దాడి చేసింది తామేనంటూ ముష్కరులు ఒప్పుకున్నావారిపై కేసు పెట్టని పోలీసులు...బాధితులపై మాత్రం కేసు


దాడి చేసింది తామేనంటూ ముష్కరులు ఒప్పుకున్నావారిపై కేసు పెట్టని పోలీసులు...బాధితులపై మాత్రం కేసు

దాడి

ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్శిటీ క్యాంపస్‌లోకి ఆదివారం రాత్రి ఇనుప రాడ్లు, కర్రలతో జొరబడి హాస్టల్‌లో ఉంటున్న విద్యార్థినీ విద్యార్థులతోపాటు ప్రొఫెసర్లను చితక బాదడానికి కుట్ర పన్నింది, పిలుపునిచ్చిందీ ఏబీవీపీ నాయకులని ʹవాట్సాప్‌ గ్రూపుʹల్లో వచ్చిన సందేశాల ద్వారా గుర్తించినప్పటికీ, వారి మెసేజ్‌ స్క్రీన్‌ షాట్లు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయినప్పటికీ ఢిల్లీ పోలీసులు వారిపై ఎలాంటి చర్య తీసుకోకుండా సోమవారం సాయంత్రం ʹగుర్తు తెలియని వ్యక్తులʹ పేరిట ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేశారని జేఎన్‌యూ విద్యార్థులు ఆరోపిస్తున్నారు.

ʹకర్రలు, రాళ్లు, చేతికి ఏవి దొరికితే వాటిని తీసుకెళ్లి కొట్టండంటూ వామపక్ష విద్యార్థులపై దాడికి పిలుపునిచ్చిందీ ఏబీవీపీయేʹ అంటూ ఏబీవీపీ ఢిల్లీ జాయింట్‌ సెక్రటరీ అనిమా సోంకర్‌ ʹటైమ్స్‌ నౌʹ సాక్షిగా అంగీకరించినా, ʹఅవును దాడికి మేమే బాధ్యులం, నోరు మూసుకొని ఉండకపోతే భవిష్యత్తులో ఇలాంటి దాడులు మరిన్ని జరుపుతాంʹ అని హిందూ రక్షా దళ్‌ నాయకుడు పింకీ చౌదరి కూడా హెచ్చరించినా వారిపై ఎలాంటి చర్య తీసుకోకపోవడం ఏమిటని విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.

విద్యార్థులపై దాడి చేసింది ఎవరో తెలిసినా వారిపై కేసు పెట్టడం కానీ అరెస్టు చేయడం కానీ చేయని పోలీసులు ఏబీవీపీ నాయకుల దాడిలో తీవ్రంగా గాయపడిన జేఎన్‌యూ విద్యార్థి సంఘం నాయకురాలు ఐశే ఘోష్, మరో 19 మంది విద్యార్థులపై మాత్రం కేసుసులు నమోదు చేశారు ఢిల్లీ పోలీసులు. జనవరి నాలుగవ తేదీన ఐశే ఘోష్‌ నాయకత్వాన క్యాంపస్‌లోని సర్వర్‌ రూమ్‌ను ధ్వంసం చేశారని ఆరోపిస్తూ ఆదివారం రాత్రే ఢిల్లీ పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. ఢిల్లీ పోలీసులు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా పరిధిలో పనిచేస్తారు కనుక వారు ఏబీవీపీ నాయకులపై ఎలాంటి చర్య తీసుకోలేక పోతున్నారని ఐశే ఘోష్‌ ఆరోపించారు.

Keywords : JNU, Students, delhi, bjp, ABVP, RSS, leftists
(2020-08-11 01:34:28)



No. of visitors : 721

Suggested Posts


Solidarity with the women complainants of SRFTI,JNU in their fight against sexual harassment

On behalf of JNUSU and undersigned organizations we extend our solidarity and revolutionary greetings to the women complainants of SRFTI Kolkata, who have been fighting against cases

మనిషిని వెతుక్కుంటూ అతను వెళ్ళి పోయాడు...

విద్రోహి సాధారణ విద్యార్థి మాత్రమే కాదు.. అతనో కవి.. సాంస్కృతిక కార్యకర్త. క్యాంపస్ లోప‌ల, బయట... ఎక్కడ ఏ పోరాటం జరిగినా అక్కడ ప్రత్యక్షమవుతాడు. కవితా ప్రవాహాన్ని వెంట మోసుకెళ్తాడు. అలుపెరగని ఆ కవితాఝురికి ʹబ్రెయిన్ డెడ్ʹ బ్రేక్ వేసింది....

