JNU విద్యార్థులు,ప్రొఫెసర్లపై దాడి చేసిందెవరో తేల్చే సాక్షాలివే !


JNU విద్యార్థులు,ప్రొఫెసర్లపై దాడి చేసిందెవరో తేల్చే సాక్షాలివే !

JNU

జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీలో నిన్న సాయంత్రం 50 మందికి పైగా ముసుగు దొంగలు రాడ్లు, కర్రలు, రాళ్ళతో విద్యార్థులపై, ప్రొఫెసర్లపై చేసిన దాడి నేపథ్యంలో ఆ దాడికి పాల్పడిన ముష్కరులెవరో తెలిపే సాక్షాలు బయటపడ్డాయి. వాట్సప్ గ్రూపుల్లో కొందరు చేసిన చాటింగ్ స్క్రీన్ షాట్లు బహిర్గతమయ్యాయి. ఆ వాట్సాప్‌ సందేశాలను ʹస్క్రోల్‌ డాట్‌ ఇన్‌ʹ మీడియా ʹట్రూకాలర్‌ ఆప్‌ʹను ఉపయోగించి ఫోన్‌ నెంబర్లను కనుగొన్నది. వాటిని ఫేస్‌బుక్‌లో శోధించాక వారి ప్రొఫైల్‌ వివరాలు వెలుగులోకి వచ్చాయి.

ʹసాలోం కో హాస్టల్‌ మే గుస్‌కే తోడే (హాస్టల్లోకి గుసాయించి కొట్టాం వారిని)ʹ అనే హిందీలో సందేశం ఆదివారం రాత్రి 7.03 నిమిషాలకు ఓ వాట్సప్‌ గ్రూప్‌లో కనిపించింది. దానికి సమాధానంగా అదే గ్రూప్‌ నుంచి మరొకరు ʹఅవును. వారితో తేల్చుకోవాల్సిన సమయం వచ్చింది. ఇప్పుడు కాకపోతే మరెప్పుడూ తేల్చుకుంటాం. కోమియో (కమ్యూనిస్టులు) చెత్త, చెత్త ప్రచారం చేస్తున్నారుʹ అంటూ స్పందించారు.

ఈ నేపథ్యంలో దాడులకు సంబంధించి సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో వచ్చిన ʹసాలోంకో హాస్టల్‌ మే గుస్‌కే తోడేʹ అనే సందేశం పంపిందీ సౌరవ్‌ దూబే అని తెల్సింది. ఆయన ఢిల్లీలోని షహీద్‌ భగత్‌సింగ్‌ ఈవినింగ్‌ కాలేజీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఆయన ʹజేఎన్‌యూటీస్‌ ఫర్‌ మోదీʹ అనే గ్రూపును నడుపుతున్నారు. ఆ రోజు దాడికి ముందు సాయంత్రం 5.39 గంటలకు ʹఫ్రెండ్స్‌ ఆఫ్‌ ఆరెస్సెస్‌ʹ అనే వాట్సాప్‌ గ్రూపులో లెఫ్ట్‌ టెర్రర్‌కు వ్యతిరేకంగా దయచేసి ఈ గ్రూపులో చేరండి. వారిని చితక బాదాల్సిందే. అదే వారికి సరైన చికిత్సʹ అని ఒకరు వ్యాఖ్యానించగా, అందుకు స్పందనగా మరొకరు ʹడీయూ నుండి వచ్చిన మనవాళ్ళు ఖజన్ సింగ్ స్విమ్మింగ్ వైపు నుండి లోపలికి రండి ఇక్కడ మేము 25-30 మంది ఉన్నాముʹ అని స్పందించారు

