లేని హార్డ్ డిస్క్ నుండి సమాచారం వెలికి తీయడం ఎఫ్బీఐ వల్ల అవుతుందా ?


లేని హార్డ్ డిస్క్ నుండి సమాచారం వెలికి తీయడం ఎఫ్బీఐ వల్ల అవుతుందా ?

లేని

విప్లవ కవి, రచయిత వరవరరావు ఇంట్లో తాము స్వాధీనం చేసుకున్న ఓ దెబ్బతిన్న హార్డ్ డిస్క్ లోంచి సమాచారాన్ని వెలికి తీయడం కోసం ఎఫ్బీఐ సహాయం తీసుకుంటామని పోలీసులు చెబుతున్న మాటలు అనేక అనుమానాలకు తావిస్తోంది. అసలు అలాంటి దెబ్బతిన్న హార్డ్ డిస్క్ వీవీ ఇంటి నుండి స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు కోర్టుకు ఇప్పటి వరకు చెప్పలేదు. కోర్టుకు ఇచ్చిన తాము స్వాధీనం చేసుకున్న వస్తువుల లిస్ట్ లో దెబ్బతిన్న హార్డ్ డిస్క్ లేదని వీవీ తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకవచ్చారు. ఈ మేరకు వారు బుధవారం ప్రత్యేక యుఎపిఎ న్యాయస్థానంలో ఒక అప్లికేషన్ దాఖలు చేశారు.

ఎల్గార్ పరిషద్ కేసుకు సంబంధించి విచారణ అధికారులు స్వాధీనం చేసుకున్న నాలుగు పంచనామాల్లో దెబ్బతిన్న హార్డ్ డిస్క్ లేకపోవడాన్ని సామాజికవేత్త పి వరవరరావు తరఫున వాదిస్తున్న న్యాయవాదులు లేవనెత్తారు. ఈ మేరకు వారు బుధవారం ప్రత్యేక యుఎపిఎ న్యాయస్థానంలో ఒక అప్లికేషన్ దాఖలు చేశారు. సదరు దెబ్బతిన్న హార్డ్ డిస్క్ నుంచి డేటా సేకరణ నిమిత్తం పూణే పోలీసులు ఎఫ్‌బిఐ సాయం కోరనుంది.

న్యాయవాదులు రోహన్ నహర్ మరియు పార్థ్ షా న్యాయమూర్తి ఎస్ఆర్ నవందెర్ ఎదుట ఈ అప్లికేషన్ ను దాఖలు చేశారు. వరవరరావు కంప్యూటర్‌లో లభించిన దెబ్బతిన్న హార్డ్ డిస్క్ నుంచి డేటా సేకరణ నిమిత్తం అమెరికాలోని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్‌వెస్టిగేషన్(ఎఫ్‌బిఐ) సాయాన్ని పోలీసులు కోరనున్నట్టుగా మీడియాలో వచ్చిన వార్తలను వారు ఉటంకించారు.

దీనిపై స్పందించిన న్యాయస్థానం జనవరి 13న తదుపరి విచారణ సమయానికి సదరు అంశంపై రాతపూర్వకంగా స్పందించాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల పవార్‌ను ఆదేశించింది.

విచారణ అనంతరం పార్థ్ షా టైమ్స్ ఆఫ్ ఇండియా(టిఒఐ)తో మాట్లాడుతూ "ఎల్గార్ పరిషద్ కేసుకు సంబంధించిన దర్యాప్తు అధికారి వరవర‌రావుపై దాఖలు చేసిన చార్జ్ షీట్ కు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 102కు లోబడి నాలుగు పంచనామాలను జతపరిచారు. అయితే వీవీ కంప్యూటర్ నుంచి ఒక దెబ్బ తిన్న హార్డ్ డిస్క్ ను స్వాధీనం చేసుకున్న విషయాన్ని ఏ ఒక్క పంచనామాలోనూ ప్రస్తావించలేదు. ఈ దెబ్బ తిన్న హార్డ్ డిస్క్ ఎక్కడి నుంచి వచ్చిందనేది మేం తెలుసుకోవాలనుకుంటున్నాము" అని అన్నారు

సామాజిక కార్యకర్త‌ మహేష్ రావుత్ తరఫు న్యాయవాది షాహిద్ అక్తర్ విచారణ సందర్భంగా...ఎల్గార్ కేసులో అరెస్టయిన తన క్లయింట్, ఇతర సామాజికవేత్తలు ప్రధాన మరియు అనుబంధ అభియోగపత్రాల్లో ప్రస్తావించిన ఎలక్ట్రానిక్ సాక్ష్యాల తాలూకు కాపీలు సహా అన్ని డాక్యుమెంట్లను పొందడానికి అర్హులని న్యాయస్థానానికి విన్నవించుకున్నారు.

