC
చుట్టుప్రక్కల, ఎక్కడనుంచో పొగలు దట్టంగా వస్తూ కనపడ్డాయి. అంతా ఊపిరి ఆడనట్టు గా ఉంది.
ఎక్కడ ఏమీ బాగున్నట్టు కనపడలేదు. యూనివర్సిటీ బయట కొందరు వున్నారు. వాళ్ళెవరూ జామియా విద్యార్థులు కారు.. ఏదో వెక్కిరిస్తున్నట్టు, వేళాకోళం చేస్తున్నట్టూ అగుపించేరు. లైబ్రరీ బయట సెక్యురిటి గార్డు కూడా లేడు. అక్కడే ఉన్న ఇంకొక సహవిద్యార్ధి ని పిలిచి, యూనివర్సిటీ రెక్టర్ కి చెప్పి లైబ్రరీ కి కాపలా ఎవరూ లేరు, ఎవరినైనా నియమించవల సిందని చెప్పమని పంపించేను. మళ్లీ నా రూమ్ కి వెళ్లిపోతుంటే, మొదటి అంతస్తు కిటికీ లోంచీ కనపడింది.. కొంత మంది నిరసన చేస్తున్న విద్యార్థులు ని పోలీసులు తరుముతున్నారు. వారి వెనుకే పరుగెడుతూ బాష్ప వాయు గోళాల్ని విసురుతున్నారు. అయినా నేను అలాగే వెళ్ళిపోయి మళ్లీ చదువులో పడ్డాను. ఈలోగా టియర్ గాస్ పొగ దట్టంగా నా గదిలో కి వచ్చేసింది....

నిరసన తీవ్రత ని అంచనా వెయ్యలేక పోయేను.13 వ తేదీ నిరసన లాగే ఉంటుందనుకున్నాను . కొంత సేపు తరువాత కొందరు ఆడ పిల్లలు బయపడిపోతూ పరిగెత్తుకుంటూ లైబ్రరీ గదిలోకి వొచ్చి చెప్పేరు ..జామియా లో 144 సెక్షన్ పెట్టేరు అని. నేను వెంటనే మరొక కాశ్మీరీ విద్యార్థి ని పిలిచి ప్రొక్టర్ దగ్గరకెళ్లి లైబ్రరీ కి వెంటనే తక్షణం రక్షణ ఏర్పాటు చెయ్యండి అని చెప్ప మన్నాను. ఈలోగానే మరి కొందరు విద్యార్థులు లోపలికి వచ్చేరు.అలా అలా 15- 20 నుండి సంఖ్య 40 కి పెరిగింది. క్యాంపస్ బయట నిరసన చేస్తున్న వాళ్లతో పాటు బయట వాళ్ళు కూడా ఎవరో ఉన్నారట. నేను ఎక్కడైనా దాక్కుందామా అని అనుకున్నాను గానీ వెంటనే ఆ ఆలోచన మానుకున్నాను. పారామిలటరీ దళాలు ఎలాగూ నన్ను వెదికి పట్టుకుని కాల్చేస్తాయి కనుక.

స్టేట్ పోలీసులు టియర్ గ్యాస్ గోళాలు వెయ్యడం మొదలు పెట్ట గానే గుంపు చెదిరి పోయి అన్ని వైపులా పరుగెత్తడం మొదలు పెట్టారు. బయటి వాళ్ళు బళ్ళు నిలిపేచోటులోను, గార్డెన్ లోను, ఇంకా అక్కడ అక్కడ దాగి ఉన్నారని చెప్పేరు.

లైబ్రరీ అక్కడ ఉంది అని తెలిసిన విద్యార్థులు ఆవరణలో అప్పటికే చుట్టుముడుతున్న పొగ నుండి తప్పించుకోడానికి ఇటే వచ్చారు. అప్పటికే పారా మిలిటరీ జామియా ఆవరణలో కి వొచ్చేసేరని, లైబ్రరీ కి బయట నుంచి తాళం వేయమని కొంతమంది మిగతా విద్యార్థులకు సలహా ఇస్తున్నారు. క్రింది అంతస్తు లోంచి విద్యార్థుల అరుపులు, కేకలు వినిపిస్తున్నాయి. అందరిలో భయం వ్యాపించిపోయింది. మళ్లీ అనిపించింది దాక్కుందామా ఎక్కడైనా అని. కానీ మరునిమిషం లొనే ఆ ఆలోచన విరమించుకున్నాను. ఎలాగైనా వెదికి పట్టుకుని మరీ కాల్చేస్తారు. ఆపాటి దానికి దాక్కోడం ఎందుకు ...అనుకున్నాను.
వణుకుతున్న చేతుల్తో ఫోన్ తీసుకుని గతంలో డయల్ చేసిన నెంబరే శీతల్ భోపాల్ కి ,( JNU మిత్రురాలు )ఫోన్చేసి, నిస్సహాయంగా ఏడుస్తూ సహాయం కోసం అడిగాను. పారా మిలిటరీ దళాలు లైబ్రరీ తలుపులు బద్దలుకొట్టే ప్రయత్నం చేస్తున్నారు. కిటికీ అద్దంలోంచీ చూస్తే మెట్ల మీద కూడా దళాలు నిండిపోయారు.

