విరసం 50 ఏళ్ల సభలు.. పూణే జైలు నుంచి వరవరరావు సందేశం


విరసం 50 ఏళ్ల సభలు.. పూణే జైలు నుంచి వరవరరావు సందేశం

విప్లవ రచయితల సంఘం 50 ఏండ్ల మహాసభలు హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శనివారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా గత ఏడాది పైగా పూణేలోని ఎరవాడ జైల్లో అక్రమ నిర్బంధంలో ఉన్న విరసం వ్యవస్థాపక సభ్యుడు, రచయిత కామ్రేడ్ వరవరరావు తన సందేశాన్ని పంపించారు. ఆ సందేశాన్ని ఈనాటి ప్రారంభ సభలో చదివి వినిపించారు. ఆ సందేశం యధాతథంగా..
--------------------------------------------------------------------------------------------

కామ్రేడ్స్ మీ అందరి నుంచి 600 కిలోమీటర్ల దూరంలో ఒంటరి ఖైదులో నిర్బంధంగా ఉన్నప్పటికీ నా ఆలోచనలన్నీ ఉద్వేగాలు అన్నీ మీతోనే ఉన్నాయి. నా మనసు మీ మధ్యలో ఉంది. మన ప్రియతమ సంస్థ విప్లవ రచయితల సంఘం 50వ పుట్టినరోజు సందర్భంగా జరుగుతున్న చారిత్రాత్మక ఉత్సవాల సమయంలో నా హృదయ పూర్వకమైన ప్రగాఢమైన సంఘీభావాన్ని.. విప్లవ అభినందనలు తెలియజేస్తున్నాను. ఇప్పుడున్న విషాదకర పరిస్థితుల్లో, సెన్సార్ నిబంధ‌నల వల్ల నేను ఈ సందేశాన్ని.. మీకూ, నాకూ ప‌రాయిదైన భాష‌లో రాయవ‌ల‌సి వ‌స్తోంది. అందువ‌ల్ల నా ఉద్వేగాల‌న్నీ సంపూర్ణంగా మీతో పంచుకోలేక పోతున్నాను. క్లుప్లమైన సందేశాన్ని పంపిస్తున్నాను. కొన్ని పరిశీలనలను అభిప్రాయాలను మాత్రమే పంచుకోగలుగుతున్నాను.

మొట్టమొదట ఈ యాభై ఏళ్ల ఉత్సవాల సందర్భంగా నా జ్ఞాపకాలు 50 ఏళ్ల కింద.. 1970 జూలై 3 రాత్రి జరిగిన ఘటన వైపు వెళుతున్నాయి. అప్పుడు ఒక డజను పైబడిన కొద్ది మందిమి ఈ సంస్థను స్థాపించాలని నిర్ణయించుకున్నాము. ఆనాటి ప్రకటన మీద సంతకం చేసిన చాలా మంది మరణించారు. మరి కొద్ది మంది ఇవాళ మన సంస్థలో లేరు. నా ఉద్దేశంలో ఆ పదిహేను మంది సంతకదారుల్లో బతికి ఉంది నేనొక్కడినే ఇవ్వాల్టికి విరసంలో కొనసాగుతున్నాను.

ఆ రోజున మేము ఈ సంస్థను ప్రారంభించడానికి కారణాలన్నీ లేదా మమ్మల్ని అందుకు పురిగొల్పిన సామాజిక, రాజకీయ కారణాలన్నీ ఇవ్వాల్టికీ యధాతథంగా ఉన్నాయి లేదా బహుశా ఇంకా పెచ్చరిల్లాయేమో కూడా. ఇటువంటి సంస్థల అవసరాన్ని పెంచుతున్నాయేమో కూడా. హిందూత్వ బ్రాహ్మణీయ ఫాసిస్టు దాడి వల్ల.. సామ్రాజ్యవాదతో దాని మిలాఖత్ వల్ల ఈ సంస్థ అవసరం ఇంకా పెరుగుతున్నది. నేను గతంలో ఎన్నో ఉపన్యాసాల్లో, రచనల్లో.. విశాఖ విద్యార్థులు కరపత్రంలో మా దృష్టికి తీసుకొచ్చిన పారీస్ అంతర్యుద్ధం గురించి ప్రస్తావించాను. భారతదేశంలో మనం ఆ స్పానిష్ అంతర్యుద్ధ పరిస్థితిని చాలా కాలంగా అనుభవిస్తున్నాము.