"వారు సదరు డాక్యుమెంట్లను పొందేంతవరకు ప్రాసిక్యూషన్ వారు దాఖలు చేసిన అభియోగాల పై వాదనలను నిలుపుదల చేయాలి" అని అక్తర్ కోరారు.

ఇవి బుధవార‍ం నాడు పూణే కోర్టులో జరిగిన వాదనలు. దీన్ని బట్టే అర్దమవుతోంది. అసలు వరవరరావు ఇంట్లో దెబ్బతిన్న హార్డ్ డిస్క్ స్వాధీనం చేసుకున్నామన్న పోలీసుల మాటలు అబద్దమని. ఎల్గర్ పరిషద్ కేసు మొత్తం అబద్దాలతో నిండి ఉన్నది కాబట్టి కోర్టులో నిలబడకపోయినా కనీసం మీడియాలో అబద్దాలు ప్రచారం చేసి కొందరినైనా నమ్మించవచ్చనే కుట్రతో రోజుకోకొత్త ఎత్తుగడ వేస్తున్నారు పోలీసులు. అందులో భాగమే దెబ్బతిన్న హార్డ్ డిస్క్...ఎఫ్బీఐ అనే ప్రచారాలు మొదలు పెట్టారు.
లేని హార్డ్ డిస్క్ నుండి సమాచారం వెలికి తీయడం ఎఫ్బీఐ వల్ల అవుతుందా ?

Keywords : varavararao, virasam, elger parishad, pune, maoists, modi, police
(2020-01-28 04:26:22)No. of visitors : 261

Suggested Posts


ఆ తల్లిముందు దోసిళ్లతో.....ʹ - వరవరరావు

ʹమీరేమనుకోకుంటే ఒక ప్రశ్న వేస్తాను. ఇంత పెద్దవాళ్లున్నారు. ఈ పిల్లవాడే దొరికాడా పంపడానికిʹ అని అడిగింది ఆ తల్లి. ఆ తల్లిని నేను అప్పుడే చూడడం. ఆమె షాక్‌ తిన్నట్లుగా ఉన్నది. తండ్రి విహ్వలంగా దు:ఖిస్తున్నాడు గనుక గుండెబరువు దిగిపోతున్నట్లున్నది.....

సారూ.. ఆరోగ్యం జాగ్రత్త..!

మరికాసేపట్లో వాహనం ఎక్కిస్తారనగా అపార్ట్‌మెంట్ వాసులు వరవరరావు చుట్టూ చేరారు. వారెవరో ఆయనకు కానీ ఆయన కుటుంబ సభ్యులకు కానీ పెద్దగా పరిచయం లేదు. అయినా కానీ విరసం నేత చుట్టూ చేరారు. సొంత బంధువు కన్నా మిన్నగా జాగ్రత్తలు చెప్పడం మొదలుపెట్టారు. ʹʹసార్.. నమస్తే సార్. ఆరోగ్యం జాగ్రత్త.. వేళకు మందులు వేసుకోండిʹʹ అనడం చూసి విస్తుపోవడం కుటుంబ సభ్యుల వంతు అయ్యింది.

నక్సల్బరీ ప్రాసంగికత ‍- వరవరరావు (2)

చుండూరు మారణకాండపై ప్రత్యేక కోర్టు ఏర్పడి నేరస్తులకు శిక్ష పడిన స్థితి నుంచి హైకోర్టు వాళ్లను వదిలి పెట్టిన కాలానికి ఈ పరిణామ క్రమాన్ని చూస్తే ఇదొక విషాదం. ఇటు విప్లవోద్యమం, అటు దళిత అస్తిత్వ ఉద్యమాలు స్వీయ విమర్శ చేసుకోవలసిన విషాదం....

