JNU పై ముసుగు దొంగల‌ దాడి - భయంతో ఫస్ట్‌ ఫ్లోర్‌ నుంచి దూకిన విద్యార్థులు

JNU

జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)లో 5 వతేదీ సాయంత్రం ముసుగులు ధరించిన చెడ్డీ గ్యాంగ్ సృష్టించిన బీభత్సానికి విద్యార్థులు భయంతో వణికిపోయారు. దాడి నుంచి తప్పించుకునేందుకు ఇద్దరు విద్యార్థులు మొదటి అంతస్తు నుంచి దూకడంతో గాయాలపాలయ్యారు. క్యాంపస్‌లోకి ప్రవేశించిన ముసుగు దొంగలైన చెడ్డీ గ్యాంగ్ విద్యార్ధులు, ప్రొఫెసర్లను రాడ్లతో, హాకీ స్టిక్స్తో, రాళ్ళతో చితకబాదడంతో పాటు వాహనాలను, ఆస్తులను ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. దుండగలు క్యాంపస్‌లోని పెరియార్ హాస్టల్, సబర్మతి హాస్టల్‌లోకి చొరబడి దొరికిన వారిని దొరికినట్లు చితకబాదారు. ఈ దాడిలో విద్యార్థి సంఘం నేతతో పాటు పలువురు విద్యార్ధులకు తీవ్ర గాయాలయ్యాయి.
ఈ దాడికి భయపడి విద్యార్థులు హాస్టళ్లలోని తమ గదుల్లో దాక్కున్నా వదలని ముష్కర మూకలు తలుపులు బద్దలు కొట్టి మరీ గదుల్లో చొరబడి విద్యార్థులను కొట్టారు. దుండగుల దాడి నుంచి తప్పించుకునేందుకు పలువురు విద్యార్థులు మొదటి అంతస్తు నుంచి కిందకు దూకేశారు. దీంతో పలువురి విద్యార్థుల కాళ్లకు గాయాలు అయ్యాయి.

దాడి అనంతరం హాస్టల్‌ భవనంలోని ప్రతి అంతస్తు బీభత్స వాతావరణాన్ని తలపించింది. కిటికీ అద్దాలు, తలుపులు, ఫర్నిచర్‌ పూర్తిగా ధ్వంసం అయ్యాయి. దుండగులు సమారు మూడు గంటల పాటు జేఎన్‌యూలో విధ్వంస కాండను కొనసాగించారు. ఈ దాడిలో యూనివర్శిటీ విద్యార్థి సంఘం ప్రెసిడెంట్‌ ఆయిసీ ఘోష్‌ సహా సుమారు 35మంది ఉపాధ్యాయులు, విద్యార్థులు గాయడ్డారు. దాడికి పాల్పడిన వారిని గుర్తించినట్లు చెబుతున్న పోలీసులు... ఇప్పటి వరకూ ఎవరినీ అరెస్ట్‌ చేయలేదు.

మరోవైపు ఈ ఘటనతో విద్యార్థులకు భద్రత కల్పించలేకపోయామంటూ హాస్టల్‌ వార్డెన్‌ ఆర్‌. మీనా సోమవారం రాజీనామా చేశారు. ఈ మేరకు యూనివర్శిటీ స్టూడెంట్‌ డీన్‌కు లేఖ రాశారు. తాము దుండగులను అడ్డుకునేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని, హాస్టళ్లకు భద్రత కల్పించలేకపోయామని తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.

Keywords : JNU, Students, attack, delhi, abvp, rss, left students
(2024-03-29 21:05:34)



No. of visitors : 502

Suggested Posts


Solidarity with the women complainants of SRFTI,JNU in their fight against sexual harassment

On behalf of JNUSU and undersigned organizations we extend our solidarity and revolutionary greetings to the women complainants of SRFTI Kolkata, who have been fighting against cases

మనిషిని వెతుక్కుంటూ అతను వెళ్ళి పోయాడు...

విద్రోహి సాధారణ విద్యార్థి మాత్రమే కాదు.. అతనో కవి.. సాంస్కృతిక కార్యకర్త. క్యాంపస్ లోప‌ల, బయట... ఎక్కడ ఏ పోరాటం జరిగినా అక్కడ ప్రత్యక్షమవుతాడు. కవితా ప్రవాహాన్ని వెంట మోసుకెళ్తాడు. అలుపెరగని ఆ కవితాఝురికి ʹబ్రెయిన్ డెడ్ʹ బ్రేక్ వేసింది....