ఇక ఇక్కడ డీయూ అంటే ఢిల్లీ యూనివర్శిటీ అని. ఖాజన్‌ సింగ్‌ స్విమ్మింగ్‌ సైడ్‌ అంటే జేఎన్‌యూలో ఖాజన్‌ సింగ్‌ స్విమ్మింగ్‌ అకాడమీ ఉంది. దానికి వేరే గేటు ఉంది. అక్కడ పెద్దగా భద్రత ఉండదు. జేఎన్‌యూ ప్రధాన గేట్‌ నుంచి వచ్చే ప్రతి విజిటర్‌ను తనిఖీ చేసే లోపలికి పంపిస్తారు. అందుకని దుండగులు ఆ స్విమ్మింగ్‌ అకాడమీ గేట్‌ నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. కాగా ఈ సందేశం పంపిందీ ʹట్రూకాలర్‌ యాప్‌ʹ ద్వారా వికాస్‌ పటేల్‌దని తేలింది. ఆయన ఫేస్‌బుక్‌ ప్రొఫైల్‌ ప్రకారం వికాస్‌ పటేల్‌ ఏబీవీపీ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యుడు. జేఎన్‌యూలో ఏబీవీపీ మాజీ ఉపాధ్యక్షుడు. ʹయునిటీ అగెనెస్ట్‌ లెఫ్ట్‌ʹ అనే వాట్సాప్‌ గ్రూప్‌లో అదే రోజు రాత్రి 8.41 గంటలకు ʹహాజ్‌ ది పోలీస్‌ కమ్, బ్రదర్‌. లెఫ్టిస్ట్‌ హాజ్‌ జాయిన్డ్‌ దిస్‌ గ్రూప్‌ టూ. వై వాజ్‌ ది లింక్‌ షేర్డ్‌ (బ్రదర్‌ పోలీసులు వచ్చారా? ఈ గ్రూపులో కూడా లెఫ్టిస్టులు చేరారు. ఎందుకు లింక్‌ షేర్‌ చేశారు?)ʹ అన్న సందేశం వచ్చింది.

కాగా ʹట్రూకాలర్‌ʹ ద్వారా ఓంకార్‌ శ్రీవాత్సవ అనే వ్యక్తి ఆ సందేశాన్ని పంపించారని తెల్సింది. ఆయన ఫేస్‌బుక్‌ ప్రొఫైల్‌ ప్రకారం ఆయన ఢిల్లీ రాష్ట్ర ఏబీవీపీ ఎగ్టిక్యూటివ్‌ కమిటీ సభ్యుడు. జేఎన్‌యూలో 2015-16లో ఏబీవీపీ ఉపాధ్యక్షుడు. రాత్రికి రాత్రి ఈ వాట్సాప్‌ గ్రూపుల నుంచి ఈ సందేశాలన్నింటిని డిలీట్‌ చేశారు. వాట్సాప్‌ గ్రూపుల్లో ఇతరులను కూడా చేర్చుకున్నారు. పేర్లు బయటకు వచ్చిన వీరిని మీడియా సంప్రదించేందుకు ప్రయత్నించగా, వారి ఫోన్లన్నీ స్విచాఫ్‌లో ఉన్నాయి. ఢిల్లీ పోలీసు అధికారులను సంప్రదించగా, వారు స్పందించేందుకు నిరాకరించారు.


Keywords : JNU, STUDENTS, ATTACK, RSS, ABVP
(2020-01-27 22:01:37)No. of visitors : 625

Suggested Posts


Solidarity with the women complainants of SRFTI,JNU in their fight against sexual harassment

On behalf of JNUSU and undersigned organizations we extend our solidarity and revolutionary greetings to the women complainants of SRFTI Kolkata, who have been fighting against cases

మనిషిని వెతుక్కుంటూ అతను వెళ్ళి పోయాడు...

విద్రోహి సాధారణ విద్యార్థి మాత్రమే కాదు.. అతనో కవి.. సాంస్కృతిక కార్యకర్త. క్యాంపస్ లోప‌ల, బయట... ఎక్కడ ఏ పోరాటం జరిగినా అక్కడ ప్రత్యక్షమవుతాడు. కవితా ప్రవాహాన్ని వెంట మోసుకెళ్తాడు. అలుపెరగని ఆ కవితాఝురికి ʹబ్రెయిన్ డెడ్ʹ బ్రేక్ వేసింది....

పోలీసుల దుర్మార్గం - విద్యార్థులు, ప్రొఫెసర్లపై దుర్మార్గమైన దాడి.. ఫోటోలు తీసిన‌ మహిళా జర్నలిస్టుకు లైంగిక వేదింపులు

విద్య ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా, విద్యార్థినులపై లైంగికవేధింపులకు పాల్పడుతున్న‌ ప్రొఫెసర్‌ అతుల్‌ జోహ్రీని సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ జేఎన్‌యూ విద్యార్థులు, ఉపాధ్యాయులు చేపట్టిన పార్లమెంట్‌ మార్చ్‌పై పోలీసులు దుర్మార్గంగా విరుచుకుపడ్డారు.