పోలీసుల దుర్మార్గం - విద్యార్థులు, ప్రొఫెసర్లపై దుర్మార్గమైన దాడి.. ఫోటోలు తీసిన‌ మహిళా జర్నలిస్టుకు లైంగిక వేదింపులు

విద్య ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా, విద్యార్థినులపై లైంగికవేధింపులకు పాల్పడుతున్న‌ ప్రొఫెసర్‌ అతుల్‌ జోహ్రీని సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ జేఎన్‌యూ విద్యార్థులు, ఉపాధ్యాయులు చేపట్టిన పార్లమెంట్‌ మార్చ్‌పై పోలీసులు దుర్మార్గంగా విరుచుకుపడ్డారు.

జ‌నం ప‌క్షాన నిల‌బ‌డ్డవాడు దేశ‌ద్రోహి అయ్యాడా : ఉమ‌ర్ ఖలీద్ తండ్రి ఎస్‌క్యూఆర్ ఇల్యాసీ

ఏ మ‌నిషి త‌న జీవిత‌మంతా దేశం కోసం ఆలోచించాడో... ఏ మ‌నిషి ద‌ళితుల కోసం, ఆదివాసీల కోసం నిల‌బ‌డ‌డ్డాడో... ఏమ‌నిషి దేశం కోసం ప‌నిచేయాల‌ని విదేశీ స్కాల‌ర్‌షిప్ ని సైతం వ‌దులు కున్నాడో... ఏమ‌నిషైతే పాస్‌పోర్ట్ కూడా తీసుకోలేదు.. ఇప్పుడా మ‌నిషి పాకిస్తాన్‌కి వెళ్లాడ‌ని నింద‌లు వేస్తున్నారు. ఏ మ‌నిషి ద‌ళితుల ప‌క్షాన పోరాడుతున్నాడో... ఏ మ‌నిషి రైతుల కోసం..

దేశద్రోహం కేసు : JNU విద్యార్థి నేతలపై చార్జ్ షీట్ తిరస్కరించిన కోర్టు

జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ (JNU) విద్యార్థి సంఘం మాజీ నాయకుడు కన్హయ్య కుమార్, ఉమర్ ఖలీద్, అనిర్బన్ భట్టాచార్య మరో ఏడుగురు కశ్మీరీ విద్యార్ధులపై రాజద్రోహం కేసులో ఢిల్లీ పోలీసులు దాఖలు చేసిన చార్జ్ షీట్ ను కోర్టు తిరస్కరించింది.

జేఎన్యూ పై మళ్ళీ ఎర్రజెండా రెపరెపలు... విద్యార్థి సంఘం ఎన్నికల్లో లెఫ్ట్ ఘనవిజయం

ఢిల్లీ జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీపై మళ్ళీ లెఫ్ట్ ఫ్రంట్ తన జెండా ఎగిరేసింది. పాలకుల మద్దతుతో సంఘీల విద్యార్థి సంఘం ఏబీవీపీ చేసిన కుట్రలను ఓడించిన జేఎన్యూ విద్యార్థులు మళ్ళీ SFI, DSF, AISA, AISF లతో కూడిన లెఫ్ట్ ఫ్రంట్ నే గెలిపించారు.

Proud of Kanhaiya, Khalid, Anirban, says Prof Saibaba

ʹI am proud of my students Kanhaiya Kumar, Umar Khalid and Anirban Bhattacharya, who are striving for the people of the countryʹ beamed alleged naxal think-tank Prof G N Saibaba...

A Statement by Umar Khalid and Anirban Bhattacharya in the context of the Chargesheet

the people of the country have been dealing with these sanghi Thugs of Hindustan long enough now. Itʹs been five years, nearly. They know by now that it would be raining lies as it gets closer to the elections

ʹఈ రోజు నా కూతురిపై దాడి జరిగింది... రేపు మీ పైనా జరుగుతుందిʹ

ʹఈరోజు నా కూతురిపై దాడి జరిగింది. రేపు మిమ్మల్ని కూడా కొడతారు. నాపై కూడా దాడి జరగొచ్చు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రమాదకర పరిస్థితులు పొంచి ఉన్నాయి. మాకు చాలా భయంగా ఉందిʹ అంటూ జేఎన్యూ విద్యార్థి సంఘం అధ్యక్షురాలు ఆయిషీ ఘోష్‌ తండ్రి ఆందోళన వ్యక్తం చేశారు.