ఐదు దశాబ్దాలుగా ఉన్న ఆ స్థితి ఇవాళ ఇంకా పెరిగింది. అందువల్ల మన సభ్యులందరికీ, నాయకత్వానికి, సమాజం గురించి ఆలోచించే రచయితలకు, మేధావులకు నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే పారీస్ అంతర్ యుద్ధము, ఫాసిజం పరిణామాల గురించి అధ్యయనం చేయండి. అర్థం చేసుకోండి. ఆ అవగాహనలో సాహిత్య, సాంస్కృతిక రంగాలలో భావజాల రంగాలలో స్థిరమైన పోరాటాలకు సంసిద్ధంకండి. 1970 జులై 4న సమాజం మనకిచ్చిన ఆదేశం మన మీద పెట్టిన బాధ్యత అదే. అదే ఆదేశం.. అదే బాధ్యత ఇవాళ కూడా వర్తిస్తుంది. కాకపోతే కాలక్రమంలో వచ్చిన మార్పులు చేర్పులు అవసరం కావచ్చు. పరిస్థితి మరింత ఘోరంగా మరింత అస్పష్టంగా మారి ఉండవచ్చు.

గత 50 సంవత్సరాల్లో మనం సాధించిన విజయాలు.. సాధించలేకపోయిన అంశాలు ఇప్పుడు మళ్ళీ మీతో చెప్పనక్కరలేదు. మనం కచ్చితంగా సాహిత్యంలో, సాహిత్య సంబంధాల్లో ప్రజల నుంచి ప్రజలతోనే అనే సూత్రంతో అన్ని ప్రజా పోరాటాలను దృఢంగా సమర్ధించడంలో, నక్సల్బరీ పంథాన్ని ఎత్తిపట్టడంలో, దండకారణ్యంలో ఇతర ప్రాంతాల్లో భారత విప్లవం సాధించిన విజయాలను ప్రచారం చేయడంలో ఎన్నో విజయాలు సాధించాం. మన 50 సంవత్సరాలు జీవితం ఉజ్వలమైనది మనకు గర్వకారకమైనది. ఆ వారసత్వాన్ని మనం కొనసాగించవలసి ఉన్నది. మన పొరపాట్లను గుర్తిస్తూ సరి చేసుకుంటూ ఆ వారసత్వాన్ని బలోపేతం చేయాల్సి ఉన్నది.

ఈ దేశపు పోరాడే ప్రజల హృదయాల్లో మనం సాధించుకున్న పేరుకు తగినట్లుగా మనం నిలబడవలసి ఉంది. మావో చెప్పినట్టు మనం ఎప్పుడూ వర్గ పోరాటాన్ని విస్మరించకుండా ఉండ వలసి ఉన్నది. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే పోరాటాలలో ప్రాణాలను బలిపెట్టిన వేలాది మంది వీరుల త్యాగాలను ఎప్పుడు మర్చిపోకూడదు. వారి అసంపూర్ణ కృత్యాన్ని సాకారం చేయడానికి కృషి చేయాల్సి ఉంది. ప్రజా సాహిత్య సాంస్కృతిక ఉద్యమం సుబ్బారావు పాణిగ్రాహి నుంచి అనేక డజన్ల మంది సహచరుల త్యాగాలను మనం ఎన్నడూ మర్చిపోకూడదు. ఈ ప్రజా పోరాటాల మార్గం నుంచి ఎన్నడూ వైదొలగబోమని మనం ప్రతిన పూనాలి ఉంది.

ఈ హైదరాబాదు లోనే పుట్టిన మన సంస్థ ఆ తర్వాత ఐదు సార్లు ఇక్కడే మహాసభలు జరుపుకుంది. 1971లో రెండో మహాసభలు, 80 దశాబ్ది మహాసభలు, 90 ద్విదశాబ్ది మహాసభలు, 96లో 25 ఏండ్ల మహాసభలు, నిషేధం కొట్టివేసిన తర్వాత 2006 మహాసభలు. ఆ ఒరవడిలోనే ఈ మహాసభలు కూడా జయప్రదం కావాలని ఆకాంక్షిస్తున్నాను. ఈ మహాసభల్లో పాల్గొంటున్న ప్రతి ఒక్క కామ్రేడ్‌కు పేరు పేరునా విప్లవ అభినందనలు తెలియజేస్తున్నాను.

