జేఎన్‌యూ : పోలీసుల సమక్షంలోనే దాడి... పోలీసు ఎఫ్ఐఆర్ చెబుతున్న నిజాలు


జేఎన్‌యూ : పోలీసుల సమక్షంలోనే దాడి... పోలీసు ఎఫ్ఐఆర్ చెబుతున్న నిజాలు

జేఎన్‌యూ

ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్శిటీ క్యాంపస్‌లోని హాస్టళ్లపై ఆదివారం దుండగులు జరిపిన దాడి పోలీసుల సమక్షంలోనే జరిగిందని, అయినప్పటికీ దాన్ని ఆపేందుకు ఢిల్లీ పోలీసులు ఎలాంటి చర్య తీసుకోలేదని ఆ దాడిపై దాఖలైన ఎఫ్‌ఐఆర్‌ను చూస్తే స్పష్టం అవుతోంది. దుండగులలో ఒక్కరిని కూడా పట్టుకునేందుకు ప్రయత్నించక పోవడం ఆశ్చర్యం. ఈ సంఘటనపై ఢిల్లీ పోలీసులు సోమవారం మధ్యాహ్నం ʹగుర్తుతెలియని వ్యక్తులʹ పేరిట హిందీలో ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేశారు.

ఎఫ్‌ఐఆర్‌ కథనం ప్రకారం ʹపెరియార్‌ హాస్టల్‌ వద్ద కొంతమంది విద్యార్థులు గుమిగూడారని, వారు ఇతరులు కొడుతున్నారని, ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని ఆదివారం సాయంత్రం 3.45 గంటల ప్రాంతంలో క్యాంపస్‌ అడ్మినిస్ట్రేటివ్‌ బ్లాక్‌ వద్ద పోలీసు సబ్‌ ఇనిస్పెక్టర్‌కు సమాచారం అందింది. ఎఫ్‌ఐఆర్‌ కోసం ఫిర్యాదు చేసిన వసంత్‌కుంజ్‌ నార్త్‌ పోలీసు స్టేషన్‌కు చెందిన పోలీసు అధికారి, పోలీసు సబ్‌ ఇన్‌స్పెక్టర్, మరి కొంతమంది పోలీసులు పెరియార్‌ హాస్టల్‌ వద్దకు వెళ్లగా అక్కడ 50–60 మంది ముసుగులు ధరించి కర్రలతో విద్యార్థులను కొడుతూ కనిపించారు. పోలీసులను చూడగానే వారు అక్కడి నుంచి పారిపోయారు.

సాయంత్రం ఏడు గంటలకు సబర్మతి హాస్టల్లోకి కొంత మంది దుండగులు ప్రవేశించి కొడుతున్నారని పోలీసు ఇన్‌స్పెక్టర్‌కు సమాచారం అందింది. ఆయన వెంటనే ఫిర్యాదు చేసిన పోలీసు అధికారిని, తన సిబ్బందిని తీసుకొని సబర్మతి హాస్టల్‌కు వెళ్లారు. అక్కడ 50–60 మంది ముసుగులు ధరించి వ్యక్తులు కర్రలతో విద్యార్థులను బాదడం కనిపించింది. వారిని మైకులో హెచ్చరించడంతో ఎక్కడి వారక్కడ వెళ్లిపోయారు. అదే సమయంలో క్యాంపస్‌లో శాంతి భద్రతలను పరిరక్షించాల్సిందిగా క్యాంపస్‌ అధికారుల నుంచి విజ్ఞప్తి అందడంతో అదనపు బలగాలను పోలీసులు పిలిపించారు. గాయపడిన విద్యార్థులను ఆస్పత్రికి తీసుకెళ్లారుʹ

ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వుల మేరకు గత కొంతకాలంగా క్యాంపస్‌ ఆవరణలో పోలీసు పికెట్‌ ఉంటోంది. ఆ రోజు 3.45 గంటల ప్రాంతంలోనే 50–60 మంది ముసుగు దుండగులను వారు చూసినప్పుడు వారు ఎందుకు స్పందించలేదు? సాయంత్రం కూడా వారు మళ్లీ కనిపించినప్పుడు వారిలో ఒక్కరిని కూడా పట్టుకునేందుకు ఎందుకు ప్రయత్నించలేదు? మొదట్లోనే అదనపు బలగాల కోసం వారు ఎందుకు కోరలేదు? దుండగులు 3.45 గంటల నుంచి రాత్రి ఏడున్నర గంటల వరకు స్వైర విహారం చేసిన క్యాంపస్‌ అధికారులు ఎందుకు సకాలంలో స్పందించలేదు? అసులు దాడి జరిగినప్పుడు క్యాంపస్‌లో ఎంత మంది పోలీసులు ఉన్నారు? అదనపు బలగాల్లో ఎంత మంది, ఎప్పుడు వచ్చారు? ప్రస్తుతానికి సమాధానంలేని ప్రశ్నలు. ఈ ప్రశ్నలకు కొత్తగా దర్యాప్తు బాధ్యతలు చేపట్టిన ఢిల్లీ క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులైన కనుక్కుంటారేమో చూడాలి!