JNUపై 50 మంది ముసుగులు ధరించిన గూండాల దాడి,విద్యార్థులు,ప్రొఫెసర్లకు తీవ్ర గాయాలు - ఇది ఏబీవీపీ పనే అని విద్యార్థుల ఆరోపణ‌

ఢిల్లీలోని జవహర్ లాల్ యూనివర్సిటీలోకి చొరబడి 50 మంది ముసుగులు ధరించిన గూండాలు జేఎన్యూ విద్యార్థులపై, ప్రొఫెసర్లపై రాడ్లతో, కర్రలతో, రాళ్ళతో దుర్మార్గమైన దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో అనేక మంది తీవ్ర గాయాలయ్యాయి.

Search Engine

మోడీకి, శ్రీరాముడికి జైకొట్టనందుకు ఆటో డ్రైవర్ ను చితకబాదిన మతోన్మాదులు
ప్రజల పంటలను ధ్వంసం చేసిన పోలీసులు, ఫారెస్ట్ అధికారులు ... నిజనిర్దారణ కమిటీ రిపోర్ట్
అంబులెన్స్ సమయానికి రాక గర్భవతి మరణం... వార్త ప్రసారం చేసిన జర్నలిస్టు, టి వి చానెల్ పై కేసు
వీవీని విడుదల చేయాలి...ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, పబ్లిక్ సెక్టార్, కాంట్రాక్టు ఉద్యోగుల ఐక్య వేదిక డిమాండ్
పాలకుల అవినీతిని వెలికి తీసిన జర్నలిస్టులపై రాజద్రోహం కేసులు...అరెస్టులు
విప్లవ వాగ్గేయకారుడు వంగపండు ప్రసాదుకు నివాళి -విరసం
వీరుల కన్నతల్లి... అమరుల బంధువు...
ఇది భయపడాల్సిన సమయం కాదు... ఎదిరించాల్సిన సమయం...ప్రొఫెసర్ హానీబాబు భార్య డాక్టర్ జెన్నీ రోవేనా
వారిపై దాడి చేసింది సిఆర్‌పిఎఫ్ బలగాలే... మావోయిస్టులు కాదు...నిజనిర్దారణ కమిటీ రిపోర్టు
ముగిసిన అమ్మ ఎదురు చూపులు
ఏపీ జైళ్ళలో కరోనా పాజిటీవ్....ఖైదీలను విడుదల చేయాలి
ప్రొఫెసర్ సాయిబాబాను కాపాడుకుందాం... సహకరించండి... సాయిబాబా భార్య లేఖ‌
పోలీసు కూంబింగు‌ల మధ్య ఏవోబీలో భారీ ర్యాలీ ‍- అమరుల వారోత్సవాలు జరుపుకుంటున్న ప్రజలు
ప్రైవేట్ హాస్పిటల్స్ లో కరోనా పీజుల దోపిడీని అరికట్టాలి -CLC
అక్రమంగా అరెస్ట్ చేసిన ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ హనీ బాబును విడుదల చేయాలి - CLC
Condemn the impunity towards political prisoners
వరవరరావును విడుదల చేయాలి....765 మంది జర్నలిస్టుల లేఖ!
భీమా కోరేగావ్ కేసు: మరో ప్రొఫెసర్ అరెస్ట్
Condemn the arbitrary arrest of Prof. Hany Babu - CASR
కవిత్వంలో అమరత్వం...జూలై 28 - వరవరరావు
ఉద్యమాల ఉపాధ్యాయుడి జీవితమంతా ప్రజా ఉద్యమాలే
కుల నిర్మూలనవాది ఉసాకి జోహార్లు...పాపని నాగరాజు
ఉద్యమాల ఉపాధ్యాయుడు ఉ.సా.కు జోహార్లు !
వరవరరావు,సాయిబాబాలను విడుదల చేయాలంటూ 520 మంది రచయితల లేఖ‌ !
విలాస జీవితం ఎవరిది....డీజీపీకి మావోయిస్టుల సవాల్
more..


దాడి