కామ్రేడ్ వంశీధర్ @ చింతన్‌దాకు లాల్ సలాం!


కామ్రేడ్ వంశీధర్ @ చింతన్‌దాకు లాల్ సలాం!

కామ్రేడ్

2020 జనవరి 6 నాడు కామ్రేడ్ చింతన్‌దా 78 సంవత్సరాల వయసులో అమరులయ్యారు. జనవరి 7న వారణాసిలోని చిత్తుపూర్‌లో అంత్యక్రియలు జరిగాయి. కామ్రేడ్ చింతన్ ఒక నిబద్ధత కలిగిన విప్లవకారుడు. విద్యాభ్యాస సమయంలోనే ఆయన విప్లవ కార్యకలాపాలలో సక్రియంగా పాల్గొన్నారు. ఉద్యమ జీవితం గురించి పూర్తి వివరాలు లభించలేదు.

కామ్రేడ్ చింతన్‌దా స్వంత వూరు బీహార్‌లోని తూర్పు చంపరాన్. ఆయన పెరగడం, విద్యాభ్యాసం అంతా ఢిల్లీలో జరిగింది. 1970లో బి. టెక్ పూర్తి చేశారు. సామాజిక శాస్త్రాల్లో అభిరుచిని కలిగిన ఆయన సామాజికశాస్త్రంలో పిజి చేయడం కోసం జవజర్‌లాల్ నెహ్రూ విశ్వ విద్యాలయంలో (జె‌ఎన్‌యు)లో చేరారు. అక్కడే తన ఎంఏ , ఎంఫిల్, పిహెచ్‌డిలు పూర్తి చేశారు. ఆ తరువాత తన సంపూర్ణ జీవితాన్ని విప్లవోద్యమానికి సమర్పించారు.

2006 నుండి 2009 వరకు జైలు జీవితాన్ని అనుభవించారు. అరెస్టు అయినప్పుడు పోలీసులు పెట్టిన చిత్రహింసల వల్ల కర్ణభేరి (చెవిలోని పొర) చిరిగిపోయింది. జైలు జీవితంలో ఒక కంటి చూపు పోయింది. ఆయనకు ఎముకలకు సంబంధించిన టి.బి వ్యాధి ఉండింది. వీటన్నింటి వల్లా శారీరకంగా చాలా బలహీనమై పోయారు.

2010లో చికిత్స కోసం కాన్పూరు వెళ్లినప్పుడు స్పెషల్ టాస్క్ ఫోర్స్ వాళ్ళు అరెస్టు చేయడంతో 2014 దాకా కాన్పూరు జైలులో ఉన్నారు. జైలు నుంచి విడుదల అయ్యాక పూర్తిగా అనారోగ్యం పాలయ్యారు. రెండు సంవత్సరాల క్రితం బ్రైన్ హెమరేజ్ వల్ల కోమాలోకి వెళ్ళి బయటకు రాగలిగారు కానీ జ్ఞాపక శక్తి పూర్తిగా కోల్పోయారు. శరీరంలో సగ భాగానికి పక్షవాతం వచ్చింది.

రెండు సంవత్సరాల క్రితం కామ్రేడ్ వంశీధర్ తీవ్ర అనారోగ్యం పాలై చికిత్స కోసం బెనారస్ వెళ్లి అక్కడ ఆసుపత్రిలోని ఐసియులో చేరినప్పుడు యిక బతకడం కష్టమని డాక్టర్లు చెపారు. బిహెచ్‌యు విద్యార్థులు ప్రేమానురాగాలతో అందించిన ప్రశంసనీయమైన సేవలతో తిరిగి కోలుకొన్నారు. గత రెండు సంవత్సరాలుగా డిమెన్శీయాతో జ్ఞాపక శక్తిని కోల్పోయిన కామ్రేడ్ చింతన్‌దాతో సరదాగా కబుర్లు చెబుతూ, పాటలు వినిపిస్తూ, అటూ యిటూ తిప్పుతూ ఆయన గతానుభవాలను గుర్తు చేయడానికి ప్రయత్నిస్తూ ఆ విద్యార్థులు ఆయన ఆయుస్శును మరికొంత పొడిగించగలిగారు. ఈ విద్యార్థులు కేవలం ఫాసిజంతో పోరాడటం కాదు, గతాన్ని నిశితంగా గమనిస్తూ తమ భవిష్యత్తుని సుందరమయంగా మలుచుకోడానికి ముందడుగు వేస్తున్నారు.

