నిరాశ‌ల న‌డుమ‌ కొత్త ఆశ

నిరాశ‌ల


దేశం అత్యంత సంక్షోభ స‌మ‌యాన్ని ఎదుర్కొంటోంద‌ని, పాల‌కులు ఏక‌త్వం గురించి మాట్లాడుతున్న ఈ సంద‌ర్భంలో ప్ర‌జ‌లు ఏక‌త్వంలో భిన్నాత్వాన్ని నిల‌బెట్టుకోవ‌ల్సిన అవ‌స‌ర‌ముంద‌ని ఆంధ్ర‌జ్యోతి సంపాద‌కులు కె. శ్రీనివాస్ అన్నారు. డైలాగ్ చ‌ర్చావేదిక ప్ర‌చురించిన Trails Of Dissent / స‌మ‌కాలీన సంభాష‌ణ (ద్విభాష‌) పుస్త‌కాన్ని ఆయ‌న ఆదివారం లామ‌కాన్‌లో ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ ఐదారేళ్ల‌లో ఎన్నో సంక్షోభాలు స‌మాజంలో అలుముకున్నాయ‌ని, అవి ఆలోచ‌నాప‌రుల‌ను ఎంతో క‌ల‌వ‌రానికి గురిచేస్తున్నాయ‌ని అన్నారు. ఇలాంటి సంద‌ర్భాల్లో కూడా స‌మాజాన్ని ప్ర‌గ‌తిశీలంగా మార్చాల‌నే ఆశ ఈ త‌రంలో క‌నిపిస్తోంద‌న్నారు. వాళ్ల‌కు రాజ్యం క్రూర‌త్వం తెలియ‌క‌పోయినా... విచ‌క్ష‌ణ‌తో ఆలోచిస్తూ, ప్ర‌శ్నిస్తున్నార‌ని అన్నారు. రాజ్యాంగంలోని విలువ‌లు ఇంకా అంత‌రించి పోలేద‌ని, అంతిమంగా విజ‌యం సాధిస్తాయ‌న్న విశ్వాసం క‌లుగుతోంద‌న్నారు.

వీక్ష‌ణం సంపాద‌కులు ఎన్ వేణుగోపాల్ మాట్లాడుతూ ప్ర‌శ్న‌ను, ఆలోచ‌న‌ను అణ‌చివేస్తున్న‌ట్రంప్‌, మోడీ - షా, కేసీఆర్‌ల‌ కాలంలో యువ‌త నిరంత‌రం సంభాష‌ణ‌ను కొన‌సాగిస్తుండ‌డం అభినంద‌నీయ‌మ‌న్నారు. డీమానిటైజేష‌న్‌, జీఎస్‌టీ, 370 ఆర్టిక‌ల్ ర‌ద్దు, అయోద్య తీర్పులాంటి ఉప‌ద్రవాలు వ‌చ్చినా స‌మాజం క‌ద‌ల‌వ‌ల‌సినంత క‌ద‌ల‌లేద‌ని, కానీ ఇప్పుడు ఆ నిరాశలోంచి కొత్త కాంతి పుంజాలు వెలుగుచూస్తున్నాయ‌ని అన్నారు. ఇప్పుడు ఎన్ఆర్‌సీకి వ్య‌తిరేకంగా జ‌రుగుతున్న ఆందోళ‌న‌ల్లో క‌నిపించే యువ‌తే ఆ ఆశ అన్నారు. ఒక‌నాడు జ‌ర్మ‌నీలో జ‌రిగిన హింస‌ను ఇప్పుడు భార‌త దేశ పాల‌కులు ఇక్క‌డ అమ‌లు చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నార‌ని, పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టం మ‌నుషుల అస్థిత్వాన్నే ప్ర‌శ్నార్థ‌కం చేయ‌నుంద‌ని అన్నారు. ఇలాంటి సంద‌ర్భంలో స‌మ‌కాలీన స‌మాజంలో రాజ‌కీయంగా, సాంస్కృతికంగా, ఆర్థికంగా వ‌చ్చే ప్ర‌తి మార్పునూ శాస్త్రీయంగా అర్థం చేసుకునేందుకు యువ‌త ప్ర‌య‌త్నిస్తోంద‌ని అన్నారు. 2020లు 1960ల‌ను గుర్తుచేయ‌బోతున్నాయ‌ని అన్నారు. ఏడాది క్రితం ఆరంభ‌మైన డైలాగ్ వేదిక దేశాన్ని కుదిపేసిన అన్ని అంశాల‌ను చ‌ర్చించ‌డంతో పాటు, సమ‌కాలీన సంభాష‌ణ పేరుతో పుస్త‌కాన్ని వెలువ‌రించ‌డం అభినంద‌నీయ‌మ‌న్నారు. ప్రొఫెస‌ర్ ప‌ద్మ‌జా మాట్లాడుతూ ఇవాల్టి త‌రం ప్ర‌గ‌తిశీలంగా ఆలోచించ‌డంతో పాటు, ప్ర‌గ‌తి నిరోధ‌క విధానాల ప‌ట్ల త‌మ అసమ్మ‌తిని సైతం ప్ర‌క‌టిస్తోంద‌ని అన్నారు. అలాంటి ధిక్కార ప్ర‌క‌ట‌నే ఈ పుస్త‌కం అన్నారు. స్వేచ్ఛ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో ప‌లువురు ర‌చ‌యిత‌లు, విద్యార్థులు పాల్గొన్నారు.