జ‌నం ప‌క్షాన నిల‌బ‌డ్డవాడు దేశ‌ద్రోహి అయ్యాడా : ఉమ‌ర్ ఖలీద్ తండ్రి ఎస్‌క్యూఆర్ ఇల్యాసీ

ఏ మ‌నిషి త‌న జీవిత‌మంతా దేశం కోసం ఆలోచించాడో... ఏ మ‌నిషి ద‌ళితుల కోసం, ఆదివాసీల కోసం నిల‌బ‌డ‌డ్డాడో... ఏమ‌నిషి దేశం కోసం ప‌నిచేయాల‌ని విదేశీ స్కాల‌ర్‌షిప్ ని సైతం వ‌దులు కున్నాడో... ఏమ‌నిషైతే పాస్‌పోర్ట్ కూడా తీసుకోలేదు.. ఇప్పుడా మ‌నిషి పాకిస్తాన్‌కి వెళ్లాడ‌ని నింద‌లు వేస్తున్నారు. ఏ మ‌నిషి ద‌ళితుల ప‌క్షాన పోరాడుతున్నాడో... ఏ మ‌నిషి రైతుల కోసం..

దేశద్రోహం కేసు : JNU విద్యార్థి నేతలపై చార్జ్ షీట్ తిరస్కరించిన కోర్టు

జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ (JNU) విద్యార్థి సంఘం మాజీ నాయకుడు కన్హయ్య కుమార్, ఉమర్ ఖలీద్, అనిర్బన్ భట్టాచార్య మరో ఏడుగురు కశ్మీరీ విద్యార్ధులపై రాజద్రోహం కేసులో ఢిల్లీ పోలీసులు దాఖలు చేసిన చార్జ్ షీట్ ను కోర్టు తిరస్కరించింది.

Proud of Kanhaiya, Khalid, Anirban, says Prof Saibaba

ʹI am proud of my students Kanhaiya Kumar, Umar Khalid and Anirban Bhattacharya, who are striving for the people of the countryʹ beamed alleged naxal think-tank Prof G N Saibaba...

A Statement by Umar Khalid and Anirban Bhattacharya in the context of the Chargesheet

the people of the country have been dealing with these sanghi Thugs of Hindustan long enough now. Itʹs been five years, nearly. They know by now that it would be raining lies as it gets closer to the elections

జేఎన్యూ పై మళ్ళీ ఎర్రజెండా రెపరెపలు... విద్యార్థి సంఘం ఎన్నికల్లో లెఫ్ట్ ఘనవిజయం

ఢిల్లీ జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీపై మళ్ళీ లెఫ్ట్ ఫ్రంట్ తన జెండా ఎగిరేసింది. పాలకుల మద్దతుతో సంఘీల విద్యార్థి సంఘం ఏబీవీపీ చేసిన కుట్రలను ఓడించిన జేఎన్యూ విద్యార్థులు మళ్ళీ SFI, DSF, AISA, AISF లతో కూడిన లెఫ్ట్ ఫ్రంట్ నే గెలిపించారు.

మీడియా దుర్నార్గం: జేఎన్యూ విద్యార్థి ఐసిస్ సింపతైజర్ అని మొదటిపేజీలో.. అది ఫేక్ న్యూస్ అని లోపలి పేజీల్లో..

మీడియా ద్వారా సంఘ్ పరివారం మరో నీచమైన కుట్రకు తెరలేపింది. నజీబ్ వ్యక్తిత్వ హననానికి పాల్పడింది. జీ టీవీ , టైమ్స్ ఆఫ్ ఇండియా మరికొన్ని మీడియా సంస్థలు నజీబ్ గురించి అబద్దపు కథనాలు ప్రచురించి బురదచల్లే ప్రయత్నం చేశాయి. లేని పోలీసు రిపోర్ట్ ను ఉన్నట్టు నమ్మించే ప్రయత్నం చేశాయి....

JNUపై 50 మంది ముసుగులు ధరించిన గూండాల దాడి,విద్యార్థులు,ప్రొఫెసర్లకు తీవ్ర గాయాలు - ఇది ఏబీవీపీ పనే అని విద్యార్థుల ఆరోపణ‌

ఢిల్లీలోని జవహర్ లాల్ యూనివర్సిటీలోకి చొరబడి 50 మంది ముసుగులు ధరించిన గూండాలు జేఎన్యూ విద్యార్థులపై, ప్రొఫెసర్లపై రాడ్లతో, కర్రలతో, రాళ్ళతో దుర్మార్గమైన దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో అనేక మంది తీవ్ర గాయాలయ్యాయి.