- పద్మ కొండిపర్తి కే

సోర్స్ : https://www.facebook.com/padmakondiparthy.k/posts/1520895931424027


Keywords : Chintan daa, Vamshidhar, Naxal, Maoist, Comrade
(2020-08-11 10:19:54)No. of visitors : 775

Suggested Posts


0 results

Search Engine

మోడీకి, శ్రీరాముడికి జైకొట్టనందుకు ఆటో డ్రైవర్ ను చితకబాదిన మతోన్మాదులు
ప్రజల పంటలను ధ్వంసం చేసిన పోలీసులు, ఫారెస్ట్ అధికారులు ... నిజనిర్దారణ కమిటీ రిపోర్ట్
అంబులెన్స్ సమయానికి రాక గర్భవతి మరణం... వార్త ప్రసారం చేసిన జర్నలిస్టు, టి వి చానెల్ పై కేసు
వీవీని విడుదల చేయాలి...ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, పబ్లిక్ సెక్టార్, కాంట్రాక్టు ఉద్యోగుల ఐక్య వేదిక డిమాండ్
పాలకుల అవినీతిని వెలికి తీసిన జర్నలిస్టులపై రాజద్రోహం కేసులు...అరెస్టులు
విప్లవ వాగ్గేయకారుడు వంగపండు ప్రసాదుకు నివాళి -విరసం
వీరుల కన్నతల్లి... అమరుల బంధువు...
ఇది భయపడాల్సిన సమయం కాదు... ఎదిరించాల్సిన సమయం...ప్రొఫెసర్ హానీబాబు భార్య డాక్టర్ జెన్నీ రోవేనా
వారిపై దాడి చేసింది సిఆర్‌పిఎఫ్ బలగాలే... మావోయిస్టులు కాదు...నిజనిర్దారణ కమిటీ రిపోర్టు
ముగిసిన అమ్మ ఎదురు చూపులు
ఏపీ జైళ్ళలో కరోనా పాజిటీవ్....ఖైదీలను విడుదల చేయాలి
ప్రొఫెసర్ సాయిబాబాను కాపాడుకుందాం... సహకరించండి... సాయిబాబా భార్య లేఖ‌
పోలీసు కూంబింగు‌ల మధ్య ఏవోబీలో భారీ ర్యాలీ ‍- అమరుల వారోత్సవాలు జరుపుకుంటున్న ప్రజలు
ప్రైవేట్ హాస్పిటల్స్ లో కరోనా పీజుల దోపిడీని అరికట్టాలి -CLC
అక్రమంగా అరెస్ట్ చేసిన ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ హనీ బాబును విడుదల చేయాలి - CLC
Condemn the impunity towards political prisoners
వరవరరావును విడుదల చేయాలి....765 మంది జర్నలిస్టుల లేఖ!
భీమా కోరేగావ్ కేసు: మరో ప్రొఫెసర్ అరెస్ట్
Condemn the arbitrary arrest of Prof. Hany Babu - CASR
కవిత్వంలో అమరత్వం...జూలై 28 - వరవరరావు
ఉద్యమాల ఉపాధ్యాయుడి జీవితమంతా ప్రజా ఉద్యమాలే
కుల నిర్మూలనవాది ఉసాకి జోహార్లు...పాపని నాగరాజు
ఉద్యమాల ఉపాధ్యాయుడు ఉ.సా.కు జోహార్లు !
వరవరరావు,సాయిబాబాలను విడుదల చేయాలంటూ 520 మంది రచయితల లేఖ‌ !
విలాస జీవితం ఎవరిది....డీజీపీకి మావోయిస్టుల సవాల్
more..


కామ్రేడ్