Keywords : nrc, cab, caa, virasam, hyderabad
(2024-03-27 23:42:57)



No. of visitors : 713

Suggested Posts


నేను ముస్లింను కాను కానీ పోరాటంలో ముందుభాగాన ఉన్నాను, అందుకే నన్ను టార్గెట్ చేశారు

పౌరసత్వ సవరణ బిల్లు (CAB)పై నిరసన కార్యక్రమాల సందర్భంగా పోలీసులు జామియా మిలియా యూనివర్సిటీపై దాడి చేసిన ఘటనలో యూనివర్సిటీ మొత్తం నెత్తురు ఏరులై పారింది. యూనివర్సిటీ రోడ్లు, లైబ్రరీ, హాస్టల్ గదులు విద్యార్హుల నెత్తురుతో తడిసిపోయింది.

NRC,CAA : ఫాసిస్టు చట్టంపై స్పందించండి - టెకీల బహిరంగ లేఖ

పౌరసత్వ సవరణ చట్టం (CAA), నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (NRC) లకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో భారతీయ ఐటీ నిపుణులు ఘాటుగా స్పందించారు. పౌరసత్వ సవరణ చట్టం ఫాసిస్ట్‌ చట్టంగా పేర్కొంటూ బహిరంగ లేఖ రాశారు.

అమిత్ షాకు బహిరంగ లేఖ‌ !

ʹʹసిటిజెన్‌ షిప్‌ అమెండ్‌ మెంట్‌ ఆక్ట్‌ 2019 గురించి ఏ ఒక్క భారతీయ పౌరుడూ భయపడనక్కరలేదుʹʹ అని ఎంత బాగా అన్నారు, అమిత్‌ భాయ్‌! ఆఫ్ఘనిస్తాన, పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌ లలో తాము ఎదుర్కొన్న మతపరమైన వివక్ష

వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్ లను యూనివర్సిటీ నుండి బహిష్కరించిన విద్యార్థులు, అధ్యాపకులు, ఉద్యోగులు

ఇప్పటి వరకు విద్యార్థులను కాలేజీల నుండి, యూనివర్సిటీల నుండి బహిష్కరించే వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్, ప్రిన్సిపాల్ లనే చూశాం కదా.... తప్పు చేసిన వైస్ ఛాన్సలర్ ను, రిజిస్ట్రార్ లను యూనివర్సిటీ నుండి బహిష్కరించిన విద్యార్థులు, అద్యాపకులు, ఉద్యోగుల గురించి విన్నారా ఎప్పుడైనా ?

CAA,NRC : ఈ దేశ ప్రజలపై పాలకుల హింసాకాండకు ఉత్తరప్రదేశ్ ఓ ఉదహరణ‌

పౌరసత్వ సవరణ చట్టానికి (CAA) వ్యతిరేకంగా ఉత్తరప్రదేశ్‌లో శాంతియుత నిరసనలు చేస్తున్న విద్యార్థులు, యువకులు, సామాజిక, హక్కుల కార్యకర్తలపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ నేతృత్వంలోని బీజేపీ సర్కారు కేసులు పెడుతున్నది.

జామియా విద్యార్థులకు అండగా నిల్చిన వీసీ - పోలీసులపై కేసు నమోదు చేస్తామని ప్రకటన‌

పౌరసత్వ సవరణ చట్టం(CAA)పై నిరసనలు తెలిపిన జామియా మిలియా యూనివర్సిటీ విద్యార్థులపై పోలీసుల దాడిని ఆ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ నజ్మా అఖ్తర్ తీవ్రంగా ఖండించారు

NPR పేరుతో NRC అమలు చేయబోతున్నరు... IAS కన్నన్ గోపీనాథన్

ఎన్పీఆర్ పేరుతో అమిత్ షా ఎన్నార్సీ అమలు చేయదల్చుకున్నాడని మాజీ ఐఏఎస్ కన్నన్ గోపీ నాథన్ మండి పడ్డారు. ఎన్నార్సీ, సీఏఏ లకు వ్యతిరేకంగా ముంబైలో జరిగిన ఓ ప్రదర్శనను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.

ఎన్నార్పీలో సరైన వివరాలు ఇవ్వకండి - ప్రజలకు అరుంధతీ రాయ్ పిలుపు

కేంద్ర ప్రభుత్వందొడ్డి దారిన ఎన్నార్సీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోందని ప్రముఖ రచయిత్రి, సామాజిక కార్యకర్త అరుంధతి రాయ్ ఆరోపించారు. ఎన్‌ఆర్‌పీ అనేది ఎన్‌ఆర్‌సీకి డేటాబేస్‌గా ఉపమోగపడుతుందని ఆమె అన్నారు. ఢిల్లీ యూనివర్సిటీలో ఎన్‌ఆర్‌సీని వ్యతిరేకిస్తూ నిర్వహించిన నిరసన కార్యక్రమంలో బుధవారం ఆమె పాల్గొన్నారు.

హైదరాబాద్‌ను తాకిన ʹజామియాʹ నిరసన సెగ.. వందలాది మంది విద్యార్థుల ఆందోళన

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ విద్యార్థులు చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. ఆందోళన చేపట్టిన విద్యార్థులపై ఢిల్లీ పోలీసులు అత్యంత దారుణంగా దాడులు చేశారు. ఈ దాడులకు నిరసనగా, జామియా విద్యార్థులకు మద్దతుగా హైదరాబాద్‌లో నిరసనలు వెల్లువెత్తాయి.

పోలీసుల దాడిలో కన్ను కోల్పోయిన విద్యార్థి ఏమంటున్నాడు

దేశ రాజధాని ఢిల్లీకి వచ్చి చాలా పెద్ద తప్పు చేశానని పోలీసుల దాడిలో కన్ను పోగొట్టుకున్న‌ జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయంలో విద్యార్థి మిన్హాజుద్దీన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 15న జామియా యూనివర్సిటీలో పౌరసత్వ సవరణ చట్టానికి

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


నిరాశ‌ల