కిటికీ అద్దాలు బద్దలుకొట్టుకుని బయటకి దూకేద్దామనుకుంటున్నంత లోనే, వాళ్లలో ఒకడు అరిచి నన్ను పట్టుకొమ్మన్నాడు. దళాలు తలుపులు విరగ్గొట్టడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. వాళ్లంటున్నారు, " కాలీమా మార్గం లో పోండి. ఇదే మీకున్న ఆఖరి అవకాశం". పరిస్థితి విషమించి అంతటా ప్రాకిపోయిందని నాకు అర్ధమయింది. బుర్ర నిండా రకరకాల ఆలోచనలు పరిగెడు తున్నాయి....ʹ నేను కాశ్మీరు వాడిని, మహమ్మదీయుడిని కూడా.ʹ.....

ఏదో ఒకలాగా ఏమిటి చేస్తే, ఎలాగ హిందువు లాగా కనపడగలను....అలా అయితే చంపకుండా వొదిలేస్తారు కదా అనుకున్నాను. చుట్టుకున్న మఫ్లెర్ విసిరేసి, నా పొడవు జుట్టుని వెనక్కి విప్పి వొదిలేసాను. దళాలు తలుపుల్ని నాలుగు ముక్కలు కింద బద్దలుకొట్టుకుని లోపలికి చొచ్చుకొని వొచ్చేసేరు. వస్తూనే ఆడపిల్లల్ని కిరాతకంగా కొట్టేరు. అప్పుడా పిల్లలకి ఏమైందో నాకు తెలీదు. మా అందర్నీ లైబ్రరీ గది నుంచీ బయటకి రమ్మన్నారు. గది లోంచీ అడుగు బయటకి పెట్టేనో లేదో, బయట ఉన్న ఒకడు లాఠీతో బలంగా నా నుదుటి మీద కొట్టేడు. తలనుండీ ఒక్కమారుగా విపరీతంగా రక్తం ధార కట్టి కారడం మొదలెట్టింది. ఇక మెట్ల మీద నిలబడ్డ ప్రతీ ఒక్కడూ నన్ను కొట్టేరు. బ్రతికించమని ప్రాధేయ పడ్డాను. భగవంతుడి పేరు మీద నన్ను వొదిలి పెట్టమని వేడుకున్నాను. దారిలో పారా మిలిటరీ వాళ్ళు మళ్లీ కొట్టి అన్నారు," సా...., భగవంతుని పేరుతో కాదురా.. నువ్వు మహమ్మదీయుడివి... అల్లాహ్ పేరు తో వొదిలి పెట్టమని ఆడుగురా", అని వాళ్లలో ఒకడు అన్నాడు.

ఇంకొకడు కొడుతూ ఆజాదీ కావాలిరా నీకు.....అంటాడు. మరొకడు వెక్కిరిస్తూ అంటాడు.." రాళ్లువిసురుతావురా"? 7వ నెంబరు గేట్ చేరే దాకా నన్ను లాఠీతో కొట్టడం కొనసాగింది. తప్పించుకుని పారి పోదామనుకున్నాను గానీ అది వృధా ప్రయాసే అని విరమించు కున్నాను. అంతటా పారామిలటరీ మోహరించి ఉన్నారు. రక్తం విపరీతంగా కారడం తో నాలో వణుకు మొదలయింది. బ్రతికించమని వేడుకున్నాను. గేట్ దగ్గర వాళ్లలో ఒకడిని నన్ను కాపాడమని అడిగేను. వాళ్ళకి కూడా ఇంటి దగ్గర నాలాటి కొడుకులో, తమ్ముల్లో ఉంటారు కదా, నన్ను కూడా వాళ్ళ లాగే అనుకుని, ఈ రక్తంధార ఆగి కట్టడానికి ఏమన్నా చెయ్యమని బ్రతిమిలాడుకున్నాను. ఇంకొకడు వచ్చి మళ్లీ లాఠీతో కొట్టడం మొదలుపెట్టేడు. తల మీద కొడితే చచ్చిపోతానని ఇంకొకడు తలమీద కొట్టకుండా ఆపేడు. ఈపాటికే నా వొళ్ళు అంతా ఎక్కడికక్కడ విరిగిపోయింది. లైబ్రరీ నుండి 7 వ నెంబరు గేట్ వరకూ, సుమారు 500మీటర్ల దూరానికే నిలబడి ఉన్న 40 నుండీ50 మంది పారామిలటరీ వాళ్ళు నన్ను క్రూరంగా కొట్టేరు.