Search Engine

వీక్షణం పై పాలకుల దుర్మార్గపు ప్రచారాన్ని ఖండిద్దాం ... ప్రజా పత్రికకు అండగా నిలబడదాం
ʹమాపై వీసీనే దాడి చేయించాడుʹ...వీసీపై కేసు నమోదు చేసిన‌ విద్యార్థులు
ʹకేంద్రం ఎన్ని ఎత్తుగడలు వేసినా ʹమహా ʹ ప్రభుత్వం భీమా కోరేగావ్ కేసులో నిజాలను బైటికి తీస్తుందిʹ
ʹతెలంగాణలో నియంతృత్వం రాజ్యమేలుతుంది...ఈ అవమానాన్ని మర్చిపోంʹ
భీం ఆర్మీ చీఫ్‌ ఆజాద్‌ను అరెస్టు చేసి గుర్తు తెలియని ప్రదేశానికి తరలించిన హైదరాబాద్ పోలీసులు
ఇండియా అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తోంది : CAA పై తీర్మానం ప్రవేశపెట్టిన‌ యూరోపియన్ యూనియన్
గుజరాత్ సెంట్రల్ యూనివర్సిటీలో చిత్తుగా ఓడిన ఏబీవీపీ ... వామపక్ష, దళిత‌ విద్యార్థి సంఘాల‌ విజయం
దేశవ్యాప్తంగా ʹషహీన్ బాగ్ʹ లు...విజయవాడలో శాంతి బాగ్ ప్రారంభం
మోడీ షా దుర్మార్గం.... భీమా కోరే గావ్ కేసును NIA కు బదిలీ చేసిన కేంద్రం
మేదావులపై భీమాకోరేగావ్ కేసు ఓ కుట్ర... సీఎం కు శరద్ పవార్ లేఖ
ʹతుక్డే తుక్డే గ్యాంగ్ʹ అంటే ఏంటి ? అందులో సభ్యులెవరు ? హోం శాఖకు కూడా తెలియదట !
కశ్మీర్ బహిరంగ చెరసాల... 24న పుస్తకావిష్కరణ‌
భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ ఢిల్లీకి రావొచ్చు.. అనుమతించిన కోర్టు
సీఏఏకు వ్యతిరేకంగా షహీన్‌బాగ్ నిరసనల్లో కాశ్మీరీ పండితులు
ప్రొఫెసర్ సాయిబాబాకు ముకుందన్ సీ మీనన్ అవార్డు 2019 ప్రకటించిన NCHRO
నా కొడుకు ఏ తప్పూ చేయలేదు.. పేదల కోసం, తెలంగాణ కోసం కొట్లాడిండు : కాశీం తల్లి వీరమ్మ‌
నిరసన తెలుపుతున్న మహిళల ఆహారం, దుప్పట్లు ఎత్తుకొని పారిపోయిన పోలీసులు
Condemning arbitrary arrest of Prof. C. Kaseem
జ్యుడీషియల్ రిమాండుకు ప్రొఫెసర్ కాసీం.. చీఫ్ జస్టీస్ ఇంట్లో ముగిసిన విచారణ
తనను అరెస్టు చేయడానికి వచ్చిన పోలీసులకు ʹజాషువా పద్యంʹ వినిపించిన కాశీం...!
ప్రొఫెసర్ కాసీం అరెస్టు.. తెలంగాణ పోలీసులపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం
కామ్రేడ్ కాశీం కోసం... ప్రజాస్వామిక హక్కుల కోసం అందరం గొంతు విప్పుదాం
కట్టుకథ ఆధారంగా కాశీం అరెస్ట్...!!
ʹప్రొఫెసర్ కాశీంను అణగారిన ప్రజల వైపు నిలబడ్డందుకే అరెస్ట్ చేశారుʹ
ఉరిశిక్ష‌లు, ʹఎన్‌కౌంట‌ర్ʹ హ‌త్య‌ల‌తో నేరాల నియంత్ర‌ణ సాధ్య‌మేనా?
more..


JNU