సాయిబాబాను రక్షించుకుందాం -వరవరరావు

నాగపూర్ సెంట్రల్ జైలు లోని అండా సెల్ లో ఉన్న ప్రొ . సాయిబాబ ఆరోగ్య పరిస్ధితి నానాటి దిగజారాడం తో ఆయన భార్య వసంత జాతీయ మానవ హక్కుల కమిటీకి, జాతీయ వైకల్య హక్కుల వేదిక తో కలసి ఫిర్యాదు చేశారు . ఆయన శిక్ష విధించే కొద్దీ రోజుల ముందు పిత్తాశయం, క్లోమ గ్రంధి కి సంబంధి ఆపరేషన్...

ప్రజల సభంటే.. ఇట్లుంటది

ఇప్పుడెందుకో.. సభలు గుర్తుకు వస్తున్నాయి. తెరలు తెరలుగా నాటి జ్ఞాపకాలు యాదికొస్తున్నాయి. అవి మర్చిపోవటానికి ఏమైనా ఘటనా.. కాదు అనుభవం. తేనెతుట్టె కదిపినట్టు..జ్ఞాపకాల దొంతరలు.. ముసురుకుంటున్న ముచ్చట్లు.. మానవీయ స్పర్శలు.. ఆత్మీయతలు..

కామ్రేడ్ కాకరాల పద్మ ఎక్కడ ?

విప్లవ కార్యకర్త, విప్లవ మహిళా సంఘం నాయకురాలు కామ్రేడ్ కాకరాల పద్మ ఏమైంది. నాలుగు రోజుల కింద తమిళనాడులోని ఈరోడ్ జిల్లా సెన్నిమలై దగ్గర ఆమెను కిడ్నాప్ చేసిన ʹగుర్తు తెలియని వ్యక్తులుʹ పద్మను ఏం చేశారు...

సెప్టెంబర్ 17 - ఇండియన్ యూనియన్ సైనిక దురాక్రమణ దినం - వరవరరావు

నైజాం రాజ్యంలో వెయ్యి మంది కమ్యూనిస్టులు, సానుభూతిపరులు కూడా చంపబడ్డారో లేదో కాని యూనియన్ మిలిటరీ నాలుగు వేల మంది కమ్యూనిస్టులను, సానుభూతిపరులను చంపింది. ఎలమర్రు, కాటూరు గ్రామాల్లో గాంధీ విగ్రహం చుటూ పురుషులను వివస్త్రలను చేసి పరుగెత్తిస్తూ స్త్రీలపై అత్యాచారాలు చేసిన ఘటనలు ప్రపంచమంతా చెప్పకున్నది. హరీంద్రనాథ్ ఛట్టోపాధ్యాయ్ దీర్ఘ కవిత్ర రాశాడు.....

ఒక మహిళ అస్తిత్వం ఏంటిది - పవన‌

నేను ʹపవనʹనా? ʹపెండ్యాల పవనʹనా? ʹకుసుమ పవనʹ నా? నేను ʹపవనʹ అనే ఒక మనిషినా లేక వరవరరావు బిడ్డనో, సత్యనారాయణ భార్యనో ʹమాత్రమేʹనా? నాలో సుళ్లు తిరుగుతున్న ఈ ప్రశ్నలన్నిటికి మల్లొక్కసారి నాకు నేను జవాబు చెప్పుకుంటూ మీ అందరితో నా ఈ ఘర్షణను పంచుకుందామని నా ఆశ.

తొలితరం మహిళా నక్సలైట్‌ కొమురమ్మకు విప్లవ జోహార్లు -వరవరరావు

మహబూబాబాద్‌ ప్రాంతంలో కరుడుగట్టిన భూస్వామ్యంతో రాజీలేకుండా పోరాడి 1989-90లలో మళ్లీ వెళ్లిన అజ్ఞాత జీవితంలో వాళ్లను ప్రతిఘటించే క్రమంలోనే దొరికిపోయి హత్యకు గురైన యోధుడు. యాదగిరి రాజు నాయకత్వం నుంచి లిన్‌పియావో వర్గం వైపు ఆకర్షితులైన జగన్‌ మోహన్‌ రెడ్డి, స్నేహలతల దళంలో వెంటకయ్య, కొమురమ్మలు పనిచేసినట్లు వింటుండేవాళ్లం.

యాభై ఏళ్ల నక్సల్బరీ: కవిత్వంలో అమరత్వం...జూలై 28 - వరవరరావు

చారు మజుందార్‌ కన్న ముందే 1970 జూలై 28ననే మరొక గొప్ప విప్లవకారుడు కామ్రేడ్‌ భుజాసింగ్‌ పంజాబ్‌లో అమరుడయ్యాడు. అది పోలీసులు చేసిన ఎన్‌కౌంటర్‌ హత్య...102 సంవత్సరాల క్రితం సాయుధ పోరాటం చేపట్టిన గదర్‌ పార్టీ మొదలు నక్సల్బరీ వసంత మేఘగర్జన దాకా ఆయన సాయుధ విప్లవంతో కొనసాగిన కమ్యూనిస్టు.....