వాళ్ళు నన్నో బంగాళాదుంపల బస్తా లాగా ఎత్తి పోలీసు వాన్ లోకి విసిరేసేరు. అక్కడ అప్పటికే ఉన్న మరో నలుగురు మనుషుల మీద పడ్డాను. చీకటి పడింది. మమ్మల్నితెచ్చిన వాళ్లలో ఒకడు మమ్మల్ని ఆసుపత్రి కి తీసుకెళ్లమని చెప్పేడు.
డ్రైవర్ ప్రక్కన కూర్చున్న ఒకడు వాన్ ని నెమ్మదిగా తీసుకు పొమ్మన్నాడు. నేను మధ్యలో కలిగించుకుని తొందరగా తీసుకెళ్లమని బ్రతిమిలాడుకున్నాను. ఎందుకంటే రక్తం ఒక్కలాగా కారిపోతోంది. ఆగడం లేదు. చచ్చిపోతానని చెప్పేను. దయచేసి వేగంగా నడిపి ఆసుపత్రి కి తీసుకెళ్ల మన్నాను. ఇంక వాళ్లలో ఒకడు అరిచేడు.." చస్తే ఏమయి పోతుందేంట్రా". అక్కడికి దగ్గరే ఉన్న హోలీ ఆసుపత్రికి తీసుకెళ్ల కుండా సందులన్నీ వరసగా తిప్పేరు. చీకట్లోనే తిప్పుతున్నారు. నా ప్రాణం ఎక్కడ పోతుందో అని ఒకటే భయం నాకు. ఎక్కడికి తీసుకెళుతున్నారో తెలీదు. చివరకి న్యూ ఫ్రెండ్స్ కాలనీ లో ఉన్న పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి ఒక గదిలో పడేసారు.

కాపాడమని, వైద్య సహాయం అందించమని, మంచినీళ్లు, తిండి, ఇమ్మని అడుక్కున్నాం. ఏ కారణం చేతనో గానీ, నా ముక్కు రక్తం కారడం ఆగింది. మా చరవాణీ లని దూరంగా పెట్టెయ్య మన్నారు. అలాగే2 గంటలు అక్కడే పడి ఉన్నాం. వాళ్ళు మమ్మల్ని నోటకొచ్చిన తిట్లన్నీ తిట్టేరు. ఒకడు ఇలాగ కూడా అన్నాడు," పౌర సత్వ బిల్లు CAB తో మీకొచ్చిన సమస్య ఏమిటిరా.." అని. జవాబిచ్చే స్థితిలో మేము లేం. లోపల కూర్చున్న ఒకడు అదేపనిగా ఎదో ఒకటి అంటూనే ఉన్నాడు. తరువాత నా ముక్కుకి పట్టీ వేసేరు. రాత్రి ఎప్పుడో ఒక లాయర్ మా గురించి అడగడానికి వొచ్చేడు. ఒక పోలీసు ఒక స్టూడెంట్ ని కూడా ఉండి తీసుకెళుతున్నాడు మేమేదో పెద్ద నేరగాళ్ల మయినట్టు.

మేం అందరం కలిపి16 మందిమి ఉన్నాం. ఎయిమ్స్ ట్రామా సెంటర్ కి మమ్మల్ని తీసుకెళ్ళేరు. చికిత్స చేస్తూనే కొందరు వైద్యులు మమ్మల్ని పౌరసత్వ బిల్లు గురించి అడిగేరు. మరునాడు ఉదయం ఆరు గంటలకు మమ్మల్ని అపోలో ఆసుపత్రి కి తీసుకెళ్ళేక అక్కడి వైద్యులు కూడా ఇలాగే బిల్లు గురించి అడిగేరు. డిసెంబర్16 తేదీ ఉదయం 6గంటలకి మమ్మల్ని పోలీసు ఠాణా నుంచీ వొదిలి పెట్టేరు.

---- రహుల్ బంక
జమియా మిలియ ఇస్లామీయ
యూనివర్సిటీ విద్యార్థి

(రహుల్ బంక జమియా మిలియ ఇస్లామీయ యూనివర్శిటీ విద్యార్ధి. జమ్మూ కాశ్మీర్ కి చెందిన ముస్లీం కుంటుంబం నుంచి వచ్చినవాడు. పిహెచ్ డి ఇంటర్వ్యూకి సిద్ధమవుతున్నాడు. ఢిల్లీ పోలీసులు యూనివర్సిటీ పై దాడిచేసి దొరికిన విద్యార్థుల్ని దొరికినట్టు అత్యంత అమానుషంగా కొట్టిన 15 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు చదువుకోవడం కోసం లైబ్రరీ కి వెళ్లి క్యాంపస్ కి తిరిగివస్తోన్న రహుల్ పై కూడా పోలీసులు క్రూరంగా దాడిచేసి కొట్టారు.. )

నోట్ : అమర్ మాలిక్ ఫేస్‌బుక్‌లో రాసిన పోస్టును మోహన సుందరం తెలుగులో అనువదించారు.

సోర్స్ : https://www.facebook.com/mohana.sundaram.3975012/posts/441262560112778

Keywords : JMIU, CAA, NRC, Agitations, Police, Muslim, Student, Attack
(2024-03-09 01:48:32)



No. of visitors : 742

Suggested Posts


0 results

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


నేను