Keywords : JNU, Attack, Delhi Police, FIR, Students
(2020-05-25 17:50:09)No. of visitors : 298

Suggested Posts


0 results

Search Engine

వీవీ,సాయిబాబాలతో సహా రాజకీయ ఖైదీల విడుదలకై వారం రోజుల కార్యక్రమాలు -నిర్బంధ వ్యతిరేక వేదిక పిలుపు
మానవత్వానికే మచ్చ తెచ్చిన ఆ దుర్మార్గుడితో కలిసి ఉండలేను... విడాకులు ఇప్పించండి
నోరు మూసుకో....ట్రంప్ కు పోలీసు చీఫ్ హెచ్చరిక‌
తెలంగాణకోసం పోరాడిన వారు జైళ్ళలో మగ్గుతున్నరు
వరవరరావు బెయిల్ పిటిషన్ మళ్ళీ వాయిదా !
వరవరరావు విడుదల కోసం ʹమాహాʹ సీఎంకు మాజీ కేంద్ర సమాచార కమీషనర్ల‌ లేఖ
వీవీ,సాయిబాబాల‌ జీవించే హక్కును కాపాడండి...పౌరహక్కుల సంఘం
కేసీఆర్ కు తెలంగాణ, ఏపీకి చెందిన 27 మంది ప్రముఖ రచయితల విజ్ఞప్తి
వీవీ, సాయిబాబాలను వెంటనే విడుదల చేయాలి -సామాజిక తెలంగాణ మహాసభ
వరవరరావును వెంటనే విడుదల చేయాలి - సీపీఐ (ఎంఎల్) జనశక్తి డిమాండ్
వరవరరావు ఆరోగ్యంపై ఆయన సహచరి హేమలత ప్రకటన‌
వీవీ, సాయిబాబాలతో సహా రాజకీయ ఖైదీలందరినీ విడుదల చేయాలంటూ దేశవ్యాప్త ప్రదర్శనలు
సామాజిక కార్యకర్తల‌ జీవించే హక్కును కాలరాస్తున్న‌ పాలకుల విధానాలపై రేపు(మే29) నిరసన
మంథని లో లాకప్ డెత్...పౌరహక్కుల సంఘం నిజ నిర్దారణ... విచారణకు ఆదేశించిన హైకోర్టు
దయనీయస్థితిలో జి.ఎన్.సాయిబాబా ఆరోగ్య పరిస్థితి- సహచరి వసంతకుమారి ఆందోళన
వరవరరావును విడుదల చేయాలి -జర్నలిస్టు,హక్కుల,ప్రజా సంఘాల డిమాండ్
వరవరరావు విడుదలకు తెలంగాణ ప్రభుత్వం చొరవ చేయాలి..వివిధ పార్టీల డిమాండ్
మా నాన్నను వెంటనే విడుదల చేయండి..వరవరరావు కూతుర్ల లేఖ‌
వీవీ, ఇతర సామాజిక‌ కార్యకర్తలున్న తలోజా జైలుతో సహా మూడు జైళ్ళలో కరోనాతో ముగ్గురు ఖైదీల మృతి !
తలోజా జైల్లో వ్యాపించిన కరోనా...అనారోగ్యంతో ఉన్నవీవీని తక్షణం విడుదల చేయాలని విరసం డిమాండ్
పింజ్రా తోడ్ కార్యకర్తలకు బెయిల్...కొద్ది నిమిషాల్లోనే మళ్ళీ అరెస్టు
రాజ్యాంగాన్ని, ప్రజల స్వేచ్ఛ, హక్కులను కాపాడడాన్ని సుప్రీం కోర్టు మానుకుంది...మార్కండేయ్ ఖట్జు
నక్సల్బరీ ప్రాసంగికత ‍- వరవరరావు (2)
నక్సల్బరీ ప్రాసంగికత ‍- వరవరరావు (1)
ఇది నక్సల్బరీ ప్రజ్వరిల్లినరోజు....అడవిలో ప్రవేశించాలనే ఆశయం నెరవేరిన రోజు...
more..


జేఎన్‌యూ