పోలీసుల దుర్మార్గం - విద్యార్థులు, ప్రొఫెసర్లపై దుర్మార్గమైన దాడి.. ఫోటోలు తీసిన‌ మహిళా జర్నలిస్టుకు లైంగిక వేదింపులు

విద్య ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా, విద్యార్థినులపై లైంగికవేధింపులకు పాల్పడుతున్న‌ ప్రొఫెసర్‌ అతుల్‌ జోహ్రీని సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ జేఎన్‌యూ విద్యార్థులు, ఉపాధ్యాయులు చేపట్టిన పార్లమెంట్‌ మార్చ్‌పై పోలీసులు దుర్మార్గంగా విరుచుకుపడ్డారు.

దేశద్రోహం కేసు : JNU విద్యార్థి నేతలపై చార్జ్ షీట్ తిరస్కరించిన కోర్టు

జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ (JNU) విద్యార్థి సంఘం మాజీ నాయకుడు కన్హయ్య కుమార్, ఉమర్ ఖలీద్, అనిర్బన్ భట్టాచార్య మరో ఏడుగురు కశ్మీరీ విద్యార్ధులపై రాజద్రోహం కేసులో ఢిల్లీ పోలీసులు దాఖలు చేసిన చార్జ్ షీట్ ను కోర్టు తిరస్కరించింది.

జ‌నం ప‌క్షాన నిల‌బ‌డ్డవాడు దేశ‌ద్రోహి అయ్యాడా : ఉమ‌ర్ ఖలీద్ తండ్రి ఎస్‌క్యూఆర్ ఇల్యాసీ

ఏ మ‌నిషి త‌న జీవిత‌మంతా దేశం కోసం ఆలోచించాడో... ఏ మ‌నిషి ద‌ళితుల కోసం, ఆదివాసీల కోసం నిల‌బ‌డ‌డ్డాడో... ఏమ‌నిషి దేశం కోసం ప‌నిచేయాల‌ని విదేశీ స్కాల‌ర్‌షిప్ ని సైతం వ‌దులు కున్నాడో... ఏమ‌నిషైతే పాస్‌పోర్ట్ కూడా తీసుకోలేదు.. ఇప్పుడా మ‌నిషి పాకిస్తాన్‌కి వెళ్లాడ‌ని నింద‌లు వేస్తున్నారు. ఏ మ‌నిషి ద‌ళితుల ప‌క్షాన పోరాడుతున్నాడో... ఏ మ‌నిషి రైతుల కోసం..

జేఎన్యూ పై మళ్ళీ ఎర్రజెండా రెపరెపలు... విద్యార్థి సంఘం ఎన్నికల్లో లెఫ్ట్ ఘనవిజయం

ఢిల్లీ జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీపై మళ్ళీ లెఫ్ట్ ఫ్రంట్ తన జెండా ఎగిరేసింది. పాలకుల మద్దతుతో సంఘీల విద్యార్థి సంఘం ఏబీవీపీ చేసిన కుట్రలను ఓడించిన జేఎన్యూ విద్యార్థులు మళ్ళీ SFI, DSF, AISA, AISF లతో కూడిన లెఫ్ట్ ఫ్రంట్ నే గెలిపించారు.

JNUపై 50 మంది ముసుగులు ధరించిన గూండాల దాడి,విద్యార్థులు,ప్రొఫెసర్లకు తీవ్ర గాయాలు - ఇది ఏబీవీపీ పనే అని విద్యార్థుల ఆరోపణ‌

ఢిల్లీలోని జవహర్ లాల్ యూనివర్సిటీలోకి చొరబడి 50 మంది ముసుగులు ధరించిన గూండాలు జేఎన్యూ విద్యార్థులపై, ప్రొఫెసర్లపై రాడ్లతో, కర్రలతో, రాళ్ళతో దుర్మార్గమైన దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో అనేక మంది తీవ్ర గాయాలయ్యాయి.

Proud of Kanhaiya, Khalid, Anirban, says Prof Saibaba

ʹI am proud of my students Kanhaiya Kumar, Umar Khalid and Anirban Bhattacharya, who are striving for the people of the countryʹ beamed alleged naxal think-tank Prof G N Saibaba...

A Statement by Umar Khalid and Anirban Bhattacharya in the context of the Chargesheet

the people of the country have been dealing with these sanghi Thugs of Hindustan long enough now. Itʹs been five years, nearly. They know by now that it would be raining lies as it gets closer to the elections

ʹఈ రోజు నా కూతురిపై దాడి జరిగింది... రేపు మీ పైనా జరుగుతుందిʹ

ʹఈరోజు నా కూతురిపై దాడి జరిగింది. రేపు మిమ్మల్ని కూడా కొడతారు. నాపై కూడా దాడి జరగొచ్చు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రమాదకర పరిస్థితులు పొంచి ఉన్నాయి. మాకు చాలా భయంగా ఉందిʹ అంటూ జేఎన్యూ విద్యార్థి సంఘం అధ్యక్షురాలు ఆయిషీ ఘోష్‌ తండ్రి ఆందోళన వ్యక్తం చేశారు.

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


JNU