విరసం వర్ధిల్లాలి.. విప్లవం వర్థిల్లాలి.

- వరవరరావు

Keywords : Virasam, Meetings, Varavararao, Message
(2020-01-28 01:28:08)No. of visitors : 572

Suggested Posts


0 results

Search Engine

వీక్షణం పై పాలకుల దుర్మార్గపు ప్రచారాన్ని ఖండిద్దాం ... ప్రజా పత్రికకు అండగా నిలబడదాం
ʹమాపై వీసీనే దాడి చేయించాడుʹ...వీసీపై కేసు నమోదు చేసిన‌ విద్యార్థులు
ʹకేంద్రం ఎన్ని ఎత్తుగడలు వేసినా ʹమహా ʹ ప్రభుత్వం భీమా కోరేగావ్ కేసులో నిజాలను బైటికి తీస్తుందిʹ
ʹతెలంగాణలో నియంతృత్వం రాజ్యమేలుతుంది...ఈ అవమానాన్ని మర్చిపోంʹ
భీం ఆర్మీ చీఫ్‌ ఆజాద్‌ను అరెస్టు చేసి గుర్తు తెలియని ప్రదేశానికి తరలించిన హైదరాబాద్ పోలీసులు
ఇండియా అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తోంది : CAA పై తీర్మానం ప్రవేశపెట్టిన‌ యూరోపియన్ యూనియన్
గుజరాత్ సెంట్రల్ యూనివర్సిటీలో చిత్తుగా ఓడిన ఏబీవీపీ ... వామపక్ష, దళిత‌ విద్యార్థి సంఘాల‌ విజయం
దేశవ్యాప్తంగా ʹషహీన్ బాగ్ʹ లు...విజయవాడలో శాంతి బాగ్ ప్రారంభం
మోడీ షా దుర్మార్గం.... భీమా కోరే గావ్ కేసును NIA కు బదిలీ చేసిన కేంద్రం
మేదావులపై భీమాకోరేగావ్ కేసు ఓ కుట్ర... సీఎం కు శరద్ పవార్ లేఖ
ʹతుక్డే తుక్డే గ్యాంగ్ʹ అంటే ఏంటి ? అందులో సభ్యులెవరు ? హోం శాఖకు కూడా తెలియదట !
కశ్మీర్ బహిరంగ చెరసాల... 24న పుస్తకావిష్కరణ‌
భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ ఢిల్లీకి రావొచ్చు.. అనుమతించిన కోర్టు
సీఏఏకు వ్యతిరేకంగా షహీన్‌బాగ్ నిరసనల్లో కాశ్మీరీ పండితులు
ప్రొఫెసర్ సాయిబాబాకు ముకుందన్ సీ మీనన్ అవార్డు 2019 ప్రకటించిన NCHRO
నా కొడుకు ఏ తప్పూ చేయలేదు.. పేదల కోసం, తెలంగాణ కోసం కొట్లాడిండు : కాశీం తల్లి వీరమ్మ‌
నిరసన తెలుపుతున్న మహిళల ఆహారం, దుప్పట్లు ఎత్తుకొని పారిపోయిన పోలీసులు
Condemning arbitrary arrest of Prof. C. Kaseem
జ్యుడీషియల్ రిమాండుకు ప్రొఫెసర్ కాసీం.. చీఫ్ జస్టీస్ ఇంట్లో ముగిసిన విచారణ
తనను అరెస్టు చేయడానికి వచ్చిన పోలీసులకు ʹజాషువా పద్యంʹ వినిపించిన కాశీం...!
ప్రొఫెసర్ కాసీం అరెస్టు.. తెలంగాణ పోలీసులపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం
కామ్రేడ్ కాశీం కోసం... ప్రజాస్వామిక హక్కుల కోసం అందరం గొంతు విప్పుదాం
కట్టుకథ ఆధారంగా కాశీం అరెస్ట్...!!
ʹప్రొఫెసర్ కాశీంను అణగారిన ప్రజల వైపు నిలబడ్డందుకే అరెస్ట్ చేశారుʹ
ఉరిశిక్ష‌లు, ʹఎన్‌కౌంట‌ర్ʹ హ‌త్య‌ల‌తో నేరాల నియంత్ర‌ణ సాధ్య‌మేనా?
more..


విరసం