Search Engine

వీక్షణం పై పాలకుల దుర్మార్గపు ప్రచారాన్ని ఖండిద్దాం ... ప్రజా పత్రికకు అండగా నిలబడదాం
ʹమాపై వీసీనే దాడి చేయించాడుʹ...వీసీపై కేసు నమోదు చేసిన‌ విద్యార్థులు
ʹకేంద్రం ఎన్ని ఎత్తుగడలు వేసినా ʹమహా ʹ ప్రభుత్వం భీమా కోరేగావ్ కేసులో నిజాలను బైటికి తీస్తుందిʹ
ʹతెలంగాణలో నియంతృత్వం రాజ్యమేలుతుంది...ఈ అవమానాన్ని మర్చిపోంʹ
భీం ఆర్మీ చీఫ్‌ ఆజాద్‌ను అరెస్టు చేసి గుర్తు తెలియని ప్రదేశానికి తరలించిన హైదరాబాద్ పోలీసులు
ఇండియా అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తోంది : CAA పై తీర్మానం ప్రవేశపెట్టిన‌ యూరోపియన్ యూనియన్
గుజరాత్ సెంట్రల్ యూనివర్సిటీలో చిత్తుగా ఓడిన ఏబీవీపీ ... వామపక్ష, దళిత‌ విద్యార్థి సంఘాల‌ విజయం
దేశవ్యాప్తంగా ʹషహీన్ బాగ్ʹ లు...విజయవాడలో శాంతి బాగ్ ప్రారంభం
మోడీ షా దుర్మార్గం.... భీమా కోరే గావ్ కేసును NIA కు బదిలీ చేసిన కేంద్రం
మేదావులపై భీమాకోరేగావ్ కేసు ఓ కుట్ర... సీఎం కు శరద్ పవార్ లేఖ
ʹతుక్డే తుక్డే గ్యాంగ్ʹ అంటే ఏంటి ? అందులో సభ్యులెవరు ? హోం శాఖకు కూడా తెలియదట !
కశ్మీర్ బహిరంగ చెరసాల... 24న పుస్తకావిష్కరణ‌
భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ ఢిల్లీకి రావొచ్చు.. అనుమతించిన కోర్టు
సీఏఏకు వ్యతిరేకంగా షహీన్‌బాగ్ నిరసనల్లో కాశ్మీరీ పండితులు
ప్రొఫెసర్ సాయిబాబాకు ముకుందన్ సీ మీనన్ అవార్డు 2019 ప్రకటించిన NCHRO
నా కొడుకు ఏ తప్పూ చేయలేదు.. పేదల కోసం, తెలంగాణ కోసం కొట్లాడిండు : కాశీం తల్లి వీరమ్మ‌
నిరసన తెలుపుతున్న మహిళల ఆహారం, దుప్పట్లు ఎత్తుకొని పారిపోయిన పోలీసులు
Condemning arbitrary arrest of Prof. C. Kaseem
జ్యుడీషియల్ రిమాండుకు ప్రొఫెసర్ కాసీం.. చీఫ్ జస్టీస్ ఇంట్లో ముగిసిన విచారణ
తనను అరెస్టు చేయడానికి వచ్చిన పోలీసులకు ʹజాషువా పద్యంʹ వినిపించిన కాశీం...!
ప్రొఫెసర్ కాసీం అరెస్టు.. తెలంగాణ పోలీసులపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం
కామ్రేడ్ కాశీం కోసం... ప్రజాస్వామిక హక్కుల కోసం అందరం గొంతు విప్పుదాం
కట్టుకథ ఆధారంగా కాశీం అరెస్ట్...!!
ʹప్రొఫెసర్ కాశీంను అణగారిన ప్రజల వైపు నిలబడ్డందుకే అరెస్ట్ చేశారుʹ
ఉరిశిక్ష‌లు, ʹఎన్‌కౌంట‌ర్ʹ హ‌త్య‌ల‌తో నేరాల నియంత్ర‌ణ సాధ్య‌మేనా?
more..


లేని